డెస్క్‌టాప్ Google Driveను ఉపయోగించండి

మీ పరికరాలన్నింటిలో, క్లౌడ్‌లో కంటెంట్‌ను సులభంగా మేనేజ్ చేయడానికి, షేర్ చేయడానికి, Google‌కు చెందిన డెస్క్‌టాప్ సింక్ క్లయింట్ అయిన డెస్క్‌టాప్ Driveను ఉపయోగించండి.

Windows File Explorer లేదా macOS Finderతో మీ కంప్యూటర్‌లో మీ Drive ఫైళ్లను, ఫోల్డర్‌లను కనుగొనడానికి డెస్క్‌టాప్ Driveను ఉపయోగించండి.

మీరు క్లౌడ్‌లో ఫైల్‌ను ఎడిట్ చేసినా, తొలగించినా, లేదా తరలించినా, మీ కంప్యూటర్, పరికరాలలో సదరు మార్పు ప్రతిబింబిస్తుంది, అలాగే మీ కంప్యూటర్, పరికరాలలో ఫైల్‌ను ఎడిట్ చేసినా, తొలగించినా, లేదా తరలించినా సదరు మార్పు క్లౌడ్‌లో కూడా ప్రతిబింబిస్తుంది. ఆ రకంగా, మీ ఫైళ్లు అప్‌డేట్ అయ్యి ఉంటూ, ఏ పరికరం నుండి అయినా యాక్సెస్ చేయడానికి అందుబాటులో ఉంటాయి.

మీరు కింద పేర్కొన్న పనులు చేయడానికి డెస్క్‌టాప్ Driveను ఉపయోగించవచ్చు:

  • క్లౌడ్‌లో స్టోర్ చేసిన ఫైళ్లను నేరుగా మీ కంప్యూటర్‌లో తెరవవచ్చు.
  • స్టోరేజ్ స్పేస్ ఉపయోగించకుండానే మీ కంప్యూటర్ ఫైల్ సిస్టమ్‌లో మీ ఫైళ్లను చూడవచ్చు, ఆర్గనైజ్ చేయవచ్చు.
  • మీ కంప్యూటర్ నుండి Google Driveకు ఫోల్డర్‌లను సింక్ చేయవచ్చు.
    • మీరు సింక్ చేసినప్పుడు, మీ ఫైళ్లు క్లౌడ్ నుండి డౌన్‌లోడ్ చేయబడతాయి, మీ కంప్యూటర్ హార్డ్ డ్రైవ్ నుండి అప్‌లోడ్ చేయబడతాయి.
    • మీరు సింక్ చేసిన తర్వాత, మీ కంప్యూటర్ ఫైళ్లు క్లౌడ్‌లో ఉన్న వాటితో మ్యాచ్ చేయబడతాయి.
    • మీ ఫైళ్లు అప్‌డేట్ అయ్యి ఉంటాయి, అలాగే యాక్సెస్ చేయడానికి అందుబాటులో ఉంటాయి, మీరు చేసే ఏదైనా మార్పు అన్ని పరికరాలలోని ఫైళ్లకు వర్తింపజేయబడుతుంది.
  • ఆఫ్‌లైన్ వినియోగం కోసం ఫైళ్లను, ఫోల్డర్‌లను సేవ్ చేయవచ్చు. ఇందులో షేర్ చేసిన డ్రైవ్‌లకు సంబంధించిన ఫైళ్లు ఉంటాయి.
  • రియల్ టైమ్‌లో Microsoft Office ఫైళ్లలో కలిసి పని చేయవచ్చు.
  • మీరు వర్క్ లేదా స్కూల్ ఖాతాతో Windowsలో Outlookను ఉపయోగిస్తుంటే, Microsoft Outlookతో ఫైళ్లను పంపవచ్చు, సేవ్ చేయవచ్చు.

డెస్క్‌టాప్ Driveను ఇన్‌స్టాల్ చేసి, సెటప్ చేయండి

డెస్క్‌టాప్ Driveను డౌన్‌లోడ్ చేయండి

ముఖ్య గమనిక: మీరు ప్రారంభించడానికి ముందు, మీ ఆపరేటింగ్ సిస్టమ్ డెస్క్‌టాప్ Driveకు అనుకూలంగా ఉందో లేదో చెక్ చేయండి.

  1. డెస్క్‌టాప్ Driveను డౌన్‌లోడ్ చేయండి:

    WINDOWS కోసం డౌన్‌లోడ్ చేయండి MAC కోసం డౌన్‌లోడ్ చేయండి

  2. మీ కంప్యూటర్‌లో, దీన్ని తెరవండి:
    • Windows: GoogleDriveSetup.exe
    • Mac: GoogleDrive.dmg
  3. స్క్రీన్‌పై సూచనలను ఫాలో అవ్వండి.

