ఫీచర్ లభ్యత
- ఈ ఫీచర్‌ను ఉపయోగించాలంటే, అర్హత గల Google Workspace సబ్స్క్రిప్షన్ కావాలి. Gemini ఫీచర్‌లు, ప్లాన్ల గురించి తెలుసుకోండి.
- "క్రియేట్ చేయడంలో నాకు సహాయం చేయి", చదవడంలో సాయపడే టెలీ-ప్రాంప్టర్, ఇంకా AI వాయిస్-ఓవర్ వంటి Vidsలో ఉన్న AI ఫీచర్‌లు ప్రస్తుతం ఇంగ్లీష్‌లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. Vids లభ్యత గురించి మరింత తెలుసుకోండి.
వీడియోకు స్టాక్ మీడియా ఫైళ్లను జోడించండి
వీడియోకు స్టాక్ వీడియోలను, ఇమేజ్‌లను, మ్యూజిక్‌ను, సౌండ్ ఎఫెక్ట్‌లను, స్టిక్కర్లను ఇంకా GIFలను జోడించడానికి:
- మీ కంప్యూటర్‌లో, Google Vidsలో వీడియోను తెరవండి.
- సైడ్‌బార్‌లో, స్టాక్ మీడియా ఫైళ్లు
ను క్లిక్ చేయండి, లేదా ఎగువున ఉన్న, ఇన్‌సర్ట్ చేయండి
స్టాక్ మీడియా ఫైళ్లు
ను క్లిక్ చేయండి.
- సందర్భోచితంగా ఉన్న కంటెంట్ కోసం సెర్చ్ చేయండి:
- అన్ని స్టాక్ మీడియా ఫైళ్లన్నింటిలో సెర్చ్ చేయడానికి, సెర్చ్ బార్‌లో మీ ఎంపికను టైప్ చేసి, రకాన్ని "అన్నీ"కి సెట్ చేయండి.
- ఫైళ్ల 'రకం' ఆధారంగా ఫిల్టర్ చేయడానికి, "అన్నీ" అనే ఎంపికపై క్లిక్ చేసి, ఆపై డ్రాప్ డౌన్ మెనూ నుండి మీడియా రకాన్ని ఎంచుకోండి.
- చిట్కాలు:
- ఇన్‌సర్ట్ చేయడానికి ముందు, స్టాక్ వీడియోలను ప్రివ్యూ చేయడానికి, ఎంపికపై మీ మౌస్ కర్సర్ ఉంచండి.
- ఇన్‌సర్ట్ చేయడానికి ముందు స్టాక్ మ్యూజిక్ లేదా సౌండ్ ఎఫెక్ట్‌లను ప్రివ్యూ చేయడానికి, ప్లే చేయండి
ని క్లిక్ చేయండి.
- దీన్ని కాన్వాస్‌కు జోడించడానికి, ఐటెమ్ పైన క్లిక్ చేయండి.
- మీరు జోడించిన ఐటెమ్ లొకేషన్‌ను అనుకూలంగా మార్చడానికి:
- సైజ్ మార్చండి: ఐటెమ్‌ను పెద్దదిగా లేదా చిన్నదిగా చేయడానికి, వీడియో, ఇమేజ్, GIF లేదా స్టిక్కర్‌ను ఎంచుకుని, ఒకవైపు మూల నుండి సర్దుబాటు చేయండి.
- తరలించండి: ఐటెమ్‌ను ఎంచుకుని, కావలసిన లొకేషన్‌కు దాన్ని లాగండి.
- చిట్కాలు:
- ప్లేహెడ్ ప్రస్తుతం ఉన్న చోట ఆడియో క్లిప్‌లు ఇన్‌సర్ట్ చేయబడతాయి. ఆడియో ట్రాక్‌లతో టైమింగ్‌ను, ట్రాన్సిషన్లను కంట్రోల్ చేయడం గురించి మరింత తెలుసుకోండి.
