Google Playతో స్క్రీన్ రీడర్‌ను ఉపయోగించడం

Google Playలో స్క్రీన్ రీడర్‌ను ఉపయోగించి మీరు పుస్తకాలు, వార్తాపత్రికలు, వార్తా కథనాలు చదవవచ్చు లేదా మ్యూజిక్ వినవచ్చు.

మీరు వార్తల కథనాలను చదవచ్చు లేదా VoiceOver స్క్రీన్ రీడర్ ద్వారా సినిమాలను చూడవచ్చు.

ఒకవేళ మీరు ఇంకా వాయిస్ఓవర్‌ని ఆన్ చేయకపోతే, సూచనల కోసం Apple సహాయ సైట్‌ను సందర్శించండి.

వార్తలు & సినిమాలను కనుగొనండి, ఇంకా వాటిని వినండి

సినిమాలను కనుగొనండి, ప్లే చేయండి

సినిమాలను నావిగేట్ చేయడం

  1. మీరు ఇప్పటికే ఆన్ చేయకపోతే, VoiceOverను ఆన్ చేయండి.
  2. Play సినిమాలు Play Moviesను తెరవండి.
  3. మీరు మొదటి స్క్రీన్‌పై ఉంటారు.
  4. స్క్రీన్‌లో అన్వేషించడానికి స్వైప్ చేయండి లేదా తాకండి. మీరు స్వైప్ చేసిన వెంటనే, మీరు సినిమాలు/బటన్‌లు ఉన్న లిస్ట్ ద్వారా నావిగేట్ అవుతారు. బటన్‌లపై రెండుసార్లు నొక్కడం ద్వారా, వాటి వివరాల పేజీలు తెరవబడతాయి, అలాగే పైకి, కిందకి స్వైప్ చేయడం ద్వారా వాటి అనుకూల చర్యలను తెరుస్తాయి.

సినిమాను ప్లే చేయండి

  1. మీరు ఇప్పటికే ఆన్ చేయకపోతే, VoiceOverను ఆన్ చేయండి.
  2. Play సినిమాలు Play Moviesను తెరవండి.
  3. మీరు కొనుగోలు చేసిన సినిమాను ప్లే చేయవచ్చు, అలాగే మీకు సిఫార్సు చేసిన సినిమా ట్రయిలర్‌ను ప్లే చేయవచ్చు అని దయచేసి గమనించండి.
    • సినిమాను ప్లే చేయడానికి, సినిమా బటన్‌పై రెండుసార్లు నొక్కండి, తద్వారా సినిమా వివరాల పేజీకి తీసుకెళ్లబడతారు, అక్కడ స్వైప్ చేయండి లేదా ప్లే బటన్‌ను కనుగొనండి. దానిపై రెండుసార్లు నొక్కండి, వెంటనే సినిమా ఆటోమేటిక్‌గా ప్లే కావడం ప్రారంభమవుతుంది.
    • సినిమా ట్రయిలర్‌ను ప్లే చేయడానికి, స్వైప్ చేయండి లేదా సినిమా బటన్‌ను కనుగొని దాని అనుకూల చర్యల కోసం, పైకి లేదా కిందకి స్వైప్ చేయండి. “ట్రయిలర్ ప్లే చేయి”ని రెండుసార్లు నొక్కండి, అది ఆటోమేటిక్‌గా ప్లే కావడం ప్రారంభమవుతుంది.

వార్తలను చదవండి

వార్తల సంబంధిత కథనాలను నావిగేట్ చేయండి

  1. మీరు ఇప్పటికే ఆన్ చేయకపోతే, VoiceOverను ఆన్ చేయండి.
  2. న్యూస్‌స్టాండ్ Play Newsstandను తెరవండి.
  3. మీరు మొదటి స్క్రీన్‌పై ఉంటారు. దిగువున ఉన్న ట్యాబ్‌లు, యాప్‌లో "మీకోసం", "లైబ్రరీ", "అన్వేషించండి" ఇంకా "తర్వాత చదవండి" లాంటి వివిధ విభాగాలను నావిగేట్ చేయడానికి అనుమతిస్తాయి.
    • మెనూ: ఎగువ ఎడమ వైపున ఉంటుంది.
    • మీ కోసం: దిగువ ఎడమ వైపున ఉంటుంది. ఈ ట్యాబ్ వార్తల కథనాలను సూచించింది.
    • లైబ్రరీ: దిగువున ఉంటుంది. ఈ ట్యాబ్, మీ సోర్స్‌లు ఇంకా ఆసక్తి గల శీర్షికలను కలిగి ఉంటుంది.
    • అన్వేషించండి: దిగువున ఉంటుంది. మీరు మీ లైబ్రరీకి జోడించుకొనే విధంగా ఎన్నో శీర్షికలను ఈ ట్యాబ్ కలిగి ఉంది.
    • తర్వాత చదవండి: దిగువ కుడి వైపున ఉంటుంది. మీరు తర్వాత చదవడం కోసం, సేవ్ చేసిన వార్తా కథనాలను ఈ ట్యాబ్ కలిగి ఉంటుంది.

వార్తా కథనాన్ని చదవండి

  1. మీరు ఇప్పటికే ఆన్ చేయకపోతే, VoiceOverను ఆన్ చేయండి.
  2. న్యూస్‌స్టాండ్ Play Newsstandను తెరవండి.
  3. ఒక వార్తా కథనాన్ని కనుగొనడానికి స్వైప్ చేయండి లేదా తాకడం ద్వారా పరిశీలించండి, తర్వాత దాన్ని చదవడం ప్రారంభించడానికి రెండుసార్లు నొక్కండి
  4. ఆప్షనల్: తర్వాత చదవడం కోసం వార్తా కథనాన్ని సేవ్ చేయడానికి, ఎగువ కుడి వైపునకు వెళ్ళి, 'తర్వాత చదవండి' ఆప్షన్‌ను ఎంచుకోండి బుక్‌మార్క్‌ను జోడించు.

చిట్కా: తర్వాత చదవడం కోసం, మీరు వార్తా కథనాన్ని సేవ్ చేయాలంటే, దాన్ని తెరవాల్సిన అవసరం లేదు. హెడ్‌లైన్‌ను మీరు ఇష్టపడితే, పైకి లేదా కిందకి స్వైప్ చేయండి, తర్వాత "తర్వాత చదవడానికి జోడించు" అనే అనుకూల చర్యను ఎంచుకోండి.

చిట్కాలు

  • మీ సినిమా లేదా సినిమా ట్రయిలర్ ఆటోమేటిక్‌గా ప్లే కావడం ప్రారంభమైన తర్వాత, ప్లేయర్ కంట్రోల్‌లను (ప్లే, మరియు పాజ్ లాగా) అలాగే సినిమా నిడివిని లేదా ట్రయిలర్‌ను ట్రాక్ చేసే స్లయిడర్‌ను కనుగొనడానికి, స్వైప్ చేయండి.
  • సినిమా లేదా సినిమా ట్రయిలర్ ల్యాండ్‌స్కేప్ మోడ్‌లో తెరవబడుతుంది. లీనియర్‌గా స్వైప్ చెయ్యడం ద్వారా కంట్రోల్‌లను చేరాలంటే, దీన్ని గుర్తుంచుకోండి.

 

true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
15828519545121999565
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
84680
false
false