చిట్కా: మీరు ఆఫీస్ లేదా స్కూల్ ఖాతాను ఉపయోగిస్తుంటే, మీరు డెస్క్‌టాప్ Driveను ఉపయోగించలేకపోవచ్చు లేదా మీ సంస్థ మీ కోసం దాన్ని ఇన్‌స్టాల్ చేయాల్సి రావచ్చు. మీకు ఏవైనా సందేహాలు ఉంటే, మీ అడ్మినిస్ట్రేటర్‌ను అడగండి.

డెస్క్‌టాప్ Driveను తెరవండి
మీరు డెస్క్‌టాప్ Driveను ఉపయోగించినప్పుడు, మీరు కింద పేర్కొన్న ప్రదేశంలో డెస్క్‌టాప్ Drive మెనూ డిస్క్ ఫైల్ స్ట్రీమ్ను కనుగొనవచ్చు:
  • Windows: దిగువ కుడి వైపున, సిస్టమ్ ట్రేలో.
    • చిట్కా: దాచిన చిహ్నాలను చూడటానికి మీరు బాణం గుర్తును క్లిక్ చేయాల్సి రావచ్చు.
  • Mac: ఎగువ కుడి వైపున, మెనూ బార్‌లో.

డెస్క్‌టాప్ Drive మూసివేయబడినప్పుడు, దాన్ని కనుగొనడం సులభతరం చేయడానికి, మీరు దాన్ని పిన్ చేయవచ్చు:

  • Windows:
    • Driveను ప్రారంభ మెనూకు జోడించడానికి: మీ ప్రారంభ మెనూలో, Driveపై కుడి క్లిక్ చేయండి ఆ తర్వాత ప్రారంభ మెనూకు పిన్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
    • Driveను టాస్క్‌బార్‌కు జోడించడానికి: మీ ప్రారంభ మెనూలో, Driveపై కుడి క్లిక్ చేయండి ఆ తర్వాత టాస్క్‌బార్‌కు పిన్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  • Mac:
    • Driveను మీ డాక్‌కు జోడించడానికి: “అప్లికేషన్‌లు” అనే ఫోల్డర్‌లో, ఇటీవల ఉపయోగించిన యాప్‌లను వేరు చేసే లైన్ ఎడమ వైపునకు Drive యాప్‌ను లాగండి.

డెస్క్‌టాప్ Google Driveను ఉపయోగించడం ప్రారంభించండి

డెస్క్‌టాప్ Driveకు సైన్ ఇన్ చేయండి
మీరు మొదటిసారి డెస్క్‌టాప్ Driveను తెరిచినప్పుడు, లేదా మీ ఖాతా డిస్‌కనెక్ట్ అయిన తర్వాత, లాగిన్ చేయడానికి:
  1. మీ కంప్యూటర్‌లో, డెస్క్‌టాప్ Drive డిస్క్ ఫైల్ స్ట్రీమ్ను తెరవండి.
  2. బ్రౌజర్‌తో సైన్ ఇన్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. డెస్క్‌టాప్ Driveను మీరు ఏ ఖాతాతో ఉపయోగించాలనుకుంటున్నారో ఆ Google ఖాతాకు సైన్ ఇన్ చేయండి.

చిట్కా: డెస్క్‌టాప్ Driveతో మీరు గరిష్ఠంగా ఒకేసారి 4 ఖాతాలు ఉపయోగించవచ్చు. ఒకే సమయంలో పలు ఖాతాలను ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి.

డెస్క్‌టాప్ Driveలో మీ Google Drive ఫైళ్లను ఉపయోగించండి

మీరు డెస్క్‌టాప్ Driveను ఇన్‌స్టాల్ చేసినప్పుడు, మీ ఫైళ్లు Windows File Explorer లేదా macOS Finderలో “Google Drive” లొకేషన్‌లో డిస్‌ప్లే అవుతాయి. మీ కంప్యూటర్‌లో, డెస్క్‌టాప్ Drive డిస్క్ ఫైల్ స్ట్రీమ్ను తెరవండి.

