Microsoft Office ఫైల్‌లతో పని చేయండి

మీరు కింది మార్గాలలో ఒకదానిలో Google డిస్క్, డాక్స్, షీట్‌లు, స్లయిడ్‌లను ఉపయోగించడం ద్వారా Microsoft Office ఫైల్‌లను ఎడిట్ చేయవచ్చు, వ్యాఖ్యానించవచ్చు, వాటిపై ఇతరులతో కలిసి పని చేయవచ్చు:

  • Microsoft Office ఫైల్‌లను Google డిస్క్‌లో తెరవండి, ఎడిట్ చేయండి, సేవ్ చేయండి
  • Microsoft Office ఫైల్‌లను Google డాక్స్, షీట్‌లు లేదా స్లయిడ్‌ల రూపంలో మార్పిడి చేయండి
  • Google డిస్క్ ప్రివ్యూలో Microsoft Office ఫైల్‌లపై వ్యాఖ్యానించండి
  • డిస్క్‌లోని Office ఫైల్‌లను Office అనుకూల మోడ్ Chrome ఎక్స్‌టెన్షన్‌తో ఎడిట్ చేయండి

Microsoft Office ఫైల్‌లను Google డిస్క్‌లో తెరవండి, ఎడిట్ చేయడి, దాని ఫార్మాట్‌లో సేవ్ చేయండి

మీరు Microsoft Office ఫైల్‌లను Google డిస్క్‌లో అప్‌లోడ్ చేసినప్పుడు, ఆ Microsoft Office ఫైల్‌లను నేరుగా Google డాక్స్, షీట్‌లు, స్లయిడ్‌లను ఉపయోగించి ఎడిట్ చేయగలరు, వ్యాఖ్యానించగలరు, వాటిపై ఇతరులతో కలిసి పని చేయగలరు. అన్ని మార్పులు ఆటోమేటిక్‌గా ఫైల్‌కు దాని అసలు Microsoft Office ఫార్మాట్‌లో సేవ్ అవుతాయి. Office ఎడిటింగ్‌ను ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి.

Microsoft Office ఫైల్‌లను Google డాక్స్, షీట్‌లు లేదా స్లయిడ్‌ల రూపంలో మార్పిడి చేయండి

మీరు యాడ్-ఆన్‌లు, Apps స్క్రిప్ట్‌లు, రక్షిత పరిధులు లేదా అనువాద ఎంపికలు ఉపయోగించాలనుకుంటే, Office ఫైల్‌ను Google డాక్స్, షీట్‌లు లేదా స్లయిడ్‌లు రూపంలోకి మార్చవచ్చు. మీరు మార్పిడి చేస్తున్నప్పుడు, మీ Microsoft Office ఫైల్ కాపీని రూపొందిస్తారు. Microsoft Office ఫైల్‌ను ఎలా మార్పిడి చేయాలో తెలుసుకోండి.

Google డిస్క్ ప్రివ్యూలో Microsoft Office ఫైల్‌లపై వ్యాఖ్యానించండి

మీరు Google డిస్క్ ప్రివ్యూలో అసలు ఫైల్‌కు ఎలాంటి మార్పులు చేయకుండా Microsoft Office ఫైల్‌లు, PDFలు, చిత్రాలు, ఇతర ఫైల్‌లలో వ్యాఖ్యానించవచ్చు, వాటిలోని వ్యాఖ్యలను చదవవచ్చు. Google డిస్క్‌లో ఈ ఫైల్‌లపై ఎలా వ్యాఖ్యానించాలో తెలుసుకోండి.

Microsoft Office ఫైల్‌లను Chrome ఎక్స్‌టెన్షన్‌తో ఉపయోగించండి

ముఖ్య విషయం: ఈ ఎక్స్‌టెన్షన్‌కు Office ఎడిటింగ్ మోడ్‌తో అనుకూలత సమస్యలు ఏర్పడవచ్చు. మీరు ఫైల్‌ను Office ఎడిటింగ్ మోడ్‌లో తెరిస్తే, ఈ ఎక్స్‌టెన్షన్‌ను డిజేబుల్ చేయాల్సి ఉంటుంది. Chrome ఎక్స్‌టెన్షన్‌ను ఎలా డిజేబుల్ చేయాలో తెలుసుకోండి. 

Microsoft Office అనుకూల మోడ్ అనేది ఒక Google Chrome బ్రౌజర్ ఎక్స్‌టెన్షన్. దీనిని ఉపయోగించి మీరు Microsoft Office ఫైల్‌లను తెరవగలరు, ఎడిట్ చేయగలరు.  Microsoft Office అనుకూల మోడ్‌తో ఎలా ఎడిట్ చేయాలో తెలుసుకోండి.

ఇది సహాయకరంగా ఉందా?
మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?