మీ పేమెంట్ సమాచారాన్ని సురక్షితంగా ఉంచండి

How your card info stays safe

మీ పేమెంట్ సమాచారాన్ని సురక్షితంగా ఉంచడంలో Google Pay ఎలా సహాయపడుతుందో, అనుమానాస్పద రిక్వెస్ట్‌లను నివారించడానికి చిట్కాలను, అలాగే మీ ఫోన్ పోయినా లేదా దొంగిలించబడినా ఏమి చేయాలో అనే వాటి గురించి తెలుసుకోండి.

మీ గోప్యత గురించిన సమాచారం

Google Pay & వ్యాపారులు

పాల్గొనే వ్యాపారులు వెబ్‌సైట్లలో, యాప్‌లలో వస్తువులు, సర్వీస్‌ల కొనుగోలు కోసం Google Payను అంగీకరిస్తారు. మీ పరికరంలో మీరు Google Pay సెటప్ చేశారో లేదో పాల్గొనే సైట్‍లకు, యాప్‌లకు Google వెల్లడిస్తుంది. తద్వారా మీకు Google Payని పేమెంట్ ఎంపికగా అందించాలో లేదో వ్యాపారులకు తెలుస్తుంది. Google Pay గోప్యతా సెట్టింగ్‌లలో Google దీన్ని బహిర్గతం చేయడాన్ని మీరు నిలిపివేయవచ్చు. సమ్మతిని నిలిపివేయడం ద్వారా కొంత మంది వ్యాపారులతో లావాదేవీలు జరిపేందుకు Google Payను ఉపయోగించే మీ సామర్థ్యంపై ప్రభావం పడవచ్చు.

Google Pay మీ లావాదేవీ డేటా

మీరు స్టోర్‌లలో లేదా థర్డ్-పార్టీ యాప్‌లలో, వెబ్‌సైట్‌లలో చేసే Google Pay లావాదేవీల డేటాను Google ఉపయోగించవచ్చు:

  • మీ Google Pay లావాదేవీలను సులభరతరం చేయడానికి.
  • మీ లావాదేవీ వివరాలు, లావాదేవీ హిస్టరీని మీకు చూపించడానికి
  • Google Payతో మీకు ఉన్న సమస్యని పరిష్కరించడానికి.
  • ఇతర Google Pay ఫీచర్స్‌ను మీకు అందించడానికి.

మరింత సమాచారం కోసం, Google గోప్యతా పాలసీకి వెళ్లండి.

మీ పేమెంట్ సమాచారాన్ని రక్షించడంలో సహాయపడండి

మీ పేమెంట్ సమాచారాన్ని సురక్షితంగా ఉంచడానికి ఇక్కడ 4 మార్గాలు ఉన్నాయి.

డేటా ఎన్‌క్రిప్షన్

ఎన్‌క్రిప్షన్ మీ డేటాను మీ ఫోన్ లేదా టాబ్లెట్ అన్‌లాక్ అయి ఉన్నప్పుడు మాత్రమే చదవగలిగే రూపంలో స్టోర్ చేస్తుంది. మీరు మీ పరికరాన్ని అన్‌లాక్ చేసినప్పుడు, మీరు మీ డేటాను డిక్రిప్ట్ చేస్తారు. ఎన్‌క్రిప్షన్‌లో ఈ ప్రయోజనాలు ఉంటాయి:

  • మీ పరికరాన్ని ఎవరైనా దొంగతనం చేస్తే, ఎన్‌క్రిప్షన్ రక్షణను జోడిస్తుంది.
  • ఎన్‌క్రిప్ట్ చేసిన పరికరంలో, అత్యంత వ్యక్తిగత డేటా ఎన్‌క్రిప్ట్ అవుతుంది.

చాలా పరికరాలు ఆటోమేటిక్‌గా ఎన్‌క్రిప్ట్ అవుతాయి. అయితే, కొన్ని పరికరాలకు మీ పరికరపు సెట్టింగ్‌లలో ఎన్‌క్రిప్షన్‌ను మీరు ఆన్ చేయాల్సి రావచ్చు.

ఎన్‌క్రిప్ట్ చేసిన పరికరంలో మీ డేటాకు అత్యంత ఎక్కువ రక్షణ పొందడానికి, మీ పరికరాన్ని ఆన్ చేసినప్పుడు దాన్ని అన్‌లాక్ చేయడానికి ఎల్లప్పుడూ మీ PIN, ఆకృతి లేదా పాస్‌వర్డ్ అవసరం.

