VLOOKUP

 
మీ స్ప్రెడ్‌షీట్‌లో మీకు తెలిసిన సమాచారం ఉంటే, మీరు అడ్డు వరుసల ఆధారంగా సంబంధిత సమాచారాన్ని సెర్చ్ చేయడానికి VLOOKUPను ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, మీరు ఆరెంజ్‌ను కొనుగోలు చేయాలనుకుంటే, ధర కోసం సెర్చ్ చేయడానికి మీరు VLOOKUPను ఉపయోగించవచ్చు.
VLOOKUP formula example
BigQuery కోసం VLOOKUP

వర్టికల్ లుక్-అప్. సెర్చ్ నిలువు వరుసలో ఏ స్థానంలో అయితే మ్యాచ్ కనుగొనబడిందో, డేటా నిలువు వరుసలో ఆ స్థానం వద్ద ఉండే విలువలను అందిస్తుంది.

వినియోగ నమూనా

VLOOKUP("Apple",table_name!fruit,table_name!price)

సింటాక్స్

VLOOKUP(search_key, range,index, is_sorted)

  • search_key: సెర్చ్ నిలువు వరుసలో సెర్చ్ చేయాల్సిన విలువ.
  • search_column: సెర్చ్ చేయడం కోసం పరిగణించాల్సిన డేటా నిలువు వరుస.
  • result_column: ఫలితం కోసం పరిగణించాల్సిన డేటా నిలువు వరుస.
  • is_sorted: [ఆప్షనల్] search_key కోసం మ్యాచ్‌ను కనుగొనే విధానం.
    • FALSE: ఖచ్చితమైన మ్యాచ్ కోసం, ఇది సిఫార్సు చేయబడింది.
    • TRUE: సమీప మ్యాచ్ కోసం, is_sorted పేర్కొనబడకపోతే ఇది ఆటోమేటిక్‌గా ఎంచుకోబడుతుంది.
      చిట్కా: మీరు సమీప మ్యాచ్‌ను ఉపయోగించే ముందు, మీ సెర్చ్ కీని ఆరోహణ క్రమంలో అమర్చండి. లేకపోతే, మీరు తప్పు రిటర్న్ విలువను పొందవచ్చు. మీరు తప్పు రిటర్న్ విలువను ఎందుకు పొందవచ్చో తెలుసుకోండి.

చిట్కా: BigQueryలో మరింత సౌకర్యవంతమైన డేటాబేస్ క్వెరీల కోసం, XLOOKUPను ఉపయోగించండి.

సింటాక్స్

=VLOOKUP(search_key, range, index, [is_sorted])

ఇన్‌పుట్‌లు

  1. search_key: పరిధిలోని మొదటి నిలువు వరుసలో సెర్చ్ చేయాల్సిన విలువ.
  2. range: సెర్చ్ కోసం పరిగణించాల్సిన ఎగువ, దిగువ విలువలు.
  3. index: పరిధికి చెందిన రిటర్న్ విలువతో నిలువు వరుసకు సంబంధించిన ఇండెక్స్. ఇండెక్స్ తప్పనిసరిగా ధనాత్మక పూర్ణాంకం అయి ఉండాలి.
  4. is_sorted: ఆప్షనల్ ఇన్‌పుట్. ఒక ఆప్షన్‌ను ఎంచుకోండి:
    • FALSE = ఖచ్చితమైన మ్యాచ్. ఇది సిఫార్సు చేయబడింది.
    • TRUE = సమీప మ్యాచ్. is_sorted పేర్కొనబడకపోతే ఇది ఆటోమేటిక్‌గా ఎంచుకోబడుతుంది.
      ముఖ్య గమనిక: మీరు సమీప మ్యాచ్‌ను ఉపయోగించడానికి ముందు, మీ సెర్చ్ కీని ఆరోహణ క్రమంలో అమర్చండి. లేకపోతే, మీరు తప్పు రిటర్న్ విలువను పొందవచ్చు. మీరు తప్పు రిటర్న్ విలువను ఎందుకు పొందవచ్చో తెలుసుకోండి.

