డాక్స్ ఎడిటర్‌లకు యాక్సెసిబిలిటీ

Google డాక్స్ ఎడిటర్‌లు అనేవి స్క్రీన్ రీడర్‌లు, బ్రెయిలీ పరికరాలు, స్క్రీన్ మాగ్నిఫికేషన్ మరియు మరెన్నో అంశాలతో కలిసి పని చేయడానికి రూపొందించబడ్డాయి.

స్క్రీన్ రీడర్‌ను ఉపయోగించడం

మీరు ఇప్పటికే మీ కంప్యూటర్‌లో ChromeVox, NVDA, JAWS లేదా VoiceOver వంటి స్క్రీన్ రీడర్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నట్లయితే, డాక్స్ ఎడిటర్‌లతో ప్రారంభించడానికి ఈ కింది దశలను అనుసరించండి.

1వ దశ: Docs స్క్రీన్ రీడర్ సపోర్ట్‌ను ఆన్ చేయండి

మీరు డాక్స్ ఎడిటర్‌లను స్క్రీన్ రీడర్‌తో మొదటిసారి ఉపయోగించేటప్పుడు, మీరు తప్పనిసరిగా డాక్స్ స్క్రీన్ రీడర్ మద్దతును ఆన్ చేయాలి:

 1. Google డాక్స్కు వెళ్లి, ఒక డాక్యుమెంట్‌ను తెరవండి. 
 2. సాధనాల మెనులో, యాక్సెసిబిలిటీ సెట్టింగ్‌లు ఎంచుకోండి. 
 3. స్క్రీన్ రీడర్ మద్దతును ఆన్ చేయి ఎంచుకోండి.

ఐచ్ఛికం: Google ఖాతాలో, యాక్సెసిబిలిటీ సెట్టింగ్‌లును సందర్శించి, స్క్రీన్ రీడర్ను ఆన్ చేయండి. 

2వ దశ: మీ స్క్రీన్ రీడర్ సెట్టింగులను తనిఖీ చేయండి

కొన్ని స్క్రీన్ రీడర్‌ల కోసం, మీరు డాక్స్ ఎడిటర్‌లను ఉపయోగించేటప్పుడు మీ సెట్టింగులను సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది. కింద మీ స్క్రీన్ రీడర్ సూచనలను తనిఖీ చేయండి.

ChromeVox

మీరు ChromeVoxను Chrome OSలో ఉపయోగిస్తుంటే, మీరు డాక్స్ ఎడిటర్‌లను ఉపయోగించడానికి అదనపు సెటప్ ఏదీ చేయాల్సిన అవసరం లేదు.

NVDA

Windowsలో ఉత్తమ అనుభవం పోందడానికి, Chrome లేదా Firefox యొక్క తాజా వెర్షన్‌తో పాటు NVDA యొక్క తాజా వెర్షన్‌ను ఉపయోగించండి.

Docs, Slides, Drawings

 1. Google డాక్స్కు వెళ్లి, ఒక డాక్యుమెంట్‌ను తెరవండి.
 2. ఈ మాటల కోసం వినండి: "స్క్రీన్ రీడర్ మద్దతు ప్రారంభించబడింది." మీకు ఏమీ వినిపించకపోతే, సాధనాల మెనుకు వెళ్లి, యాక్సెసిబిలిటీ సెట్టింగ్‌లు ఎంచుకుని, ఆపై స్క్రీన్ రీడర్ మద్దతును ఆన్ చేయి ఎంచుకోండి. మీకు "స్క్రీన్ రీడర్ మద్దతు ప్రారంభించబడింది" అని వినిపించాలి.
 3. NVDA + Ctrl + kను నొక్కి, టైప్ చేసిన అక్షరాలను చదువు మరియు టైప్ చేసిన పదాలను చదువును ఆఫ్ చేయండి.
 4. ఐచ్ఛికం: మీ NVDA ప్రారంభ కీ‌బోర్డ్‌ షార్ట్‌కట్‌ను మార్చుకోండి, తద్వారా అది డాక్స్ ఎడిటర్‌లతో విభేదించదు. డిఫాల్ట్ NVDA కీ‌బోర్డ్‌ షార్ట్‌కట్, Ctrl + Alt + nను సాధారణంగా డాక్స్ ఎడిటర్‌లలో ఉపయోగిస్తారు (ఉదాహరణకు, Ctrl + Alt + n ఆపై gను నొక్కితే, డాక్యుమెంట్‌లోని తర్వాతి చిత్రానికి నావిగేట్ చేస్తుంది). మీ NVDA కీ‌బోర్డ్‌ షార్ట్‌కట్‌ను మార్చుకోవడానికి, NVDA షార్ట్‌కట్ నుండి లక్షణాలు తెరవండి. షార్ట్‌కట్ ట్యాబ్‌లో, షార్ట్‌కట్ కీను సవరించండి తద్వారా అది డాక్స్ ఎడిటర్‌లతో విభేదించదు (ఉదాహరణకు, Ctrl + Alt + \).

