Android యాప్ డెవలపర్‌ను సంప్రదించండి

Google కాకుండా, థర్డ్-పార్టీ డెవలపర్‌లు చాలా వరకు Google Playలో యాప్‌లను క్రియేట్ చేస్తారు. డెవలపర్‌లు వారి యాప్‌ల సపోర్ట్‌కు ఇంకా ఆ యాప్‌లు మీకు సక్రమంగా పని చేసేలా చూడటానికి బాధ్యత వహిస్తారు. యాప్‌లోని సమస్యలను వారు మాత్రమే పరిష్కరించగలరు. ఒకవేళ ఈ కింద పేర్కొన్న సమస్యలు ఎదురైతే యాప్ డెవలపర్‌ను సంప్రదించండి:

  • మీరు డౌన్‌లోడ్ చేసిన యాప్ పని చేయడం లేదు.
  • యాప్‌లో కొనుగోలు లేదా సబ్‌స్క్రిప్షన్ డెలివరీ కాలేదు, పని చేయడం లేదు లేదా మీరు ఆశించిన విధంగా జరగలేదు.
  • రీఫండ్‌ను రిక్వెస్ట్ చేయడం అనే విధానానికి అందుబాటులో లేని యాప్‌లో కొనుగోలు లేదా సబ్‌స్క్రిప్షన్ కోసం మీకు రీఫండ్ కావాలి.
  • మీ ప్రోగ్రెస్‌ను తిరిగి పొందడం లేదా రీసెట్ చేయడం లేదా యాప్ లేదా గేమ్‌లో ఫైల్‌ను సేవ్ చేయడంలో మీకు సమస్య ఉంది.
  • యాప్ లేదా గేమ్‌ను ఎలా ఉపయోగించాలనే దాని గురించి మీరు మరింత తెలుసుకోవాలనుకుంటున్నారు.

యాప్ డెవలపర్ కాంటాక్ట్ సమాచారాన్ని కనుగొనండి

On Android mobile devices

  1. Open the Google Play Store app Google Play.
  2. Browse or search for the app.
  3. Tap the app to open the detail page.
  4. Tap Developer contact.
  5. Scroll down to review the contact information listed.

On Android TV

  1. Open the Google Play Store app Google Play.
  2. Browse or search for the app.
  3. Locate and select the app from your search results.
  4. Select Full Description.

మీరు డెవలపర్‌ను సంప్రదించినప్పుడు ఏమి చెప్పాలి

మీరు డెవలపర్‌ను సంప్రదించినప్పుడు, వారికి ఇవి తెలియజేయండి:

  • మీరు ఉపయోగిస్తున్న యాప్. కొన్ని ఉదాహరణలు, "Facebook," "Clash of Clans," లేదా "Candy Crush."
  • మీకు గల సమస్య. ఉదాహరణకు, "నా యాప్‌లో కొనుగోలు విఫలమైంది," లేదా "నేను యాప్‌ను తెరిచినప్పుడు సరైన రీతిలో పని చేయడం లేదు" లాంటివి.
  • మీరు కోరుకునే ప్రతిస్పందన. ఉదాహరణకు, సమస్యను పరిష్కరించడంలో మీకు సహాయం కావాల్సి ఉంటే లేదా మీ కొనుగోలు కోసం రీఫండ్ పొందాలనుకుంటే పేర్కొనండి. 

యాప్ డెవలపర్‌ని సంప్రదిస్తున్నప్పుడు ఏమి ఆశించాలి

మీరు సమస్య గురించి డెవలపర్‌ని సంప్రదించినప్పుడు, మర్యాదపూర్వక మరియు వృత్తిపరమైన ప్రతిస్పందనను పొందుతారు. మీరు చేసిన కొనుగోలుతో గల సమస్య గురించి మీ విచారణ అయితే, మీకు మూడు పని దినాలలో ప్రతిస్పందన అందుతుంది.

మీరు డెవలపర్‌ను సంప్రదించిన తర్వాత, మీరు Play Storeలో యాప్ కోసం పబ్లిక్ రివ్యూ అందించవచ్చు. డెవలపర్‌కు ఫీడ్‌బ్యాక్‌ని అందించడానికి, ఇతర Play యూజర్‌లకు అవగాహన కలిగించడానికి డెవలపర్ మద్దతు గురించి మీ అనుభవాన్ని జోడించండి. 

డెవలపర్‌ల కోసం పబ్లిక్ రివ్యూను అందించండి 

Play Storeలో రివ్యూను ఎలా అందించాలి

మీ Android పరికరం లేదా Chromebookలో Play Store యాప్‌ను ఉపయోగించడం

  1. Google Play Store Google Playను తెరవండి.
  2. మీకు కావలసిన యాప్ కోసం బ్రౌజ్ చేయండి లేదా సెర్చ్ చేయండి. 
  3. వివరాల పేజీని తెరవడానికి యాప్‌ను కనుగొని, ఎంచుకోండి.
  4. మీరు రివ్యూల విభాగానికి చేరుకునే దాకా దిగువకు స్క్రోల్ చేయండి. 
  5. స్టార్‌ల సంఖ్యను ఎంచుకోండి.
  6. సమర్పించు ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  7. ఫీడ్‌బ్యాక్ అందించి, చిన్న రివ్యూను రాయండి.
  8. ముగించండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

మీ కంప్యూటర్‌లో వెబ్ బ్రౌజర్‌ను ఉపయోగించడం

  1. play.google.com లింక్‌కు వెళ్లండి.
  2. మీరు రివ్యూ చేయాలనుకుంటున్న యాప్‌ను ట్యాప్ కనుగొనండి.
  3. వివరాల పేజీని తెరిచేందుకు యాప్‌ను ఎంచుకోండి.
  4. దిగువకు స్క్రోల్ చేసి, రివ్యూను రాయండి Write a review ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  5. మీ స్టారే రేటింగ్‌ను ఎంచుకుని, మీ రివ్యూను రాయండి. 
  6. సమర్పించు ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

గమనిక: మీరు గతంలో డౌన్‌లోడ్ చేసి, ఇన్‌స్టాల్ చేసిన యాప్‌లను మాత్రమే రివ్యూ చేయవచ్చు. మీరు యాప్‌ను డౌన్‌లోడ్ చేసినప్పుడు, అది మీ Google ఖాతాకు లింక్ చేయబడుతుంది. మీరు యాప్‌ను డౌన్‌లోడ్ చేసినప్పటికీ, రివ్యూను రాయడానికి ఆప్షన్ కనిపించకుంటే, మీరు సరైన ఖాతాకు సైన్ ఇన్ చేసినట్లు నిర్ధారించుకోండి

Android కంప్యూటర్
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
12767568649529234911
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
84680
false
false