రిటర్న్ విలువ

ఎంచుకోబడిన range నుండి మొదటగా మ్యాచ్ అయిన విలువ.
టెక్నికల్ వివరాలు:
ఉదాహరణ:
=VLOOKUP(G9, B4:D8, 3, FALSE)
=VLOOKUP("Apple", B4:D8, 3, TRUE)
ఇన్‌పుట్‌లు వివరణ
search_key
ఇది మీరు rangeలోని మొదటి నిలువు వరుసలో సెర్చ్ చేసే విలువ. మీరు ఎర్రర్ లేని విలువను ఆశించినట్లయితే, సెర్చ్ కీ తప్పనిసరిగా rangeలోని మొదటి నిలువు వరుసలో ఉండాలి. సెల్ రెఫరెన్స్‌కు కూడా సపోర్ట్ ఉంది.
సాధారణ చెకప్ చేయడానికి: మీ search_key B3 వద్ద లొకేట్ అయి ఉన్నట్లయితే, మీ range నిలువు వరుస Bతో ప్రారంభం కావాలి.
పరిధి
rangeలో:
  • ఫంక్షన్ దాని మొదటి నిలువు వరుసలో పేర్కొన్న సెర్చ్ కీ కోసం సెర్చ్ చేస్తుంది.
  • VLOOKUP, index ద్వారా పేర్కొన్న నిలువు వరుస నుండి విలువను అందిస్తుంది. మీరు పేరు గల సెల్ గ్రూప్‌ను కూడా ఉపయోగించవచ్చు.
ఎర్రర్ లేని విలువను అందించడానికి, మీ సెర్చ్ కీ తప్పనిసరిగా rangeలోని మొదటి నిలువు వరుసలో ఉండాలి.
సాధారణ చెకప్ చేయడానికి: మీ search_key B3 వద్ద లొకేట్ అయి ఉన్నట్లయితే, మీ range నిలువు వరుస Bతో ప్రారంభం కావాలి.
ఇండెక్స్
దీన్ని “నిలువు వరుస సంఖ్య” అని కూడా పిలుస్తారు. ఇది రిటర్న్ విలువను కలిగి ఉన్న rangeలోని నిలువు వరుసకు సంబంధించిన ఇండెక్స్.
  • అతి చిన్న ఇండెక్స్ 1.
  • అతి పెద్ద ఇండెక్స్ ఆ rangeలోని నిలువు వరుసల గరిష్ఠ సంఖ్య.
మీరు పరిధిని సెటప్ చేసిన తర్వాత, ఇండెక్స్ = 1, లేదా అక్కడి నుండి మరింత కుడి వైపునకు ఉన్న నిలువు వరుసలు అయినప్పుడు, VLOOKUP సెర్చ్ కీ నిలువు వరుస కోసం మాత్రమే చూస్తుంది.
చిట్కా: మీరు VLOOKUPను ఉపయోగించినప్పుడు, rangeలోని నిలువు వరుసలకు ఎడమ నుండి కుడి వైపునకు నంబరింగ్ ఇవ్వబడి, అవి 1తో ప్రారంభించబడతాయని ఊహించుకోండి.
is_sorted
ఇది ఆప్షనల్ ఇన్‌పుట్. అందుబాటులో ఉన్న రెండు ఎంపికలు TRUE, FALSE.
  • is_sorted విలువ TRUE అయితే, అప్పడు VLOOKUP సమీప మ్యాచ్‌ను ఎంచుకుంటుంది.
    ముఖ్య గమనిక: మీరు సమీప మ్యాచ్‌ను ఉపయోగించడానికి ముందు, మీ సెర్చ్ కీని ఆరోహణ క్రమంలో అమర్చండి. లేకపోతే, మీరు ఊహించని విలువను పొందవచ్చు. మీరు తప్పు రిటర్న్ విలువను ఎందుకు పొందవచ్చో తెలుసుకోండి.
  • is_sorted విలువ FALSE అయితే, అప్పుడు VLOOKUP ఖచ్చితమైన మ్యాచ్‌ను ఉపయోగిస్తుంది.

