Google Playతో స్క్రీన్ రీడర్‌ను ఉపయోగించడం

Google Playలో స్క్రీన్ రీడర్‌ను ఉపయోగించి మీరు పుస్తకాలు, వార్తాపత్రికలు, వార్తా కథనాలు చదవవచ్చు లేదా మ్యూజిక్ వినవచ్చు.

TalkBack స్క్రీన్ రీడర్‌ను ఉపయోగించి మీరు పుస్తకాలు, వార్తాపత్రికలు, వార్తా కథనాలు చదవవచ్చు లేదా మ్యూజిక్ వినవచ్చు. TalkBackను ఆన్ చేయడం ఎలాగో తెలుసుకోండి.

గమనిక: అన్ని ఫార్మాట్‌లకు TalkBack అందుబాటులో ఉండదు. 

పుస్తకాలు, వార్తలు & మ్యూజిక్‌ను కనుగొనండి ఇంకా వాటిని వినండి

పుస్తకాలను కనుగొనండి ఇంకా వాటిని చదవండి

మీ పుస్తకాన్ని కనుక్కోండి

  1. మీరు ఇప్పటికే ఆన్ చేయకపోతే, TalkBackను ఆన్ చేయండి.
  2. Play Books Play Booksను తెరవండి.
  3. పుస్తకాన్ని కనుగొనడానికి యాప్‌లో అన్వేషించండి:
    • ట్యాబ్‌లు : దిగువున, మీరు "మొదటి ట్యాబ్," "షాప్," ఇంకా "లైబ్రరీ" లేదా "నా లైబ్రరీ" లాంటి ట్యాబ్‌లను కనుగొనవచ్చు. వీటిలో కొన్ని, మిమ్మల్ని యాప్ నుండి బయటికి తీసుకుపోవచ్చు.
    • నావిగేషన్ డ్రాయర్: ఎగువ ఎడమ వైపున, మీరు నావిగేషన్ డ్రాయర్‌ను కనుగొనవచ్చు. షాపింగ్ చేయండి , సహాయం & ఫీడ్‌బ్యాక్ , ఇంకా సెట్టింగ్‌లు మొదలగు వాటిని అన్వేషించడానికి దానిని తెరవండి.
    • "మొదటి ట్యాబ్": మీ దగ్గర లేని పుస్తకం కోసం వెతకండి, దానిని డౌన్‌లోడ్ చేసుకోండి.

పుస్తకాన్ని చదవండి

  1. మీరు ఇప్పటికే ఆన్ చేయకపోతే, TalkBackను ఆన్ చేయండి.
  2. Play Books Play Booksను తెరవండి.
    1. మీ దగ్గర ఇప్పటికే పుస్తకం ఉంటే, దాన్ని "లైబ్రరీ"లో గానీ లేదా "మొదటి" స్క్రీన్‌లలో గానీ కనుగొనండి.
    2. మీ దగ్గర పుస్తకం లేకపోతే, దాని కోసం "మొదటి" స్క్రీన్ పైభాగంలో సెర్చ్ చేయండి, దాని తర్వాత వచ్చిన ఫలితాన్ని ఎంపిక చేసుకోవడం ద్వారా పుస్తకాన్ని డౌన్‌లోడ్ చేయండి.
  3. పుస్తకాన్ని తెరవండి.
  4. స్క్రీన్‌పై ట్యాప్ చేయండి, తర్వాత స్థూలదృష్టి వీక్షణ మోడ్‌లోకి ఎంటర్ కావడానికి రెండుసార్లు నొక్కండి.
  5. మరిన్ని మరిన్ని ఆ తర్వాత బిగ్గరగా చదువు ఆప్షన్‌ను ఎంచుకోండి.
    • పేజీలోని టెక్స్ట్‌లో ఒక దాని నుండి మరొక దానికి జరగడానికి స్వైప్ చేయండి.
    • పేజీలను తిప్పడానికి, రెండు వేళ్ళతో ఎడమ వైపునకు లేదా కుడి వైపునకు గానీ స్వైప్ చేయండి.

సినిమాలను కనుగొనండి, ప్లే చేయండి

సినిమాలను నావిగేట్ చేయడం

  1. మీరు ఇప్పటికే ఆన్ చేయకపోతే, TalkBackను ఆన్ చేయండి.
  2. Play సినిమాలు Play Moviesను తెరవండి.
  3. మొదటి స్క్రీన్‌లో, అన్వేషించడానికి స్వైప్ చేయండి లేదా తాకండి.
    • మీరు స్వైప్ చేసిన వెంటనే, మీరు సినిమాలు/బటన్‌లు ఉన్న లిస్ట్ ద్వారా నావిగేట్ అవుతారు.
    • సినిమాల వివరాలను పొందడానికి, బటన్‌లపై రెండుసార్లు నొక్కండి.
    • అదనపు చర్యలను (బాగుంది/బాగోలేదు, విష్‌లిస్ట్ నుండి జోడించు/తీసివేయి) తెరవడం కోసం, ఎక్కువసేపు నొక్కి ఉంచండి.