మీకు తెలిసిన వ్యక్తులకు మాత్రమే డబ్బు పంపండి

ముఖ్యమైనది: మీరు ఎవరికైనా పేమెంట్‍లను విజయవంతంగా ఆమోదించిన తర్వాత, మీకు, మీరు డబ్బు పంపిన వ్యక్తికి మధ్య వివాదాలకు Google బాధ్యత వహించదు.

Google Payలో ఫ్రెండ్స్, ఫ్యామిలీ నుండి మీరు నగదును పంపవచ్చు లేదా రిక్వెస్ట్ చేయవచ్చు.

మోసం, స్కామ్‍లను నివారించడంలో మీకు సహాయపడటానికి:

  • మీ నుండి డబ్బును రిక్వెస్ట్ చేసే వ్యక్తి మీకు తెలిసిన వ్యక్తి అని ఎల్లప్పుడూ నిర్ధారించుకోండి. స్కామర్‌లు మీ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీలాగా కనిపించే నకిలీ ఖాతాలను క్రియేట్ చేయవచ్చు.
  • మీకు తెలియని వ్యక్తులకు డబ్బు పంపకండి.
  • మీకు తెలియని వ్యక్తుల నుండి డబ్బు రిక్వెస్ట్‌లను అంగీకరించవద్దు.
  • అపరిచితులతో డబ్బు బదిలీలను ఉపయోగించి వస్తువులు లేదా సర్వీసులను కొనుగోలు చేయవద్దు.
  • నగదు బదిలీలతో వస్తువులు లేదా సర్వీసులను విక్రయించడానికి ప్రయత్నించవద్దు.

పేమెంట్ బదిలీ స్కామ్‌లను ఎలా నివారించాలో తెలుసుకోండి.

అనుమతి లేని ఛార్జీలను వెంటనే రిపోర్ట్ చేయండి

మీ పేమెంట్స్ ప్రొఫైల్‌లో మోసపూరిత లేదా అనధికార యాక్టివిటీ ఉందని మీరు అనుకుంటే, లావాదేవీ తేదీ నుండి 120 రోజుల్లో దాన్ని రిపోర్ట్ చేయండి.

చిట్కా: అనుమతి లేని ఛార్జీ అనేది మోసపూరితంగా జరిగిందని మీరు విశ్వసించే లావాదేవీ. మీరు మీ Google Pay బ్యాలెన్స్‌తో చేసిన పేమెంట్ లేదా స్నేహితుడికి పంపిన డబ్బుపై వివాదం చేయాలనుకుంటే, పేమెంట్‌ను ఎలా వివాదం చేయాలో తెలుసుకోండి.

మోసపూరిత Google Pay మెసేజ్‌లను గుర్తించండి, రిపోర్ట్ చేయండి

"ఫిషింగ్" మరియు "స్పూఫింగ్" అనేవి మీ వ్యక్తిగత సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి చేసే మోసపూరిత ప్రయత్నాలు.

  • ఫిషింగ్ అంటే ఎవరైనా వేరొకరిలా నటిస్తూ మిమ్మల్ని వ్యక్తిగత సమాచారం కోసం అడగడం.
  • స్పూఫింగ్ మరొకరిని అనుకరించడం అంటే, ఈమెయిల్‌ని వేరే వ్యక్తి పంపినట్లుగా పంపి అత్యంత విశ్వసనీయమైనవిగా అనిపించేలా చేయడం.

మీకు అనుమానాస్పద ఈమెయిల్ వస్తే, అది అడిగే సమాచారంతో స్పందించవద్దు.

ఈమెయిల్ అనుమానాస్పదమైనది అని ఎలా తెలుసుకోవాలి

ముఖ్య గమనిక: పాస్‌వర్డ్‌లు, క్రెడిట్ కార్డ్ నంబర్‌లు లేదా పన్ను సమాచారం వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఈమెయిల్, టెక్స్ట్ మెసేజ్ లేదా ఫోన్ కాల్ ద్వారా పంపమని Google మిమ్మల్ని ఎప్పుడూ అడగదు. Google తప్పనిసరిగా మీ సమాచారాన్ని వెరిఫై చేయాలి అని మీకు మెసేజ్ వస్తే, నేరుగా payments.google.com కు వెళ్లండి. Google మీ సమాచారాన్ని వెరిఫై చేయాల్సిన అవసరం ఉన్నట్లయితే, ఎగువ కుడివైపున, సూచనలతో మీరు ఎంచుకోగల అలర్ట్ ఉంటుంది.

