మీ ఫైల్‌లను Google డిస్క్‌లో క్రమబద్ధంగా నిర్వహించండి

డిస్క్‌లో మీ ఫైల్‌లను క్రమబద్ధంగా నిర్వహించడానికి, మీరు ఫోల్డర్‌లను సృష్టించడం ద్వారా ఫైల్‌లను మరింత సులభంగా కనుగొనగలరు, ఇతరులతో షేర్ చేయగలరు.

గమనిక: మీరు ఒకేసారి అనేక ఫైల్‌లు లేదా ఫోల్డర్‌లను క్రమబద్ధంగా నిర్వహించేటట్లయితే, ఆ మార్పులు మీకు కనిపించడానికి సమయం పట్టవచ్చు.

ఫైళ్లను క్రియేట్ చేయండి, తరలించండి, అలాగే కాపీ చేయండి

ఫోల్డర్‌ను క్రియేట్ చేయండి

  1. మీ కంప్యూటర్‌లో, drive.google.com లింక్‌కు వెళ్లండి.
  2. ఎడమ వైపున ఉన్న, కొత్తది ఆ తర్వాత ఫోల్డర్ ఆప్షన్‌లను క్లిక్ చేయండి.
  3. ఫోల్డర్ కోసం పేరును నమోదు చేయండి.
  4. క్రియేట్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
ఐటెమ్‌లను ఫైల్ లేదా ఫోల్డర్‌లోకి తరలించండి

ముఖ్య గమనిక: ఫైల్‌ను తరలించడానికి, ఫైల్‌ను సోర్స్ నుండి డెస్టినేషన్‌కు తరలించడానికి మీకు తప్పనిసరిగా అనుమతి ఉండాలి, లేకపోతే ఫైల్ తరలించబడదు. బదులుగా డెస్టినేషన్ ఫోల్డర్‌లో షార్ట్‌కట్ క్రియేట్ చేయబడుతుంది.

ఐటెమ్‌లను ఫైల్ లేదా ఫోల్డర్‌కు తరలించడానికి పలు మార్గాలు ఉన్నాయి. మీరు ఐటెమ్‌ను కింద పేర్కొన్న వాటిలో యాక్సెస్ చేసేటప్పుడు దీన్ని చేయవచ్చు:

  • ప్రధాన విండో
  • ఎడమ వైపు ప్యానెల్
  • Google Drive సెర్చ్ ఫలితాలు

చిట్కా: మీరు అనేక ఫైళ్లు లేదా సబ్-ఫోల్డర్‌లతో ఫోల్డర్‌లను తరలిస్తే, మీరు మార్పులను కనుగొనడానికి సమయం పడుతుంది.

ఫోల్డర్‌కు మాన్యువల్‌గా తరలించండి

  1. మీ కంప్యూటర్‌లో, drive.google.com లింక్‌కు వెళ్లండి.
  2. మీరు తరలించాలనుకునే ఐటెమ్‌పై కుడి క్లిక్ చేయండి.
  3. ఆర్గనైజ్ చేయండి తరలించండి ని క్లిక్ చేయండి.
  4. ఫోల్డర్‌ను ఎంచుకోండి లేదా క్రియేట్ చేయండి.
  5. మరిన్ని ఎంపికను క్లిక్ చేయండి.

ఫోల్డర్‌లోకి లాగండి

  1. మీ కంప్యూటర్‌లో, drive.google.com లింక్‌కు వెళ్లండి.
  2. మీరు తరలించాలనుకునే ఐటెమ్‌ను లాగండి.
  3. ఐటెమ్‌ను ఫోల్డర్‌లోకి జరిపి, దాన్ని వదలండి.

చిట్కా: Google Driveలోని ఏదైనా ఫోల్డర్‌లోకి ఐటెమ్‌లను తరలించడానికి, ఎడమ ప్యానెల్‌కు వెళ్లండి.

ఫోల్డర్‌ను తరలించడానికి కీబోర్డ్ షార్ట్‌కట్‌లను ఉపయోగించండి

ముఖ్య గమనిక: ఈ ఫంక్షనాలిటీ Chromeలో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

  1. మీ కంప్యూటర్‌లో, drive.google.comకు వెళ్లండి.
  2. ఒక ఫైల్‌ను ఎంచుకోండి.
  3. ఫైల్‌ను కట్ చేయడానికి, Ctrl + x నొక్కండి.
  4. కొత్త లొకేషన్‌కు వెళ్లండి.
  5. ఒక ఆప్షన్‌ను ఎంచుకోండి:
    • ఫైల్‌ను కొత్త లొకేషన్‌లో పేస్ట్ చేయడానికి, Ctrl + v నొక్కండి.
    • ఫైల్ షార్ట్‌కట్‌ను కొత్త లొకేషన్‌లో క్రియేట్ చేయడానికి, Ctrl + Shift + v నొక్కండి.

