మీ PCలో Google Play Games బీటాను ఇన్‌స్టాల్ చేసి, సెటప్ చేయండి

మీ PC, కనీస అవసరాలకు అనుగుణంగా ఉంటే, మీరు PCలో Google Play Games బీటాను ఇన్‌స్టాల్ చేయవచ్చు.

ఇన్‌స్టాలేషన్‌ను ప్రారంభించండి

  1. మీ Windows కంప్యూటర్‌లో, play.google.com/googleplaygames లింక్‌కు వెళ్లండి.
  2. డౌన్‌లోడ్ ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి, డౌన్‌లోడ్ అయిన ఫైల్‌ను తెరిచి, సూచనలను ఫాలో అవ్వండి.
    • ఇన్‌స్టాలేషన్ పూర్తి కావడానికి, కొన్ని నిమిషాల సమయం పట్టవచ్చు.

చిట్కా: మీ కంప్యూటర్ కనీస అవసరాలకు అనుగుణంగా లేకుంటే, మీకు తెలియజేయబడుతుంది అలాగే ఇన్‌స్టాలేషన్ కొనసాగదు.

వర్చువలైజేషన్ సెట్టింగ్‌లను సెటప్ చేయండి

మీ PCలో మొబైల్ గేమ్స్‌ను ఆడటానికి, Windows వర్చువలైజేషన్ సెట్టింగ్‌లు తప్పకుండా ఆన్ చేసి ఉండాలి.

  • Windows Hypervisor Platform ఆఫ్ చేయబడినట్లయితే, ఇన్‌స్టాలేషన్ సమయంలో దాన్ని ఆన్ చేయమని మీరు ప్రాంప్ట్ చేయబడతారు. ఈ సెట్టింగ్ వర్తించడానికి, మీ కంప్యూటర్‌ను రీస్టార్ట్ చేయండి.
  • ఇప్పటికే, Windows Hypervisor Platform ఆన్ చేయబడినట్లయితే, మీకు ప్రాంప్ట్ చేయబడదు.
  • మీరు మీ PCలో Google Play Games బీటాను ఇన్‌స్టాల్ చేసే ముందు, మీ కంప్యూటర్ BIOS సెట్టింగ్‌లలో CPU వర్చువలైజేషన్ తప్పనిసరిగా ఆన్ చేసి ఉండాలి.

చిట్కా: మీరు మీ కంప్యూటర్‌లో ఇతర ఎమ్యులేటర్‌లను ఇన్‌స్టాల్ చేసినట్లయితే, Windows Hypervisor Platform ఆన్‌లో ఉన్నప్పుడు, అవి పని చేయకపోవచ్చు. ఇన్‌స్టాలేషన్ తర్వాత Hypervisorను ఎలా ఆఫ్ చేయాలో తెలుసుకోండి.

మీ ఖాతాకు సైన్ ఇన్ చేయండి

పరికరాల్లో ప్లే చేయడానికి, మీ మొబైల్ పరికరంలో ఇంకా మీ PCలో అదే ఖాతాతో సైన్ ఇన్ చేసేటట్లు తప్పకుండా చూసుకోండి.

చిట్కా: PCలో Google Play Games బీటాను ఇన్‌స్టాల్ చేసిన మొదటి యూజర్ మాత్రమే దాన్ని తెరిచి గేమ్‌లను ఆడగలరు.

ఇన్‌స్టాలేషన్ ఎర్రర్‌లను పరిష్కరించండి

  • మిస్ అవుతున్న కనీస PC అవసరాల పరిష్కారం కోసం ప్రయత్నించండి. ఇన్‌స్టాలేషన్ సమయంలో, నిర్దిష్ట ఐటెమ్‌లు గమనించబడతాయి.
    • మీ PCని ఎలా అప్‌డేట్ చేయాలి అనే దాని గురించి మరింత సమాచారం కోసం, PC తయారీదారుని సంప్రదించండి.
  • ఇన్‌స్టాలేషన్‌కు ముందు గానీ లేదా మీరు PCలో Google Play Games బీటాను రన్ చేసినప్పుడు ప్రాంప్ట్ చేసినప్పుడు గానీ, Windows Hypervisor Platformను తప్పకుండా ఆన్ చేయాలని గుర్తుంచుకోండి.
  • మీరు యాప్‌ను ఇన్‌స్టాల్ చేసినప్పుడు, మీరు HAXMను ఆన్ చేసినట్లయితే, PCలో Google Play Games బీటాను అన్‌ఇన్‌స్టాల్ చేసి, ఆపై దాన్ని మళ్లీ ఇన్‌స్టాల్ చేయండి. ప్రాంప్ట్ చేయబడినప్పుడు, Windows Hypervisor Platformను తప్పకుండా ఆన్ చేయాలని గుర్తుంచుకోండి.
    • నవంబర్ 11, 2022 నాటికి, PCలో Google Play Games Beta, HAXMను Windows Hypervisor Platformకు ప్రత్యామ్నాయంగా సపోర్ట్ చేయదు.
  • Windows “యాప్‌లు & ఫీచర్లు” ద్వారా PCలో Google Play Games బీటాను అన్‌ఇన్‌స్టాల్ చేసి, ఆపై దాన్ని మళ్లీ ఇన్‌స్టాల్ చేయండి.
  • మీ కంప్యూటర్‌ను రీస్టార్ట్ చేయండి.

చిట్కా: మీరు ఈ పరిష్కార ప్రక్రియ దశలన్నీ ట్రై చేశాక కూడా, మీ PCలో మీరు Google Play Games బీటాను ఇన్‌స్టాల్ చేయలేకపోతున్నట్లయితే, మమ్మల్ని సంప్రదించండి. ఈ ప్రోడక్ట్ ఇప్పటికీ బీటాలో ఉంది, కాబట్టి మీరు పంపే ఏదైనా ఫీడ్‌బ్యాక్‌ను మేము అభినందిస్తాము.

సంబంధిత రిసోర్స్‌లు

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
13927690095207674653
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
84680
false
false