డెస్క్‌టాప్ Drive సెట్టింగ్‌లను అనుకూలంగా మార్చండి

మీరు అధునాతన సెట్టింగ్‌లతో డెస్క్‌టాప్ Drive అనుభవాన్ని మెరుగుపరచవచ్చు.

సింక్ ప్రాధాన్యతలను అనుకూలంగా మార్చండి

ఒకే సమయంలో పలు ఖాతాలను ఉపయోగించండి
డెస్క్‌టాప్ Driveతో మీరు ఒకేసారి 4 ఖాతాల వరకు ఉపయోగించవచ్చు.
ఖాతాను జోడించడానికి:
  1. మీ కంప్యూటర్‌లో, డెస్క్‌టాప్ Drive మెనూ డిస్క్ ఫైల్ స్ట్రీమ్ ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  2. పైన కుడి మూలన, మీ ప్రొఫైల్ ఫోటో ఆ తర్వాత మరొక ఖాతాను జోడించండి ఆప్షన్‌లను క్లిక్ చేయండి.
  3. మీ బ్రౌజర్ ద్వారా సైన్ ఇన్ చేయండి.
  4. డెస్క్‌టాప్ Driveను రీస్టార్ట్ చేయండి.
ఖాతాను డిస్‌కనెక్ట్ చేయడానికి:
  1. మీ కంప్యూటర్‌లో, డెస్క్‌టాప్ Drive మెనూ డిస్క్ ఫైల్ స్ట్రీమ్ ఆ తర్వాత సెట్టింగ్‌లు ఆ తర్వాత ప్రాధాన్యతలు ఆ తర్వాత అధునాతన సెట్టింగ్‌లు ఆప్షన్‌లను క్లిక్ చేయండి.
  2. మీరు డిస్‌కనెక్ట్ చేయాలనుకుంటున్న ఖాతాకు స్క్రోల్ చేయండి.
  3. ఖాతాను డిస్‌కనెక్ట్ చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. పాప్-అప్ విండోలో, సరే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
ముఖ్య గమనిక: స్ట్రీమింగ్ ఖాతా డిస్‌కనెక్ట్ చేయబడితే, ఏవైనా ఆఫ్‌లైన్ ఫైళ్లు తీసివేయబడతాయి.
ఖాతాను డిస్‌కనెక్ట్ చేయండి

ముఖ్య గమనిక: మీరు మీ ఖాతాను డిస్‌కనెక్ట్ చేసినప్పుడు, ఆఫ్‌లైన్ ఫైళ్లు తీసివేయబడతాయి.

  1. మీ కంప్యూటర్‌లో మెనూ డిస్క్ ఫైల్ స్ట్రీమ్ ఆ తర్వాత సెట్టింగ్‌లు ఆ తర్వాత ప్రాధాన్యతలు ఆ తర్వాత అధునాతన సెట్టింగ్‌లు ఆప్షన్‌లను క్లిక్ చేయండి.
  2. మీరు డిస్‌కనెక్ట్ చేయాలనుకుంటున్న ఖాతాను ఎంచుకోండి.
  3. ఖాతాను డిస్‌కనెక్ట్ చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. పాప్-అప్ విండోలో, సరే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
Drive స్ట్రీమింగ్ లొకేషన్‌ను మార్చండి
మీరు డెస్క్‌టాప్ Drive స్ట్రీమింగ్ లొకేషన్‌ను మార్చవచ్చు:
  1. మీ కంప్యూటర్‌లో, డెస్క్‌టాప్ Drive మెనూ డిస్క్ ఫైల్ స్ట్రీమ్ ఆ తర్వాత సెట్టింగ్‌లు ఆ తర్వాత ప్రాధాన్యతలు ఆ తర్వాత అధునాతన సెట్టింగ్‌లు ఆప్షన్‌లను క్లిక్ చేయండి.
  2. "Google Drive స్ట్రీమింగ్ లొకేషన్" కింద, మార్చండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
    • Windowsలో: మీ కంప్యూటర్‌లోని ఫోల్డర్‌కు Google Drive ఫైళ్లను స్ట్రీమ్ చేయడానికి, “Google Drive స్ట్రీమింగ్ లొకేషన్” కింద, ఫోల్డర్‌ను ఎంచుకోండి. Drive లెటర్‌ను మార్చడానికి, "Drive లెటర్" కింద, కింది వైపు బాణం గుర్తును క్లిక్ చేయండి.
    • MacOSలో: స్ట్రీమింగ్ లొకేషన్‌ను మార్చడానికి, "Google Drive స్ట్రీమింగ్ లొకేషన్" కింద, మార్చండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