  1. మీ పేరును క్లిక్ చేయండి ఆ తర్వాత Google Drive ను క్లిక్ చేయండి.
    • మీ లేదా మీ సంస్థకు చెందిన మునుపటి Drive వినియోగం ఆధారంగా, మీరు కింద పేర్కొన్న వాటిని కూడా తెరవవచ్చు:
      • నా డ్రైవ్
      • షేర్ చేసిన డ్రైవ్
      • ఇతర కంప్యూటర్‌లు
  2. ఫోల్డర్‌లో, మీ ఫైల్‌పై రెండు సార్లు క్లిక్ చేయండి.
    • Google Docs, Sheets, Slides, లేదా Forms ద్వారా క్రియేట్ చేసిన ఫైళ్లు మీ బ్రౌజర్‌లో తెరవబడతాయి.
    • ఇతర ఫైళ్లు మీ కంప్యూటర్‌లో వాటి సాధారణ అప్లికేషన్‌లలో తెరవబడతాయి.

చిట్కా: మీ Driveలో ఎలాంటి కంటెంట్ లేకపోతే:

  • “నా డ్రైవ్” ఫోల్డర్ ఖాళీగా ఉంటుంది.
  • “షేర్ చేసిన డ్రైవ్‌లు” లేదా “ఇతర కంప్యూటర్‌ల” వీక్షణలు డిస్‌ప్లే కావు.

ఫైళ్లను Google Driveతో సింక్ చేయండి లేదా Google Photosకు బ్యాకప్ చేయండి

Google Drive లేదా Google Photosతో ఫోల్డర్‌ను సింక్ చేయండి

మీరు మీ కంప్యూటర్ నుండి Google Driveకు ఫైళ్లను సింక్ చేయవచ్చు, Google Photosకు బ్యాకప్ చేయవచ్చు.

  1. మీ కంప్యూటర్‌లో, డెస్క్‌టాప్ Drive డిస్క్ ఫైల్ స్ట్రీమ్ను తెరవండి.
  2. సెట్టింగ్‌లు సెట్టింగ్‌లు ఆ తర్వాత ప్రాధాన్యతలు అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. ఎడమ వైపున, మీ కంప్యూటర్‌లోని ఫోల్డర్‌లు అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. ఈ మెనూ నుండి, మీరు కింద పేర్కొన్న పనులు చేయవచ్చు:
    • Driveతో సింక్ చేయడానికి ఫోల్డర్‌లను జోడించవచ్చు.
    • Photosకు బ్యాకప్ చేయడానికి ఫోల్డర్‌లను జోడించవచ్చు.
    • ఇప్పటికే కాన్ఫిగర్ చేయబడిన ఫోల్డర్‌ల ప్రాధాన్యతలను ఎడిట్ చేయవచ్చు.

మీరు Google Driveతో సింక్ చేసినట్లయితే:

  • ఫోల్డర్‌లోని మొత్తం కంటెంట్ మిర్రర్ అవుతుంది. కంప్యూటర్, Google Drive‌ల మధ్య మార్పులు సింక్ అవుతాయి.
  • మీరు ఆన్‌లైన్‌లో లేదా ఏదైనా పరికరం నుండి Google Drive మొబైల్ యాప్‌లో మీ ఫైళ్లను ఉపయోగించవచ్చు. "కంప్యూటర్‌లు" విభాగంలో సింక్ అయిన ఫోల్డర్‌లు డిస్‌ప్లే అవుతాయి.
  • మీరు ఈ ఫోల్డర్‌ల నుండి ఐటెమ్‌లను జోడించడం, ఎడిట్ చేయడం, తరలించడం లేదా తొలగించడం వంటివి చేస్తే, సంబంధిత మార్పులు మీ కంప్యూటర్‌లో కూడా ప్రతిబింబిస్తాయి.

మీరు Google Photosకు బ్యాకప్ చేసినట్లయితే:

  • ఫోటోలు, వీడియోలు మాత్రమే అప్‌లోడ్ అవుతాయి.
  • మీ కంప్యూటర్‌లో ఫోటోలను, వీడియోలను తొలగిస్తే, అవి Google Photosలో తొలగించబడవు, అదే విధంగా Google Photosలో ఫోటోలను, వీడియోలను తొలగిస్తే మీ కంప్యూటర్‌లో అవి తొలగించబడవు.
  • ఇమేజ్‌లకు ఏవైనా మార్పులు చేస్తే అవి కొత్త ఇమేజ్‌లుగా అప్‌లోడ్ అవుతాయి. పాత ఇమేజ్ Google Photosలో అలాగే ఉంటుంది.
  • మీరు ఆన్‌లైన్‌లో లేదా ఏదైనా పరికరం నుండి Google Photos మొబైల్ యాప్‌లో మీ ఫోటోలను, వీడియోలను చూడవచ్చు.

