Drive, Docs, Sheets & Slidesలో ఎన్‌క్రిప్ట్ చేసిన ఫైల్స్‌తో ప్రారంభించండి

Driveకు అప్‌లోడ్ చేసిన లేదా Docs, Sheets, Slidesలో క్రియేట్ చేసిన అన్ని ఫైల్స్ బదిలీ అవుతున్నప్పుడు, స్టోర్ అయ్యి ఉన్నప్పుడు AES256 బిట్ ఎన్‌క్రిప్షన్‌తో వాటిని ఎన్‌క్రిప్ట్ చేయడం జరుగుతుంది. అదనపు గోప్యత కోసం, మీ సంస్థ, Drive, Docs, Sheets, అలాగే Slidesకు సంబంధించిన ఫైల్స్‌ను Workspace క్లయింట్-సైడ్ ఎన్‌క్రిప్షన్‌తో ఎన్‌క్రిప్ట్ చేయడానికి మిమ్మల్ని అనుమతించవచ్చు. స్టాండర్డ్ ఫైల్స్‌తో పోలిస్తే, ఎన్‌క్రిప్ట్ చేసిన ఫైల్స్‌కు కొన్ని పరిమితులు ఉంటాయి. మీరు PDFలు, Office లాంటి Drive ఫైల్ రకాలు వేటినైనా ఎన్‌క్రిప్ట్ చేసిన Drive ఫైల్స్‌గా అప్‌లోడ్ చేయవచ్చు.

ముఖ్యమైనది: Workspace క్లయింట్-సైడ్ ఎన్‌క్రిప్షన్‌తో Drive, Docs, Sheets, ఇంకా స్లయిడ్‌ల ఫైల్స్‌ను ఎన్‌క్రిప్ట్ చేయడానికి:

  • మీకు వర్క్ స్పేస్ ఖాతా ఉండాలి.
  • మీ అడ్మినిస్ట్రేటర్ క్లయింట్-సైడ్ ఎన్‌క్రిప్షన్‌ను తప్పనిసరిగా ఎనేబుల్ చేయాలి.
  • మీరు మీ గుర్తింపును తప్పనిసరిగా వెరిఫై చేయాలి.

ఎన్‌క్రిప్షన్ గురించి తెలుసుకోండి

ఎన్‌క్రిప్షన్ అంటే మీ డేటాను సురక్షితంగా ఉంచడానికి సమాచారాన్ని ఎన్‌కోడ్ చేసే ప్రాసెస్. అడ్మిన్ నుండి Workspace క్లయింట్-సైడ్ ఎన్‌క్రిప్షన్ ఎనేబుల్ చేసిన, తమ గుర్తింపు వెరిఫై చేసిన యూజర్‌లు మాత్రమే ఎన్‌క్రిప్ట్ చేసిన ఫైల్స్‌ను క్రియేట్ లేదా కాపీ చేయగలరు. ఎన్‌క్రిప్ట్ చేసిన ఫైల్‌లో, ఫైల్ షేర్ చేసిన ఏ యూజర్ అయినా ఆ ఫైల్‌కు ప్రత్యేకమైన ఎన్‌క్రిప్షన్ కీని ఉపయోగించి దాన్ని యాక్సెస్ చేయవచ్చు. సాధారణంగా Google మీ కంటెంట్‌ను, బదిలీ చేయబడుతున్నప్పుడు, అలాగే విశ్రాంతి సమయాలలో ఎన్‌క్రిప్ట్ చేస్తుంది, కానీ క్లయింట్-సైడ్ ఎన్‌క్రిప్షన్‌తో మీ డొమైన్ అదనపు రక్షణ లేయర్‌ను జోడించే విధంగా ఎంచుకుంది.