      ముఖ్య గమనిక: “Google Drive స్ట్రీమింగ్ లొకేషన్” కింద, “ఫోల్డర్ లొకేషన్ macOS ద్వారా కంట్రోల్ చేయబడుతోంది” అని చెప్పే నోటిఫికేషన్‌ను మీరు కనుగొనవచ్చు, అలాగే మీరు మౌంట్‌ను అప్‌డేట్ చేయలేరు. macOSలో డెస్క్‌టాప్ Drive గురించి మరింత తెలుసుకోండి.
  3. మీరు మీ ఫైళ్లను ఎక్కడ కనుగొనాలనుకుంటున్నారో ఎంచుకోండి.
  4. సరే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
సింక్‌ను పాజ్ చేయండి
సింక్ పాజ్ చేయబడినప్పుడు, డెస్క్‌టాప్ Drive ఈ బ్యాక్‌గ్రౌండ్ సింక్ యాక్టివిటీలను ఆపివేస్తుంది:
  • వర్చువల్ Driveలో స్ట్రీమ్ చేసిన ఫైళ్లకు అప్‌డేట్‌లు చేయబడ్డాయి.
  • మిర్రర్డ్ ఫోల్డర్‌ల కోసం రెండు దిశల్లో Driveకు సింక్ చేసిన ఫైల్.
  • Google Photosకు చేసిన బ్యాకప్‌లు.
  • macOS ఫైల్ ప్రొవైడర్‌లో, డౌన్‌లోడ్ చేయని ఫైళ్లు యాక్సెస్ చేయబడవు. macOSలో డెస్క్‌టాప్ Drive గురించి మరింత తెలుసుకోండి.
సింక్ చేయడాన్ని పాజ్ చేయడానికి:
  1. మీ కంప్యూటర్‌లో, డెస్క్‌టాప్ Drive మెనూ డిస్క్ ఫైల్ స్ట్రీమ్ ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  2. సెట్టింగ్‌లు ఆ తర్వాత సింక్ చేయడాన్ని పాజ్ చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
సింక్ చేయడాన్ని కొనసాగించడానికి:
  1. మీ కంప్యూటర్‌లో, డెస్క్‌టాప్ Drive మెనూ డిస్క్ ఫైల్ స్ట్రీమ్ ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  2. సెట్టింగ్‌లు ఆ తర్వాత సింక్ చేయడాన్ని కొనసాగించండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
స్ట్రీమ్ చేయబడిన, అలాగే మిర్రర్ చేయబడిన ఫైళ్ల సెట్టింగ్‌ల గురించి తెలుసుకోండి
మీరు మీ My Drive ఫైళ్ళను డెస్క్‌టాప్ Driveతో మిర్రరింగ్ లేదా స్ట్రీమింగ్‌తో సింక్ చేయవచ్చు.

స్ట్రీమింగ్ నుండి మిర్రరింగ్‌కు మారడానికి:

  1. డెస్క్‌టాప్ Driveను తెరవండి.
  2. సెట్టింగ్‌లు సెట్టింగ్‌లు ఆ తర్వాత ప్రాధాన్యతలు ఆప్షన్‌లను క్లిక్ చేయండి.
  3. ఎడమ వైపున, Drive నుండి ఫోల్డర్‌లు ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. "నా డ్రైవ్ సింకింగ్ ఆప్షన్‌ల" కింద, ఫైళ్లను మిర్రర్ చేయండి ఆప్షన్‌ను ఎంచుకోండి.
  5. డెస్క్‌టాప్ Driveను మూసివేయండి.

