డెస్క్‌టాప్ Driveతో ఫైళ్లను స్ట్రీమ్ చేసి, మిర్రర్ చేయండి

డెస్క్‌టాప్ Driveలో మీ ఫైళ్లను సింక్ చేయడానికి మిర్రరింగ్, అలాగే స్ట్రీమింగ్‌ను ఉపయోగించండి.

  • మీకు విశ్వసనీయమైన ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నంత వరకు, చాలా మంది యూజర్‌లు తమ కంప్యూటర్‌లో వారి Google Drive ఫైళ్ళతో పని చేయడానికి స్ట్రీమింగ్‌ను ఒక మార్గంగా ఎంచుకుంటారు. ఫైల్‌లు ప్రధానంగా క్లౌడ్‌లో స్టోర్ చేయబడతాయి, కానీ యాక్సెస్ చేసినప్పుడు ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉంచబడతాయి.
  • మిర్రరింగ్‌తో, మీ లోకల్ పరికరంలో మీ My Drive ఫైళ్లు ఎక్కడ కనిపించాలని మీరు కోరుకుంటున్నారో ఎంచుకోండి లేదా లోకల్ ఫైళ్లను క్లౌడ్‌కు బ్యాకప్ చేయండి. మిర్రర్ చేయబడిన ఫైల్‌లు ఎల్లప్పుడూ మీ కంప్యూటర్‌లో, అలాగే క్లౌడ్‌లో స్టోర్ చేయబడతాయి. అవి ఎల్లప్పుడూ ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి.

ఒక పరికరంలో మీ స్ట్రీమ్ చేయబడిన లేదా మిర్రర్ చేయబడిన ఫైళ్లకు మీరు చేసే మార్పులు ప్రతిచోటా ప్రతిబింబిస్తాయి. రెండు సందర్భాల్లో, డెస్క్‌టాప్ Drive యాప్ ఇప్పటికీ మీ డెస్క్‌టాప్‌లోని Google Driveలోని మీ ఫైళ్లు, ఫోల్డర్‌లు అన్నింటినీ బ్రౌజ్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. 

స్ట్రీమింగ్ లేదా మిర్రరింగ్‌ను ఉపయోగించాలా వద్దా అని నిర్ణయించుకోవడానికి కింది టేబుల్‌ను ఉపయోగించండి: 