షీట్‌లు మరియు ఫారమ్‌లు

షీట్‌లు లేదా ఫారమ్‌లలో ప్రారంభించడానికి, పైన 1వ దశలో వివరించిన విధంగా స్క్రీన్ రీడర్ మద్దతును ప్రారంభించండి. 

చిట్కా: సాధారణంగా ఫోకస్ మోడ్ అనేది బ్రౌజ్ మోడ్ కంటే మంచి అనుభవాన్ని అందిస్తుంది. ఫోకస్ మరియు బ్రౌజ్ మోడ్‌ల మధ్య మారడానికి, NVDA + Spacebarను నొక్కండి.

JAWS

Windowsలో ఉత్తమ అనుభవం పోందడానికి, Chrome లేదా Firefox యొక్క తాజా వెర్షన్‌తో పాటు JAWS యొక్క తాజా వెర్షన్‌ను ఉపయోగించండి.

Docs, Slides, Drawings

డాక్స్, స్లయిడ్‌లు మరియు డ్రాయింగ్‌ల కోసం, మీ JAWS సెట్టింగ్‌లను సర్దుబాటు చేయడానికి ఈ దశలను అనుసరించండి:

 1. Google డాక్స్కు వెళ్లి, ఒక డాక్యుమెంట్‌ను తెరవండి.
 2. ఈ మాటల కోసం వినండి: "స్క్రీన్ రీడర్ మద్దతు ప్రారంభించబడింది." మీకు ఏమీ వినిపించకపోతే, సాధనాల మెనుకు వెళ్లి, యాక్సెసిబిలిటీ సెట్టింగ్‌లు ఎంచుకుని, ఆపై స్క్రీన్ రీడర్ మద్దతును ఆన్ చేయి ఎంచుకోండి. మీకు "స్క్రీన్ రీడర్ మద్దతు ప్రారంభించబడింది" అని వినిపించాలి.
 3. మీరు Firefoxని ఉపయోగిస్తే:
  • కీ ఎకోయింగ్‌ను, ఎకోయింగ్‌ వద్దని సెట్ చేయండి: మీకు "ఏమీలేదు" అని వినిపించే వరకు JAWS + 2 నొక్కండి.
  • వర్చువల్ కర్సర్‌ను ఆపివేయండి: మీకు "వర్చువల్ PC కర్సర్‌ ఆఫ్" ఉపయోగించండి అని వినిపించే వరకు JAWS + z నొక్కండి. ఆపై "వర్చువల్ కర్సర్ అన్ని యాప్‌ల కోసం ఆపివేయబడుతుంది" అని వినిపించే వరకు JAWS + z + z నొక్కండి.
  • ఫారమ్‌ల ఎంపికలను సర్దుబాటు చేయండి: ఫోకస్ ఎగువ టూల్‌బార్‌పై ఉందని నిర్ధారించుకుని, ఆపై JAWS + v నొక్కండి. సెట్టింగ్‌ల విండోలో, "ఫారమ్‌ల ఎంపికలు" కోసం వెతికి, "ఆటో ఫారమ్‌ల మోడ్" మరియు "కొత్త పేజీ లోడ్ అయినప్పుడు ఫారమ్‌ల మోడ్ ఆఫ్ అవుతుంది" అనే రెండు ఎంపికలను తీసివేయండి. ఆపై సరే నొక్కండి.
  • అప్లికేషన్ మోడ్ ప్రకటించబడింది అని మీకు వినిపించేంత వరకు Docs Toolbar నియంత్రణల గుండా అడ్రస్ బార్ నుండి ట్యాబ్ చేస్తూనే ఉండండి, ఆపై ఎడిట్ చేసే ప్రాంతానికి తిరిగి రావడానికి Escapeను నొక్కండి.

Sheets, Forms

షీట్‌లు లేదా ఫారమ్‌లలో ప్రారంభించడానికి, పైన 1వ దశలో వివరించిన విధంగా స్క్రీన్ రీడర్ మద్దతును ప్రారంభించండి.

చిట్కా: సాధారణంగా ఫారమ్‌ల మోడ్ అనేది వర్చువల్ మోడ్ కంటే మంచి అనుభవాన్ని అందిస్తుంది.