చిట్కాలు:
  • మీరు మారినప్పుడు, నా డ్రైవ్ ఫైళ్లు మీరు ఎంచుకున్న ఫోల్డర్‌కు డౌన్‌లోడ్ అవుతాయి. 
  • ఎంచుకున్న ఫోల్డర్‌లో ఇప్పటికే ఫైళ్లు ఉన్నట్లయితే, డెస్క్‌టాప్ Drive ఇప్పటికే క్లౌడ్‌లో ఉన్న ఫైళ్లను కాపీ చేయకుండా ఉండటానికి ట్రై చేస్తుంది. 
    • ఫైల్‌లోని కంటెంట్ క్లౌడ్‌లో ఉన్న దానికంటే భిన్నంగా ఉంటే, డెస్క్‌టాప్ Drive రెండింటినీ ఉంచుతుంది.
  • క్లౌడ్‌లో ఇప్పటికే లేని ఫైళ్లు అప్‌లోడ్ చేయబడతాయి.
  • మీ కొత్త నా డ్రైవ్ ఫోల్డర్‌కి షార్ట్‌కట్‌ను చూపడానికి Google Drive స్ట్రీమింగ్ లొకేషన్ అప్‌డేట్ అవుతుంది. 
  • షేర్ చేసిన డ్రైవ్‌లు, ఇతర కంప్యూటర్‌లు, బ్యాకప్ చేయబడిన USB పరికరాలు ఇప్పటికీ కనిపిస్తాయి, అలాగే ఇప్పటికీ స్ట్రీమ్ చేయడానికి వీలుగా ఉంటాయి.

డెస్క్‌టాప్ Driveతో మిర్రరింగ్, ఇంకా స్ట్రీమింగ్ గురించి మరింత తెలుసుకోండి.
స్ట్రీమింగ్ ఫైళ్ల కోసం కంటెంట్ కాష్ గురించి తెలుసుకోండి

ముఖ్య గమనిక: మీ కాష్ డైరెక్టరీ పాత్ అందుబాటులో లేకపోతే, మీరు డెస్క్‌టాప్ Driveను ఉపయోగించలేరు.

మీరు Google Drive నుండి ఫైళ్లను మీ కంప్యూటర్‌కు స్ట్రీమ్ చేస్తే, ఫైల్ డేటా మీ హార్డ్ డ్రైవ్‌లోని లోకల్ కాష్‌లో స్టోర్ చేయబడుతుంది.

కాష్ మీ ఫైళ్లను వేగంగా తెరవడానికి డెస్క్‌టాప్ Driveను అనుమతిస్తుంది, అలాగే వాటిని ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతుంది. మీరు ఆఫ్‌లైన్‌లో ఏదైనా ఎడిట్ చేస్తే, అది క్లౌడ్‌కి అప్‌లోడ్ చేయబడే వరకు కాష్‌లో స్టోర్ చేయబడుతుంది.

Windows, అలాగే MacOSకు చెందిన పాత వెర్షన్‌లలో, డెస్క్‌టాప్ Drive కంటెంట్ కాష్‌ను ఆటోమేటిక్‌గా మేనేజ్ చేస్తుంది. ఆఫీస్ లేదా స్కూల్ ఖాతాల కోసం, మీ అడ్మిన్ కాష్ ద్వారా ఎంత స్పేస్‌ను ఉపయోగించాలో పరిమితిని సెట్ చేయవచ్చు.

macOSకు చెందిన కొత్త వెర్షన్‌లలో, macOS కంటెంట్ కాష్‌ను మేనేజ్ చేస్తుంది. macOS కంటెంట్ కాష్‌ను మేనేజ్ చేస్తుంది కాబట్టి, కాష్ ఎంత స్పేస్‌ను ఉపయోగిస్తుందో మీరు పరిమితిని సెట్ చేయలేరు.

మీరు ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉన్న ఫైళ్లను కనుగొనవచ్చు, అలాగే మీ హార్డ్ డ్రైవ్ స్పేస్ ఎలా ఉపయోగించబడుతుందో చూడవచ్చు. ఈ సమాచారాన్ని చూడటానికి:
  1. మీ కంప్యూటర్‌లో,డెస్క్‌టాప్ Drive మెనూ డిస్క్ ఫైల్ స్ట్రీమ్ ఆ తర్వాత సెట్టింగ్‌లు ఆ తర్వాత ఆఫ్‌లైన్ ఫైళ్లు ఆప్షన్‌లను క్లిక్ చేయండి.
  2. మీ ఖాతాల కింద కాష్ చేయబడిన ఫైళ్లను చూడటానికి, ఆఫ్‌లైన్ ఫైళ్లు ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

డెస్క్‌టాప్ Driveకు వర్తించే కాష్ పరిమితుల లిస్ట్ ఇక్కడ ఉంది:

  • మీరు కాష్ ఫోల్డర్ ఉన్న పార్టిషన్‌లో అందుబాటులో ఉన్న స్టోరేజ్ కంటే పెద్ద ఫోల్డర్‌ను అప్‌లోడ్ చేయలేరు.
  • కాష్ ఉన్న లోకల్ డ్రైవ్‌లో అందుబాటులో ఉన్న స్పేస్ ఆధారంగా మీరు డెస్క్‌టాప్ Driveకు సంబంధించిన పరిమిత Drive కోటాను (అపరిమిత ఖాతాల కోసం కూడా) కనుగొనవచ్చు.
అధునాతనం: మీ స్థానిక కాష్ చేసిన ఫైళ్ల డైరెక్టరీ లొకేషన్‌ను మార్చండి
మీరు మీ స్థానిక కాష్ చేసిన ఫైళ్ల డైరెక్టరీ లొకేషన్‌ను మార్చవచ్చు, అయినప్పటికీ మేము దాని ఆటోమేటిక్ లొకేషన్‌లో ఉంచాలని సిఫార్సు చేస్తున్నాము. మీరు తప్పని సరిగా లొకేషన్‌ను మార్చాల్సి వస్తే:
  1. మీ కంప్యూటర్‌లో, డెస్క్‌టాప్ Drive మెనూ డిస్క్ ఫైల్ స్ట్రీమ్ ఆ తర్వాత సెట్టింగ్‌లు ఆ తర్వాత ప్రాధాన్యతలు ఆ తర్వాత అధునాతన సెట్టింగ్‌లు ఆప్షన్‌లను క్లిక్ చేయండి.
  2. “కాష్ చేసిన ఫైళ్ల లోకల్ ఫోల్డర్”ను కనుగొనండి.
  3. మార్చండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. కొత్త కాష్ లొకేషన్‌ను ఎంచుకోండి.
  5. మార్చండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
ముఖ్య గమనిక:
  • macOS కోసం ఫైల్ ప్రొవైడర్‌లో ఈ సెట్టింగ్ ఎనేబుల్ చేయబడలేదు.
  • మీ స్థానిక కాష్ చేసిన ఫైళ్ల డైరెక్టరీ ఈ కింది రకంగా ఉండకూడదు:
    • మిర్రర్ చేసిన ఫోల్డర్‌కు సబ్ ఫోల్డర్.
    • మీ స్ట్రీమింగ్ లొకేషన్‌ల పేరెంట్ లేదా సబ్‌ఫోల్డర్.

Microsoft Officeతో రియల్ టైం ఎడిటింగ్ వీక్షణను ఎనేబుల్ చేయండి లేదా నిలిపివేయండి

Microsoft Officeతో రియల్ టైం ఎడిటింగ్ వీక్షణ గురించి తెలుసుకోండి
రియల్ టైం ఎడిటింగ్ వీక్షణతో, డెస్క్‌టాప్ Driveలో స్టోర్ చేయబడిన Microsoft Word, Excel లేదా PowerPoint ఫైల్‌ను ఎవరైనా ఎడిట్ చేస్తున్నారో లేదో మీరు కనుగొనవచ్చు. డెస్క్‌టాప్ Driveలో రియల్ టైం ఎడిటింగ్ వీక్షణ ఆటోమేటిక్‌గా ఆన్ చేయబడుతుంది. ఎవరైనా దాన్ని ఆఫ్ చేస్తే, ఆ వ్యక్తి ఫైల్‌లో ఉన్నారో లేదో మీరు చూడలేరు.

మీరు macOSతో రియల్ టైం ఎడిటింగ్ వీక్షణను ఉపయోగించే ముందు, మీరు మీ సిస్టమ్ అనుమతులను తప్పనిసరిగా మార్చాలి.

  1. మీ Macలో, సిస్టమ్ ప్రాధాన్యతలు ఆ తర్వాత సెక్యూరిటీ & గోప్యత ఆ తర్వాత గోప్యత ఆ తర్వాత యాక్సెసిబిలిటీ ఆప్షన్‌లను తెరవండి.
  2. కింద, మార్పులు చేయడానికి లాక్‌ను క్లిక్ చేయండి.
  3. Google Drive బాక్స్‌ను చెక్ చేయండి.
ముఖ్య గమనిక: Microsoft Officeలో రియల్ టైం ఎడిటింగ్ వీక్షణతో ఎడిట్ చేయడానికి, మీకు Office 2010 లేదా అంతకంటే అధునాతనమైన వెర్షన్ అవసరం.