  • is_sorted విలువ పేర్కొనబడకపోతే, అది ఆటోమేటిక్‌గా TRUE అవుతుంది.
వీటిని చేయాల్సిందిగా మేము మీకు గట్టిగా సిఫార్సు చేస్తున్నాము:
  • సెర్చ్ కీ నిలువు వరుస క్రమపద్ధతిలో అమర్చబడినా, అమర్చబడకపోయినా దాని స్థిరమైన ప్రవర్తన కారణంగా is_sorted కోసం FALSEను ఉపయోగించండి.
  • ఇన్‌పుట్ ఆప్షనల్ అయినప్పటికీ, మెరుగైన రీడబిలిటీ కోసం ఎల్లప్పుడూ is_sortedను పేర్కొనండి.

 

అవుట్‌పుట్‌లు వివరణ
రిటర్న్ విలువ
ఇది మీ ఇన్‌పుట్‌ల ఆధారంగా VLOOKUP అందించే విలువ. ఒక్కో VLOOKUP ఫంక్షన్ నుండి ఒక రిటర్న్ విలువ మాత్రమే అందించబడుతుంది.
  • మ్యాచ్ అయ్యే పలు సెర్చ్ కీ విలువలు ఉన్నట్లయితే, సెర్చ్ కీ నిలువు వరుసలో అనుబంధిత సెర్చ్ కీతో మొదట మ్యాచ్ అయ్యే రిటర్న్ విలువకు సంబంధించిన నిలువు వరుసలోని విలువ అందించబడుతుంది.
  • #N/A అందించబడితే, విలువ కనుగొనబడదు.
మీరు, ఆశించిన విలువ లేదా #N/A లేదా #VALUE! వంటి ఎర్రర్‌ను పొందితే, పరిష్కరించడాన్ని ప్రారంభించండి. మీరు #N/Aను మరొక విలువతో రీప్లేస్ చేయాలనుకుంటే, VLOOKUP()లో IFNA()ను ఎలా ఉపయోగించాలి అనే దాని మరింత తెలుసుకోండి.

ప్రాథమిక VLOOKUP ఉదాహరణలు:

విభిన్న సెర్చ్ కీలలో VLOOKUP

Orange, Appleల ధరను కనుగొనడానికి VLOOKUPను ఉపయోగించండి.

VLOOKUP on different search keys example
వివరణ:

మీరు VLOOKUPను ఉపయోగించినప్పుడు, మీరు "Apple", అలాగే "Orange" వంటి విభిన్న సెర్చ్ కీలను ఉపయోగించవచ్చు.

ఎర్రర్ లేని విలువను అందించడానికి, ఈ సెర్చ్ కీలు తప్పనిసరిగా rangeలోని మొదటి నిలువు వరుసలో ఉండాలి. మీరు సెర్చ్ కీల కోసం విలువను పూరించకూడదనుకుంటే, మీరు సెల్ రెఫరెన్స్‌ను కూడా ఉపయోగించవచ్చు, ఉదాహరణకు "G9."
search_key విలువ "Orange"
=VLOOKUP("Orange", B4:D8, 3, FALSE)
రిటర్న్ విలువ = $1.01
search_key విలువ "Apple"
=VLOOKUP("Apple", B4:D8, 3, FALSE)
రిటర్న్ విలువ = $1.50
search_key G9లో "Apple" సెల్ రెఫరెన్స్‌ను ఉపయోగిస్తుంది
=VLOOKUP(G9, B4:D8, 3, FALSE)
రిటర్న్ విలువ = $1.50

వేర్వేరు నిలువు వరుస ఇండెక్స్‌లలో VLOOKUP

రెండవ ఇండెక్స్ నిలువు వరుసలో Orangeల సంఖ్యను కనుగొనడానికి VLOOKUPను ఉపయోగించండి.
VLOOKUP on different column indexes example
వివరణ:
మీరు VLOOKUPను ఉపయోగించినప్పుడు, rangeలోని నిలువు వరుసలకు ఎడమ నుండి కుడి వైపునకు నంబరింగ్ ఇవ్వబడి, అవి 1తో ప్రారంభించబడతాయని ఊహించుకోండి. టార్గెట్ సమాచారాన్ని కనుగొనడానికి, మీరు తప్పనిసరిగా దాని నిలువు వరుస ఇండెక్స్‌ను పేర్కొనాలి. ఉదాహరణకు, సంఖ్య కోసం నిలువు వరుస 2.
Index = 2
rangeలోని రెండవ నిలువు వరుసలో ఉన్న orangeల సంఖ్యను కనుగొనండి.
=VLOOKUP(G3, B4:D8, 2, FALSE)
రిటర్న్ విలువ = 5

