మీ నోటిఫికేషన్‌లను మేనేజ్ చేయండి

Google Docs, Drawings, Sheets, లేదా Slidesలో కామెంట్‌ల కోసం మీరు ఎంత తరచుగా ఈమెయిల్ నోటిఫికేషన్‌లను పొందాలి అనే దాన్ని మీరు మార్చవచ్చు. Google Docs, Sheetsలలో, మీరు ఎడిట్‌ల కోసం నోటిఫికేషన్ సెట్టింగ్‌లను కూడా మార్చవచ్చు. మీరు ఈమెయిల్ ద్వారా లేదా మీ బ్రౌజర్‌లో నోటిఫికేషన్‌లను పొందాలా అనే దాన్ని ఎంచుకోవచ్చు.

ముఖ్య గమనిక: నోటిఫికేషన్ సెట్టింగ్‌లకు మార్పులు అనేవి మీరు ఉన్న ఫైల్‌కు మాత్రమే వర్తిస్తాయి.

కామెంట్‌లకు సంబంధించిన నోటిఫికేషన్‌లను మేనేజ్ చేయండి

  1. మీ కంప్యూటర్‌లో, డాక్యుమెంట్, డ్రాయింగ్, స్ప్రెడ్‌షీట్, లేదా ప్రెజెంటేషన్‌ను తెరవండి.
  2. మీరు వీటిలో ఏదో ఒక దాన్ని చేయవచ్చు:
    • టూల్స్ ఆ తర్వాత నోటిఫికేషన్ సెట్టింగ్‌లకు వెళ్లండి.
    • ఫైల్ ఎగువ కుడి మూలన, కామెంట్ హిస్టరీని తెరవండి కామెంట్ని క్లిక్ చేయండి ఆ తర్వాత నోటిఫికేషన్ సెట్టింగ్‌లు అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. “కామెంట్‌ల” కింద, మీరు నోటిఫికేషన్‌లను ఎప్పుడు పొందాలనుకుంటున్నారో ఎంచుకోండి:
    • అన్ని కామెంట్‌లు: అన్ని కొత్త కామెంట్‌ల గురించి మీకు తెలియజేయబడుతుంది.
    • మీకు సంబంధించిన కామెంట్‌లు: మీకు సంబంధించిన @ప్రస్తావనలు, థ్రెడ్‌ల గురించి మీకు తెలియజేయబడుతుంది.
    • ఏ నోటిఫికేషన్‌లు వద్దు: ఆ ఫైల్‌కు సంబంధించిన కామెంట్‌ల గురించి ఎప్పుడూ ఈమెయిల్స్ పొందరు.

చిట్కా: మీరు ఈమెయిల్ నోటిఫికేషన్‌ల నుండి కూడా నేరుగా మీ నోటిఫికేషన్ సెట్టింగ్‌లను మార్చవచ్చు. మీరు కామెంట్‌లకు సంబంధించిన ఈమెయిల్ నోటిఫికేషన్‌ను అందుకున్నప్పుడు, ఈమెయిల్‌లోని నోటిఫికేషన్ సెట్టింగ్‌లను క్లిక్ చేయండి. “కామెంట్‌ల” పక్కన, మీరు ఆ ఫైల్ కోసం మీ ప్రాధాన్యతలను అప్‌డేట్ చేయవచ్చు.

ఎడిట్‌లకు సంబంధించిన నోటిఫికేషన్‌లను మేనేజ్ చేయండి 

Google Docs, Sheetsలోని ఫైళ్లలో, ఇతరులు మార్పులు చేసినప్పుడు నోటిఫికేషన్‌లను పొందడానికి మీరు సెట్టింగ్‌లను మార్చవచ్చు.

Google Docsలో

మీరు మీ డాక్యుమెంట్‌లో మార్పులు చేసినప్పుడు మీకు నోటిఫికేషన్‌లు రావు, కానీ ఎవరైనా కంటెంట్‌ను జోడించినప్పుడు లేదా తీసివేసినప్పుడు మీరు నోటిఫికేషన్‌లను పొందుతారు.

  1. మీ కంప్యూటర్‌లో, Google డాక్‌ను తెరవండి.
  2. మీరు వీటిలో ఏదో ఒక దాన్ని చేయవచ్చు:
    • టూల్స్ ఆ తర్వాత నోటిఫికేషన్ సెట్టింగ్‌లకు వెళ్లండి.
    • ఫైల్ ఎగువ కుడి మూలన, కామెంట్ హిస్టరీని తెరవండి కామెంట్ని క్లిక్ చేయండి ఆ తర్వాత నోటిఫికేషన్ సెట్టింగ్‌లు అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. “ఎడిట్‌ల” కింద, మీరు నోటిఫికేషన్‌లను ఎప్పుడు పొందాలనుకుంటున్నారో ఎంచుకోండి:
    • కంటెంట్‌ను జోడించినప్పుడు లేదా తీసివేసినప్పుడు: ఎవరైనా ఆ ఫైల్‌లో కంటెంట్‌ను జోడించినా లేదా తీసివేసినా మీకు తెలియజేయబడుతుంది.
    • ఏ నోటిఫికేషన్‌లు వద్దు: ఆ ఫైల్‌కు సంబంధించిన ఎడిట్‌ల గురించి ఎప్పుడూ ఈమెయిల్స్ పొందరు.