  స్ట్రీమింగ్ మిర్రరింగ్
అధిక స్థాయి వినియోగ కేస్ ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం. హార్డ్ డ్రైవ్ వినియోగాన్ని తగ్గించి, క్లౌడ్‌లో కంటెంట్‌ను సురక్షితంగా స్టోర్ చేయండి. మీకు ఇంటర్నెట్ కనెక్షన్ లేనప్పుడు లేదా డెస్క్‌టాప్ Drive యాప్ రన్నింగ్‌లో లేనప్పుడు కూడా మీ క్లౌడ్ ఫైల్‌లను యాక్సెస్ చేయండి.
స్టోరేజ్ ఫైళ్లు, ఫోల్డర్‌లు క్లౌడ్‌లో స్టోర్ చేయబడతాయి. మీరు మీ కంప్యూటర్‌లోని ఫైళ్లపై పని చేసినప్పుడు లేదా ఇటీవల, అలాగే తరచుగా ఉపయోగించే ఫైళ్ల కోసం మాత్రమే లోకల్ స్టోరేజ్ ఉపయోగించబడుతుంది. ఫైళ్లు, ఫోల్డర్‌లు క్లౌడ్‌లో, అలాగే మీ లోకల్ హార్డ్ డ్రైవ్‌లో స్టోర్ చేయబడతాయి.
లభ్యత, యాక్సెస్
  • డెస్క్‌టాప్ Drive ద్వారా ప్రత్యేకంగా ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉంచితే మినహా ఫైళ్లు ఆన్‌లైన్‌లో మాత్రమే అందుబాటులో ఉంటాయి.
  • మీరు MacOSలో Finder లేదా Windowsలో File Explorer ద్వారా ఫైళ్లను యాక్సెస్ చేయవచ్చు.
  • డెస్క్‌టాప్ Drive రన్ అవుతున్నప్పుడు మాత్రమే ఫైళ్లను యాక్సెస్ చేయగలరు.
  • ఫైళ్లు ఆఫ్‌లైన్‌లో, అలాగే ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి.
  • MacOSలో Finder లేదా Windowsలో File Explorer ద్వారా ఫైల్‌లను యాక్సెస్ చేయవచ్చు.
సపోర్ట్ ఉన్న డ్రైవ్ రకాలు షేర్ చేసిన డ్రైవ్‌లు, ఇతర కంప్యూటర్‌లు, బ్యాకప్ చేయబడిన USB పరికరాల నుండి ఫైళ్లు స్ట్రీమ్ మాత్రమే చేయబడతాయి. నా డ్రైవ్ స్ట్రీమ్ చేయబడవచ్చు లేదా మిర్రర్ చేయబడవచ్చు. లోకల్ ఫోల్డర్‌లు లేదా మీ డెస్క్‌టాప్ మాత్రమే మిర్రర్ చేయబడవచ్చు. నా డ్రైవ్ స్ట్రీమ్ చేయబడవచ్చు లేదా మిర్రర్ చేయబడవచ్చు.
యాప్ ప్రభావం కొన్ని యాప్‌లు ఫైళ్లను స్ట్రీమ్ చేయడం కష్టతరం చేసే APIల కాంబినేషన్‌ను ఉపయోగిస్తాయి. మీరు ఫైళ్లను మిర్రర్ చేసినప్పుడు విస్తృతమైన రచన, వీడియో ఎడిటింగ్ లేదా అధిక-రిజల్యూషన్ ఫోటో ఎడిటింగ్ అవసరమయ్యే యాప్‌లు వేగంగా ఉంటాయి.
 

ముఖ్య గమనిక: 

నా డ్రైవ్‌ను స్ట్రీమ్ లేదా మిర్రర్ చేయండి

  1. డెస్క్‌టాప్ Driveను తెరవండి.
  2. సెట్టింగ్‌లు సెట్టింగ్‌లు ఆ తర్వాత ప్రాధాన్యతలు ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. ఎడమ వైపున, Drive నుండి ఫోల్డర్‌లు అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. "నా డ్రైవ్ సింకింగ్ ఆప్షన్‌ల" కింద, ఫైళ్లను స్ట్రీమ్ చేయండి లేదా ఫైళ్లను మిర్రర్ చేయండి ఆప్షన్‌ను ఎంచుకోండి.
మీరు మిర్రరింగ్ నుండి స్ట్రీమింగ్‌కు మారినప్పుడు
  • మీ కంప్యూటర్‌లో మీ ఫైల్ లొకేషన్ మారుతుంది. 
    • స్ట్రీమింగ్ చేస్తున్నప్పుడు, ఫైళ్లు మీ కంప్యూటర్‌లోని వర్చువల్ డ్రైవ్‌లో ఉంటాయి.
    • మిర్రరింగ్ చేస్తున్నప్పుడు, ఫైళ్లు మీ కంప్యూటర్‌లోని ఫోల్డర్‌లో ఉంటాయి. 
  • మీ మిర్రర్ చేయబడిన నా డ్రైవ్ ఫైళ్లతో ఉన్న ఫోల్డర్ ఇకపై సింక్ చేయబడదు.