వాయిస్ఓవర్

Google డాక్స్ ఎడిటర్‌లు macOS తాజా వెర్షన్ వాయిస్‌ఓవర్‌కి అనుకూలంగా ఉంటాయి. సిఫార్సు చేయబడిన బ్రౌజర్ Google Chrome.

మంచి అనుభవం కోసం, ఒకే సమయంలో ఎడమ మరియు కుడి బాణాలను నొక్కడం ద్వారా వాయిస్‌ఓవర్ యొక్క త్వరిత నావిగేషన్ ఫీచర్‌ని ఆపివేయండి.

Docs, Slides, చిత్రలేఖనాలు

 1. Google డాక్స్కు వెళ్లి, ఒక డాక్యుమెంట్‌ను తెరవండి.
 2. ఈ మాటల కోసం వినండి: "స్క్రీన్ రీడర్ మద్దతు ప్రారంభించబడింది." మీకు ఏమీ వినిపించకపోతే, సాధనాల మెనుకు వెళ్లి, యాక్సెసిబిలిటీ సెట్టింగ్‌లు ఎంచుకుని, ఆపై స్క్రీన్ రీడర్ మద్దతును ఆన్ చేయి ఎంచుకోండి. మీకు "స్క్రీన్ రీడర్ మద్దతు ప్రారంభించబడింది" అని వినిపించాలి.
 3. మీరు వాయిస్‌ఓవర్‌లో "వెబ్‌పేజీని ఆటోమేటిక్‌గా చదివి వినిపించు" ఆన్ చేసి ఉంటే, మీకు స్క్రీన్ రీడర్ చదివి వినిపిస్తుంది. మీ ఫోకస్‌ను తిరిగి ఎడిటింగ్ ప్రాంతంపై ఉంచడానికి Escape నొక్కండి.
 4. ఎడిట్ చేయదగిన వచనంతో పరస్పర చర్య జరపడానికి వాయిస్ఓవర్ + Shift + కిందకు ఉన్న బాణం నొక్కండి.

షీట్‌లు మరియు ఫారమ్‌లు

షీట్‌లు లేదా ఫారమ్‌లలో ప్రారంభించడానికి, పైన 1వ దశలో వివరించిన విధంగా స్క్రీన్ రీడర్ మద్దతును ప్రారంభించండి.

కీ‌బోర్డ్‌ షార్ట్‌కట్‌లు మరియు వాయిస్ఓవర్

వాయిస్ఓవర్ షార్ట్‌కట్‌లు డాక్స్ ఎడిటర్‌ల మెను షార్ట్‌కట్‌లతో విభేదిస్తాయి. డాక్స్ మెనూలను తెరవడానికి, ముందుగా వాయిస్ఓవర్ పాస్-త్రూ కీలు Ctrl + Option + Tabను ఉపయోగించి, ఆపై డాక్స్ మెను షార్ట్‌కట్‌ని టైప్‌ చేయండి, అవి ఫైల్ మెను కోసం Ctrl + Option + f వంటివి. మీరు Option + / నొక్కడం ద్వారా మెనూలను త్వరగా శోధించి, ఆపై ఫైల్ వంటి పదం కోసం శోధించండి.

ఒకవేళ వాయిస్ఓవర్ పేజీ యొక్క సరైన భాగంపై ఆటోమేటిక్‌గా దృష్టి పెట్టకపోతే (ఉదాహరణకు, డైలాగ్ విండో కనిపిస్తే), మీ ఫోకస్‌ను తిరిగి ఎడిటింగ్ ప్రాంతంపై ఉంచడానికి Escape నొక్కండి. తిరిగి ఎడిట్ చేయదగిన ప్రాంతానికి రావడానికి వాయిస్ఓవర్ + Shift + కిందకు ఉన్న బాణం నొక్కండి.

3వ దశ: ఎడిట్ చేయడం ప్రారంభించండి

ఈ కింది సహాయక పేజీలు మరియు వీడియోల ద్వారా స్క్రీన్ రీడర్‌తో డాక్స్ ఎడిటర్‌లను ఉపయోగించడం గురించి మరింత తెలుసుకోండి.

గమనిక: డాక్స్, షీట్‌లు, స్లయిడ్‌లలో మీరు ఫైల్‌లోకి ప్రవేశిస్తున్న, సవరిస్తున్న లేదా నిష్క్రమిస్తున్న ఇతర వ్యక్తుల గురించి వచ్చే స్క్రీన్ రీడర్ ప్రకటనలను ఆపివేయవచ్చు. సహకారి ప్రకటనలను ఆఫ్ చేయడం ఎలాగో తెలుసుకోండి.