- స్టాక్ వీడియోలు, ఇమేజ్‌లు, వెబ్ ఇమేజ్‌లు, GIFలు ఇంకా స్టిక్కర్లు సీన్ ప్రారంభంలో కనిపిస్తాయి అలాగే వాటిని ఆబ్జెక్ట్ ట్రాక్‌లతో అనుకూలంగా మార్చవచ్చు. ఆబ్జెక్ట్ ట్రాక్‌లతో టైమింగ్ ఇంకా ట్రాన్సిషన్లను కంట్రోల్ చేయడం గురించి మరింత తెలుసుకోండి.
ప్రాంప్ట్‌ల ఆధారంగా Gemini సహాయంతో ఇమేజ్‌లను క్రియేట్ చేయండి
Google Vidsలో, మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించి ఇమేజ్‌లను క్రియేట్ చేయడానికి, "Geminiతో ఇమేజ్‌ను క్రియేట్ చేయండి" అనే ఫీచర్‌ను ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, మీరు పిక్నిక్ లేదా అబ్‌స్ట్రాక్ట్ పెయింటింగ్‌ను క్రియేట్ చేయమని Geminiని అడగవచ్చు.
ముఖ్య గమనిక:"క్రియేట్ చేయడంలో నాకు సహాయపడు", చదవడంలో సాయపడే టెలీ-ప్రాంప్టర్ వంటి Vids జెనరేటివ్ AI ఫీచర్‌లు ప్రస్తుతం ఇంగ్లీష్‌లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
- మీ కంప్యూటర్‌లో, Google Vidsలో వీడియోను తెరవండి
- మీ కాన్వాస్‌కు కుడి వైపున, ఒక ఇమేజ్‌ను క్రియేట్ చేయడంలో నాకు హెల్ప్ చెయ్యి
అనే దాన్ని క్లిక్ చేయండి. ఇమేజ్‌ను క్రియేట్ చేయడం ద్వారా ఒరిజినల్ ఇమేజ్‌లను జెనరేట్ చేయవచ్చు, ఆపై మీరు వాటిని ఏదైనా సీన్‌లో ఇన్‌సర్ట్ చేయగలరు.
- కుడి వైపున ప్యానెల్‌లో, ప్రాంప్ట్‌లో ఎంటర్ చేయండి. ఉదాహరణకు:
- “దూరంగా తాటి చెట్లతో సూర్యాస్తమయం సమయంలో హవాయి బీచ్ ఉన్న అందమైన ఫోటోగ్రాఫ్.”
- “ఒక పెద్ద కిటికీ పక్కన ఉన్న వంట గదిలోని చెక్క బల్లపై తాజాగా కాల్చిన బ్లూబెర్రీ మఫిన్‌ల ప్లేట్”
- “నీటి కాడలో హైడ్రేంజస్ వాటర్ కలర్ పెయింటింగ్”
- “రాత్రిపూట స్కైస్క్రాపర్‌లు, ఎగిరే కార్ల HD వివరాలు, నీడలతో కూడిన భవిష్యత్తు నగర దృశ్యం”
- (ఆప్షనల్): మీరు క్రియేట్ చేసే ఇమేజ్‌ను అనుకూలంగా మార్చడానికి స్టయిల్‌ను జోడించండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
- సూచించిన అనేక ఇమేజ్‌లను చూడటానికి క్రియేట్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
- (ఆప్షనల్): 'క్రియేట్ చేయండి' ఆప్షన్‌ను క్లిక్ చేసిన తర్వాత, మీరు ఇవి చేయవచ్చు:
- (ఆప్షనల్): ఇమేజ్‌ను గురించి ఫీడ్‌బ్యాక్‌ను పంపడానికి, మంచి సూచన
లేదా సరైన సూచన కాదు
ఆప్షన్‌లను క్లిక్ చేయండి.