చిట్కా: యూజర్‌లు బ్రౌజర్ విండోలు అంతటా కదలవచ్చు.

ఫైల్ లేదా ఫోల్డర్‌కు షార్ట్‌కట్‌ను క్రియేట్ చేయండి

మీకు లేదా మీ బృందానికి బహుళ Google Driveలలో ఫోల్డర్‌లు, ఫైల్‌లను కనుగొనడం, క్రమబద్ధంగా నిర్వహించుకోవడాన్ని షార్ట్‌కట్‌లు సులభతరం చేస్తాయి. షార్ట్‌కట్ అనేది మరొక ఫైల్ లేదా ఫోల్డర్‌ను సూచించే లింక్. 

షార్ట్‌కట్‌ను క్రియేట్ చేయండి

  1. మీ కంప్యూటర్‌లో, drive.google.com లింక్‌కు వెళ్లండి.
  2. మీరు దేని కోసం అయితే షార్ట్‌కట్‌ను క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫైల్ లేదా ఫోల్డర్‌పై కుడి క్లిక్ చేయండి.
  3.  ఆర్గనైజ్ చేయండి  > షార్ట్‌కట్‌ను జోడించండి ని క్లిక్ చేయండి.
  4. మీరు షార్ట్‌కట్‌ను ఎక్కడ ఉంచాలనుకుంటున్నారో ఎంచుకోండి.
  5. షార్ట్‌కట్‌ను జోడించండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

చిట్కా: Drive ఫోల్డర్‌లో మీరు షార్ట్‌కట్‌కు కాపీని క్రియేట్ చేయవచ్చు, కానీ ఇప్పటికే ఉన్న షార్ట్‌కట్‌కు మరొక షార్ట్‌కట్ ఫైల్‌ను క్రియేట్ చేయడం కుదరదు.

షార్ట్‌కట్‌ను క్రియేట్ చేయడానికి కీబోర్డ్ షార్ట్‌కట్‌లను ఉపయోగించండి

ముఖ్య గమనిక: ఈ ఫంక్షనాలిటీ Chromeలో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

  1. మీ కంప్యూటర్‌లో, drive.google.com లింక్‌కు వెళ్లండి.
  2. ఫైల్‌ను ఎంచుకోండి.
  3. ఫైల్‌ను క్లిప్‌బోర్డ్‌కు కాపీ చేయడానికి, Ctrl + c నొక్కండి.
  4. కొత్త లొకేషన్‌కు వెళ్లండి.
  5. షార్ట్‌కట్‌ను కొత్త లొకేషన్‌లో పేస్ట్ చేయడానికి, Ctrl + Shift + v నొక్కండి.

షార్ట్‌కట్‌ను తొలగించండి

  1. మీ కంప్యూటర్‌లో, drive.google.com లింక్‌కు వెళ్లండి.
  2. మీరు తీసివేయాలనుకుంటున్న షార్ట్‌కట్ మీద కుడి క్లిక్ చేయండి.
  3. తీసివేయి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

షార్ట్‌కట్‌ను శాశ్వతంగా తొలగించడానికి, ట్రాష్‌ను ఖాళీ చేయండి.

ముఖ్య గమనిక: మీరు షార్ట్‌కట్‌ను తొలగించినప్పటికీ, ఒరిజినల్ ఫైల్ తొలగించబడదు.

ఇతర అప్లికేషన్‌లలో ఫైల్‌కు లేదా ఫోల్డర్‌కు సంబంధించిన లింక్‌ను క్రియేట్ చేయండి

ముఖ్య గమనిక: ఈ ఫంక్షనాలిటీ Chromeలో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

Google Drivతో, మీరు Google ఎడిటర్ డాక్యుమెంట్‌లు, అలాగే ఇతర యాప్‌లలో ఫైల్ మరియు/లేదా ఫోల్డర్ పేరును కాపీ చేసి, పేస్ట్ చేయవచ్చు.