Microsoft Officeతో డెస్క్‌టాప్ Driveను ఉపయోగించడం గురించి మరింత తెలుసుకోండి.
రియల్ టైం ఎడిటింగ్ వీక్షణను ఆఫ్ చేయండి
డెస్క్‌టాప్ Driveలో మీరు రియల్ టైం ఎడిటింగ్ వీక్షణను ఆఫ్ చేయవచ్చు.

ముఖ్య గమనిక: ఎవరైనా వారి రియల్ టైం ఎడిటింగ్ వీక్షణను ఆఫ్ చేస్తే, ఆ వ్యక్తి ఫైల్‌లో పని చేస్తున్నారో లేదో మీకు తెలియదు.

  1. మీ కంప్యూటర్‌లో, డెస్క్‌టాప్ Drive మెనూ డిస్క్ ఫైల్ స్ట్రీమ్ ఆ తర్వాత సెట్టింగ్‌లు ఆ తర్వాత ప్రాధాన్యతలు ఆ తర్వాత అధునాతన సెట్టింగ్‌లు ఆప్షన్‌లను క్లిక్ చేయండి.
  2. "షేర్ చేసిన Microsoft Office ఫైల్‌ను మరొకరు ఎవరైనా ఎడిట్ చేస్తున్నారేమో చూడండి" బాక్స్ ఎంపికను తీసివేయండి.
  3. సేవ్ చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

Google Photos సెట్టింగ్‌లను అనుకూలంగా మార్చండి

అప్‌లోడ్ సైజ్ గురించి మరింత తెలుసుకోండి
మీరు Google Photosలో ఫోటోలు, వీడియోల స్టోరేజ్ క్వాలిటీను ఎంచుకోవచ్చు. రెండు సందర్భాలలోను, మీ కంప్యూటర్‌లోని ఫోటోలు, వీడియోలకు ఎటువంటి మార్పులు చేయబడవు:
  • స్టోరేజ్ సేవర్ మీ ఫోటోల క్వాలిటీను కొద్దిగా తగ్గిస్తుంది, కానీ తక్కువ స్టోరేజ్ స్పేస్‌ను ఉపయోగిస్తుంది.
  • ఒరిజినల్ క్వాలిటీ మీ ఫోటోలు, వీడియోల క్వాలిటీ, ఇంకా సైజ్‌ను నిర్వహిస్తుంది.
  1. మీ కంప్యూటర్‌లో, డెస్క్‌టాప్ Drive మెనూ డిస్క్ ఫైల్ స్ట్రీమ్ ఆ తర్వాత సెట్టింగ్‌లు ఆ తర్వాత ప్రాధాన్యతలు ఆ తర్వాత అధునాతన సెట్టింగ్‌లు ఆప్షన్‌లను క్లిక్ చేయండి.
  2. "అప్‌లోడ్ సైజ్" అని గుర్తించబడిన కంట్రోల్స్‌ను కనుగొనండి.
  3. మీ ప్రాధాన్యతను ఎంచుకోండి:
    • స్టోరేజ్ సేవర్
    • ఒరిజినల్ క్వాలిటీ
macOS కోసం సిస్టమ్ ఫోటో లైబ్రరీ గురించి తెలుసుకోండి
  1. macOSలో, డెస్క్‌టాప్ Drive మెనూ డిస్క్ ఫైల్ స్ట్రీమ్ ఆ తర్వాత సెట్టింగ్‌లు ఆ తర్వాత ప్రాధాన్యతలు ఆ తర్వాత అధునాతన సెట్టింగ్‌లు ఆప్షన్‌లను క్లిక్ చేయండి.
  2. మీ ఫోటోలు, వీడియోలను ఆటోమేటిక్‌గా Google Photosకు అప్‌లోడ్ చేయడానికి, "సిస్టమ్స్ ఫోటో లైబ్రరీ"ని ఎంచుకోండి లేదా ఎంపికను తీసివేయండి.”
    • పెద్ద లైబ్రరీలు పెద్ద మొత్తంలో డేటాను అప్‌లోడ్ చేయడానికి, బదిలీ చేయడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి.
ఫైల్ రకాల గురించి తెలుసుకోండి
  1. మీ కంప్యూటర్‌లో, డెస్క్‌టాప్ Drive మెనూ డిస్క్ ఫైల్ స్ట్రీమ్ ఆ తర్వాత సెట్టింగ్‌లు ఆ తర్వాత ప్రాధాన్యతలు ఆ తర్వాత అధునాతన సెట్టింగ్‌లు ఆప్షన్‌లను క్లిక్ చేయండి.
  2. ప్రాసెస్ చేయని ఫైళ్లు, అలాగే స్క్రీన్‌షాట్‌లను సింక్ చేయడానికి లేదా విస్మరించడానికి ఫైల్ రకం బాక్స్‌లను ఎంపిక చేయండి లేదా ఎంపికను తీసివేయండి.

