Google Play నుండి పరికరాన్ని ఎలా తీసివేయాలి, పరికరానికి మారుపేర్లను ఎలా జోడించాలి

మీరు యాప్ మెనూలో మీ పరికరాల నుండి వేటిని చూపాలో మీరు ఎంచుకోవచ్చు. మీరు పరికరాలకు మారుపేర్లను కూడా ఇవ్వవచ్చు, తద్వారా వాటిని సులభంగా గుర్తించవచ్చు.

మీరు పరికరాన్ని దాచడం ద్వారా Google Play నుండి కూడా తీసివేయవచ్చు. పరికరం దాచబడినప్పుడు, మీరు మీ వెబ్ బ్రౌజర్ నుండి ఆ పరికరానికి యాప్‌లను ఇన్‌స్టాల్ చేయలేరు.

Google Play నుండి పరికరాలను ఎలా తీసివేయాలి

మీరు మునుపు ఉపయోగించిన పరికరాలను Google Play ట్రాక్ చేస్తుంది. మీరు మీ Google Play హిస్టరీ నుండి పరికరాన్ని తీసివేయలేరు, కానీ మీరు వీటిని చేయవచ్చు:

  • పరికరం నుండి మీ ఖాతాను తీసివేయండి. మీరు పాత పరికరం నుండి మీ ఖాతాను తీసివేస్తే, ఆ పరికరంలో మీ Google Play హిస్టరీ లేదా యాక్టివిటీని చూడలేరు.
  • Google Playలో పరికరాన్ని దాచండి. మీరు పరికరాన్ని దాచినప్పుడు, మీరు Google Play వెబ్‌సైట్ నుండి ఏదైనా డౌన్‌లోడ్ చేసినప్పుడు అది కనిపించదు.

Google Playలో పరికరాలను ఎలా దాచాలి

మీరు ఇప్పుడు ఒక పరికరాన్ని స్వంతంగా కలిగి ఉండకపోతే లేదా ఉపయోగించకుంటే, మీరు దాన్ని దాచవచ్చు, ఇలా చేయడం వలన మీరు మీ కంప్యూటర్ లేదా మొబైల్ బ్రౌజర్ నుండి దేనినైనా డౌన్‌లోడ్ చేసినప్పుడు అది కనిపించదు:

  1. play.google.com లింక్‌కు వెళ్లండి.
  2. ఎగువున కుడి వైపున ఉన్న, మీ ప్రొఫైల్ చిహ్నాన్ని క్లిక్ చేయండి.
  3. లైబ్రరీ & పరికరాలు ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. పరికరాలు ట్యాబ్‌ను ఎంచుకోండి.
  5. పరికరానికి పక్కన, మెనూలలో చూపించు ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

పరికరానికి మారుపేరును ఎలా జోడించాలి

పరికరాలను సులభంగా గుర్తించడానికి వీలుగా మీరు వాటికి మారుపేర్లను జోడించవచ్చు, మీ ఖాతాతో పలు పరికరాలు అనుబంధించబడి ఉన్నప్పుడు ఇది సహాయకరంగా ఉంటుంది. ఒక పరికరానికి మారుపేరును జోడించడానికి:

  1. play.google.com లింక్‌కు వెళ్లండి.
  2. ఎగువున కుడి వైపున ఉన్న, మీ ప్రొఫైల్ చిహ్నాన్ని క్లిక్ చేయండి.
  3. లైబ్రరీ & పరికరాలు ఆప్షన్‌ను క్లిక్ చేయండి. 
  4. పరికరాలు ట్యాబ్‌ను ఎంచుకోండి.
  5. మీరు మార్చాలనుకుంటున్న పరికరాన్ని కనుగొనండి.
  6. "మారుపేరు" దిగువ, కొత్త పేరును ఎంటర్ చేయండి.
  7. అప్‌డేట్ చేయిని క్లిక్ చేయండి.
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
2837807382010382204
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
84680
false
false