PCలో Google Play Games బీటా కోసం మీ GPUను ఎలా ఆప్టిమైజ్ చేయాలో తెలుసుకోండి

సిఫార్సు చేయబడిన GPU సిరీస్

PCలో Google Play Games బీటాను ఉపయోగించడానికి, ఇక్కడ పేర్కొన్న GPUలను మేము సిఫార్సు చేస్తున్నాము:

  • NVIDIA RTX సిరీస్
  • NVIDIA GeForce GTX 600 సిరీస్ లేదా ఆ తర్వాత వచ్చిన వెర్షన్
  • NVIDIA Volta సిరీస్
  • NVIDIA GeForce 16, 20, లేదా 30 సిరీస్
  • Intel Iris Xe Max సిరీస్
  • Intel Arc సిరీస్
  • 7వ జెనరేషన్ Intel కోర్ ప్రాసెసర్ లేదా ఆ తర్వాత వచ్చిన వెర్షన్ కోసం Intel ఇంటిగ్రేటెడ్ GPU
  • AMD Radeon HD 7790, 7850, 7870, 7950, 7970, లేదా 7990
  • AMD Radeon HD 8970 లేదా 8990
  • AMD Radeon R9 200 సిరీస్
  • AMD Radeon R7/R9 300 సిరీస్
  • AMD Radeon RX 400 సిరీస్
  • AMD Radeon RX 570, 580, లేదా 890
  • AMD Radeon RX Vega సిరీస్
  • AMD Radeon VII సిరీస్
  • AMD Radeon RX 5000 లేదా 6000 సిరీస్

మీ GPU డ్రైవర్‌ను ఎలా అప్‌డేట్ చేయాలో తెలుసుకోండి

మీ GPU డ్రైవర్‌ను అప్‌డేట్ చేసే ముందు, మీ కంప్యూటర్‌లో ఏ GPU మోడల్ ఉందో తెలుసుకోవడం ముఖ్యం.

మీ GPU తయారీదారు, మోడళ్లకు సంబంధించిన వివరాలను పొందడానికి ఈ దశలను ఫాలో అవ్వండి:

  1. Ctrl + Shift + Esc కలిపి నొక్కడం ద్వారా టాస్క్ మేనేజర్‌ను తెరవండి.
  2. పనితీరును ఎంచుకోండి.
  3. ట్యాబ్ చివరి పేన్‌లో, GPUను ఎంచుకోండి. ఇది లిస్ట్‌లో దిగువున ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది.
  4. GPU ఎంపికకు సంబంధించిన ఎగువ కుడి వైపు మూలన, మీ కంప్యూటర్‌కు చెందిన GPU గురించిన సమాచారం కనిపిస్తుంది. మీ కంప్యూటర్‌లో ఒకటి కంటే ఎక్కువ GPUలు ఉండవచ్చని దయచేసి గమనించండి, ఉత్తమ ఎక్స్‌పీరియన్స్‌ను పొందడానికి, అన్ని GPUల డ్రైవర్‌లు అప్‌డేట్ చేయబడి ఉండాలి.

కొన్ని సాధారణ Windows GPU డ్రైవర్‌లకు సంబంధించిన అప్‌డేట్ సమాచారాన్ని దిగువ అందించిన ఈ తయారీదారు వెబ్‌సైట్‌లలో కనుగొనవచ్చు.

మీ GPU డ్రైవర్‌ను అప్‌డేట్ చేయడం కోసం థర్డ్-పార్టీ రిసోర్స్‌లు

ముఖ్య గమనిక: ఈ లిస్ట్‌లో మీ దేశంలోని లేదా ప్రాంతంలోని తయారీదారులందరి సమాచారం ఉండకపోవచ్చు.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
518479634953472605
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
84680
false
false