సాధారణ సెట్టింగ్‌లను అనుకూలంగా మార్చండి

Google Driveలో ఆటోమేటిక్ లాంచ్‌ను ఆఫ్ చేయండి
మీరు మీ కంప్యూటర్‌కు లాగిన్ చేసిన తర్వాత, Google Drive ఆటోమేటిక్‌గా తెరవబడుతుంది. దీన్ని ఆఫ్ చేయడానికి:
  1. మీ కంప్యూటర్‌లో, డెస్క్‌టాప్ Drive మెనూ డిస్క్ ఫైల్ స్ట్రీమ్ ఆ తర్వాత సెట్టింగ్‌లు ఆ తర్వాత ప్రాధాన్యతలు ఆ తర్వాత అధునాతన సెట్టింగ్‌లు ఆప్షన్‌లను క్లిక్ చేయండి.
  2. “మీరు మీ కంప్యూటర్‌కు లాగిన్ చేసినప్పుడు Google Driveను ప్రారంభించండి” పక్కన ఉన్న బాక్స్ ఎంపికను తీసివేయండి.
ప్రాక్సీ సెట్టింగ్‌ల గురించి తెలుసుకోండి
మీ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా పేర్కొన్న ప్రాక్సీ సెట్టింగ్‌లను ఉపయోగించడానికి Google Drive "ఆటో-డిటెక్ట్" మోడ్‌కి ఆటోమేటిక్ సెట్టింగ్ చేయబడుతుంది. మీరు ప్రాక్సీ సెట్టింగ్‌లను బైపాస్ చేయడానికి “డైరెక్ట్ కనెక్షన్” మోడ్‌ను కూడా ఉపయోగించవచ్చు:
  1. మీ కంప్యూటర్‌లో, డెస్క్‌టాప్ Drive మెనూ డిస్క్ ఫైల్ స్ట్రీమ్ ఆ తర్వాత సెట్టింగ్‌లు ఆ తర్వాత ప్రాధాన్యతలు ఆ తర్వాత అధునాతన సెట్టింగ్‌లు ఆప్షన్‌లను క్లిక్ చేయండి.
  2. మీ ప్రాధాన్యత ఆధారంగా, ఆటో-డిటెక్ట్ లేదా డైరెక్ట్ కనెక్షన్‌ను ఎంచుకోండి.
బ్యాండ్‌విడ్త్ సెట్టింగ్‌ల గురించి తెలుసుకోండి
Google Drive డౌన్‌లోడ్, అలాగే అప్‌లోడ్ రేట్ కోసం, మీరు బ్యాండ్‌విడ్త్ గరిష్ఠ పరిమితిని ఎంటర్ చేయవచ్చు.
  1. మీ కంప్యూటర్‌లో, డెస్క్‌టాప్ Drive మెనూ డిస్క్ ఫైల్ స్ట్రీమ్ ఆ తర్వాత సెట్టింగ్‌లు ఆ తర్వాత ప్రాధాన్యతలు ఆ తర్వాత అధునాతన సెట్టింగ్‌లు ఆప్షన్‌లను క్లిక్ చేయండి.
  2. “డౌన్‌లోడ్ రేట్” లేదా “అప్‌లోడ్ రేట్” పక్కన ఉన్న బాక్స్‌ను క్లిక్ చేయండి.
  3. మీ విలువలను ఎంటర్ చేయండి:
    • విలువలు 1 నుండి 100,000,000 మధ్య ఉండవచ్చు.
    • యూనిట్ సెకనుకు కిలోబైట్‌లలో ఉంటుంది.
హాట్‌కీను సెటప్ చేయండి
  1. మీ కంప్యూటర్‌లో, డెస్క్‌టాప్ Drive మెనూ డిస్క్ ఫైల్ స్ట్రీమ్ ఆ తర్వాత సెట్టింగ్‌లు ఆ తర్వాత ప్రాధాన్యతలు ఆ తర్వాత అధునాతన సెట్టింగ్‌లు ఆప్షన్‌లను క్లిక్ చేయండి.
  2. "హాట్‌కీని కాన్ఫిగర్ చేయండి" కింద, కీ కాంబినేషన్ టెక్స్ట్‌ను ఎంచుకోండి.
  3. కీ కాంబినేషన్‌ను ఎంటర్ చేయండి.
