Google Play నుండి పుస్తకాలను డౌన్‌లోడ్ ఎలా చేయాలి

మీరు Google Play Books నుండి ఈ-బుక్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు కాబట్టి మీకు ఇంటర్నెట్ కనెక్షన్ లేనప్పుడు కూడా వాటిని ఎక్కడైనా చదవవచ్చు.

ఆఫ్‌లైన్‌లో చదవడానికి వీలుగా పుస్తకాలను డౌన్‌లోడ్ చేసుకోండి

  1. Google Play Books యాప్ Play Booksను తెరవండి.
  2. మీ లైబ్రరీకి వెళ్లండి.
  3. మీరు డౌన్‌లోడ్ చేయాలనుకుంటున్న పుస్తకం పక్కన ఉన్న, డౌన్‌లోడ్ చేయండి Downloadని ట్యాప్ చేయండి.
  4. పుస్తకం ఒకసారి డౌన్‌లోడ్ అయిన తర్వాత, డౌన్‌లోడ్ అయింది అనే చిహ్నం Offline కనిపిస్తుంది.
చిట్కాలు:
  • Android (వెర్షన్ 2023.04.17.00 ఇంకా ఆపై వెర్షన్)లో, మీరు ఒక్కసారే మల్టిపుల్ పుస్తకాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పుస్తకాన్ని ట్యాప్ చేసి ఉంచండి, మరిన్ని పుస్తకాలను ఎంచుకుని, ఆపై డౌన్‌లోడ్ చేయండి Downloadని ట్యాప్ చేయండి.
  • డౌన్‌లోడ్ చేసిన పుస్తకాలను తీసివేయడానికి, మల్టిపుల్ పుస్తకాలను ఎంచుకోవడానికి ట్యాప్ చేసి ఉంచండి, ఆపై డౌన్‌లోడ్ తీసివేయండి ని ట్యాప్ చేయండి.

Wi-Fiని ఉపయోగించి మాత్రమే డౌన్‌లోడ్ చేయండి

డేటా ఛార్జీలను నివారించడానికి, Wi-Fiని ఉపయోగించి మాత్రమే మీరు ఈ-బుక్‌లను డౌన్‌లోడ్ చేయవచ్చు.

  1. మీ ఫోన్ లేదా టాబ్లెట్‌లో, Google Play Books యాప్ Play Booksను తెరవండి.
  2. పైన కుడి వైపున, మీ ప్రొఫైల్ ఫోటోను ట్యాప్ చేయండి.
  3. Play Books సెట్టింగ్‌లు ఆ తర్వాత Wi-Fi ద్వారా మాత్రమే డౌన్‌లోడ్ చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

కొత్త డౌన్‌లోడ్‌లను SD కార్డ్‌కు సేవ్ చేయండి

మీరు ప్రారంభించడానికి ముందు

  • SD కార్డ్‌ను తప్పనిసరిగా “అంతర్గత” లేదా “పోర్టబుల్ స్టోరేజ్”గా ఫార్మాట్ చేయాలి. సెట్టింగ్‌లు, ఫంక్షనాలిటీ ఫోన్‌ను బట్టి మారతాయి. మరింత సమాచారం కోసం, మీ పరికరం తయారీదారును సంప్రదించండి.
  • మీ SD కార్డ్ తగినంత స్టోరేజ్ స్పేస్‌ను కలిగి ఉందేమో చెక్ చేయండి.

పుస్తకాలను SD కార్డ్‌కు సేవ్ చేయండి

  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, Play Books Play Booksను తెరవండి.
  2. ఎగువ కుడి వైపున, మీ ప్రొఫైల్ ఫోటో లేదా ఇంటి పేరును ట్యాప్ చేయండి.
  3. Play Books సెట్టింగ్‌లు Settingsను ట్యాప్ చేయండి.
  4. కొత్త పుస్తకాలను SD కార్డ్‌కు డౌన్‌లోడ్ చేయండి ఆప్షన్‌ను ఆన్ చేయండి.
చిట్కాలు:
  • Play Books, మీ SD కార్డ్‌కు డౌన్‌లోడ్ కాలేకపోతే, దానికి బదులుగా మీ అంతర్గత స్టోరేజ్‌కు, అది ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ అవుతుంది.
  • మునుపటి డౌన్‌లోడ్‌లు SD కార్డ్‌కు బదిలీ కావు. గతంలో డౌన్‌లోడ్ చేసిన పుస్తకాలను SD కార్డ్‌కు తరలించడానికి, SD కార్డ్ స్టోరేజ్‌ను ఆన్ చేసి, డౌన్‌లోడ్‌ను తీసివేసి, ఆ తర్వాత పుస్తకాన్ని మళ్లీ డౌన్‌లోడ్ చేయండి.
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
13184630834028440988
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
84680
false
false