యాప్‌లను మళ్లీ ఇన్‌స్టాల్ చేయండి & రీ-ఎనేబుల్ చేయండి

మీరు Google Playలో కొనుగోలు చేసిన యాప్‌లను మళ్లీ పే చేయాల్సిన అవసరం లేకుండా ఏదైనా Android పరికరంలో ఉపయోగించవచ్చు. ప్రతి పరికరం తప్పనిసరిగా ఒకే Google ఖాతాకు సైన్ ఇన్ అయి ఉండాలి. మీ పరికరాల మధ్య యాప్‌లను సింక్ చేయడం ఎలాగో తెలుసుకోండి.

మీరు మీ పరికరంతో పాటు వచ్చే యాప్‌ను ఆఫ్ చేస్తే, దాన్ని తిరిగి ఆన్ చేయవచ్చు. ఉపయోగించని యాప్‌లను Androidలో ఎలా మేనేజ్ చేయాలో తెలుసుకోండి.

మీరు కొనుగోలు చేసిన తర్వాత తొలగించిన యాప్‌ను కూడా రీ-ఇన్‌స్టాల్ చేయవచ్చు.

యాప్‌లను మళ్లీ ఇన్‌స్టాల్ చేయండి లేదా యాప్‌లను తిరిగి ఆన్ చేయండి

  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, Google Play స్టోర్ Google Playను తెరవండి.
  2. కుడి వైపున, ప్రొఫైల్ చిహ్నాన్ని ట్యాప్ చేయండి.
  3. యాప్‌లను, పరికరాన్ని మేనేజ్ చేయండి ఆ తర్వాత మేనేజ్ చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. మీరు ఇన్‌స్టాల్ లేదా ఆన్ చేయాలనుకుంటున్న యాప్‌లను ఎంచుకోండి.
    • ఎగువున, మీరు యాప్‌ను కనుగొనలేకపోతే, ఈ పరికరం ఆ తర్వాత ఇన్‌స్టాల్ చేయబడలేదు అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  5. ఇన్‌స్టాల్ చేయండి లేదా ఎనేబుల్ చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

పరిష్కార ప్రక్రియ దశలు

మీరు యాప్‌లను రీ-ఇన్‌స్టాల్ చేయలేకపోతే, ఈ కింద ఉన్న దశలను ట్రై చేయండి.

Google Play Store అప్‌డేట్‌లను అన్‌ఇన్‌స్టాల్ చేసి, మళ్లీ ఇన్‌స్టాల్ చేయండి

Play Store యాప్ అప్‌డేట్‌లను అన్‌ఇన్‌స్టాల్ చేయడానికి:

  1. మీ పరికరం హోమ్ లేదా యాప్ స్క్రీన్‌లో, Google Play Store యాప్‌ను కనుగొనండి.
  2. Google Play Store యాప్ Google Play‌ను నొక్కి, పట్టుకోండి.
  3. యాప్ సమాచారం ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. ఎగువున కుడి వైపున ఉన్న, మరిన్ని ఆ తర్వాత అప్‌డేట్‌లను అన్‌ఇన్‌స్టాల్ చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  5. సమాచారాన్ని రివ్యూ చేసి, సరే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

Play Store యాప్ అప్‌డేట్‌లను రీ-ఇన్‌స్టాల్ చేయడానికి:

  1. Google Play Store యాప్ Google Playను తెరవండి.
  2. ఎగువున కుడి వైపున ఉన్న, ప్రొఫైల్ ఫోటోను ట్యాప్ చేయండి.
  3. సెట్టింగ్‌లు ఆ తర్వాత వివరాలు అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. “Play Store వెర్షన్,” కింద ఉన్న Play Storeను అప్‌డేట్ చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

Google Play Store కాష్‌ను & డేటాను క్లియర్ చేయండి

ముఖ్య గమనిక:

  • మీరు Google Play Store నుండి యాప్‌లను డౌన్‌లోడ్ చేయడంలో వచ్చే సమస్యలకు Google Play Store నుండి కాష్‌ను క్లియర్ చేయడం అనేది అత్యంత సాధారణ పరిష్కారం.
  • మీరు కాష్‌ను, డేటాను క్లియర్ చేసినప్పుడు, అది Google Play Store యాప్‌లోని తల్లిదండ్రుల కంట్రోల్స్, పాస్‌వర్డ్ రక్షణ వంటి కొన్ని సెట్టింగ్‌లను తొలగించవచ్చు. మీరు తర్వాతిసారి Google Play Storeను తెరిచినప్పుడు సర్వీస్ నియమాలకు మళ్లీ అంగీకరించమని ఇది మిమ్మల్ని అడుగుతుంది.

  1. మీ పరికరంలోని హోమ్‌స్క్రీన్ లేదా యాప్ స్క్రీన్‌లో Google Play Store యాప్‌ను కనుగొనండి.
  2. Google Play Store యాప్‌ను నొక్కి, పట్టుకోండి.
  3. యాప్ సమాచారం ను ట్యాప్ చేయండి.
  4. స్టోరేజ్ & కాష్ ఆ తర్వాత కాష్‌ను క్లియర్ చేయండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  5. స్టోరేజ్‌ను క్లియర్ చేయండి ఆ తర్వాత తొలగించండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

పాస్‌వర్డ్ రక్షణ,తల్లిదండ్రుల కంట్రోల్స్ ఆప్షన్‌ను రీ-ఎనేబుల్ చేయండి.

మునుపటి కొనుగోళ్లను లేదా డౌన్‌లోడ్ చేసిన యాప్‌లను కనుగొనడం

మీరు ఒక యాప్‌ను కనుగొనలేకపోతే లేదా దాన్ని తిరిగి కొనుగోలు చేయమని అడిగినట్లయితే, మీరు దాన్ని కొనుగోలు చేసిన అదే Google ఖాతాను మీరు ఉపయోగిస్తున్నారని నిర్ధారించుకోండి.

Android కంప్యూటర్
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
18081811718483465572
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
84680
false
false