వీడియో ట్యుటోరియల్స్

డాక్స్, షీట్‌లు, స్లయిడ్‌ల కోసం స్క్రీన్ రీడర్ వీడియోలు

Get started with Google Docs (18.9 minutes)

In this video, you’ll learn how to get started with Google Docs, using NVDA with Firefox.

మీరు ఈ వీడియోలో Firefoxతో NVDAని ఉపయోగిస్తూ Google డాక్స్‌ని ఎలా ప్రారంభించాలి అనేది నేర్చుకుంటారు.

 

Get started with Google Sheets (26.3 minutes)

In this video, you’ll learn how to get started with Google Sheets, using NVDA with Firefox.

మీరు ఈ వీడియోలో Firefoxతో NVDAని ఉపయోగిస్తూ Google షీట్‌లని ఎలా ప్రారంభించాలి అనేది నేర్చుకుంటారు.

 

Get started with Google Slides (16 minutes)

In this video, you’ll learn how to get started with Google Slides, using NVDA with Firefox.

మీరు ఈ వీడియోలో Firefoxతో NVDAని ఉపయోగిస్తూ Google స్లయిడ్‌లని ఎలా ప్రారంభించాలి అనేది నేర్చుకుంటారు.

 

బ్రెయిలీ డిస్‌ప్లేను ఉపయోగించండి

మీరు డాక్యుమెంట్‌లు, స్ప్రెడ్‌షీట్‌లు, ప్రెజెంటేషన్‌లు మరియు డ్రాయింగ్‌లను చదవడానికి మరియు ఎడిట్ చేయడానికి బ్రెయిలీ డిస్‌ప్లేను ఉపయోగించవచ్చు

స్క్రీన్ మాగ్నిఫైయర్ ఉపయోగించండి

మీరు డాక్స్ ఎడిటర్‌లతో స్క్రీన్ మాగ్నిఫికేషన్‌ను ఉపయోగించి, దగ్గరగా జూమ్ చేసి మీ స్క్రీన్‌లో ప్రతిదీ పెద్దదిగా చేసుకోవచ్చు.

గమనిక: ఈ ఎంపిక Mac మరియు Chrome OSలో అందుబాటులో ఉంది.

 1. Chromeలో డాక్యుమెంట్, స్ప్రెడ్‌షీట్, ప్రెజెంటేషన్ లేదా డ్రాయింగ్‌ను తెరవండి. 
 2. సాధనాల మెనులో, యాక్సెసిబిలిటీ సెట్టింగ్‌లు ఎంచుకోండి.
 3. స్క్రీన్ మాగ్నిఫైయర్ మద్దతును ఆన్ చేయండి ఎంచుకోండి.
 4. అవసరమైతే, మీ కంప్యూటర్‌లో సెట్టింగ్‌లను సర్దుబాటు చేసుకోండి:
  • Mac: సిస్టమ్ ప్రాధాన్యతలు ఆ తర్వాత యాక్సెసిబిలిటీ ఆ తర్వాత జూమ్ చేయి ఎంపికకు వెళ్లండి. జూమ్ కీబోర్డ్ ఫోకస్‌ను అనుసరిస్తుంది ఆన్ చేయండి.
  • Chrome OS: సెట్టింగ్‌లు ఆ తర్వాత అధునాతనం ఆ తర్వాత యాక్సెసిబిలిటీ ఆ తర్వాత యాక్సెస్ సౌలభ్య ఫీచర్‌లను నిర్వహించు ఎంపికకు వెళ్లండి. పూర్తి స్క్రీన్‌ మ్యాగ్నిఫైయర్‌ని ఎనేబుల్ చేయి  లేదా డాక్ చేయబడిన మ్యాగ్నిఫైయర్‌ని ఎనేబుల్ చేయి ఆన్ చేయండి. Chromebook మాగ్నిఫికేషన్గురించి తెలుసుకోండి.

మీ వాయిస్‌తో టైప్ చేయండి

మీరు డాక్యుమెంట్‌లు లేదా ప్రెజెంటేషన్ స్పీకర్ గమనికలలో మీ వాయిస్‌తో టైప్ చేయవచ్చు. (ఈ ఫీచర్ Chrome బ్రౌజర్‌లలో మాత్రమే అందుబాటులో ఉంది.)

కీబోర్డ్ షార్ట్‌కట్‌లను ఉపయోగించండి

డాక్స్ ఎడిటర్‌లలో నావిగేషన్ మరియు ఎడిటింగ్ కోసం కీబోర్డ్ షార్ట్‌కట్‌లు ఉన్నాయి. 

