మీ పరికరంలో Google Play Storeలో ఖాతాలను ఎలా జోడించాలి & ఉపయోగించాలి

మీరు Google Play Store యాప్‌లో వస్తువులను డౌన్‌లోడ్ చేయడం, కొనుగోలు చేయడం ప్రారంభించడానికి మీ పరికరంలో Google ఖాతాను జోడించవచ్చు. దిగువ దశలను పునరావృతం చేయడం ద్వారా మీరు మీ పరికరానికి అనేక Google ఖాతాలను జోడించవచ్చు.

మీ పరికరానికి ఒకటి లేదా అనేక Google ఖాతాలను ఎలా జోడించాలి

  1. మీరు ఇంతవరకూ జోడించకపోతే, Google ఖాతాను సెటప్ చేయండి.
  2. మీ పరికర సెట్టింగ్‌ల యాప్ ను తెరవండి.
  3. ఖాతాలు ఆ తర్వాత ఖాతాను జోడించు ఆ తర్వాత Googleను ట్యాప్ చేయండి.
  4. మీ ఖాతాను జోడించడానికి సూచనలను ఫాలో అవ్వండి.
  5. అవసరమైతే, ఒకటి కంటే ఎక్కువ ఖాతాలను జోడించడానికి, పైన పేర్కొన్న దశలను మీరు రిపీట్ చేయండి.

చిట్కా: పొరపాటున చేసే కొనుగోళ్లు లేదా అనధికార కొనుగోళ్లను నివారించడానికి, మీ పరికరంలో పాస్‌వర్డ్‌ రక్షణను ఉపయోగించండి.

Google Play Storeలో మీ ఖాతాలను ఉపయోగించండి & మేనేజ్ చేయండి

ఖాతాల మధ్య మారండి

మీరు అనేక ఖాతాలను కలిగి ఉన్నట్లయితే, మీరు మీ పరికరానికి మరొక Google ఖాతాను జోడించవచ్చు, మీరు ఏ ఖాతాను ఉపయోగిస్తున్నారో ఎంచుకోవచ్చు. కింద పేర్కొన్న సూచనలు, Google Play యాప్‌ల కోసం పనిచేస్తాయి.

Google Play యాప్‌లో ఖాతాలను మార్చండి

  1. ఒక Google Play యాప్‌ను తెరవండి.
  2. పైన కుడి వైపున ఉన్న, మీ ప్రొఫైల్ ఫోటోపై లేదా ఇంటి పేరుపై ట్యాప్ చేయండి.
  3. కింది వైపు బాణం Down arrowగుర్తును ట్యాప్ చేయండి.
  4. ఒక ఖాతాను ఎంచుకోండి.

Google Play వెబ్‌సైట్‌లో ఖాతాలను స్విచ్ చేయండి

  1. https://play.google.com సైట్‌కు వెళ్లండి.
  2. ఎగువున కుడి వైపున ఉన్న, మీ ప్రొఫైల్ చిహ్నాన్ని ఎంచుకోండి.
  3. ఖాతాను మార్చండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  4. వేరే ఖాతాను ఎంచుకోండి.
    • మరొక ఖాతాను మీరు కనుగొనలేకపోతే, మరొక ఖాతాను ఉపయోగించండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
మీ ఖాతాను రికవరీ ఆప్షన్‌లతో సంరక్షించుకోండి

బ్యాకప్, ఇమెయిల్ అడ్రస్ లేదా ఫోన్ నంబర్ లాంటి ఖాతా రికవరీ ఆప్షన్‌లను జోడించడం ద్వారా మీరు Google ఖాతా ఇంకా Google Play కొనుగోళ్ళను సంరక్షించడంలో సహాయపడవచ్చు. మీరు ఎప్పుడైనా మీ పాస్‌వర్డ్‌ను మర్చిపోతే, లేదా మీ ఖాతాతో సహాయం అవసరమైతే, మిమ్మల్ని సంప్రదించడంలో ఇది మాకు సహాయపడుతుంది.

మీరు కింద పేర్కొన్న వాటికోసం, అవసరమైన మొత్తం సమాచారాన్ని Google ఖాతా సహాయ కేంద్రం కలిగి ఉంటుంది:

ఖాతా & సైన్ ఇన్ సమస్యలను పరిష్కరించండి

మీరు మీ పరికరంలో Google Play Storeకి సైన్ ఇన్ చేయలేకపోతే లేదా ఇతర ఖాతా సమస్యలను కలిగి ఉంటే, మీరు ఖాతా సమస్యలతో సహాయం పొందవచ్చు.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
4202695426980670355
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
84680
false
false