మీ డాక్యుమెంట్ లేదా ప్రెజెంటేషన్‌ని మరింత యాక్సెస్‌బుల్ చేయండి

మీరొక డాక్యుమెంట్ లేదా ప్రెజెంటేషన్‌ని సృష్టించేటప్పుడు, వైకల్యాలున్న వ్యక్తులతో సహా ప్రతి ఒక్కరూ మరింత బాగా చదవగలిగేలా చేయడానికి ఈ కింది చిట్కాలను అనుసరించండి.

ప్రత్యామ్నాయ వచనాన్ని చేర్చు

చిత్రాలు, డ్రాయింగ్‌లు మరియు ఇతర గ్రాఫిక్స్ కోసం ప్రత్యామ్నాయ వచనాన్ని చేర్చండి. లేకుంటే, స్క్రీన్ రీడర్ వినియోగదారులు కేవలం "చిత్రం" అని వింటారు. కొన్ని చిత్రాలు ప్రత్యామ్నాయ వచనాన్ని ఆటోమేటిక్‌గా చేర్చుకుంటాయి, కాబట్టి అది మీకు కావాల్సిన ఆటోమేటిక్‌ ప్రత్యామ్నాయ వచనమో కాదో తనిఖీ చేయడానికి ఇదొక మంచి ఆలోచన.

ప్రత్యామ్నాయ వచనాన్ని జోడించండి లేదా సవరించండి

  1. చిత్రం, డ్రాయింగ్ లేదా గ్రాఫిక్‌ని ఎంచుకోండి.
  2. కుడి క్లిక్ చేసి ఆ తర్వాత ప్రత్యామ్నాయ వచనం ఎంచుకోండి.
  3. శీర్షికను మరియు వివరణను నమోదు చేయండి.
  4. సరే క్లిక్ చేయండి.

డేటా కోసం పట్టికలను ఉపయోగించండి

పట్టికలను పేజీ యొక్క దృశ్య లేఅవుట్‌ను మార్చడం కోసం కాకుండా డేటాను ప్రదర్శించడానికి ఉపయోగించండి. స్క్రీన్ రీడర్‌లు మొదటి వరుసను ఆటోమేటిక్‌గా శీర్షిక వరుసగా చదువుతాయి కాబట్టి పట్టికలో, (మొదటి వరుసలోనే డేటాను చేర్చకుండా) ఒక శీర్షిక వరుసను చేర్చండి. 

వ్యాఖ్యలు మరియు సూచనలను ఉపయోగించండి

మీ డాక్యుమెంట్ లేదా ప్రెజెంటేషన్‌ వచనంలోనే గమనికలను రాయడానికి బదులుగా వ్యాఖ్యానం మరియు సూచన మోడ్‌ ఫీచర్‌లను ఉపయోగించండి. స్క్రీన్ రీడర్ యూజర్‌లు వ్యాఖ్యలకు వెళ్ళడానికి మీ ఫైల్‌ను వెతక్కకుండా నేరుగా కీ‌బోర్డ్‌ షార్ట్‌కట్‌లను ఉపయోగించవచ్చు. ఫైల్ యజమాని కూడా ఇమెయిల్ నోటిఫికేషన్‌లను స్వీకరించగలరు లేదా వ్యాఖ్య థ్రెడ్‌లను సమీక్షించగలరు.

అధిక రంగు కాంట్రాస్ట్ కోసం తనిఖీ చేయండి

అధిక రంగు కాంట్రాస్ట్ వచనాలు మరియు చిత్రాలను చదవడాన్ని మరియు గ్రహించడాన్ని సులభతరం చేస్తుంది. వెబ్ కంటెంట్ యాక్సెసిబిలిటీ మార్గదర్శకాలు (WCAG) 2.0 పెద్ద వచనాల కోసం కనిష్ట నిష్పత్తి 4.5:1గా మరియు ఇతర వచనాలు మరియు చిత్రాల కోసం 7:1గా సిఫార్సు చేయబడింది. ఉదాహరణకు, తెలుపు బ్యాక్‌గ్రౌండ్‌లో లేత బూడిద రంగు వచనాలను నివారించండి.

కాంట్రాస్ట్‌ను తనిఖీ చేయడానికి, WebAIM కాంట్రాస్ట్ చెకర్ని ఉపయోగించండి.

సమాచారాత్మక లింక్ వచనాన్ని ఉపయోగించండి

స్క్రీన్ రీడర్‌లు లింక్‌ల కోసం స్కాన్ చేయగలవు, కాబట్టి సమాచారాత్మక లింక్ వచనం సహాయపడుతుంది. పేజీ యొక్క శీర్షికను లింక్ చేయబడ్డ వచనంగా ఉపయోగించడం ఉత్తమం. ఉదాహరణకు, మీరు మీ ప్రొఫైల్ పేజీకి లింక్ చేస్తుంటే, లింక్ వచనం "నా ప్రొఫైల్" అని చెప్పాలి కాని "ఇక్కడ క్లిక్ చేయండి" లేదా పూర్తి URL ఇవ్వండి అని చెప్పకూడదు.

వచన పరిమాణం మరియు అమరికను తనిఖీ చేయండి

మీ డాక్యుమెంట్ లేదా ప్రెజెంటేషన్‌ని సులభంగా చదవగలిగేలా చేయడానికి, వీలైనంత మేరకు ఎడమకు అమర్చిన పెద్ద వచనాలను ఉపయోగించండి. పదాల మధ్య అదనపు స్థలం ఉండడం వల్ల సర్దుబాటు చేసిన వచనాలను చదవడం చాలా కష్టం. అమరికను మార్చడానికి, (Windows లేదా Chrome OSలో) Ctrl + Shift + L నొక్కండి లేదా (Macలో అయితే) ⌘ + Shift + L నొక్కండి.