ఎన్‌క్రిప్షన్ గురించి తెలుసుకోవాల్సిన అంశాలు
  • డొమైన్ అడ్మినిస్ట్రేటర్‌కు ఎన్‌క్రిప్షన్‌ను ఉపయోగించగల గ్రూప్‌లు, అలాగే వ్యక్తులపై కంట్రోల్ ఉంటుంది. మీరు ఎన్‌క్రిప్షన్ ఆఫ్ చేసిన లొకేషన్‌లకు ఫైల్‌ను తరలించాలనుకుంటే లేదా కొత్త లొకేషన్‌ల కోసం ఈ ఫీచర్‌ను ఆన్ చేయాలనుకుంటే మీ అడ్మినిస్ట్రేటర్‌ను సంప్రదించండి.
  • Drive, Docs, Sheets, అలాగే Slidesలోని కొత్త ఫైళ్లు యాప్‌లోని ప్రాంప్ట్‌ల ద్వారా క్లయింట్-సైడ్ ఎన్‌క్రిప్షన్‌ను ఉపయోగించి క్రియేట్ చేయాలని మీ అడ్మినిస్ట్రేటర్‌కు సిఫార్సు చేసే ఆప్షన్ కూడా ఉంది. మీ సంస్థకు సంబంధించిన అంచనాలు అర్థం చేసుకున్నట్లు నిర్ధారించుకోవడానికి దయచేసి మీ అడ్మిన్‌ను సంప్రదించండి.
  • క్లయింట్-సైడ్ ఎన్‌క్రిప్షన్ అనేది మీ సంస్థకు అదనపు రక్షణ లేయర్‌ను అందిస్తుంది. మీ ఫైల్స్ పూర్తి స్థాయిలో, అలాగే క్లయింట్‌ల మధ్య ఎన్‌క్రిప్ట్ చేయబడ్డాయి. Google మీ ఫైల్స్‌ను డీక్రిప్ట్ చేయలేదు. గుర్తుంచుకోండి:
    • Chrome ఎక్స్‌టెన్షన్‌ల వంటి తగిన అనుమతులు మంజూరు అయి ఉన్న మీ కంప్యూటర్‌లోని యాప్‌లకు, ఎన్‌క్రిప్ట్ చేసిన ఫైల్స్‌ను చూడగల, అలాగే నిర్మూలించగల సామర్థ్యం ఉండవచ్చు.
    • ఎన్‌క్రిప్షన్ అనేది మీ స్క్రీన్‌ను చూడగల వ్యక్తి నుండి మీ ఫైల్స్‌ను రక్షించదు.
  • క్లయింట్-సైడ్ ఎన్‌క్రిప్ట్ చేసిన ఫైల్స్‌ను తెరవడానికి మీరు ఎంత తరచుగా మళ్లీ సైన్ ఇన్ చేయవలసి ఉంటుంది అనేది మీ అడ్మిన్‌పై ఆధారపడి ఉంటుంది. మీరు తరచుగా సైన్ ఇన్ చేయవలసి వస్తే, మీ అడ్మిన్‌ను సంప్రదించండి.
ఎన్‌క్రిప్ట్ చేసిన ఫైల్స్‌కు సంబంధించి ఏ అంశాలు భిన్నంగా ఉంటాయో తెలుసుకోండి
  • ఎన్‌క్రిప్ట్ చేసిన ఫైల్ పక్కన లాక్ కనిపిస్తుంది.
  • ఎన్‌క్రిప్ట్ చేసిన ఫైల్‌ని ఒకే సమయంలో ఒక వ్యక్తి మాత్రమే ఎడిట్ చేయగలరు. ఎన్‌క్రిప్ట్ చేసిన ఫైళ్లలో ఎలా సహకారం పొందాలో తెలుసుకోండి.
  • ఎన్‌క్రిప్ట్ చేసిన ఫైల్స్‌లో, మీ పరికరం ఇన్‌యాక్టివ్‌గా ఉంటే లేదా మీరు ఫైల్‌ను షేర్ చేయడం లేదా ఫైల్ నుండి నిష్క్రమించడానికి ట్రై చేయడం వంటి మరొక చర్యను చేస్తే తప్ప, ప్రతి 30 సెకన్లకు ఆటోమేటిక్ సేవ్ ప్రారంభమవుతుంది.