మీరు ఏదైనా ఫైల్‌ను ఎడిట్ చేసేటప్పుడు కీ‌బోర్డ్‌ షార్ట్‌కట్‌ల జాబితాను తెరవడానికి, (Windows, Chrome OSలో అయితే) Ctrl + / లేదా (Macలో అయితే ) ⌘ + / నొక్కండి.

మరిన్ని కీబోర్డ్ షార్ట్‌కట్‌లు:

స్క్రీన్ రీడర్‌తో టచ్ ఇన్‌పుట్‌ని ఉపయోగించండి

కొన్ని కంప్యూటర్‌లు మరియు స్క్రీన్ రీడర్‌లలో, కర్సర్‌ను తరలించడానికి మరియు వచనాన్ని నమోదు చేయడానికి మీరు కంప్యూటర్ స్క్రీన్‌ను తాకవచ్చు. 

టచ్ ఇన్‌పుట్ ఈ కింది స్క్రీన్ రీడర్‌లు మరియు బ్రౌజర్‌లను ఉపయోగించి డాక్స్, షీట్‌లు మరియు స్లయిడ్‌లలో పనిచేస్తుంది:

 • Chromebooksలో, Chrome 67 లేదా తర్వాతి వెర్షన్‌తో ChromeVox స్క్రీన్ రీడర్‌ను ఉపయోగించండి.
 • Windowsలో, Firefoxతో JAWS స్క్రీన్ రీడర్‌ను లేదా Chrome తాజా వెర్షన్‌ను ఉపయోగించండి.

ChromeVoxతో టచ్ ఇన్‌పుట్

Chromebookలో ChromeVoxతో టచ్ ఇన్‌పుట్‌ని ఉపయోగించడానికి: 

 1. ఈ సెట్టింగ్‌ల కోసం మీ Chromebook యాక్సెస్ సౌలభ్య ఫీచర్‌లను తనిఖీ చేయండి:
  • వినడానికి ఎంచుకోండి ఎనేబుల్ చేయి ఆఫ్ చేయండి.
  • స్క్రీన్‌పై కీబోర్డ్ ఎనేబుల్ చేయిని ఆన్ చేయండి.
 2. డాక్యుమెంట్, స్ప్రెడ్‌షీట్ లేదా ప్రెజెంటేషన్‌ను తెరవండి.
 3. సాధనాల మెనులో, యాక్సెసిబిలిటీ సెట్టింగ్‌లు ఎంచుకోండి.
 4. బ్రెయిలీ మద్దతును ఆన్ చేయి ఎంచుకోండి.
 5. సవరణ ప్రాంతంలో, స్క్రీన్‌పై కీబోర్డ్ ఉపయోగించండి. 
 6. సవరణ ప్రాంతానికి వెలుపల, మీరు స్క్రీన్‌ని మామూలుగా ఎలా అయితే స్వైప్ చేసి టచ్ చేస్తారో అలానే చేయండి. Chromebook టచ్ స్క్రీన్ యాక్సెస్ సామర్ధ్యం ఉపయోగించడం గురించి తెలుసుకోండి.

JAWSతో టచ్ ఇన్‌పుట్

Firefox లేదా Chrome తాజా వెర్షన్‌తో Windowsలో JAWSతో టచ్ ఇన్‌పుట్‌ను ఉపయోగించడానికి:

 1. డాక్యుమెంట్, స్ప్రెడ్‌షీట్ లేదా ప్రెజెంటేషన్‌ను తెరవండి.
 2. సాధనాల మెనులో, యాక్సెసిబిలిటీ సెట్టింగ్‌లు ఎంచుకోండి.
 3. బ్రెయిలీ మద్దతును ఆన్ చేయి ఎంచుకోండి.
 4. ఎడిట్ చేసే ప్రాంతంలో , JAWS వచన పఠన మోడ్‌ను ఉపయోగించండి. 
  • టచ్ మోడ్‌ల నుండి వచన పఠన మోడ్‌కు పునరావృతం చేయడానికి, రెండు వేళ్లతో తిప్పే భ్రమణ సంజ్ఞను ఉపయోగించండి. JAWS టచ్ సపోర్ట్ గురించి తెలుసుకోండి.
 5. ఫోకస్‌ను యాప్ మెనూల పైకి తరలించడానికి, స్క్రీన్ ఎగువన రెండుసార్లు నొక్కండి. మూడు వేళ్లతో స్వైప్ చేయండి లేదా నావిగేట్ చేయడానికి తాకడం ద్వారా విశ్లేషణ చేయండి.

 

ఇది సహాయకరంగా ఉందా?
మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయి
శోధనను మూసివేయి
Google యాప్‌లు
ప్రధాన మెనూ
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
35
false