Google Playలో తల్లిదండ్రుల కంట్రోల్స్‌ను ఎలా సెటప్ చేయాలి

మీరు Android పరికరంలో తల్లిదండ్రుల కంట్రోల్స్‌ను ఉంచినప్పుడు, మెచ్యూరిటీ స్థాయి ఆధారంగా ఆ పరికరంలో Google Play నుండి ఏ కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు లేదా కొనుగోలు చేసుకోవచ్చు అనే దాన్ని మీరు నియంత్రించవచ్చు. అయినప్పటికీ, కొనుగోలు ఆమోద సెట్టింగ్‌లు కేవలం Google Play బిల్లింగ్ సిస్టమ్ ద్వారా చేసే కొనుగోళ్లకు మాత్రమే వర్తిస్తాయి.

తల్లిదండ్రుల కంట్రోల్స్‌ను సెటప్ చేసుకోవడం

ముఖ్యమైనది: తల్లిదండ్రుల కంట్రోల్స్, సెర్చ్ ఫలితంగా గానీ లేదా ప్రత్యక్ష లింక్ నుండి గానీ కనిపించడానికి నియంత్రిత కంటెంట్‌ను నిరోధించవు.

వారి ఖాతాలను వారే స్వయంగా మేనేజ్ చేసుకునే ఫ్యామిలీ మెంబర్‌ల కోసం

Google Play తల్లిదండ్రుల కంట్రోల్స్ ఎలా పనిచేస్తాయి

  • తల్లిదండ్రుల కంట్రోల్స్, మీరు వాటిని జోడించిన Android పరికరానికి మాత్రమే వర్తిస్తాయి. మరొక పరికరంలో తల్లిదండ్రుల కంట్రోల్స్‌ను జోడించడానికి, కింది దశలను ఇతర పరికరాలలో కూడా రిపీట్ చేయండి.
  • మీరు ఒక పరికరంలో పలు రకాల యూజర్‌లను కలిగి ఉంటే, ప్రతి వ్యక్తికీ మీరు విభిన్న రకాలైన తల్లిదండ్రుల కంట్రోల్స్‌ను సెటప్ చేయవచ్చు.
  • తల్లిదండ్రుల కంట్రోల్స్‌ను ఎవరైతే సెటప్ చేస్తారో, వారు PINను కూడా క్రియేట్ చేస్తారు, దాన్ని తల్లిదండ్రుల కంట్రోల్స్‌ను తీసివేయడానికి లేదా మార్చడానికి ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

తల్లిదండ్రుల కంట్రోల్స్‌ను సెటప్ చేసుకోవడం

  1. Google Play యాప్ Google Playను తెరవండి.
  2. ఎగువున కుడి వైపున ఉన్న, ప్రొఫైల్ చిహ్నాన్ని ట్యాప్ చేయండి.
  3. సెట్టింగ్‌లు ఆ తర్వాత ఫ్యామిలీ ఆ తర్వాత తల్లిదండ్రుల కంట్రోల్స్ ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. తల్లిదండ్రుల కంట్రోల్స్‌ను ఆన్ చేయండి
  5. తల్లిదండ్రుల కంట్రోల్స్‌ను సంరక్షించడానికి, మీ చిన్నారికి తెలియని PINను క్రియేట్ చేయండి.
  6. మీరు ఫిల్టర్ చేయాలనుకుంటున్న కంటెంట్ రకాన్ని ఎంచుకోండి.
  7. ఫిల్టర్ చేయడం లేదా యాక్సెస్‌ను నియంత్రించడం ఎలాగో ఎంపిక చేసుకోండి.
Family Linkతో మేనేజ్ చేయబడే ఖాతాలు కలిగిన ఫ్యామిలీ మెంబర్‌ల కోసం
యాప్‌లో నేరుగా ఈ సెట్టింగ్‌కు వెళ్లడానికి, కింద ఉన్న బటన్‌ను ట్యాప్ చేయండి:

మీ చిన్నారి Google ఖాతా Family Linkతో మేనేజ్ చేయబడుతుంటే, మీరు వారి కోసం తల్లిదండ్రుల కంట్రోల్స్‌ను సెటప్ చేయవచ్చు.

Google Play తల్లిదండ్రుల కంట్రోల్స్ ఎలా పనిచేస్తాయి

  • మీ చిన్నారి, వారి Google ఖాతాకు సైన్ ఇన్ చేసిన Android పరికరాలపై తల్లిదండ్రుల కంట్రోల్స్ పనిచేస్తాయి.
  • ఫ్యామిలీ గ్రూప్ లోని పేరెంట్, వారి చిన్నారికి సంబంధించిన తల్లిదండ్రుల కంట్రోల్స్ సెట్టింగ్‌లను సెటప్ చేయడానికి లేదా మార్చడానికి వారి Google ఖాతా పాస్‌వర్డ్‌ను ఉపయోగించాలి.