    • మీరు సేవ్ చేయని ఫైల్ నుండి నిష్క్రమించడానికి ట్రై చేసినట్లయితే, మీకు హెచ్చరిక అందుతుంది. మీ సేవ్ చేయని మార్పులను కోల్పోవడాన్ని నివారించడానికి, రద్దు చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  • ఆటోమేటిక్ సేవ్ 3 స్టేటస్‌లను కలిగి ఉంటుంది:
    • సేవ్ కావడానికి వేచి ఉంది: ఆటోమేటిక్ సేవ్ ట్రిగ్గర్ లేదా 30-సెకన్ల టైమర్ కోసం వేచి ఉంటుంది.
    • సేవ్ చేస్తోంది: సేవ్ చేయడం ప్రోగ్రెస్‌లో ఉంది. మీ ఫైల్‌ను మీరు ఎడిట్ చేయడం కొనసాగించవచ్చు.
    • Driveకు సేవ్ చేయబడింది: మీరు ఎటువంటి మార్పులు చేయలేదు. మీది ప్రస్తుత వెర్షన్.
  • ఎన్‌క్రిప్ట్ చేసిన ఫైల్స్‌ను క్రియేట్ చేయడానికి వివిధ దశలు ఉంటాయి. ఎన్‌క్రిప్ట్ చేసిన ఫైల్స్‌ని ఎలా క్రియేట్ చేయాలో, లేదా కాపీని ఎలా తయారు చేయాలో తెలుసుకోండి.
  • ఎన్‌క్రిప్ట్ చేసిన ఫైల్స్‌ను యాక్సెస్ చేయడానికి, మీ సంస్థ IDP కోసం ఒకసారి, అలాగే Drive, Docs, Sheets, ఇంకా Slides కోసం Googleతో ఒకసారి, అంటే మొత్తం రెండుసార్లు మీరు అదనపు SSO సర్వీస్ కోసం సైన్ ఇన్ చేయాలని మీ అడ్మిన్ కోరవచ్చు.
  • మీరు Docs లేదా Sheets నుండి ప్రింట్ చేయవచ్చు, కానీ Slides నుండి ప్రింట్ చేయలేరు.
  • ఎన్‌క్రిప్ట్ చేసిన Docs, Slides కోసం స్పెల్ చెక్ అమెరికన్ ఇంగ్లీష్, బ్రిటిష్ ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, ఇంకా స్పానిష్ భాషలలో అందుబాటులో ఉంటుంది.
  • Sheetsలో స్పెల్ చెక్ అందుబాటులో లేదు.
  • మీరు Sheets ఫైల్‌ను Excel ఫైల్‌కు ఎగుమతి చేయవచ్చు. ఫైల్ ఆ తర్వాత డౌన్‌లోడ్ చేయండి ఆప్షన్‌కు వెళ్లండి.
  • ఎన్‌క్రిప్ట్ చేసిన ఫైళ్లకు సంబంధించిన వెర్షన్ హిస్టరీ 100 వెర్షన్‌ల వరకు స్టోర్ చేస్తుంది. 100 వెర్షన్‌‌లను మించిన తర్వాత, తక్కువ ప్రాముఖ్యత గల ఫైళ్లు ఆటోమేటిక్‌గా తీసివేయబడతాయి. పేరు పెట్టిన వెర్షన్‌లు ఇంకా అందుబాటులో లేవు.
  • ఎన్‌క్రిప్ట్ చేసిన Docs, Sheets, Slides గరిష్టంగా 100MB సైజ్‌ను కలిగి ఉంటాయి. ఎన్‌క్రిప్ట్ చేసిన Drive ఫైళ్లకు పరిమితి ఉండదు.
  • డాక్యుమెంట్‌లోని ఇమేజ్‌ల గరిష్ఠ సంఖ్య 3,000.
  • ఒక ఇమేజ్ సైజ్ 1MB.
  • ఫోల్డర్‌ను డౌన్‌లోడ్ చేయడం వలన ఎన్‌క్రిప్ట్ చేసిన క్లయింట్-సైడ్ ఫైళ్లు ప్రభావితం కావు.
ఎన్‌క్రిప్ట్ చేసిన ఫైళ్ల కోసం అందుబాటులో లేని వాటి గురించి కనుగొనండి