VLOOKUP ఖచ్చితమైన మ్యాచ్ లేదా సమీప మ్యాచ్

  • ఖచ్చితమైన IDని కనుగొనడానికి VLOOKUP ఖచ్చితమైన మ్యాచ్‌ను ఉపయోగించండి.
  • సమీప IDని కనుగొనడానికి VLOOKUP సమీప మ్యాచ్‌ను ఉపయోగించండి.
VLOOKUP exact match or approximate match example
వివరణ:
మీరు ఉత్తమ మ్యాచ్ కోసం సెర్చ్ చేస్తున్నప్పుడు, సమీప మ్యాచ్ లేదా is_sorted = TRUEను ఉపయోగించండి, కానీ ఖచ్చితమైన మ్యాచ్ కోసం దాన్ని ఉపయోగించకండి.
మీరు టేబుల్‌లో లేని ID = 102ను సెర్చ్ చేయాలనుకుంటే, మీకు ID = 101ని ఫలితంగా అందించడానికి సమీప మ్యాచ్ ఒక స్టెప్ వెనక్కి వెళ్తుంది. ఎందుకంటే సెర్చ్ కీ నిలువు వరుస‌లో, 101 అనేది 102కు సమీప విలువ, అలాగే 102 కంటే తక్కువ విలువ.
మీ సెర్చ్ కీ కంటే పెద్ద విలువను కనుగొనే వరకు సమీప మ్యాచ్, సెర్చ్ కీ నిలువు వరుసలో సెర్చ్ చేస్తుంది. ఆపై అది కావాల్సిన విలువ కంటే పెద్ద విలువను కలిగి ఉన్న అడ్డు వరుస కంటే ముందు ఉన్న అడ్డు వరుసలో సెర్చ్ చేయడం ఆపివేసి, ఆ అడ్డు వరుసలోని రిటర్న్ విలువకు చెందిన నిలువు వరుస నుండి విలువను అందిస్తుంది. అంటే మీ సెర్చ్ కీ నిలువు వరుస ఆరోహణ క్రమంలో అమర్చబడకపోతే, మీరు తప్పు రిటర్న్ విలువను పొందే అవకాశం ఉంది.
ముఖ్య గమనిక: మీరు సమీప మ్యాచ్‌ను ఉపయోగించే ముందు, సరైన విలువను అందించడానికి మీ సెర్చ్ కీని ఆరోహణ క్రమంలో అమర్చండి. లేకపోతే, మీరు ఊహించని విలువను పొందవచ్చు.
మీరు is_sorted = FALSE వంటి ఖచ్చితమైన మ్యాచ్ కోసం సెర్చ్ చేసినప్పుడు, అది ఖచ్చితమైన మ్యాచ్‌ను అందిస్తుంది. ఉదాహరణకు, ID = 103 పండు పేరు "Banana." ఖచ్చితమైన మ్యాచ్ లేకుంటే, మీరు #N/A ఎర్రర్‌ను పొందుతారు. దాని మరింత ఊహించదగిన ప్రవర్తన కారణంగా, మీరు ఖచ్చితమైన మ్యాచ్ ఉపయోగించాలని మేము సిఫార్సు చేస్తున్నాము.
ఖచ్చితమైన మ్యాచ్
=VLOOKUP(G6, A4:D8, 2, FALSE)
రిటర్న్ విలువ = "Apple"
సమీప మ్యాచ్
=VLOOKUP(G3, A4:D8, 2, TRUE)
లేదా
=VLOOKUP(G3, A4:D8, 2)
రిటర్న్ విలువ = "Banana"