చిట్కా: మీరు ఫోటోలను, వీడియోలను మాత్రమే స్టోర్ చేస్తే, Google Photosకు బ్యాకప్ చేయమని మేము మీకు సిఫార్సు చేస్తున్నాము. మీరు మీ ఫైళ్లను రెండు ప్రదేశాలలో స్టోర్ చేస్తే, ఫోటోలు, వీడియోలు రెండుసార్లు అప్‌లోడ్ చేయబడతాయి, ఇది మీ Google స్టోరేజ్‌ను ఎక్కువగా ఉపయోగిస్తుంది.

మీ macOS సిస్టమ్ ఫోటో లైబ్రరీని బ్యాకప్ చేయండి

ముఖ్య గమనిక: సిస్టమ్ ఫోటో లైబ్రరీ అనేది Google Photosకు సింక్ అయ్యే ఏకైక Apple ఫోటోల లైబ్రరీ. అన్ని Apple ఫోటోల లైబ్రరీలు, దీనికి విరుద్ధంగా, Driveతో సింక్ చేయబడతాయి.

మీరు Apple ఫోటోల లైబ్రరీని Driveతో సింక్ చేసినట్లయితే, థంబ్‌నెయిల్స్, ఇతర మెటాడేటాతో సహా ప్రతిదీ సింక్ అవుతుంది. మరొక కంప్యూటర్ నుండి లేదా క్లౌడ్‌లో ఈ ఫైళ్లకు మార్పులు చేయడం సిఫార్సు చేయబడదు, అది మీ లైబ్రరీని కరప్ట్ చేయగలదు.

మీ సిస్టమ్ ఫోటో లైబ్రరీ అనేది iCloud ఫోటోలు, షేర్ చేసిన ఆల్బమ్‌లు, అలాగే My Photo Streamతో ఉపయోగించగల ఏకైక లైబ్రరీ. మీకు ఒకే ఫోటో లైబ్రరీ మాత్రమే ఉంటే, అది సిస్టమ్ ఫోటో లైబ్రరీ. లేకపోతే, మీరు Photosలో క్రియేట్ చేసే లేదా తెరిచిన మొదటి ఫోటో లైబ్రరీ మీ సిస్టమ్ ఫోటో లైబ్రరీ అవుతుంది.

మీ iCloud నుండి ఫోటోలను, వీడియోలను డౌన్‌లోడ్ చేయడానికి, వాటిని Google Photosకు అప్‌లోడ్ చేయడానికి హార్డ్ డ్రైవ్ స్పేస్ తాత్కాలికంగా ఉపయోగించబడుతుంది. ఫోటోలను, వీడియోలను బ్యాకప్ చేయడం గురించి మరింత తెలుసుకోండి.

డెస్క్‌టాప్ Drive‌లోని ఫీచర్‌ల గురించి తెలుసుకోండి

మీ డెస్క్‌టాప్ Drive సెట్టింగ్‌లను అనుకూలంగా మార్చండి
అధునాతన సెట్టింగ్‌లతో, డెస్క్‌టాప్ Drive విషయంలో మీ ఎక్స్‌పీరియన్స్‌ను మెరుగుపరుచుకోండి. మీరు వీటిని చేయవచ్చు:
  • సింక్ ప్రాధాన్యతలను అనుకూలంగా మార్చుకోవచ్చు.
  • Microsoft Officeతో రియల్ టైమ్ ఎడిటింగ్ వీక్షణను ఎనేబుల్ లేదా డిజేబుల్ చేయవచ్చు.
  • Google Photos సెట్టింగ్‌లను అనుకూలంగా మార్చుకోవచ్చు.
  • ఆటోమేటిక్ లాంచ్, హాట్‌కీలు, ప్రాక్సీ సెట్టింగ్‌ల వంటి సాధారణ సెట్టింగ్‌లను అనుకూలంగా మార్చుకోవచ్చు.
మీ డెస్క్‌టాప్ Drive సెట్టింగ్‌లను ఎలా అనుకూలంగా మార్చాలో తెలుసుకోండి.
ఆఫ్‌లైన్‌లో ఫైళ్లను, ఫోల్డర్‌లను తెరవండి

మీరు డెస్క్‌టాప్ Driveతో ఆఫ్‌లైన్ వినియోగం కోసం ఫైళ్లను, ఫోల్డర్‌లను సేవ్ చేయవచ్చు. డెస్క్‌టాప్ Driveతో ఫైళ్లను ఆఫ్‌లైన్‌లో ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి.