సినిమాను ప్లే చేయండి

  1. మీరు ఇప్పటికే ఆన్ చేయకపోతే, TalkBackను ఆన్ చేయండి.
  2. Play సినిమాలు Play Moviesను తెరవండి.
  3. మీరు కొనుగోలు చేసిన సినిమాను ప్లే చేయవచ్చు, లేదా మీ కోసం సిఫార్సు చేసిన సినిమా ట్రయిలర్‌ను ప్లే చేయవచ్చు.
    • సినిమాను ప్లే చేయడం: వివరాల పేజీని పొందడానికి, సినిమా బటన్‌పై రెండుసార్లు నొక్కండి. తర్వాత 'ప్లే చేయి' బటన్‌పై రెండుసార్లు నొక్కండి.
    • ఇతర ఆప్షన్‌లను కనుగొనడం: Play సినిమాలు మొదటి పేజీలో, ఇతర ఆప్షన్‌లను చూడడానికి, ట్యాప్ చేసి నొక్కి ఉంచండి.
వార్తలను చదవండి

వార్తల సంబంధిత కథనాలను నావిగేట్ చేయండి

  1. మీరు ఇప్పటికే ఆన్ చేయకపోతే, TalkBackను ఆన్ చేయండి.
  2. Play న్యూస్‌స్టాండ్ Play Newsstandను తెరవండి.
  3. మీరు మొదటి స్క్రీన్‌పై ఉంటారు. దిగువున ఉన్న ట్యాబ్‌లు, యాప్‌లో "మీకోసం", "లైబ్రరీ", "అన్వేషించండి" ఇంకా "తర్వాత చదవండి" లాంటి వివిధ విభాగాలను నావిగేట్ చేయడానికి అనుమతిస్తాయి.
    • నావిగేషన్ డ్రాయర్: ఎగువ ఎడమ వైపున ఉంటుంది.
    • మీ కోసం: దిగువ ఎడమ వైపున ఉంటుంది. ఈ ట్యాబ్ వార్తల కథనాలను సూచించింది.
    • లైబ్రరీ: దిగువున ఉంటుంది. ఈ ట్యాబ్, మీ సోర్స్‌లు ఇంకా ఆసక్తి గల శీర్షికలను కలిగి ఉంటుంది.
    • అన్వేషించండి: దిగువున ఉంటుంది. మీరు మీ లైబ్రరీకి జోడించుకొనే విధంగా ఎన్నో శీర్షికలను ఈ ట్యాబ్ కలిగి ఉంది.
    • తర్వాత చదవండి: దిగువ కుడి వైపున ఉంటుంది. మీరు తర్వాత చదవడం కోసం, సేవ్ చేసిన వార్తా కథనాలను ఈ ట్యాబ్ కలిగి ఉంటుంది.

వార్తా కథనాన్ని చదవండి

  1. మీరు ఇప్పటికే ఆన్ చేయకపోతే, TalkBackను ఆన్ చేయండి.
  2. Play న్యూస్‌స్టాండ్ Play Newsstandను తెరవండి.
  3. ఒక వార్తా కథనాన్ని కనుగొనడానికి స్వైప్ చేయండి లేదా తాకడం ద్వారా పరిశీలించండి, తర్వాత దాన్ని చదవడం ప్రారంభించడానికి రెండుసార్లు నొక్కండి
  4. ఆప్షనల్: తర్వాత చదవడం కోసం వార్తా కథనాన్ని సేవ్ చేయడానికి, ఎగువ కుడి వైపునకు వెళ్ళి 'తర్వాత చదవండి' Add bookmarkని ఎంచుకోండి.

చిట్కాలు మరియు సూచనలు

  • చాలా వరకు స్క్రీన్‌లపై నావిగేషన్ డ్రాయర్, ఇంకా ట్యాబ్‌లు ఉంటాయి, కనుక మీరు వాటిని ల్యాండ్‌మార్క్‌లు లాగా ఉపయోగించవచ్చు.
  • నావిగేషన్ డ్రాయర్‌ను మీరు కనుక్కోలేకపోతే, దానిని రెండు వేళ్ళతో కుడి వైపుకు స్వైప్ చేయడం ద్వారా తెరవండి.

 

true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
10917718189124147621
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
84680
false
false