బ్రెజిల్‌లో పన్ను సమాచారాన్ని వెరిఫై చేయండి

మీ Google Play బ్యాలెన్స్‌కు యాక్సెస్ కోల్పోకుండా నివారించడానికి, మీరు తప్పనిసరిగా మీ CPF, పుట్టిన తేదీ, ఇంకా అడ్రస్‌ను ఎంటర్ చేయాలి.

  1. Google Payకి వెళ్లండి.
  2. మీరు రిడీమ్ చేయాలనుకుంటున్న గిఫ్ట్ కార్డ్‌తో అనుబంధించబడిన ఖాతాకు సైన్ ఇన్ చేయండి.
  3. బ్రెజిల్ పన్ను సమాచారానికి స్క్రోల్ చేసి, ఎడిట్ చేయండి ఎడిట్‌ చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. మీ CPFను ఎంటర్ చేయండి. అది ఇప్పటికే ఎంటర్ చేయబడి ఉంటే, దాన్ని తీసివేసి, మళ్లీ ఎంటర్ చేయండి.
  5. మీ పుట్టిన తేదీని స్లాష్‌లతో ఎంటర్ చేయండి (dd/mm/yyyy).
  6. వెరిఫై చేయండి ఆ తర్వాత సేవ్ చేయండి ఆప్షన్‌లను క్లిక్ చేయండి.
  7. మీ గిఫ్ట్ కార్డ్‌ను రిడీమ్ చేయడానికి, play.google.com/redeem లింక్‌కు వెళ్లండి.

మీరు మీ CPFను లేదా మీ పుట్టిన తేదీని నిర్ధారించలేకపోతే, కింద పరిష్కార ప్రక్రియ విభాగాన్ని చూడండి.

CPF సమస్యలను పరిష్కరించండి

లింగ మార్పిడి, వివాహం లేదా విడాకులు వంటి చట్టపరమైన మార్పుల కారణంగా మీరు పేమెంట్‌ల ప్రొఫైల్‌లో మీ పేరును మార్చాలనుకుంటే, మా సపోర్ట్ టీమ్‌ను సంప్రదించండి.

మీరు మీ ఖాతాను మొదటిసారి వెరిఫై చేయాలనుకుంటే, ఈ పరిష్కార ప్రక్రియ దశలను ట్రై చేయండి:

CPF, పుట్టిన తేదీని వెరిఫై చేయడం సాధ్యం కాదు

మీరు మీ CPF, ఇంకా పుట్టిన తేదీని ఎంటర్ చేసినప్పుడు “ఈ సమయంలో మేము మీ CPF & పుట్టిన తేదీని వెరిఫై చేయలేము” అనే ఎర్రర్ మెసేజ్ మీకు వచ్చినట్లయితే:

  1. Receita Federalలో మీ CPF స్టేటస్‌ను చెక్ చేయండి:
    • “రెగ్యులర్” స్టేటస్‌లో ఉన్న CPFలు ఆమోదించబడతాయి.
    • “పెండింగ్” స్టేటస్‌లో ఉన్న CPFలు ఆమోదించబడవు.
  2. మీ పుట్టిన తేదీ Receita Federal రికార్డులతో మ్యాచ్ అవుతుందో లేదో చెక్ చేయండి.
  3. మీ భాషలో మీ పుట్టిన తేదీ సరైన ఫార్మాట్‌లో ఉందో లేదో నిర్ధారించండి:
    • DD/MM/YYYY
    • MM/DD/YYYY
CPF లేదా తేదీ ఇన్‌పుట్ ఎర్రర్

మీరు మీ డేటాను సరిగ్గా ఎంటర్ చేయకపోతే, అలాగే మీకు “CPF లేదా తేదీ ఇన్‌పుట్ ఎర్రర్” అని CPF లేదా తేదీ ఇన్‌పుట్ ఎర్రర్ మెసేజ్ వచ్చినట్లయితే:

  • “CPF సరైనది కాదు. దీన్ని చెక్ చేసి, మళ్ళీ ట్రై చేయండి:"
    • మీరు మీ CPFకి పీరియడ్‌లు లేదా డాష్‌లను జోడించలేదని నిర్ధారించుకోండి.
  • “చెల్లని తేదీ (DD/MM/YYYY)" లేదా "చెల్లని తేదీ (MM/DD/YYYY):"
    • మీరు స్లాష్‌లను ఉపయోగించి తేదీని ఎంటర్ చేశారని నిర్ధారించుకోండి.
సైన్ అప్ ప్రయత్నాల సంఖ్యను మించిపోయింది

మీరు వరుసగా పలు సార్లు తప్పుగా CPFను లేదా పుట్టిన తేదీని ఎంటర్ చేస్తే, మీ ఖాతాను తాత్కాలికంగా సస్పెండ్ చేయవచ్చు. మీరు “మీరు అనుమతించబడిన సైన్-అప్ ప్రయత్నాల సంఖ్యను మించిపోయారు” అనే ఎర్రర్ మెసేజ్‌ను పొందినట్లయితే:

  • 24 గంటలు వేచి ఉండి, మళ్లీ ట్రై చేయండి.
  • మీ వద్ద ఇవి ఉన్నట్లు నిర్ధారించుకోండి:
    • చెల్లుబాటయ్యే CPF
    • “రెగ్యులర్” స్టేటస్‌లో ఉండే మీ CPF
    • మీ భాషకు తగిన ఫార్మట్‌లో స్లాష్‌లతో మీ పుట్టిన తేదీ:
      • DD/MM/YYYY
      • MM/DD/YYYY
“మీ CPF, పుట్టిన తేదీని మళ్లీ ఎంటర్ చేయండి” మెసేజ్

