ఆర్థికపరమైన సర్వీస్‌లను ఉపయోగించే కన్జ్యూమర్‌ల చార్టర్ విషయంలో న్యాయంగా వ్యవహరించడం

ఈ ఆర్టికల్ Google పేమెంట్ మలేషియా (“GPMY”) అనుసరించే కస్టమర్ సపోర్ట్ ప్రాక్టీసులను వివరిస్తుంది. ఈ ప్రాక్టీసులు నవంబర్ 6, 2019న బ్యాంక్ నెగరా మలేషియా (“BNM”) జారీ చేసిన ఆర్థికపరమైన సర్వీస్‌లను ఉపయోగించే కన్జ్యూమర్‌ల పాలసీ డాక్యుమెంట్ పట్ల న్యాయంగా వ్యవహరించడానికి అనుగుణంగా ఉన్నాయి. ఈ డాక్యుమెంట్ మే 2020లో అమల్లోకి వచ్చింది.

మా కస్టమర్‌ల శ్రేయస్సును, వారి ఆర్థిక సంక్షేమాన్ని పరిరక్షించడానికి:

మా సంస్థ కార్పొరేట్ సంస్కృతిలోను, ప్రధాన విలువలలోను న్యాయమైన వ్యవహారాన్ని పొందుపరచడానికి మేము కట్టుబడి ఉన్నాము

  • మేము మా యూజర్‌లతో ముడిపడి ఉండే అన్ని వ్యవహారాలలో న్యాయమైన బిజినెస్ పద్ధతులను ప్రోత్సహించే విధంగా కనీస ప్రమాణాలను సెట్ చేస్తాము. మా కస్టమర్‌ల సమాచార గోప్యతను సంరక్షించడం ఇందులో భాగంగా ఉంటుంది; ఇంకా
  • మేము కస్టమర్‌ల ఫీడ్‌బ్యాక్‌ను చాలా ముఖ్యమైనదిగా పరిగణించి, మా సిబ్బందికి తక్షణ నిర్మాణాత్మక ఫీడ్‌బ్యాక్‌ను అందిస్తాము.

మా కస్టమర్‌లకు న్యాయమైన నియమాలు అందించబడుతున్నాయని నిర్ధారించడానికి మేము కట్టుబడి ఉన్నాము

  • మా ఒప్పందాలు లేదా ఒప్పందాలలోని నియమాలు న్యాయమైనవిగా, పారదర్శకంగా ఉండేలా, అవి యూజర్‌లకు స్పష్టంగా తెలియజేయబడేలా మేము నిర్ధారించుకుంటాము. 
  • నియమాలు, షరతులు, సంబంధిత హక్కులు, బాధ్యతలు ఇంకా అనివార్యకార్యాలను స్పష్టమైన వివవరణను అందించే విధంగా ఉండేలా నిర్ధారించుకుంటాము. సాధ్యమైనంత వరకు సులువుగా అర్థమయ్యే భాషలో ఉండేటట్లు చూస్తాము.
  • నియమాలు, షరతులు/సర్వీస్ నియమాలలో ఏవైనా మార్పులు అమలులోకి రావడానికి ముందు కనీసం ఇరవై ఒకటి (21) రోజుల నోటీసును అందించడానికి మేము కట్టుబడి ఉన్నాము.

ఆర్థిక సర్వీస్‌లు, ప్రోడక్ట్‌లపై కస్టమర్‌లకు స్పష్టమైన, సందర్భోచితమైన, సమయానుగుణంగా ఉండే సమాచారాన్ని అందించేలా నిర్ధారించడానికి మేము కట్టుబడి ఉన్నాము