  1. మీ కంప్యూటర్‌లో, drive.google.comకు వెళ్లండి.
  2. ఒక ఫైల్‌ను ఎంచుకోండి.
  3. ఒక ఆప్షన్‌ను ఎంచుకోండి:
    • ఫైల్ లేదా ఫోల్డర్ పేరును క్లిప్‌బోర్డ్‌కు లింక్‌గా కాపీ చేయడానికి, Ctrl + c నొక్కండి. 
    • ఫైల్ లేదా ఫోల్డర్ URLను క్లిప్‌బోర్డ్‌కు లింక్‌గా కాపీ చేయడానికి, Ctrl + Shift + c నొక్కండి.
  4. ఫైల్ లేదా ఫోల్డర్‌ను Google డాక్యుమెంట్ లేదా ఇతర యాప్‌లలో పేస్ట్ చేయడానికి, Ctrl + v నొక్కండి.
ఫైల్‌కు కాపీని రూపొందించండి

ముఖ్య గమనిక:

  • ఈ ఫంక్షన్ Chromeలో మాత్రమే అందుబాటులో ఉంటుంది.
  • ఈ ఫంక్షన్ డెస్క్‌టాప్ Driveలో అందుబాటులో లేదు.
  • మీరు ఫోల్డర్‌లను కాపీ చేయలేరు, కేవలం ఫైళ్లను మాత్రమే కాపీ చేయగలుగుతారు.
  • ఫోల్డర్‌ను సులభంగా కనుగొనడానికి, మీరు ఫోల్డర్‌కు షార్ట్‌కట్‌ను క్రియేట్ చేయవచ్చు.

ఫైల్‌ను మాన్యువల్‌గా కాపీ చేయండి

  1. మీ కంప్యూటర్‌లో, drive.google.com లింక్‌కు వెళ్లండి.
  2. ఫైల్‌పై కుడి క్లిక్ చేయండి.
  3. కాపీని రూపొందించండి Make a copy ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

ఫైల్‌ను కాపీ చేయడానికి కీబోర్డ్ షార్ట్‌కట్‌లను ఉపయోగించండి

  1. మీ కంప్యూటర్‌లో, drive.google.comకు వెళ్లండి.
  2. ఒక ఫైల్‌ను ఎంచుకోండి.
  3. ఫైల్‌ను క్లిప్‌బోర్డ్‌కు కాపీ చేయడానికి, Ctrl + c నొక్కండి.
  4. కొత్త లొకేషన్‌కు వెళ్లండి.
  5. ఫైల్ కాపీని కొత్త లొకేషన్‌లో రూపొందించడానికి, Ctrl + v నొక్కండి.

చిట్కా: యూజర్‌లు బ్రౌజర్ విండోల అంతటా కదలవచ్చు.

ఫైల్ లేదా ఫోల్డర్‌ను తొలగించండి
  1. మీ కంప్యూటర్‌లో, drive.google.com లింక్‌కు వెళ్లండి.
  2. మీరు తొలగించాలనుకుంటున్న ఫైల్ లేదా ఫోల్డర్‌ను కుడి క్లిక్ చేయండి.
  3. 'తీసివేయి' ఎంపికను క్లిక్ చేయండి.

ఒక ఐటమ్‌ను అనుకోకుండా ట్రాష్‌లోకి తరలించినా, ఆ ఐటమ్‌ను పునరుద్ధరించవచ్చు.

మీ ఫోల్డర్ రంగును మార్చండి

మీరు మీ 'నా డ్రైవ్', 'షేర్ చేసిన డ్రైవ్‌ల'లోని ఫోల్డర్‌ల రంగును, ఫోల్డర్‌లకు చెందిన షార్ట్‌కట్‌లను అనుకూలంగా మార్చవచ్చు. మీరు ఏవైనా రంగులను మార్చినట్లయితే, ఆ మార్పు మీ Drive వెర్షన్‌కు మాత్రమే వర్తింపజేయబడుతుంది.

  1. మీ కంప్యూటర్‌లో, drive.google.com లింక్‌కు వెళ్లండి.
  2. మీరు మార్చాలనుకుంటున్న ఫోల్డర్‌పై కుడి క్లిక్ చేయండి.
  3. రంగును మార్చండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేసి, మీరు కోరుకునే రంగును ఎంచుకోండి.

సంబంధిత రిసోర్స్‌లు

true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
1671490540947719550
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
99950
false
false