మీ Drive ఫైళ్ల కోసం సెర్చ్ చేయండి

Driveలో మీ ఫైళ్లను కనుగొనడానికి, డెస్క్‌టాప్ Driveలో సెర్చ్ చేయండి. మీరు Windows సెర్చ్‌లో లేదా macOS స్పాట్‌లైట్‌లో కాకుండా డెస్క్‌టాప్ Drive‌లో సెర్చ్ చేసినప్పుడు, మీ సెర్చ్‌లో Drive స్ట్రీమింగ్ లొకేషన్‌లోని అన్ని ఫైళ్లు ఉన్నాయని నిర్ధారిస్తుంది.

  1. మీ కంప్యూటర్‌లో, డెస్క్‌టాప్ Drive డిస్క్ ఫైల్ స్ట్రీమ్ను తెరవండి.
  2. సెర్చ్ చేయండి Searchని క్లిక్ చేయండి.
  3. మీ సెర్చ్ క్వెరీలను ఎంటర్ చేయండి.
  4. మీ ఫైల్‌ను తెరవండి. ఫైల్ మీ కంప్యూటర్‌లో ఉంటే, అది అనుబంధిత అప్లికేషన్‌తో తెరవబడుతుంది. లేకపోతే, అది Drive వెబ్‌లో తెరుచుకుంటుంది.

చిట్కా: సెర్చ్ విండోను తెరవడానికి మీరు సెర్చ్ హాట్‌కీ కాంబినేషన్‌ను కూడా ఉపయోగించవచ్చు.

MS Outlook, Office ఫైళ్లలో పని చేయండి

మీరు డెస్క్‌టాప్ Driveను ఉపయోగించినప్పుడు Office ఫైళ్లలో రియల్ టైమ్ ఎడిటింగ్ వీక్షణతో పని చేయవచ్చు. వర్క్ లేదా స్కూల్ ఖాతా ఉన్న Windows యూజర్‌ల కోసం, మీరు Microsoft Outlookతో ఫైళ్లను కూడా పంపవచ్చు, అలాగే సేవ్ చేయవచ్చు. డెస్క్‌టాప్ Driveతో Microsoft Office ఫైళ్లను ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి.

macOSతో డెస్క్‌టాప్ Driveను ఉపయోగించండి
నా డ్రైవ్‌ను మిర్రరింగ్ చేయడం

మిర్రరింగ్, స్ట్రీమింగ్ అనేవి మీ ఫైళ్లను సింక్ చేయడానికి రెండు మార్గాలు.

  • మీ కంప్యూటర్‌లోని ఫోల్డర్‌లు మిర్రర్ మాత్రమే చేయబడతాయి.
  • షేర్ చేసిన డ్రైవ్‌లు, ఇతర కంప్యూటర్‌లు మాత్రమే స్ట్రీమ్ చేయబడతాయి.
  • నా డ్రైవ్‌ను మిర్రర్ చేయవచ్చు లేదా స్ట్రీమ్ చేయవచ్చు.
  • డెస్క్‌టాప్ Drive ఇన్‌స్టాల్ చేయబడినప్పుడు, “నా డ్రైవ్” ఫోల్డర్ స్ట్రీమ్ చేయబడుతుంది. ఇన్‌స్టాలేషన్ తర్వాత మీరు మీ ప్రాధాన్యతలను అప్‌డేట్ చేయవచ్చు, అలాగే నా డ్రైవ్‌ను మిర్రర్ లేదా స్ట్రీమ్ చేయడాన్ని ఎంచుకోవచ్చు.

డెస్క్‌టాప్ Driveతో స్ట్రీమింగ్, మిర్రరింగ్ చేయడానికి సంబంధించిన ఆప్షన్‌ల గురించి తెలుసుకోండి.

ఎర్రర్‌లను పరిష్కరించండి
డెస్క్‌టాప్ Driveలో, “యాక్టివిటీ” అనే విభాగంలో, “కొన్ని ఎర్రర్‌లు ఏర్పడ్డాయి” బ్యానర్ డిస్‌ప్లే అవుతుంది. ఎర్రర్‌ల లిస్ట్‌ను డిస్‌ప్లే చేయడానికి, మీరు కింద పేర్కొన్న వాటిలో ఏదైనా ఒకటి చేయవచ్చు:
  • బ్యానర్‌లోని లింక్‌పై క్లిక్ చేయండి.
  • సెట్టింగ్‌లు ఆ తర్వాత ఎర్రర్ లిస్ట్ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

ఎర్రర్‌లను ఎలా పరిష్కరించాలి అనే దాని గురించి మరింత తెలుసుకోండి.

సంబంధిత రిసోర్స్‌లు

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
9577398330392978254
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
99950
false
false