సాధారణ VLOOKUP అప్లికేషన్‌లు

VLOOKUP నుండి ఎర్రర్ విలువను రీప్లేస్ చేయండి

మీ సెర్చ్ కీ ఉనికిలో లేనప్పుడు మీరు VLOOKUP ద్వారా అందించబడిన ఎర్రర్ విలువను రీప్లేస్ చేయాలనుకోవచ్చు. ఈ సందర్భంలో, మీరు #N/A వద్దనుకుంటే, మీరు #N/Aను రీప్లేస్ చేయడానికి IFNA() ఫంక్షన్‌లను ఉపయోగించవచ్చు. IFNA() గురించి మరింత తెలుసుకోండి.
Replace error value from VLOOKUP example
ఒరిజినల్‌గా, VLOOKUP #N/Aను అందిస్తుంది, ఎందుకంటే సెర్చ్ కీ “Pencil” అనేది “Fruit” నిలువు వరుసలో లేదు.
IFNA(), #N/A ఎర్రర్‌ను ఫంక్షన్‌లో పేర్కొన్న రెండవ ఇన్‌పుట్‌తో రీప్లేస్ చేస్తుంది. మన విషయంలో, ఇది "NOT FOUND."
=IFNA(VLOOKUP(G3, B4:D8, 3, FALSE),"NOT FOUND")
రిటర్న్ విలువ = “NOT FOUND”

చిట్కా: మీరు #REF! వంటి ఇతర ఎర్రర్‌లను రీప్లేస్ చేయాలనుకుంటే, IFERROR() గురించి మరింత తెలుసుకోండి.

బహుళ ప్రమాణాలతో VLOOKUP

VLOOKUP నేరుగా బహుళ ప్రమాణాలపై వర్తింపజేయబడదు. బదులుగా, ఇప్పటికే ఉన్న పలు నిలువు వరుసలను కలపడానికి బహుళ ప్రమాణాలపై నేరుగా VLOOKUPను వర్తింపజేయడానికి కొత్త సహాయక నిలువు వరుసను క్రియేట్ చేయండి.
VLOOKUP with multiple criteria example
1. మీరు మొదటి పేరును, చివరి పేరును కలపడానికి "&" ఉపయోగిస్తే మీరు సహాయక నిలువు వరుసను క్రియేట్ చేయవచ్చు. =C4&D4, దానిని B4 నుండి B8కి లాగడం వలన మీకు సహాయక నిలువు వరుస ఫలితంగా అందించబడుతుంది.
2. సెర్చ్ కీగా సెల్ రిఫరెన్స్ B7, JohnLeeని ఉపయోగించండి.
=VLOOKUP(B7, B4:E8, 4, FALSE)
రిటర్న్ విలువ = "Support"

వైల్డ్ కార్డ్ లేదా పాక్షిక మ్యాచ్‌లతో VLOOKUP

VLOOKUPలో, మీరు వైల్డ్ కార్డ్‌లు లేదా పాక్షిక మ్యాచ్‌లను కూడా ఉపయోగించవచ్చు. మీరు ఈ వైల్డ్ కార్డ్ అక్షరాలను ఉపయోగించవచ్చు:
  • ఏదైనా అక్షరాన్ని మ్యాచ్ చేసే ప్రశ్న గుర్తు "?".
  • ఏవైనా అక్షరాల శ్రేణిని మ్యాచ్ చేసే నక్షత్రం గుర్తు "*".
VLOOKUPలో వైల్డ్ కార్డ్‌లను ఉపయోగించడానికి, మీరు తప్పనిసరిగా ఖచ్చితమైన మ్యాచ్‌ను ఉపయోగించాలి: "is_sorted = FALSE".
VLOOKUP with wildcard example
"St*" అనేది "Steve", "St1", "Stock" లేదా "Steeeeeve" వంటి అక్షరాల సంఖ్యతో సంబంధం లేకుండా "St"తో ప్రారంభమయ్యే దేనినైనా మ్యాచ్ చేయడానికి ఉపయోగించబడుతుంది.
=VLOOKUP("St*", B4:D8, 3, FALSE)
రిటర్న్ విలువ = "Marketing"

ఎర్రర్‌లను పరిష్కరించడానికి సంబంధించిన బెస్ట్ ప్రాక్టీసులు:

తప్పు రిటర్న్ విలువ
  • ఊహించని విలువను అందిస్తుంది: మీరు is_sortedను TRUEగా సెట్ చేసిన కూడా పరిధిలోని మీ మొదటి నిలువు వరుస అనేది సంఖ్య పరంగా లేదా అక్షరక్రమం ఆధారంగా ఆరోహణ క్రమంలో అమర్చబడకపోతే, ఆపై is_sortedను FALSEకు మార్చండి.

