Androidలోని Play Store & యాప్‌లను ఎలా అప్‌డేట్ చేయాలి

మీరు మీ Android యాప్‌లను ఇంకా Play Store యాప్‌ను ఒక్కొక్కటిగా, అన్నింటినీ కలిపి ఒకేసారి, లేదా ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయవచ్చు. మీ యాప్‌లను తాజా వెర్షన్‌కు అప్‌డేట్ చేయడం వల్ల మీకు తాజా ఫీచర్‌లకు యాక్సెస్ లభిస్తుంది, అలాగే యాప్ సెక్యూరిటీ ఇంకా స్థిరత్వాన్ని మెరుగుపరుస్తుంది.

ముఖ్యమైనది:

  • ఒకవేళ యాప్ అప్‌డేట్ వల్ల ఏదైనా క్లిష్టమైన సెక్యూరిటీ సమస్య పరిష్కారం అవుతుందని Google గుర్తిస్తే, కొన్ని నిర్దిష్ట యాప్ అప్‌డేట్‌లను మేము పూర్తి చేయగలము. యాప్‌లో లేదా మీ పరికరంలో అప్‌డేట్ సెట్టింగ్‌లతో సంబంధం లేకుండా ఈ అప్‌డేట్‌లు సంభవించవచ్చు. మరింత సమాచారం కోసం, Google Play సర్వీస్ నియమాలను చదవండి.
  • మీరు Chromebookలో Google Playని ఉపయోగిస్తుంటే, యాప్ అప్‌డేట్‌ల గురించి ఇక్కడ కనుగొనండి.

Android యాప్‌ను ఎలా అప్‌డేట్ చేయాలి

  1. Google Play స్టోర్ యాప్ Google Playను తెరవండి.
  2. ఎగువున కుడి వైపున ఉన్న, ప్రొఫైల్ చిహ్నాన్ని ట్యాప్ చేయండి.
  3. యాప్‌లను, పరికరాన్ని మేనేజ్ చేయండి ఆ తర్వాత మేనేజ్ చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. మీరు అప్‌డేట్ చేయాలనుకుంటున్న యాప్‌ను ట్యాప్ చేయండి.
    • చిట్కా: అప్‌డేట్ అందుబాటులో ఉన్న యాప్‌లు "అప్‌డేట్ అందుబాటులో ఉంది" అని లేబుల్ చేయబడతాయి.
  5. అప్‌డేట్ చేయండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

Google Play Storeను ఎలా అప్‌డేట్ చేయాలి

  1. Google Play స్టోర్ యాప్ Google Playను తెరవండి.
  2. ఎగువున కుడి వైపున ఉన్న, ప్రొఫైల్ చిహ్నాన్ని ట్యాప్ చేయండి.
  3. సెట్టింగ్‌లు ఆ తర్వాత వీటి గురించి ఆ తర్వాత Play Store వెర్షన్ అనే ఆప్షన్+ను ట్యాప్ చేయండి.
  4. Play Store అప్‌డేట్ అయిందో లేదో తెలియజేసే మెసేజ్ మీకు వస్తుంది. అర్థమైంది అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
    • అప్‌డేట్ అందుబాటులో ఉంటే, అది ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ చేయబడి, కొన్ని నిమిషాల్లో ఇన్‌స్టాల్ చేయబడుతుంది.

అన్ని Android యాప్‌లను ఆటోమేటిక్‌గా ఎలా అప్‌డేట్ చేయాలి

  1. Google Play స్టోర్ యాప్ Google Playను తెరవండి.
  2. ఎగువున కుడి వైపున ఉన్న, ప్రొఫైల్ చిహ్నాన్ని ట్యాప్ చేయండి.
  3. సెట్టింగ్‌లు ఆ తర్వాత నెట్‌వర్క్ ప్రాధాన్యతలు ఆ తర్వాత యాప్‌లను ఆటో-అప్‌డేట్ చేయి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. ఒక ఆప్షన్‌ను ఎంచుకోండి:
    • Wi-Fi లేదా మొబైల్ డేటాను ఉపయోగించి యాప్‌లను అప్‌డేట్ చేయడానికి 'ఏదైనా నెట్‌వర్క్' అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
    • Wi-Fiకి కనెక్ట్ చేసినపుడు మాత్రమే యాప్‌లను అప్‌డేట్ చేయడానికి 'Wi-Fiతో మాత్రమే' అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.

గమనిక: ఒకవేళ మీ పరికరంలోని ఏదైనా ఖాతాలో సైన్-ఇన్ చేయడంలో ఎర్రర్ ఉన్నట్లయితే, యాప్‌లను ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయడం సాధ్యపడకపోవచ్చు.