తల్లిదండ్రుల కంట్రోల్స్‌ను సెటప్ చేసుకోవడం

  1. Family Link యాప్ Family Linkను తెరవండి.
  2. మీ చిన్నారిని ఎంచుకోండి.
  3. కంట్రోల్స్ ఆ తర్వాత కంటెంట్ పరిమితులు ఆ తర్వాత Google Playను ట్యాప్ చేయండి.
  4. మీరు ఫిల్టర్ చేయాలనుకుంటున్న కంటెంట్ రకాన్ని ట్యాప్ చేయండి.
  5. ఫిల్టర్ చేయడం లేదా యాక్సెస్‌ను నియంత్రించడం ఎలాగో ఎంపిక చేసుకోండి.

చిట్కాలు:

  • మీ చిన్నారికి వారి ఖాతా సెట్టింగ్‌లపై కంట్రోల్ ఉన్నా, లేకపోయినా ఈ సెట్టింగ్‌లు ఆటోమేటిక్‌గా మారవు. ఈ కంట్రోల్‌ను మార్చిన తర్వాత, ఈ సెట్టింగ్‌లు సరిగా ఉన్నట్లు తల్లిదండ్రులు నిర్ధారించుకోవాలని మేము సిఫార్సు చేస్తున్నాము.
  • g.co/YourFamily లింక్‌లో మీ చిన్నారి పేరును క్లిక్ చేసి కూడా మీ చిన్నారికి చెందిన ఖాతాను మీరు మేనేజ్ చేయవచ్చు.

తల్లిదండ్రుల కంట్రోల్‌కు సంబంధించి ఏర్పడే సమస్యలను పరిష్కరించండి

మీకు మీ PINతో, అప్‌డేట్‌లతో లేదా మీ పరికరంపై చూపించే తప్పు రేటింగ్‌లతో సమస్యలు ఉంటే, ఈ ఆప్షన్‌లను అన్వేషించండి:

నేను నా PINని మర్చిపోయాను
ముఖ్యమైనది: మీ PINను రీసెట్ చేయడానికి, మీరు మీ Play స్టోర్ యాప్ సెట్టింగ్‌లను క్లియర్ చేయాల్సి ఉంటుంది. మీరు ఈ దశలను ఫాలో చేయడానికి ముందుగా, మీరు మీ ప్రస్తుత సెట్టింగ్‌లను గమనించాలి, తద్వారా మీరు వాటిని మళ్ళీ సెట్ చేసుకోవచ్చు.

మీరు తల్లిదండ్రుల కంట్రోల్స్ సెటప్ చేసినప్పుడు, క్రియేట్ చేసిన PINను మీరు మర్చిపోతే, దాన్ని రీసెట్ చేయడానికి కింది సూచనలను ఫాలో అవ్వండి.

  1. మీ పరికరంలో, సెట్టింగ్‌ల యాప్ ను తెరవండి.
  2. యాప్‌లు & నోటిఫికేషన్‌లను ట్యాప్ చేయండి.
  3. Google Play స్టోర్ను ట్యాప్ చేయండి.
  4. Tap స్టోరేజ్ ఆ తర్వాత డేటాను తీసివేయి లేదా స్టోరేజ్‌ను తీసివేయిని ట్యాప్ చేయండి.
  5. ఇది మీ తల్లిదండ్రుల కంట్రోల్స్, అలాగే PINను రీసెట్ చేస్తుంది.
  6. మీరు Play స్టోర్ యాప్‌కు వెళ్ళి తల్లిదండ్రుల కంట్రోల్స్‌ను జోడించినప్పుడు, మీరు కొత్త PINను సెట్ చేయగలుగుతారు.
నా యాప్ లేదా గేమ్ తెరవబడదు

మీరు యాప్‌లకు, గేమ్‌లకు తల్లిదండ్రుల కంట్రోల్స్‌ను సెటప్ చేసి ఉండి, మీ యాప్‌లలో ఒకటి అప్‌డేట్ కాకుండా ఉంటే, మీ పరికరంలో ఉన్న యాప్ వెర్షన్ కన్నా ప్రస్తుతం ఉన్న కొత్త వెర్షన్ అత్యధిక రేటింగ్‌ను కలిగి ఉండవచ్చు.

యాప్ కొత్త వెర్షన్ మీ తల్లిదండ్రుల కంట్రోల్స్ అనుమతించే దానికంటే ఎక్కువ రేటింగ్‌ను కలిగి ఉంటే, యాప్‌ను అప్‌డేట్ చేయడానికి మీరు ప్రాంప్ట్ చేయబడరు.