  • మేము Play బ్యాలెన్స్ యూజర్‌లకు సందర్భోచితమైన, సమయానుగుణంగా ఉండే Play బ్యాలెన్స్ సమాచారాన్ని అందిస్తాము;
  • యూజర్‌ల విషయంలో ఈ కింది కారణాల ఆధారంగా, రిక్వెస్ట్ చేసిన తేదీ నుండి 1 నెలలోపు Play బ్యాలెన్స్ ఖాతాలలోని బ్యాలెన్స్‌ను మేము అదనపు ఖర్చు లేకుండా (రీఫండ్ పూర్తి చేయడానికి అవసరమైనవి తప్ప) తిరిగి రీఫండ్ చేస్తాము:
    • అతని/ఆమె ఖాతాను మూసివేయాలని నిర్ణయించుకుంటే;
    • ఇకపై Play బ్యాలెన్స్‌ని ఉపయోగించవద్దని అనుకుంటే, లేదా
    • టెక్నికల్ అంశాలలో తేడాల కారణంగా వారికి తప్పుగా ఛార్జీ విధించబడితే.
  • Play బ్యాలెన్స్ యూజర్‌లకు సేల్‌కు ముందు, సేల్ జరుగుతున్న సమయంలో, సేల్ తర్వాత వారికి స్పష్టమైన, సందర్భోచితమైన, సమయానుగుణంగా ఉండే సమాచారాన్ని (ఫిర్యాదులను నిర్వహించే చేసే విధానాలతో సహా) అందించేలా నిర్ధారించడానికి మేము కట్టుబడి ఉన్నాము; తద్వారా వారు సముచితమైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. సంబంధిత సమాచారం మా సహాయ కేంద్ర ఆర్టికల్స్‌లో అందుబాటులో ఉంది.
  • Play బ్యాలెన్స్ యూజర్‌ల కోసం మేము స్పష్టమైన నియమాలు, షరతుల (“T&C”)ను అందిస్తాము. ఇవి కంపెనీ వెబ్‌సైట్‌లోని సహాయ కేంద్రంలో అందుబాటులో ఉన్నాయి; అంటే రీఫండ్ కోసం T&C వంటి వాటిలో వీటిని చూడవచ్చు.

GPMY సిబ్బంది, ప్రతినిధులు, ఏజెంట్లు (మొత్తంగా, "GPMY ఉద్యోగులు") ఆర్థికపరమైన సర్వీస్‌లను ఉపయోగించే కస్టమర్‌లతో వ్యవహరించేటప్పుడు పూర్తి జాగ్రత్తతో, నైపుణ్యంతో, శ్రద్ధతో పనిచేసేలా నిర్ధారించేందుకు మేము కట్టుబడి ఉన్నాము

  • మేము ఆర్థికపరమైన సర్వీస్‌లను ఉపయోగించే కస్టమర్‌లతో ఖచ్చితత్వంతో లావాదేవీలను నిర్వహిస్తాము, తప్పుగా ఉండే, లేదా ఉన్నదాన్ని ఎక్కువ చేసి చూపే క్లెయిమ్‌లను చేయము;
  • Play బ్యాలెన్స్ యూజర్‌ల పట్ల మాకుండే నిబద్ధత, Google ప్రవర్తనా నియమావళిలో పొందుపరచబడినట్లుగా, Googleకు తన యూజర్‌ల పట్ల ఉండే నిబద్ధతలను ప్రతిబింబిస్తుంది.

ఆర్థికపరమైన సర్వీస్‌లను ఉపయోగించే కన్జ్యూమర్‌ల ఫిర్యాదులు, క్లెయిమ్‌లు, సత్వరమైన, న్యాయమైన, ప్రభావవంతమైన పద్ధతిలో నిర్వహించబడుతున్నాయని నిర్ధారించడానికి మేము కట్టుబడి ఉన్నాము

  • మేము సమస్యను అర్థం చేసుకోవడానికి సమంజసంగా ఉండే ప్రయత్నాలు చేస్తాము, ఫిర్యాదును పూర్తి స్థాయిలో విచారిస్తాము, ఆర్థికపరమైన సర్వీస్‌లను ఉపయోగించే కస్టమర్‌కు దేని అధారంగా సదరు నిర్ణయాన్ని తీసుకున్నామో వివరిస్తాము.
  • మేము సురక్షితమైన ఆపరేషన్స్‌ను; కన్జ్యూమర్ సమాచార గోప్యతను; విశ్వసించదగిన, క్వాలిటీతో కూడిన సర్వీస్‌లను; ప్రోడక్ట్‌లు, సర్వీస్‌ల పారదర్శకతను; సందేహాలతో కూడిన ప్రశ్నలు, ఫిర్యాదులు, రీఫండ్‌లు, వివాదాలకు సత్వరమే ప్రతిస్పందించడాన్ని ఖచ్చితంగా జరిగేలా నిర్ధారించడానికి కట్టుబడి ఉన్నాము;
  • ఫిర్యాదు అందిన తర్వాత, మేము సమస్యను పరిష్కరించడానికి ట్రై చేస్తాము. ఎవరైనా కస్టమర్ తుది ఫలితంతో సంతృప్తి చెందకపోతే, 'ఆర్థిక సర్వీస్‌ల కోసం అంబుడ్స్‌మన్' అందుబాటులో ఉన్నట్లుగా మేము కస్టమర్‌కు తెలియజేస్తాము.
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
4887937546388326222
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
84680
false
false