మీ PCలో Google Play Games బీటాతో ఉన్న సమస్యలను పరిష్కరించండి

మీరు దీన్ని మీ కంప్యూటర్‌లో ఇన్‌స్టాల్ చేసిన తర్వాత PCలో Google Play Games బీటాతో మీకు సమస్యలు ఉంటే, ఈ దశలు మీకు సమస్యను పరిష్కరించడంలో సహాయపడవచ్చు. Google Play Games బీటా దశలో ఉంది, కాబట్టి కొన్ని సమస్యలు ఎదురవుతాయని మేము ఆశించాము.

PCలో Google Play Games బీటాను మెరుగుపరచడంలో మాకు సహాయపడటానికి, మీకు ఏదైనా సమస్య ఉంటే, మీ అనుభవం గురించి ఫీడ్‌బ్యాక్‌ను సమర్పించండి.

PCలోని Google Play Games బీటాలో సాధారణ సమస్యలను పరిష్కరించండి

ఈ దశలు PCలోని Google Play Games బీటాలోని చాలా సమస్యల విషయంలో సహాయపడతాయి, అవి:
  • గేమ్ పనితీరు
  • కనెక్టివిటీ
PCలో Google Play Games బీటాను రీస్టార్ట్ చేయండి
  1. టాస్క్‌బార్ నోటిఫికేషన్ ఉన్న చోట, PCలో Google Play Games బీటాపై కుడి-క్లిక్ చేయండి .
    • చిట్కా: మీకు PCలో Google Play Games బీటా చిహ్నం కనిపించకపోతే, మరిన్ని ఆప్షన్‌ల కోసం, టాస్క్‌బార్ నోటిఫికేషన్ ప్రదేశానికి దిగువ ఎడమ వైపున ఉండే పై వైపు బాణం ను క్లిక్ చేయండి.
  2. నిష్క్రమించండిని క్లిక్ చేయండి.
  3. PCలో Google Play Games బీటాను తిరిగి తెరవండి.
PCలో Google Play Games బీటాను అప్‌డేట్ చేయండి
  1. టాస్క్‌బార్ నోటిఫికేషన్ ఉన్న చోట, PCలో Google Play Games బీటాపై కుడి-క్లిక్ చేయండి .
    • చిట్కా: మీకు PCలో Google Play Games బీటా చిహ్నం కనిపించకపోతే, మరిన్ని ఆప్షన్‌ల కోసం, టాస్క్‌బార్ నోటిఫికేషన్ ప్రదేశానికి దిగువ ఎడమ వైపున ఉండే పై వైపు బాణం ను క్లిక్ చేయండి.
  2. అప్‌డేట్‌ల కోసం చెక్ చేయండిని క్లిక్ చేయండి.
  3. అప్‌డేట్‌ను పూర్తి చేయడానికి, స్క్రీన్‌పై సూచనలను ఫాలో అవ్వండి.
మీ PCలో గేమ్ ఎందుకు ప్లే చేయబడదు

PCలో Google Play Gamesలో గేమ్ కోసం సెర్చ్ చేసినప్పుడు, మీ PCలో గేమ్‌ను ప్లే చేయలేమని తెలిపే ఫలితాన్ని మీరు పొందవచ్చు. గేమ్, ప్లే చేయలేకపోవడానికి ఇక్కడ కొన్ని కారణాలు ఉన్నాయి:

గేమ్‌ను ఆడుతున్నప్పుడు ఇతర సెట్టింగ్‌లను మార్చండి

గేమ్ నుండి నిష్క్రమించండి
  1. గేమ్ ఆప్షన్‌లను తెరవడానికి, Shift + Tabను నొక్కండి.
  2. ఎగువ కుడి వైపున, గేమ్ నుండి నిష్క్రమించండిని క్లిక్ చేయండి.
చిట్కా: గేమ్ ఆప్షన్‌లను తెరవకుండానే గేమ్ నుండి నిష్క్రమించడానికి, మీరు Alt + F4 కీలను కూడా నొక్కవచ్చు.
ఏదైనా గేమ్‌కు ఇన్‌పుట్ భాషను మార్చండి
  1. గేమ్ ఆప్షన్‌లను తెరవడానికి, Shift + Tabను నొక్కండి.
  2. ఇన్‌పుట్ భాషను క్లిక్ చేయండి.
  3. మీరు ఉపయోగించాలనుకుంటున్న భాషను ఎంచుకోండి.
ఏదైనా గేమ్‌లో ఫుల్ స్క్రీన్ మోడ్‌ను ప్రారంభించండి లేదా ఆ మోడ్ నుండి నిష్క్రమించండి
  1. గేమ్ ఆప్షన్‌లను తెరవడానికి, Shift + Tabను నొక్కండి.
  2. ఫుల్ స్క్రీన్‌ను క్లిక్ చేయండి.

చిట్కా: గేమ్ ఆప్షన్‌లను తెరవకుండానే ఫుల్ స్క్రీన్ మోడ్‌ను ప్రారంభించడానికి లేదా ఆ మోడ్ నుండి నిష్క్రమించడానికి, F11ను గానీ, లేదా Alt + Enterను గానీ నొక్కండి.

మరింత సహాయం పొందండి

మీకు మరింత సహాయం అవసరమైతే, మీరు ఈ కింద ఉన్న వాటిని చేయవచ్చు:
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
5779953584262513307
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
84680
false
false