ఇది ఎర్రర్ మెసేజ్ కాదు. మీరు పలు సార్లు వెరిఫై చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేసి లాక్ చేయబడినప్పుడు ఈ సమస్య ఏర్పడుతుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి, కింది సూచనలను ఫాలో అవ్వండి:

  1. కొన్ని సందర్భాలలో, మీరు మీ ఖాతాను మొదటిసారి వెరిఫై చేయాలనుకున్నప్పటికీ, ఖాతాలో CPF ఇప్పటికే ఉండవచ్చు. ఇటువంటి సందర్భంలో, ఖాతాలో ఇప్పటికే పూరించిన అడ్రస్ ఉండే అవకాశం ఉంది. 
  2. మీ CPF, ఇంకా DOBని ఎంటర్ చేయండి.
  3. వెరిఫై చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

    చిట్కా: వెరిఫికేషన్ విజయవంతమైతే, “పేరు, అడ్రస్” విభాగం ఎడిట్ చేసే విధంగా ఉండాలి.

  4. మీరు సేవ్ చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేసినప్పుడు మీరు ఎంచుకోవాల్సిన 2 లేదా అంతకంటే ఎక్కువ అడ్రస్‌లను చూపించే కొత్త ప్రాంప్ట్ మీకు కనిపిస్తుంది.
  5. మీరు ఒకదాన్ని ఎంచుకున్న తర్వాత, మీరు ప్రధాన స్క్రీన్‌కి తిరిగి వస్తారు, అక్కడ ఇప్పటికీ CPF, ఇంకా DOBని మళ్లీ ఎంటర్ చేయమని మెసేజ్ మీకు కనిపిస్తుంది. అయితే, మీరు "పేరు, అడ్రస్" విభాగాన్ని మళ్లీ ఎంపిక చేయాలి. ఫీల్డ్‌లు ఇకపై ఎడిట్ చేయగలిగేలా లేకపోతే, వెరిఫికేషన్ పూర్తయిందని, మీరు మళ్లీ సేవ్ చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయాలని అర్థం.

    చిట్కా: ప్రాసెస్ చివరిలో మీకు ఎర్రర్ కనిపిస్తే, మిమ్మల్ని లాక్ చేశారని అర్థం. మీరు 48 గంటలు వేచి ఉండి, మునుపటి సూచనలను ఫాలో చేసి మళ్లీ ట్రై చేయండి.

డాక్యుమెంట్‌లను సమర్పించండి

"మీరు తప్పనిసరిగా డాక్యుమెంట్‌లను సమర్పించాలి" అనే ఎర్రర్ మెసేజ్ వచ్చినప్పుడు డాక్యుమెంట్‌లను సమర్పించమని మిమ్మల్ని అడిగితే:

  1. Google Payకి వెళ్లండి.
  2. మీరు సరైన ఖాతాకు సైన్ ఇన్ చేసినట్లు నిర్ధారించండి.
  3. పైన కుడి వైపున, నోటిఫికేషన్‌లు ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. స్క్రీన్‌పై సూచనలను ఫాలో అవ్వండి.

చిట్కా: సమర్పించిన తర్వాత డాక్యుమెంట్‌లను వెరిఫై చేయడానికి గరిష్ఠంగా 7 పని దినాలు పడుతుంది.

ఖాతాను మూసివేశారు

మీరు మీ వివరాలను వెరిఫై చేయకుంటే, మీ Google Play బ్యాలెన్స్ ఖాతా మూసివేయబడవచ్చు. మీకు “మీ ఖాతా మూసివేయబడింది” అనే ఎర్రర్ మెసేజ్ వస్తే, మీరు మీ CPF పుట్టిన తేదీని వెరిఫై చేసే వరకు దాన్ని ఉపయోగించలేరు.

మీ ఖాతా మూసివేశారో లేదో చెక్ చేయడానికి:

  1. Google Payకి వెళ్లండి.
  2. కింద పేర్కొన్న విధంగా ఉంటే, వీటిని చెక్ చేయండి:
    • “పేమెంట్ ఆప్షన్‌లు” కింద, “ఖాతా మూసివేయబడింది” అని చూపిస్తుంది.
    • బ్యాలెన్స్ ఉంది కానీ మీరు దాన్ని ఉపయోగించలేరు.

Play బ్యాలెన్స్ రీఫండ్ కోసం అర్హత పొందడానికి, పేరు, CPF అలాగే పుట్టిన తేదీ వంటి ముఖ్యమైన వివరాలు తప్పనిసరిగా బ్యాంక్ ఖాతాలోని వివరాలతో మ్యాచ్ అవ్వాలి. రీఫండ్‌ను రిక్వెస్ట్ చేయడానికి, సపోర్ట్ టీమ్‌ను సంప్రదించండి.

పైన పేర్కొన్న దశలు ఏవీ పని చేయకపోతే, మా సపోర్ట్ టీమ్‌ను సంప్రదించండి.

మీరు ఇప్పటికే మీ ఖాతాను వెరిఫై చేసి, మీరు ఇప్పటికీ మీ పేరును అప్‌డేట్ చేసేటప్పుడు సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే, మా సపోర్ట్ టీమ్‌ను సంప్రదించండి.

సంబంధిత రిసోర్స్‌లు

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
9365973112539862819
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
84680
false
false