Google Drive షార్ట్‌కట్‌లతో ఫైల్‌లు మరియు ఫోల్డర్‌లను కనుగొనండి

షార్ట్‌కట్‌లు మీకు లేదా మీ టీమ్‌కి అనేక Google డిస్క్‌లలో ఫైల్‌లు మరియు ఫోల్డర్‌లను కనుగొనడం మరియు నిర్వహించడం సులభం చేస్తాయి.

షార్ట్‌కట్‌ల గురించి తెలుసుకోండి

  • షార్ట్‌కట్ అన్నది మరొక ఫైల్ లేదా ఫోల్డర్‌ను సూచించే లింక్. 
  • మీరు మీ డ్రైవ్‌లో లేదా షేర్ చేసిన డ్రైవ్‌లో షార్ట్‌కట్‌లను ఉపయోగించవచ్చు.
  • ఫోల్డర్ లేదా డ్రైవ్‌కి యాక్సెస్ ఉన్న ప్రతి ఒక్కరికీ షార్ట్‌కట్‌లు కనిపిస్తాయి. 
  • షార్ట్‌కట్‌లు తిరిగి ఒరిజినల్ ఫైల్‌కి పాయింట్ చేయబడతాయి, తద్వారా మీరు ఎల్లప్పుడూ తాజా సమాచారాన్ని కలిగి ఉంటారు. 
  • మీరు ఒక్కొక్క ఫైల్‌కు లేదా ఫోల్డర్‌కు స్వయంగా మీరే 500 వరకు షార్ట్‌కట్‌లను చేయవచ్చు. ప్రతి ఐటెమ్‌లో ఎవరైనా చేసిన షార్ట్‌కట్‌ల మొత్తం 5,000 వరకు ఉండవచ్చు.

ముఖ్య గమనిక:

  • షార్ట్‌కట్‌లు ఉన్న ఫోల్డర్ లేదా డ్రైవ్‌కు యాక్సెస్ ఉన్న ప్రతి ఒక్కరికీ షార్ట్‌కట్ టైటిల్స్ కనిపిస్తాయి.
  • ఫైల్ లేదా డ్రైవ్‌ను యాక్సెస్ చేయగల ప్రతి ఒక్కరూ షార్ట్‌కట్‌ను తెరవలేరు.
  • మీరు షార్ట్‌కట్‌ను క్రియేట్ చేసినప్పుడు ఒరిజినల్ ఫైల్ అనుమతులు ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయబడవు.
  • ఫైల్ లేదా ఫోల్డర్‌కు యాక్సెస్ పొందడానికి, షార్ట్‌కట్ ద్వారా ఒరిజినల్ ఫైల్‌కు అనుమతులను రిక్వెస్ట్ చేయండి. ఒరిజినల్ ఫైల్ ఓనర్ అప్పుడు అనుమతులు ఇవ్వమని రిక్వెస్ట్‌తో కూడిన ఈమెయిల్‌ను అందుకుంటారు.

Google డ్రైవ్ హాట్‌కీల జాబితా కోసం, కీ‌బోర్డ్‌ షార్ట్‌కట్‌లకి వెళ్లండి.

షార్ట్‌కట్‌ను సృష్టించండి

  1. Android ఫోన్‌లో Google డ్రైవ్ యాప్ Google డిస్క్ని తెరవండి.
  2. మీరు షార్ట్‌కట్‌ని సృష్టించాలనుకుంటున్న ఫైల్ లేదా ఫోల్డర్‌ను కనుగొనండి.
  3. మరిన్ని మరిన్ని ఆ తర్వాత డ్రైవ్‌కి షార్ట్‌కట్‌ని జోడించును ట్యాప్ చేయండి.
  4. మీరు షార్ట్‌కట్‌ని ఉంచాలనుకుంటున్న లొకేషన్‌ని ఎంచుకోండి. 
  5. షార్ట్‌కట్‌ని జోడించును ట్యాప్ చేయండి.

ముఖ్యమైనది:

  • మీరు వేరొకరి యాజమాన్యంలోని డ్రైవ్ ఫోల్డర్‌లో షార్ట్‌కట్‌ని రూపొందిస్తే, మీరు షార్ట్‌కట్‌ని తొలగించలేరు.
  • మీరు మరొక షార్ట్‌కట్‌ ఫైల్‌కు షార్ట్‌కట్‌ని సృష్టించలేరు, కానీ మీరు దాని కాపీని రూపొందించవచ్చు.
  • మీరు ఫోల్డర్ షార్ట్‌కట్ యొక్క కాపీని కూడా రూపొందించవచ్చు.

షార్ట్‌కట్‌ను తొలగించండి

ముఖ్యమైనది: 

  • మీరు షార్ట్‌కట్‌ని తొలగించవచ్చు, కానీ మీరు అసలు ఫైల్‌ను లేదా మీ స్వంతం కాని ఫైల్‌ను తొలగించలేరు. షార్ట్‌కట్ యజమాని షార్ట్‌కట్‌ని తొలగించగలరు, కాని టార్గెట్ ఫైల్ అన్నది ఫైల్ యజమాని ద్వారా మాత్రమే తొలగించబడుతుంది.
  • మీకు అనుమతి లేకపోతే, మీరు ఫైల్ లేదా ఫోల్డర్‌ని తొలగించలేకపోవచ్చు.
  1. Android ఫోన్‌లో Google డిస్క్ యాప్ Google డిస్క్ని తెరవండి.
  2. మీరు తీసివేయాలనుకుంటున్న షార్ట్‌కట్‌ని కనుగొనండి.
  3. మరిన్ని ఆ తర్వాత తీసివేయండిని ట్యాప్ చేయండి.
  4. షార్ట్‌కట్‌ని శాశ్వతంగా తీసివేయడానికి, మీ ట్రాష్ నుండి దాన్ని తొలగించండి.
    1. ఎడమ వైపున, మెను మెను ఆ తర్వాత ట్రాష్ని ట్యాప్ చేయండి.
    2. మీరు తొలగించాలనుకుంటున్న షార్ట్‌కట్‌ను కనుగొనండి ఆ తర్వాత  మరిన్ని మరిన్ని ఆ తర్వాత శాశ్వతంగా తొలగించండిని ట్యాప్ చేయండి.

అనుసంధానం కోల్పోయిన షార్ట్‌కట్‌ని పరిష్కరించండి

షార్ట్‌కట్ ఈ సందర్బాలలో పని చేయదు:

  • అసలు ఫైల్‌ని తెరవడానికి మీకు అనుమతి లేదు.
  • అసలు ఫైల్ ట్రాష్‌లో ఉంది.
  • అసలు ఫైల్ తొలగించబడింది.

పని చేయని షార్ట్‌కట్ సమస్యను పరిష్కరించడానికి, అసలు ఫైల్‌ను రీస్టోర్ చేయడానికి ప్రయత్నించండి లేదా ఫైల్‌ను తెరవడానికి యజమానిని అనుమతి అడగండి.

true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
9735850657764613206
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
99950
false
false