- (ఆప్షనల్): ఇమేజ్‌ను గురించి ఫీడ్‌బ్యాక్‌ను పంపడానికి, మంచి సూచన
- నిర్దిష్ట ఇమేజ్‌ను ఇన్‌సర్ట్ చేయడానికి, ఇమేజ్‌పై మౌస్ కర్సర్ ఉంచి, ఇన్‌సర్ట్ చేయడానికి దానిపై క్లిక్ చేయండి.
- మీరు ఇవి కూడా చేయవచ్చు:
- ప్రాంప్ట్‌ను ఎడిట్ చేయడం: ప్రాంప్ట్‌ను ఎడిట్ చేయండి
ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
- మరిన్ని ఇమేజ్‌లను జెనరేట్ చేయడం: దిగువున, మరిన్నింటిని చూడండి
ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
- ప్రాంప్ట్‌ను ఎడిట్ చేయడం: ప్రాంప్ట్‌ను ఎడిట్ చేయండి
ప్రాంప్ట్ చిట్కాలు:
- మెరుగైన ఫలితాల కోసం, సబ్జెక్ట్, సెట్టింగ్, సబ్జెక్ట్‌కు ఎంత దూరంలో ఉన్నదీ, మెటీరియల్స్, లేదా బ్యాక్‌గ్రౌండ్‌తో సహా అన్ని అంశాలనూ పరిగణించండి. ఉదాహరణ: "సూర్యోదయ సమయంలో చుట్టూ చెట్లతో సరస్సుపై చెక్కతో చేసిన పడవ ఉన్న క్లోజప్."
- మీ ప్రాంప్ట్‌లో అలంకారిక భాషను ఉపయోగించకండి.
Gemini ఫీచర్ సూచనల గురించి తెలుసుకోండి
- Gemini ఫీచర్ సూచనలు Google అభిప్రాయాలకు ప్రాతినిధ్యం వహించవు, వాటిని Googleకు ఆపాదించకూడదు.
- వైద్యపరమైన, చట్టపరమైన, ఆర్థికపరమైన, లేదా ఇతర వృత్తిపరమైన సలహాల కోసం Gemini ఫీచర్‌లపై ఆధారపడవద్దు.
- Gemini ఫీచర్‌లు సరికాని లేదా అనుచితమైన సమాచారాన్ని సూచించవచ్చు. మీ ఫీడ్‌బ్యాక్ Geminiని మరింత సహాయకరంగా, సురక్షితంగా చేస్తుంది.
- ఎంటర్‌ప్రైజ్ ఎండ్ యూజర్‌లు ఈ ఫీచర్‌ను ఉపయోగించి వారి అనుభవం గురించి ఫీడ్‌బ్యాక్‌ను సమర్పించవచ్చు. ఫీడ్‌బ్యాక్ డేటాలో వ్యక్తిగతమైన, రహస్యమైన, లేదా గోప్యమైన సమాచారం ఉండకూడదని ఫీడ్‌బ్యాక్‌ను సమర్పించే ముందు ఎండ్ యూజర్‌కు తెలియజేయడం జరుగుతుంది.
- జెనరేట్ చేసిన ఇమేజ్‌లు Google Docs, Slides, Vidsలో ఉపయోగించడానికి మాత్రమే ఉద్దేశించినవి.
- Gemini జెనరేట్ చేసిన ఇమేజ్‌లను, Vidsలో మీ ఊహకు జీవం పోసేలా డిజైన్ చేయడం జరిగింది, అది వాస్తవ ప్రపంచ పరిస్థితులకు అద్దం పట్టేలా ఉండకపోవచ్చు.
ఈ ఫీచర్ గురించి ఫీడ్‌బ్యాక్‌ను అందించండి
ఈ ఫీచర్‌పై సాధారణ ఫీడ్‌బ్యాక్‌ను అందించడానికి, ఎగువున సహాయం Slidesను మెరుగుపరచడంలో సహాయపడండి ఆప్షన్‌లకు వెళ్లండి.
చట్టపరమైన సమస్యను రిపోర్ట్ చేయడానికి, రిక్వెస్ట్‌ను క్రియేట్ చేయండి.