పరిమిత మొబైల్ డేటాతో యాప్‌లను ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయండి

ముఖ్య గమనిక: ఈ ఆప్షన్, పరిమిత గ్రూప్‌నకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
  1. Play Store యాప్ Google Playను తెరవండి.
  2. ఎగువున కుడి వైపున ఉన్న, ప్రొఫైల్ చిహ్నాన్ని ట్యాప్ చేయండి.
  3. సెట్టింగ్‌లు ఆ తర్వాత నెట్‌వర్క్ ప్రాధాన్యతలు ఆ తర్వాత యాప్‌లను ఆటో-అప్‌డేట్ చేయండి అనే ఆప్షన్‌లను ట్యాప్ చేయండి.
  4. పరిమిత మొబైల్ డేటా ద్వారా అప్‌డేట్ చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
ఇది ఎలా పని చేస్తుంది
మీ యాప్‌లను ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయడానికి, Google Play మీ నెలవారీ మొబైల్ డేటాలోని పరిమిత భాగాన్ని ఉపయోగించగలదు. కొత్త ఫీచర్‌లు ఉన్న యాప్‌లు లేదా మీరు ఎక్కువగా ఉపయోగిస్తారని మేము భావిస్తున్న యాప్‌లు వంటి అనేక అంశాలను ఉపయోగించి యాప్ అప్‌డేట్‌లకు Google Play ప్రాధాన్యతనిస్తుంది. Google Play ఎల్లప్పుడూ ముందుగా Wi-Fi ద్వారా యాప్‌లను అప్‌డేట్ చేయడానికి ప్రయత్నిస్తుంది.
ఈ సెట్టింగ్ ఎంత మొబైల్ డేటాను ఉపయోగిస్తుంది
ఈ సెట్టింగ్ ఆన్‌లో ఉన్నప్పుడు, Google Play అనేక అంశాల ఆధారంగా బడ్జెట్‌ను ఎంచుకుంటుంది. ఉదాహరణకు:
  • మీరు గత 30 రోజుల్లో మొబైల్ డేటా ద్వారా యాప్‌లను మాన్యువల్‌గా అప్‌డేట్ చేసినట్లయితే, Google Play ఆ మొత్తం మొబైల్ డేటాను బడ్జెట్‌గా ఉపయోగిస్తుంది.
  • మీరు మొబైల్ డేటా ద్వారా యాప్‌లను అప్‌డేట్ చేయకుంటే, Google Play మీ దేశం/ప్రాంతంలో చాలా మంది వ్యక్తులు ఉపయోగించే సగటు మొబైల్ డేటాను ఉపయోగిస్తుంది, అయినప్పటికీ, ఇది మీరు తరచుగా ఉపయోగించే యాప్‌లను ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.

మొత్తం సమాచారం, Google గోప్యతా పాలసీకి అనుగుణంగా ఉపయోగించబడుతుంది.

మీరు Play Store డేటాను క్లియర్ చేస్తే, మీ సెట్టింగ్‌లు ఇంకా మునుపటి బడ్జెట్ రీసెట్ చేయబడతాయి.

ఒక్కో Android యాప్‌ను ఆటోమేటిక్‌గా ఎలా అప్‌డేట్ చేయాలి

  1. Google Play స్టోర్ యాప్ Google Playను తెరవండి.
  2. ఎగువ కుడి వైపున, ప్రొఫైల్ చిహ్నాన్ని ట్యాప్ చేయండి.
  3. యాప్‌లు & పరికరాన్ని మేనేజ్ చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. మేనేజ్ చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేసి, తర్వాత మీరు ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయాలనుకుంటున్న యాప్‌ను ఎంచుకోండి.
  5. యాప్‌నకు సంబంధించిన "వివరాలు" అనే పేజీని తెరవడానికి, యాప్‌ను ట్యాప్ చేయండి.
  6. యాప్‌నకు సంబంధించిన "వివరాలు" అనే పేజీలో, మరిన్ని మరిన్నిని ట్యాప్ చేయండి.
  7. ఆటో అప్‌డేట్‌ను ఎనేబుల్ చేయండి అనే ఆప్షన్‌ను ఆన్ చేయండి.

అప్‌డేట్‌లు అందుబాటులో ఉన్నప్పుడు, యాప్ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అవుతుంది. ఆటోమేటిక్ అప్‌డేట్‌లను ఆఫ్ చేయడానికి, ఆటో అప్‌డేట్‌ను ఎనేబుల్ చేయిని ఆఫ్ చేయండి.

చిట్కాలు:

  • కొన్ని యాప్‌లు అప్‌డేట్ అవుతున్నపుడు, వాటికి కొత్త అనుమతులు అవసరం. మీరు కొత్త అనుమతులను అంగీకరిస్తున్నారా అని అడిగే నోటిఫికేషన్‌ను మీరు పొందవచ్చు.
  • యాప్‌ను అప్‌డేట్ చేయడానికి, మీరు మీ పరికరాన్ని రీస్టార్ట్ చేయాల్సి రావచ్చు.
  • నిర్దిష్ట యాప్ కోసం సెర్చ్ చేయడానికి, యాప్‌లు & పరికరాలను మేనేజ్ చేయండి ఆ తర్వాత మేనేజ్ చేయండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  • యాప్‌నకు చెందిన అప్‌డేట్ అందుబాటులో ఉంటే, యాప్‌నకు సంబంధించిన "వివరాలు" అనే పేజీలో "అప్‌డేట్ చేయండి" అనే బటన్ కనిపిస్తుంది.
true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
15070460282006675130
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
84680
false
false