అప్‌డేట్ చేయడానికి యాప్‌ను పొందాలంటే, అత్యధిక రేటింగ్‌ను అనుమతించడానికి మీరు మీ తల్లిదండ్రుల కంట్రోల్ సెట్టింగ్‌లను మార్చాల్సి ఉంటుంది.

చిట్కా: యాప్‌ను అప్‌డేట్ చేయడానికి మీరు తల్లిదండ్రుల కంట్రోల్స్‌ను ఆఫ్ చేయవచ్చు, తర్వాత మళ్ళీ తల్లిదండ్రుల కంట్రోల్స్‌ను ఆన్ చేయవచ్చు.
నా చిన్నారి పరికరంలోని కంటెంట్ నేను సెట్ చేసిన రేటింగ్‌కు వెలుపల ఉంది

మీరు తల్లిదండ్రుల కంట్రోల్స్‌ను జోడించడం కంటే ముందు, మీరు లేదా మీ చిన్నారి ఏవైనా యాప్‌లను, గేమ్‌లను చూడగలరు, ఇది మీరు సెట్ చేసిన రేటింగ్‌కు వారు వెలుపల ఉన్నా సాధ్యపడుతుంది. మీ చిన్నారి ఖాతా Family Linkతో పర్యవేక్షించబడితే, వారి Android పరికరాలలో మీరు ఈ యాప్‌లు బ్లాక్ చేయవచ్చు.

తల్లిదండ్రుల కంట్రోల్స్ ఎలా పనిచేస్తాయి

మీరు యాప్‌లు, గేమ్‌లు, ఇంకా ఇతర డిజిటల్ కంటెంట్ కోసం తల్లిదండ్రుల కంట్రోల్స్‌ను సెటప్ చేయవచ్చు. ప్రతి కంటెంట్ రకానికి, తల్లిదండ్రుల కంట్రోల్స్ ఎలా పనిచేస్తాయనే దాన్ని తెలుసుకోవడానికి కింది విభాగాలను చదవండి.

చిట్కా: ప్రతి దేశంలో, అన్ని రకాల కంటెంట్‌లకు, తల్లిదండ్రుల కంట్రోల్స్ అందుబాటులో లేవు. అవి అందుబాటులో లేని దేశానికి మీరు ప్రయాణిస్తే, మీరు తిరిగి మీ ఇంటికి వచ్చేవరకు అవి పని చేయవు.

యాప్‌లు, గేమ్‌ల కోసం తల్లిదండ్రుల కంట్రోల్స్‌ను సెటప్ చేయండి

మీరు తల్లిదండ్రుల కంట్రోల్స్‌ను ఉపయోగించడం ద్వారా Android పరికరంలో యాప్‌లు, గేమ్‌లను పరిమితం చేయవచ్చు, ఇది డౌన్‌లోడ్‌లు లేదా కొనుగోళ్ల కోసం మీరు అనుమతించదలిచిన అత్యధిక కంటెంట్ రేటింగ్‌ను ఎంచుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.

అయినప్పటికీ, మీరు సెర్చ్ చేసినప్పుడు యాప్‌లను, గేమ్‌లను మీ ఫిల్టర్‌కు వెలుపల మీరు చూడవచ్చు, లేదా యాప్ పేజీ ప్రత్యక్ష లింక్‌ను ఉపయోగించి వాటిని సందర్శించడం ద్వారా గానీ చూడవచ్చు.

Play Gamesలో గేమ్‌ల కోసం తల్లిదండ్రుల కంట్రోల్స్ ఎలా పనిచేస్తాయి

మీరు కొన్నవి లేదా సిఫార్సు చేసిన గేమ్‌లతో సహా, Play Games యాప్‌లో మీరు చూసే గేమ్‌లను తల్లిదండ్రుల కంట్రోల్స్ మార్చవు.

Play Games యాప్ ఉపయోగించి ఏదైనా గేమ్‌ను మీరు ఇన్‌స్టాల్ చేయడానికి ట్రై చేస్తే, మీరు Play Store యాప్‌నకు తీసుకెళ్లబడతారు, అక్కడ తల్లిదండ్రుల కంట్రోల్స్ సెట్టింగ్‌లు యాక్సెస్‌ను నియంత్రించవచ్చు.

చిట్కా: మీరు తల్లిదండ్రుల కంట్రోల్స్‌ను జోడించడం కంటే ముందు, మీరు డౌన్‌లోడ్ చేసిన ఏవైనా యాప్‌లను, గేమ్‌లను మీరు లేదా మీ చిన్నారి చూడగలరు, ఇది మీరు సెట్ చేసిన రేటింగ్‌కు వారు వెలుపల ఉన్నా సాధ్యపడుతుంది. మీ చిన్నారి ఖాతా Family Linkతో పర్యవేక్షించబడితే, వారి Android పరికరాలలో మీరు ఈ యాప్‌లు బ్లాక్ చేయవచ్చు.