  • VLOOKUP మొదటి మ్యాచ్‌ను అందిస్తుంది: VLOOKUP మొదటి మ్యాచ్‌ను మాత్రమే అందిస్తుంది. మీరు పలు మ్యాచ్ అయిన సెర్చ్ కీలను కలిగి ఉంటే, ఒక విలువ అందించబడుతుంది, కానీ అది ఆశించిన విలువ కాకపోవచ్చు.
  • క్లీన్ చేయని డేటా: కొన్నిసార్లు, ట్రెయిలింగ్, అలాగే లీడింగ్ స్పేస్‌లతో కూడిన విలువలు ఒకేలా కనిపించవచ్చు, కానీ VLOOKUP వాటిని వేర్వేరుగా పరిగణిస్తుంది. ఉదాహరణకు, కింద పేర్కొన్న వాటిని VLOOKUP వేర్వేరుగా పరిగణిస్తుంది:
    • " Apple"
    • "Apple "
    • "Apple"
మీరు ఆశించిన ఫలితాలను పొందడానికి, మీరు VLOOKUPను ఉపయోగించే ముందు స్పేస్‌లను తీసివేయండి.
#N/A
  • సమీప లేదా is_sorted = TRUE ఉపయోగించబడి, VLOOKUPలోని సెర్చ్ కీ మొదటి నిలువు వరుసలోని అతి చిన్న విలువ కంటే తక్కువగా ఉంటే, VLOOKUP #N/A విలువను అందిస్తుంది.
  • ఖచ్చితమైన మ్యాచ్ లేదా is_sorted = FALSE ఉపయోగించబడితే, అప్పుడు VLOOKUPలోని సెర్చ్ కీకి సంబంధించిన ఖచ్చితమైన మ్యాచ్ మొదటి నిలువు వరుసలో కనుగొనబడదు. మొదటి నిలువు వరుసలో సెర్చ్ కీ కనుగొనబడనప్పుడు మీకు #N/A అవసరం లేకపోతే, మీరు IFNA() ఫంక్షన్‌ను ఉపయోగించవచ్చు.
#REF!
మీరు పొరపాటున rangeలోని నిలువు వరుసల గరిష్ఠ సంఖ్య కంటే పెద్ద సంఖ్యతో rangeను పేర్కొనవచ్చు. దీన్ని నివారించడానికి, కింద పేర్కొన్న విధంగా చేయండి:
  • ఎంచుకున్న rangeలోని నిలువు వరుసలను మాత్రమే లెక్కించండి, మొత్తం టేబుల్‌లోని నిలువు వరుసలను కాదు.
  • 0కి బదులుగా 1 నుండి లెక్కించడం ప్రారంభించండి.
#VALUE!
మీకు #VALUE! ఎర్రర్ వస్తే, మీరు కింద పేర్కొన్న విధంగా చేయవచ్చు:
  • index కోసం టెక్స్ట్ లేదా నిలువు వరుస పేరును తప్పుగా ఇన్‌పుట్ చేసి ఉండవచ్చు.
  • index కోసం 1 కంటే చిన్న సంఖ్యను ఎంటర్ చేసి ఉండవచ్చు. index తప్పనిసరిగా కనీసం 1కి సమానంగా ఉండాలి, అలాగే rangeలోని గరిష్ఠ నిలువు వరుసల కంటే చిన్నదిగా ఉండాలి. VLOOKUP అనేది index = 1 ఉన్నప్పుడు సెర్చ్ కీ నిలువు వరుస‌లో లేదా సంబంధిత స్థానం నుండి మరింత కుడి వైపునకు ఉన్న నిలువు వరుసలలో మాత్రమే సెర్చ్ చేయగలదు.

ముఖ్య గమనిక: index సంఖ్యను మాత్రమే ఆమోదిస్తుంది.

