యాడ్-ఆన్‌లను, Apps Scriptను, AppSheetను, Looker Studioను ఉపయోగించండి

ఆఫీస్ లేదా స్కూల్ కోసం Google Docs నుండి మరిన్ని ప్రయోజనాలు పొందాలనుకుంటున్నారా? ఎటువంటి ఛార్జీ లేకుండా Google Workspace ట్రయల్ కోసం సైన్ అప్ చేయండి.

ముఖ్య గమనిక: థర్డ్-పార్టీ కుక్కీల విషయంలో వెబ్ బ్రౌజర్ సపోర్ట్ లేకుండా కొన్ని యాడ్-ఆన్‌లు సరిగ్గా పని చేయకపోవచ్చు. థర్డ్-పార్టీ కుక్కీలను తాత్కాలికంగా ఎలా అనుమతించాలో తెలుసుకోండి.

యాడ్-ఆన్‌లను ఇన్‌స్టాల్ చేసి, ఉపయోగించండి (ఇంగ్లీష్‌లో మాత్రమే)

Google Docs, Sheets, Slides, అలాగే Formsలతో మరిన్ని పనులు చేయడానికి మీరు యాడ్-ఆన్‌లను ఉపయోగించవచ్చు. ఏయే యాడ్-ఆన్‌లు అందుబాటులో ఉన్నాయో తెలుసుకోవడానికి, Docs, Sheets, Slides, Forms యాడ్-ఆన్ స్టోర్‌లకు వెళ్లండి.

ముఖ్య గమనిక: Google ఎడిటర్ యాడ్-ఆన్‌లు Chrome Web Store నుండి Google Workspace Marketplaceకు తరలించబడుతున్నాయి. కింది వాటిని గమనించండి:

  • యాడ్-ఆన్ Google Workspace Marketplaceకు తరలించబడకపోతే, మీరు దానిని ఇన్‌స్టాల్ చేయలేరు.
  • మీరు గతంలో ఇన్‌స్టాల్ చేసిన యాడ్-ఆన్ Google Workspace Marketplaceకు తరలించబడకపోతే, మీరు ఇప్పటికీ దానిని ఉపయోగించగలరు.
  • మీరు ఇతరులతో కలిసి డాక్యుమెంట్‌లో పని చేస్తూ, Google Workspace Marketplaceకు తరలించబడని యాడ్-ఆన్‌ను మీరు ఆన్ చేసినట్లయితే, ఆ యాడ్-ఆన్‌ను గతంలో ఇన్‌స్టాల్ చేసిన వ్యక్తులు మాత్రమే ఉపయోగించగలరు.
  • గతంలో ఇన్‌స్టాల్ చేసిన కొన్ని యాడ్-ఆన్‌లను Google Docs, Sheets, Slides, Formsలలో మళ్లీ ఇన్‌స్టాల్ చేయాల్సి రావచ్చు. యాడ్-ఆన్‌ను ఇన్‌స్టాల్ చేయడం ఎలాగో తెలుసుకోండి.
  • మీరు డెవలపర్ అయితే, మీ యాడ్-ఆన్‌లను Google Workspace Marketplaceకు ఎలా తరలించాలో తెలుసుకోండి.
యాడ్-ఆన్‌ను ఇన్‌స్టాల్ చేయండి

Google Docs, Sheets, Slides

  1. మీ కంప్యూటర్‌లో, డాక్యుమెంట్‌ను, స్ప్రెడ్‌షీట్‌ను, లేదా ప్రెజెంటేషన్‌ను తెరవండి.
  2. ఎక్స్‌టెన్షన్‌లు ఆ తర్వాత యాడ్-ఆన్‌లు ఆ తర్వాత యాడ్-ఆన్‌లను పొందండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. సంక్షిప్త వివరణను కనుగొనడానికి యాడ్-ఆన్‌పై పాయింట్ చేయండి. పూర్తి వివరణను కనుగొనడానికి, యాడ్-ఆన్‌ను క్లిక్ చేయండి.
  4. యాడ్-ఆన్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి, ఇన్‌స్టాల్ చేయండి ఆ తర్వాత కొనసాగించండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  5. అనేక యాడ్-ఆన్‌ల విషయంలో, యాడ్-ఆన్ పని చేయడానికి అవసరమైన డేటాకు యాక్సెస్‌ను రిక్వెస్ట్ చేస్తూ ఒక మెసేజ్ కనిపిస్తుంది. సందేశాన్ని చదివి, ఆపై అనుమతించు ఎంపికను క్లిక్ చేయండి.
  6. యాడ్-ఆన్ ఇన్‌స్టాల్ అయిన తర్వాత, పూర్తయింది అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

చిట్కా: "యాడ్-ఆన్‌లు" అనే ఆప్షన్ కనిపించకపోతే, మీరు Microsoft Office ఎడిటింగ్‌లో ఉండి ఉంటారు. యాడ్-ఆన్‌ను ఉపయోగించడానికి, మీ ఫైల్‌ను Google Docs, Sheets లేదా Slidesకు మార్చండి. Microsoft Office ఎడిటింగ్, Microsoft Office ఫైళ్లను ఎలా మార్చాలి అనే విషయాల గురించి తెలుసుకోండి.