మిర్రరింగ్ నుండి స్ట్రీమింగ్‌కి మారడానికి:

  1. డెస్క్‌టాప్ Driveను తెరవండి.
  2. మీ లోకల్ ఫైళ్లు క్లౌడ్‌కు సింక్ చేయడం పూర్తయినట్లు నిర్ధారించుకోండి.
  3. సెట్టింగ్‌లు సెట్టింగ్‌లు ఆ తర్వాత ప్రాధాన్యతలు ఆప్షన్‌లను క్లిక్ చేయండి.
  4. ఎడమ వైపున, Drive నుండి ఫోల్డర్‌లు ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  5. "నా డ్రైవ్ సింకింగ్ ఆప్షన్‌ల" కింద, ఫైళ్లను స్ట్రీమ్ చేయండి ఆప్షన్‌ను ఎంచుకోండి.
  6. డెస్క్‌టాప్ Driveను మూసివేయండి.
  7. మిర్రర్ చేసే ఫోల్డర్‌ను తొలగించండి.

ముఖ్య గమనిక:

  • డేటా నష్టాన్ని నివారించడానికి, మీరు ఫోల్డర్‌లను తొలగించే లేదా తరలించే ముందు మీ ఫైళ్లు పూర్తిగా సింక్ చేయబడ్డాయని నిర్ధారించుకోండి.
  • Windowsలో, మీరు మీ కంప్యూటర్ నుండి మునుపు మిర్రర్ చేసిన నా డ్రైవ్ ఫైళ్ల తో ఉన్న ఫోల్డర్‌ను తీసివేయడానికి ముందు డెస్క్‌టాప్ Drive నుండి తప్పక నిష్క్రమించాలి.
మీరు స్ట్రీమింగ్ నుండి మిర్రరింగ్‌కు మారినప్పుడు
 
  • మీరు మారినప్పుడు, నా డ్రైవ్ ఫైళ్లు మీరు ఎంచుకున్న ఫోల్డర్‌కు డౌన్‌లోడ్ అవుతాయి. 
  • ఎంచుకున్న ఫోల్డర్‌లో ఇప్పటికే ఫైళ్లు ఉన్నట్లయితే, డెస్క్‌టాప్ Drive ఇప్పటికే క్లౌడ్‌లో ఉన్న ఫైళ్లను కాపీ చేయకుండా ఉండటానికి ట్రై చేస్తుంది. 
    • ఫైల్‌లోని కంటెంట్ క్లౌడ్‌లో ఉన్న దానికంటే భిన్నంగా ఉంటే, డెస్క్‌టాప్ Drive రెండింటినీ ఉంచుతుంది.
  • క్లౌడ్‌లో ఇప్పటికే లేని ఫైళ్లు అప్‌లోడ్ చేయబడతాయి.
  • మీ కొత్త నా డ్రైవ్ ఫోల్డర్‌కి షార్ట్‌కట్‌ను చూపడానికి Google Drive స్ట్రీమింగ్ లొకేషన్ అప్‌డేట్ అవుతుంది. 
  • షేర్ చేసిన డ్రైవ్‌లు, ఇతర కంప్యూటర్‌లు, బ్యాకప్ చేయబడిన USB పరికరాలు ఇప్పటికీ కనిపిస్తాయి, అలాగే ఇప్పటికీ స్ట్రీమ్ చేయడానికి వీలుగా ఉంటాయి.

స్ట్రీమింగ్ నుండి మిర్రరింగ్‌కు మారడానికి:

  1. డెస్క్‌టాప్ Driveను తెరవండి.
  2. సెట్టింగ్‌లు సెట్టింగ్‌లు ఆ తర్వాత ప్రాధాన్యతలు ఆప్షన్‌లను క్లిక్ చేయండి.
  3. ఎడమ వైపున, Drive నుండి ఫోల్డర్‌లు ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. "నా డ్రైవ్ సింకింగ్ ఆప్షన్‌ల" కింద, ఫైళ్లను మిర్రర్ చేయండి ఆప్షన్‌ను ఎంచుకోండి.
  5. డెస్క్‌టాప్ Driveను మూసివేయండి.
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
16289484753135106329
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
99950
false
false