#NAME?
  • మీ search_key అనేది టెక్స్ట్ డేటా అయినప్పుడు మీరు సెర్చ్ కీలోని కోట్‌ను మిస్ అయి ఉండవచ్చు.
బెస్ట్ ప్రాక్టీసులు

 

చేయాల్సిన పనులు కారణం
range కోసం ఖచ్చితమైన రెఫరెన్స్‌లను ఉపయోగించండి
మీరు వీటిని ఉపయోగించాలి:
  • VLOOKUP range కోసం ఖచ్చితమైన రెఫరెన్స్
  • VLOOKUP(G3, $B$3:$D$7, 3, FALSE)
మీరు వీటిని  ఉపయోగించకూడదు:
  • VLOOKUP(G3, B3:D7, 3, FALSE)
ఇది కాపీ చేయబడినప్పుడు లేదా కిందికి లాగినప్పుడు rangeలో ఊహించని మార్పులను నివారిస్తుంది.
మీరు is_sorted = TRUE వంటి సమీప మ్యాచ్‌ను ఉపయోగించినప్పుడు మొదటి నిలువు వరుసను ఆరోహణ క్రమంలో అమర్చండి. మీరు సమీప మ్యాచ్‌ను లేదా is_sorted = TRUEను ఉపయోగిస్తే, మీరు తప్పనిసరిగా మొదటి నిలువు వరుసను ఆరోహణ క్రమంలో అమర్చాలి. లేకపోతే, మీరు చాలా వరకు తప్పు రిటర్న్ విలువను పొందుతారు. క్రమపద్ధతిలో అమర్చడం ఎలాగో మరింత తెలుసుకోండి.
మీరు VLOOKUPను ఉపయోగించడానికి ముందు మీ డేటాను క్లీన్ చేయండి
మీరు VLOOKUPను ఉపయోగించే ముందు, మీ డేటాను క్లీన్ చేయాలని గుర్తుంచుకోండి. క్లీన్ చేయని డేటా VLOOKUP ఊహించని విలువను అందించడానికి కారణం కావచ్చు. క్లీన్ చేయని డేటాకు సంబంధించిన కొన్ని సాధారణ ఉదాహరణలు ఇక్కడ ఉన్నాయి:
  • లీడింగ్ స్పేస్‌లు: " apple"
  • ట్రెయిలింగ్ స్పేస్‌లు: "apple "
  • బ్లాంక్‌లు లేదా స్పేస్‌లు: "" and " "లు ఒకే విధంగా పరిగణించబడవు
లీడింగ్, ట్రెయిలింగ్ వైట్ స్పేస్‌ను ట్రిమ్ చేయడానికి, మీరు డేటా ఆ తర్వాత డేటా క్లీనప్ ఆ తర్వాత వైట్‌స్పేస్‌ను ట్రిమ్ చేయండి అనే ఆప్షన్‌ను ఉపయోగించవచ్చు.
సంఖ్య లేదా తేదీ విలువలను టెక్స్ట్‌గా స్టోర్ చేయవద్దు
సెర్చ్ కీ నిలువు వరుస వంటి మీ VLOOKUP పరిధిలోని మొదటి నిలువు వరుసలో మీ తేదీ లేదా సంఖ్య విలువలు టెక్స్ట్ విలువలుగా స్టోర్ చేయబడలేదని నిర్ధారించుకోండి. మీరు ఊహించని రిటర్న్ విలువను పొందవచ్చు.
  1. Sheets ఎగువున, మీ సెర్చ్ కీ నిలువు వరుసను ఎంచుకోండి.
  2. ఫార్మాట్ మెనూ ఆ తర్వాత సంఖ్య అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. మీరు కోరుకున్న డేటా రకాన్ని బట్టి ఆప్షన్‌ను ఎంచుకోండి:
    • తేదీ
    • సంఖ్య
true
Visit the Learning Center

Using Google products, like Google Docs, at work or school? Try powerful tips, tutorials, and templates. Learn to work on Office files without installing Office, create dynamic project plans and team calendars, auto-organize your inbox, and more.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
7307582903246803664
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
35
false
false