నోటిఫికేషన్ ప్రాధాన్యత గురించి తెలుసుకోండి
  1. మీ కంప్యూటర్‌లో, డెస్క్‌టాప్ Drive మెనూ డిస్క్ ఫైల్ స్ట్రీమ్ ఆ తర్వాత సెట్టింగ్‌లు ఆ తర్వాత ప్రాధాన్యతలు ఆ తర్వాత అధునాతన సెట్టింగ్‌లు ఆప్షన్‌లను క్లిక్ చేయండి.
  2. నోటిఫికేషన్ సెట్టింగ్‌ల కింద, "పరికరాలను బ్యాకప్ చేయమని నన్ను ప్రాంప్ట్ చేయండి"ని ఎంచుకోండి లేదా ఎంపికను తీసివేయండి:”
    • ఆన్ చేసినట్లయితే, ఫ్లాష్ డ్రైవ్ లేదా బ్యాకప్ కోసం కెమెరా వంటి USB పరికరాన్ని గుర్తించినప్పుడు Google Drive మీకు ప్రాంప్ట్‌ను అందిస్తుంది. మీరు ప్రాంప్ట్‌లో డిటాచబుల్ పరికరాన్ని విస్మరించాలని ఎంచుకుంటే, Drive మీ ప్రాధాన్యతను గుర్తుంచుకుంటుంది, అలాగే పరికరాన్ని "విస్మరించబడిన USB పరికరాలు" కింద లిస్ట్ చేస్తుంది.
డెస్క్‌టాప్ Driveను అన్‌ఇన్‌స్టాల్ చేయండి
  1. మీ కంప్యూటర్‌లో, డెస్క్‌టాప్ Drive నుండి సైన్ అవుట్ చేయండి.
  2. డెస్క్‌టాప్ Drive మెనూ డిస్క్ ఫైల్ స్ట్రీమ్ ఆ తర్వాత సెట్టింగ్‌లు ఆ తర్వాత ప్రాధాన్యతలు ఆ తర్వాత అధునాతన సెట్టింగ్‌లు ఆ తర్వాత ఖాతాను డిస్‌కనెక్ట్ చేయండి ఆప్షన్‌లను క్లిక్ చేయండి.
  3. పాప్-అప్ విండోలో, సరే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. డెస్క్‌టాప్ Drive మెనూ డిస్క్ ఫైల్ స్ట్రీమ్ ఆ తర్వాత సెట్టింగ్‌లు ఆ తర్వాత నిష్క్రమించండి ఆప్షన్‌లను క్లిక్ చేయండి.
  5. మీ కంప్యూటర్ నుండి డెస్క్‌టాప్ Driveను అన్‌ఇన్‌స్టాల్ చేయడానికి స్టాండర్డ్ విధానాలను ఉపయోగించండి.
    • మీకు సహాయం కావాలంటే, మీ కంప్యూటర్ కోసం OS సూచనలను సంప్రదించండి.
చిట్కా: మీరు డెస్క్‌టాప్ Driveను అన్‌ఇన్‌స్టాల్ చేసిన తర్వాత కూడా, మీరు మీ ఫైళ్లను వెబ్ కోసం Driveలో తెరవగలరు.

చిట్కా: మీరు మీ ఆఫీస్ లేదా స్కూల్ వంటి సంస్థ ద్వారా డెస్క్‌టాప్ Driveను ఉపయోగిస్తే, మీ అడ్మిన్ కొన్ని సెట్టింగ్‌లను మేనేజ్ చేయవచ్చు లేదా పరిమితం చేయవచ్చు. అడ్మిన్ ద్వారా మేనేజ్ చేయబడే సెట్టింగ్‌ల గురించి మరింత తెలుసుకోండి.

సంబంధిత రిసోర్స్‌లు

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
4627981275332846075
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
99950
false
false