Google Forms

  1. మీ కంప్యూటర్‌లో, ఫారమ్‌ను తెరవండి.
  2. ఎగువ కుడి వైపున, మరిన్ని మరిన్ని ని క్లిక్ చేయండి.
  3. యాడ్-ఆన్‌లు అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. పూర్తి వివరణను కనుగొనడానికి, యాడ్-ఆన్‌ను క్లిక్ చేయండి.
  5. యాడ్-ఆన్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి, ఇన్‌స్టాల్ చేయండి ఆ తర్వాత కొనసాగించండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  6. అనేక యాడ్-ఆన్‌ల విషయంలో, యాడ్-ఆన్ పని చేయడానికి అవసరమైన డేటాకు యాక్సెస్‌ను రిక్వెస్ట్ చేస్తూ ఒక మెసేజ్ కనిపిస్తుంది. సందేశాన్ని చదివి, ఆపై అనుమతించు ఎంపికను క్లిక్ చేయండి.
  7. యాడ్-ఆన్ ఇన్‌స్టాల్ అయిన తర్వాత, పూర్తయింది అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

చిట్కా: ఇన్‌స్టాల్ అయిన మీ యాడ్-ఆన్‌లన్నింటినీ చూసేందుకు, యాడ్-ఆన్‌లు ఫారమ్‌ల యాడ్-ఆన్ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

యాడ్-ఆన్‌లను ఆన్, ఆఫ్ చేయండి

మీరు యాడ్-ఆన్‌లను ఎప్పుడైనా ఆన్ లేదా ఆఫ్ చేయవచ్చు. యాడ్-ఆన్‌ను మీ ఫైళ్లన్నింటి నుండి తీసివేయడానికి, దానిని అన్ఇన్‌స్టాల్ చేయండి.

Google Docs, Sheets, Slides

  1. మీ కంప్యూటర్‌లో డాక్యుమెంట్‌ను, స్ప్రెడ్‌షీట్‌ను, లేదా ప్రెజెంటేషన్‌ను తెరవండి.
  2. ఎక్స్‌టెన్షన్‌లు ఆ తర్వాత యాడ్-ఆన్‌లు ఆ తర్వాత యాడ్-ఆన్‌లను మేనేజ్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. యాడ్-ఆన్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయడానికి, యాడ్-ఆన్ పక్కన, ఆప్షన్‌లు మరిన్ని ఆ తర్వాత ఈ డాక్యుమెంట్‌లో ఉపయోగించండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

Google Forms

  1. ఫారమ్‌ను తెరవండి.
  2. ఎగువ కుడి వైపున, మరిన్ని మరిన్ని ని క్లిక్ చేయండి.
  3. యాడ్-ఆన్‌లు అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. ఎగువ కుడి వైపున, సెట్టింగ్‌లు ఆ తర్వాత యాప్‌లను మేనేజ్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

  5. యాడ్-ఆన్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయడానికి, యాడ్-ఆన్ పక్కన, ఆప్షన్‌లు మరిన్ని ఆ తర్వాత ఈ డాక్యుమెంట్‌లో ఉపయోగించండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

యాడ్-ఆన్‌ను అన్ఇన్‌స్టాల్ చేయండి

Google Docs, Sheets, Slides

  1. మీ కంప్యూటర్‌లో డాక్యుమెంట్‌ను, స్ప్రెడ్‌షీట్‌ను, లేదా ప్రెజెంటేషన్‌ను తెరవండి.
  2. ఎక్స్‌టెన్షన్‌లు ఆ తర్వాత యాడ్-ఆన్‌లు ఆ తర్వాత యాడ్-ఆన్‌లను మేనేజ్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. యాడ్-ఆన్ పక్కన, ఆప్షన్‌లు మరిన్ని ఆ తర్వాత అన్‌ఇన్‌స్టాల్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

యాడ్-ఆన్‌కు సంబంధించిన సమస్యను రిపోర్ట్ చేయడానికి, సమస్యను రిపోర్ట్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

Google ఫారమ్‌లు

  1. ఫారమ్‌ను తెరవండి.
  2. ఎగువున కుడి వైపున, మరిన్ని మరిన్ని ని క్లిక్ చేయండి.
  3. యాడ్-ఆన్‌లు అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. ఎగువ కుడి వైపున, సెట్టింగ్‌లు  ఆ తర్వాత యాప్‌లను మేనేజ్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  5. యాడ్-ఆన్ పక్కన, ఆప్షన్‌లు మరిన్ని ఆ తర్వాత అన్‌ఇన్‌స్టాల్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

Google Docs, Sheets, Slides, Formsలతో Apps Scriptను ఉపయోగించండి

మీరు Google Apps Scriptతో Google Docs, Sheets, Slides, Formsలకు అనుకూల మెనూలను, డైలాగ్‌లను, సైడ్‌బార్‌లను జోడించగలరు. ప్రారంభించడానికి, Google Apps Script లింక్‌కు వెళ్లండి.

AppSheetతో వెబ్, మొబైల్ యాప్‌లను క్రియేట్ చేయండి

Google Sheets, Excel, క్లౌడ్ SQL, Salesforce వంటి డేటా మూలాల నుండి మొబైల్, వెబ్ యాప్‌లను రూపొందించడానికి మీరు AppSheetను ఉపయోగించవచ్చు. AppSheet అనేది కోడ్ అవసరం లేని డెవలప్‌మెంట్ ప్లాట్‌ఫామ్, కాబట్టి కోడింగ్ అనుభవం అవసరం లేదు. AppSheetను ఉపయోగించడం గురించి మరింత తెలుసుకోండి.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
11627711031774362181
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
35
false
false