1వ దశ. ఇది ఏ సమాచారం కోసం అడుగుతుందో చెక్ చేయండి

ఎవరైనా Google Payలో వ్యక్తిగత ఆర్థిక వివరాలు లేదా ఇతర గోప్యమైన సమాచారాన్ని రిక్వెస్ట్ చేస్తే, అది స్కామ్ అనుకోవాలి. ఈమెయిల్ ద్వారా లేదా ఫోన్ ద్వారా గోప్యమైన సమాచారాన్ని ఎప్పుడూ షేర్ చేయవద్దు. ఈ గోప్యమైన సమాచారానికి సంబంధించిన ఉదాహరణలు:

  • మీ పాస్‌వర్డ్‌లు, పాస్‌కోడ్‌లు లేదా పాస్‌వర్డ్ రీసెట్ లింక్
  • PINలు (వ్యక్తిగత గుర్తింపు నంబర్‌లు)
  • డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ సమాచారం
  • ఖాతా నంబర్‌ల వంటి బ్యాంక్ సమాచారం
  • అడ్రస్ లేదా సోషల్ సెక్యూరిటీ నంబర్ వంటి వ్యక్తిగత సమాచారం

సపోర్ట్ పొందడానికి లేదా సమస్యను పరిష్కరించడానికి యాప్‌ను డౌన్‌లోడ్ చేయమని Google మిమ్మల్ని అడగదు.

ఈమెయిల్ లేదా మెసేజ్ అనుమానాస్పదంగా ఉందో లేదో మీకు ఇంకా తెలియకపోతే, జాగ్రత్తగా ఉండండి, డబ్బు లేదా వ్యక్తిగత సమాచారాన్ని పంపకండి.

2వ దశ. ఈమెయిల్ పంపిన నిజమైన వ్యక్తిని కనుగొనండి

  1. Gmailలో, "రిప్లయి”కి పక్కన, మరిన్ని మరిన్ని ఆ తర్వాత ఒరిజినల్‌ను చూడండిని క్లిక్ చేయండి.
  2. "వీరి నుండి" అడ్రస్ "రిప్లయి పంపాల్సిన" అడ్రస్ మ్యాచ్ అవుతున్నాయని నిర్ధారించుకోండి.
  3. "మెసేజ్-id"లో ఉన్న చిరునామా "వీరి నుండి" చిరునామా డొమైన్‌కు సరిపోలినట్లు నిర్ధారించుకోండి.
  4. మీరు Gmailని ఉపయోగించకుంటే, పంపిన వ్యక్తిని ఎలా వెరిఫై చేయాలో తెలుసుకోవడం కోసం మీ ఈమెయిల్ హోస్ట్‌ను సంప్రదించండి.

ఆటోమేటిక్ సెక్యూరిటీ ఫీచర్‌లు

మీ సమాచారాన్ని మరింత సురక్షితంగా ఉంచడానికి Google Pay అనుసరించే కొన్ని మార్గాలు ఇవిగోండి.

బిల్ట్-ఇన్ సెక్యూరిటీ

స్కామ్‌లు, మోసాల నుండి మిమ్మల్ని రక్షించడంలో సహాయపడటానికి, మీరు డబ్బు పంపినప్పుడు లేదా స్వీకరించినప్పుడు సహా అనుమానాస్పద పేమెంట్‌లను మెరుగ్గా గుర్తించడానికి Google Pay అధునాతన, బిల్ట్-ఇన్ సెక్యూరిటీని ఉపయోగిస్తుంది.

అనుమానాస్పద పేమెంట్ నోటిఫికేషన్

మీరు మీ కాంటాక్ట్ లిస్ట్ వెలుపల ఉన్న ఎవరికైనా పేమెంట్ చేయడానికి ప్రయత్నించినట్లయితే లేదా మీ కాంటాక్ట్‌ల వెలుపలి నుండి డబ్బు కోసం రిక్వెస్ట్‌ను స్వీకరించినట్లయితే, Google Pay మీకు తెలియజేస్తుంది. ఆ విధంగా, మీరు లావాదేవీ అనుమానాస్పదంగా ఉంటే దానిని నివారించవచ్చు.

డేటా రక్షణ

మీ పేమెంట్ సమాచారం అత్యంత అధునాతనమైన ఎన్‌క్రిప్షన్‌తో సురక్షితంగా స్టోర్ చేయడం జరుగుతుంది. లావాదేవీల సమయంలో మిమ్మల్ని రక్షించడంలో సహాయపడటానికి, Google Pay మీ పేమెంట్‍లన్నింటినీ ఎన్‌క్రిప్ట్ చేస్తుంది.