ఫార్మాటింగ్‌కు మద్దతు ఇవ్వడానికి వచనాన్ని ఉపయోగించండి

అర్ధాన్ని వ్యక్తపరచడానికి కేవలం దృశ్య ఫార్మాటింగ్‌ పైనే ఆడరపడకుండా ఉండడం మంచిది. స్క్రీన్ రీడర్‌లు బోల్డ్‌ఫేస్ లేదా హైలైటింగ్ వంటి ఫార్మాటింగ్‌ మార్పులను ప్రకటించకపోవచ్చు.

ఉదాహరణకు, వచనంలోని ముఖ్యమైన విభాగాన్ని గుర్తించడానికి, "ముఖ్యమైనది" అనే పదాన్ని జోడించండి.

సంఖ్యా మరియు బుల్లెట్ జాబితాలను ఉపయోగించండి

Google డాక్స్ మరియు Google స్లయిడ్‌లు కొన్ని జాబితాలను ఆటోమేటిక్‌గా గుర్తించి యాక్సెస్ సామర్ధ్యం కోసం ఫార్మాట్ చేస్తాయి. ఉదాహరణకు, మీరు మీ డాక్యుమెంట్‌లో 1 అనే నంబర్‌ను టైప్ చేసి తర్వాత చుక్క గుర్తుని పెట్టి కొత్త పంక్తిని ప్రారంభిస్తే, ఆ కొత్త పంక్తి ఆటోమేటిక్‌గా సంఖ్యా జాబితాలో మొదటి అంశంగా మారిపోతుంది. సంఖ్యా మరియు బుల్లెట్ జాబితాలను ఎలా ఫార్మాట్ చేయాలో తెలుసుకోండి.

మీ డాక్యుమెంట్‌ను నిర్వహించడానికి ముఖ్య శీర్షికలను ఉపయోగించండి

ముఖ్య శీర్షికలు మీ డాక్యుమెంట్‌ను విభాగాలుగా విభజించి, వ్యక్తులు తమకు కావాల్సిన విభాగానికి వెళ్లడాన్ని సులభతరం చేస్తాయి (ముఖ్యంగా వారు కీ‌బోర్డ్‌ షార్ట్‌కట్‌లను ఉపయోగిస్తున్నప్పుడు). మీరు డిఫాల్ట్ శీర్షిక శైలులను ఉపయోగించుకోవచ్చు లేదా మీరే స్వంతంగా సృష్టించుకోవచ్చు. ముఖ్య శీర్షికలను జోడించడం మరియు అనుకూలీకరించడం ఎలానో తెలుసుకోండి.

మీ డాక్యుమెంట్‌లో నావిగేషన్ ల్యాండ్‌మార్క్‌లను చేర్చండి

ముఖ్య శీర్షికలు, ఫుటర్‌లు, పేజీ నంబర్‌లు మరియు పేజీ గణనలు వంటి ల్యాండ్‌మార్క్‌లు పాఠకులు మీ డాక్యుమెంట్‌లో ఎక్కడ ఉన్నారో తెలుసుకోవడానికి వారికి సహాయపడతాయి. ముఖ్యంగా పొడవైన డాక్యుమెంట్‌లలో యాక్సెస్ సామర్థ్యాన్ని పెంచడం కోసం, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ల్యాండ్‌మార్క్‌లను చేర్చండి (చేర్చు మెనూలో అందుబాటులో ఉన్నాయి).

స్లయిడ్‌లను శీర్షికలతో ప్రదర్శించండి

మీరు స్లయిడ్‌లతో ప్రదర్శించేటప్పుడు, స్పీకర్ పదాలను స్క్రీన్ దిగువన నిజ సమయంలో ప్రదర్శించడానికి మీరు ఆటోమేటిక్ శీర్షికలను ఆన్ చేయవచ్చు. స్లయిడ్‌లను శీర్షికలతో ప్రదర్శించడం ఎలానో తెలుసుకోండి.

ప్రెజెంటేషన్‌ను HTML వీక్షణలో షేర్ చేయండి

Google స్లయిడ్‌ల HTML వీక్షణ, ప్రెజెంటేషన్‌ని ఒక సమయంలో ఒక స్లయిడ్‌గా ప్రదర్శించే బదులుగా మీ ప్రెజెంటేషన్ మొత్తాన్ని ఒకేఒక స్క్రోల్ చేయదగిన HTML పేజీలో ప్రదర్శిస్తుంది. మీ ప్రేక్షకులలో స్క్రీన్ రీడర్‌లను ఉపయోగించే వ్యక్తులు కూడా ఉంటే, వారికి ఇదొక సహాయక ఫీచర్‌గా ఉపయోగపడుతుంది.

ప్రెజెంటేషన్‌ని HTML వీక్షణలో యాక్సెస్ చేసుకోవడానికి, (Windows లేదా Chrome OSలో అయితే) కీ‌బోర్డ్‌ షార్ట్‌కట్ Ctrl + Alt + Shift + p లేదా (Macలో అయితే) ⌘ + Option + Shift + pని ఉపయోగించండి.

ఇది సహాయకరంగా ఉందా?
మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?