చిట్కాలు:

  • మీరు ఈమెయిల్ నోటిఫికేషన్‌ల నుండి కూడా నేరుగా మీ నోటిఫికేషన్ సెట్టింగ్‌లను మార్చవచ్చు. మీరు కామెంట్‌లకు లేదా ఎడిట్‌లకు సంబంధించిన ఈమెయిల్ నోటిఫికేషన్‌ను అందుకున్నప్పుడు, ఈమెయిల్‌లోని నోటిఫికేషన్ సెట్టింగ్‌లను క్లిక్ చేయండి. “ఎడిట్‌ల” పక్కన, మీరు ఆ ఫైల్ కోసం మీ ప్రాధాన్యతలను అప్‌డేట్ చేయవచ్చు.
  • చాలా ఎడిట్‌లు ఉన్నట్లయితే లేదా డాక్యుమెంట్ చాలా పెద్దదిగా ఉంటే, ఈమెయిల్ నోటిఫికేషన్‌లు అన్ని మార్పులను ప్రదర్శించకపోవచ్చు. అన్నింటిని కనుగొనడానికి, డాక్యుమెంట్‌ను తెరవండి.

Google Sheetsలో

మీరు మీ కోసం మాత్రమే నోటిఫికేషన్‌లను సెటప్ చేయగలరు. మీరు మీ స్ప్రెడ్‌షీట్‌లో మార్పులు చేసినప్పుడు నోటిఫికేషన్‌లు పొందరు, కానీ ఇతరులు మార్పులు చేసినప్పుడు నోటిఫికేషన్‌లు పొందుతారు.

  1.  మీ కంప్యూటర్‌లో, Google Sheetsలో స్ప్రెడ్‌షీట్‌ను తెరవండి.
  2. ఎగువున, టూల్స్ ఆ తర్వాత నోటిఫికేషన్ సెట్టింగ్‌లు ఆ తర్వాత నోటిఫికేషన్‌లను ఎడిట్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. కనిపించే విండోలో, మీరు నోటిఫికేషన్‌లు "ఎప్పుడు" పొందాలనుకుంటున్నారో ఎంచుకోండి. ఇలాంటప్పుడు మీకు నోటిఫికేషన్ అందుతుంది:
    • ఏవైనా మార్పులు చేసినప్పుడు: ఎవరైనా స్ప్రెడ్‌షీట్‌కి మార్పులు చేసినప్పుడు నోటిఫికేషన్‌లు వచ్చేలా సెట్ చేయండి.
    • యూజర్ ఫారమ్‌ను సమర్పించినప్పుడు: ఎవరైనా ఫారమ్‌ను పూరించినప్పుడు నోటిఫికేషన్‌లు వచ్చేలా సెట్ చేయండి.
  4. కనిపించే విండోలో, మీరు "ఎంత తరచుగా" నోటిఫికేషన్‌లను పొందాలనుకుంటున్నారో ఎంచుకోండి. వీటితో మీకు నోటిఫికేషన్ అందుతుంది:
    • ఇమెయిల్ - రోజువారీ డైజెస్ట్: అన్ని మార్పులకు సంబంధించి రోజువారీ సారాంశాన్ని పంపుతుంది.
    • ఈమెయిల్ - వెంటనే: ప్రతి మార్పుకు సంబంధించి ఈమెయిల్ పంపబడుతుంది.
  5. సేవ్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

Google Sheetsలో ఎవరు మార్పులు చేస్తున్నారో చూడండి

స్ప్రెడ్‌షీట్‌కి మీకున్న యాక్సెస్ స్థాయి ఆధారంగా, మీరు మీ స్ప్రెడ్‌షీట్‌కి ఎవరు మార్పులు చేస్తున్నారో చూడగలరు.

  • మీరు ఎడిటర్ అయితే: మార్పులు చేసే వ్యక్తుల యూజర్‌నేమ్‌లను మీరు చూడగలరు.
  • మీరు వీక్షకులు అయితే: మీరు నోటిఫికేషన్‌లను సెట్ చేయగలరు కానీ యూజర్‌నేమ్‌లను చూడలేరు.

మీరు మరింత నిర్దిష్ట నోటిఫికేషన్ నియమాలను సెట్ చేయాలనుకుంటే, ఉదాహరణకు ఎవరైనా నిర్దిష్ట సెల్‌ల పరిధిని సవరించినప్పుడు, Apps స్క్రిప్ట్‌ని ఉపయోగించండి.

సంబంధిత ఆర్టికల్స్

 

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
1334985004468620043
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
35
false
false