వర్చువల్ ఖాతా నంబర్‌లు

వర్చువల్ ఖాతా నంబర్ అనేది మీ వాస్తవ ఖాతా నంబర్‌కు ఒక రకమైన తాత్కాలిక అలియాస్. మీరు Google Pay యాప్ లేదా Google Wallet యాప్ లేదా మీ బ్యాంకింగ్ యాప్‌ను ఉపయోగించి కార్డును జోడించినప్పుడు వర్చువల్ ఖాతా నంబర్ క్రియేట్ చేయబడుతుంది. ఉదాహరణకు, మీరు దుకాణాల్లో పేమెంట్ చేసినప్పుడు.

  • మీ వర్చువల్ ఖాతా నంబర్ వ్యాపారితో షేర్ చేయబడుతుంది.
  • మీ అసలు ఖాతా నంబర్ షేర్ చేయబడలేదు. ఇది మీ ఖాతా సమాచారాన్ని సురక్షితంగా ఉంచడానికి సహాయపడుతుంది.

వర్చువల్ ఖాతా నంబర్‌ను గుర్తించడానికి:

  1. Google Wallet యాప్ ను తెరవండి.
  2. ఎగువున, పేమెంట్ కార్డ్‌ను ట్యాప్ చేయండి.
    • దాన్ని కనుగొనడానికి మీరు కుడి నుండి ఎడమ వైపునకు స్వైప్ చేయాల్సి రావచ్చు, ఆపై కార్డ్‌ను ట్యాప్ చేయండి.
  3. దిగువున, వివరాలు ఆ తర్వాత వర్చువల్ ఖాతా నంబర్‌ను ట్యాప్ చేయండి.

చిట్కా: మీకు "వర్చువల్ ఖాతా నంబర్" కనిపించకుంటే, స్టోర్‌లో పేమెంట్‌ల కోసం మీరు తప్పనిసరిగా పేమెంట్ కార్డ్‌ను సెటప్ చేయాలి.

స్క్రీన్ లాక్

మీరు Google Pay యాప్‌నకు లేదా స్టోర్‌లో పేమెంట్‍ల కోసం కార్డ్‌లను జోడించే ముందు, మీరు మీ పరికరంలో తప్పనిసరిగా స్క్రీన్ లాక్‌ని సెటప్ చేయాలి. మీరు స్క్రీన్ లాక్‌ని ఆఫ్ చేస్తే, మీ రక్షణ కోసం Google Pay మీ పరికరం నుండి మీ వర్చువల్ ఖాతా నంబర్‌ను తీసివేస్తుంది.

ఎక్కువ కొనుగోళ్లు చేయడానికి, మీరు మీ ఫోన్‌ను తప్పనిసరిగా అన్‌లాక్ చేయాలి. కొన్ని చిన్న పేమెంట్‍ల కోసం మీరు మీ ఫోన్‌ను అన్‌లాక్ చేయనవసరం లేదు.

కోల్పోయిన పరికరాన్ని కనుగొని, భద్రపరుచుకోండి

మీ పరికరం పోయిన లేదా దొంగిలించబడిన పరిస్థితులను ధీటుగా ఎదుర్కొనేందుకు దాన్ని సిద్ధం చేయండి

మీ Android పరికరాన్ని పోగొట్టుకున్న పరిస్థితిని ధీటుగా ఎదుర్కొనేందుకు, పోగొట్టుకున్న Android పరికరాన్ని కనుగొనడానికి సిద్ధంగా ఉండండి.

దొంగిలించబడిన పరికరాలలోని నా పేమెంట్ సమాచారం ఏమవుతుంది?

నా పరికరం పోయిన లేదా దొంగిలించబడిన సందర్భంలో నేను ఏం చేయాలి?

  1. మీరు పోగొట్టుకున్న Android పరికరాన్ని కనుగొనడానికి, లాక్ చేయడానికి లేదా ఫ్యాక్టరీ రీసెట్ చేయడానికి ఈ దశలను ఫాలో చేయండి.

    చిట్కా: మీ పరికరాన్ని ఫ్యాక్టరీ రీసెట్ చేయడం ద్వారా పరికరం నుండి క్రెడిట్, డెబిట్ కార్డ్‌లతో సహా పేమెంట్ సమాచారం తొలగిపోతుంది.

  2. మీ Google ఖాతా హ్యాక్ చేయబడిందని మీకు అనుమానం కలిగితే, హ్యాక్ చేయబడిన లేదా దాడికి గురైన Google ఖాతాను సురక్షితం చేయడం కోసం ఈ దశలను ఫాలో చేయండి.

 

 

 
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
9078975558456708755
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
5150109
false
false