సినిమాల కోసం తల్లిదండ్రుల కంట్రోల్స్‌ను సెటప్ చేయండి

మీరు తల్లిదండ్రుల కంట్రోల్స్‌ను ఉపయోగించడం ద్వారా Android పరికరంలో సినిమాలను పరిమితం చేయవచ్చు, ఇది మీరు అద్దెకు, కొనుగోలుకు లేదా ప్లేబ్యాక్‌కు అనుమతించాలనుకునే అత్యధిక రేటింగ్‌ను ఎంచుకునేలా చేస్తుంది.

అయినప్పటికీ, మీరు సెర్చ్ చేసినప్పుడు సినిమాలను, మా ఫిల్టర్‌కు వెలుపల మీరు చూడవచ్చు, లేదా కంటెంట్ పేజీకి సంబంధించిన డైరెక్ట్ లింక్‌ను ఉపయోగించి సినిమాల పేజీకి వెళ్లడం ద్వారా చూడవచ్చు.

తల్లిదండ్రుల కంట్రోల్స్ కారణంగా ఏవైనా సినిమాలు నియంత్రించబడితే, ఒకవేళ మీరు ఇప్పటికే వాటిని అద్దెకు తీసుకున్నా లేదా కొనుగోలు చేసినా కూడా వాటిని Play Store యాప్‌లో గానీ లేదా Google TV యాప్‌లో గానీ చూడలేరు.

మీరు ఈ సినిమాలను మళ్లీ చూడటానికి, తల్లిదండ్రుల కంట్రోల్స్‌ను ఆఫ్ చేయవచ్చు.

టీవీ కోసం తల్లిదండ్రుల కంట్రోల్స్‌ను సెటప్ చేయండి

మీరు తల్లిదండ్రుల కంట్రోల్స్‌ను ఉపయోగించడం ద్వారా Android పరికరంలో టీవీ షోలను పరిమితం చేయవచ్చు, ఇది మీరు కొనుగోలు లేదా ప్లేబ్యాక్ కోసం అనుమతించాలనుకుంటున్న అత్యధిక రేటింగ్‌ను ఎంచుకునేలా చేస్తుంది.

అయినప్పటికీ, మీరు సెర్చ్ చేసినప్పుడు మా ఫిల్టర్‌కు వెలుపల మీరు టీవీ షోలను చూడవచ్చు, లేదా కంటెంట్ పేజీ ప్రత్యక్ష లింక్‌ను ఉపయోగించి వాటిని సందర్శించడం ద్వారా గానీ చూడవచ్చు.

తల్లిదండ్రుల కంట్రోల్స్ కారణంగా ఏవైనా టీవీ షోలు నియంత్రించబడితే, ఒకవేళ మీరు ఇప్పటికే కొనుగోలు చేసినా కూడా వాటిని Play Store యాప్‌లో గానీ లేదా Google TV యాప్‌లో గానీ చూడలేరు.

మీరు ఈ షోలను మళ్ళీ చూడటానికి, తల్లిదండ్రుల కంట్రోల్స్‌ను ఆఫ్ చేయవచ్చు.

పుస్తకాల కోసం తల్లిదండ్రుల కంట్రోల్స్‌ను సెటప్ చేయండి

మీరు తల్లిదండ్రుల కంట్రోల్స్‌ను పుస్తకాలకు సెట్ చేసినప్పుడు, మీరు Play స్టోర్ యాప్, Play Books యాప్ నుండి లైంగికంగా అందరికీ తగని కంటెంట్‌తో కూడిన పుస్తకాలను చదవలేరు లేదా కొనుగోలు చేయలేరు.

అయినప్పటికీ, మీరు సెర్చ్ చేసినప్పుడు పుస్తకాలను, మీ ఫిల్టర్‌కు వెలుపల మీరు చూడవచ్చు, లేదా కంటెంట్ పేజీ ప్రత్యక్ష లింక్‌ను ఉపయోగించి వాటిని సందర్శించడం ద్వారా గానీ చూడవచ్చు.

మీరు ఈ పుస్తకాలను మళ్ళీ చూడటానికి, తల్లిదండ్రుల కంట్రోల్స్‌ను ఆఫ్ చేయవచ్చు.

తల్లిదండ్రుల కంట్రోల్స్‌ను సెట్ చేస్తున్నప్పుడు, లైంగికంగా అందరికీ తగని పుస్తకాలను Google Playలో 100% చూడలేరు, ఇది పెద్దలకు మాత్రమే ఉద్దేశించిన కంటెంట్‌ను చాలా వరకు నివారించడంలో సహాయపడగలదు.

true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
8764855172161447142
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
84680
false
false