ఎన్‌క్రిప్ట్ చేసిన ఫైల్స్‌తో, మీరు కింద పేర్కొన్న పనులు చేయలేరు:

  • Docs లేదా Slides కోసం Microsoft Officeను ఎడిట్ మోడ్‌లో తెరవడం
  • Sheets, Slides, Drive ఫైల్స్‌లో కామెంట్ చేయడం
  • Docs, Sheets, లేదా Slidesను ఎడిట్ చేయడానికి మొబైల్ యాప్‌ను ఉపయోగించడం
  • Sheetsలో ఎక్ట్‌టర్నల్ కాల్స్ చేయగల ఫంక్షన్‌లను ఉపయోగించడం
  • Microsoft Office ఫైల్స్‌ని Docs, Sheets లేదా Slides రూపంలోకి దిగుమతి చేసుకోవడం
  • నిర్దిష్ట టూల్స్‌ను ఉపయోగించడం, వీటితో సహా:
    • వ్యాకరణ చెక్
    • డాక్యుమెంట్‌లను అనువదించడం, సరిపోల్చడం
    • వాయిస్ టైపింగ్
    • యాడ్-ఆన్‌లు
  • Docs లేదా Slidesని డౌన్‌లోడ్ చేయడం
  • Docs, Sheets, లేదా Slides కోసం ఫైల్ ప్రివ్యూను ఉపయోగించడం

ఎన్‌క్రిప్ట్ చేసిన ఫైల్స్‌ని క్రియేట్ చేయడం లేదా కాపీ చేయడం

ముఖ్య గమనిక: ఎన్‌క్రిప్ట్ చేసిన ఫైల్స్‌ను క్రియేట్ లేదా కాపీ చేయడానికి, మీరు:

  • ఆఫీస్ లేదా పాఠశాల ఖాతాకు సైన్ ఇన్ చేయాలి
  • మీ అడ్మిన్ ద్వారా ఎనేబుల్ చేయబడిన క్లయింట్-సైడ్ ఎన్‌క్రిప్షన్‌ను కలిగి ఉండాలి
  • మీ ఖాతా ఫైల్స్‌ను క్రియేట్ చేయగలదని వెరిఫై చేయాలి
కొత్త ఎన్‌క్రిప్ట్ చేసిన ఫైల్‌ను క్రియేట్ చేయండి

ఎన్‌క్రిప్ట్ చేసిన డాక్యుమెంట్, స్ప్రెడ్‌షీట్ లేదా ప్రెజెంటేషన్‌ను క్రియేట్ చేయడానికి, ఒక ఆప్షన్‌ను ఎంచుకోండి:

Google Drive నుండి:

  1. drive.google.comకు వెళ్లండి.
  2. ఎగువున ఎడమ వైపున, కొత్తది ని క్లిక్ చేయండి.
  3. Docs, Sheets లేదా Slides పక్కన ఉండే బాణం గుర్తు ఆ తర్వాతకు పాయింట్ చేసి, ఖాళీగా ఉండే, ఎన్‌క్రిప్ట్ చేసిన డాక్యుమెంట్/స్ప్రెడ్‌షీట్/ప్రెజెంటేషన్‌పై క్లిక్ చేయండి.
  4. “ఎన్‌క్రిప్ట్ చేసిన కొత్త డాక్యుమెంట్” విండోలో, క్రియేట్ చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

Google Docs, Sheets లేదా Slides నుండి:

  1. Google డాక్స్, షీట్ లేదా స్లయిడ్‌ను తెరవండి.
  2. పైభాగంలో, ఫైల్‌ను క్లిక్ చేయండి.
  3. కొత్తది ఆ తర్వాత పాయింట్ చేసి, కొత్త ఎన్‌క్రిప్ట్ చేసిన కొత్త డాక్యుమెంట్/స్ప్రెడ్‌షీట్/ప్రెజెంటేషన్‌ను క్లిక్ చేయండి.
  4. “ఎన్‌క్రిప్ట్ చేసిన కొత్త డాక్యుమెంట్” విండోలో, క్రియేట్ చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

చిట్కాలు:

  • మీ అడ్మిన్ CSEని ఆటోమేటిక్‌గా ఎనేబుల్ చేస్తే, "కొత్త/ఖాళీ ఎన్‌క్రిప్ట్ చేసిన డాక్యుమెంట్/స్ప్రెడ్‌షీట్/ప్రెజెంటేషన్"ఫైల్ ఆ తర్వాతకొత్త మెనూ కింద సిఫార్సు చేయబడిన ఆప్షన్‌గా కనిపిస్తుంది.
  • మీరు షేర్ చేసిన ఫోల్డర్‌లో ఎన్‌క్రిప్ట్ చేసిన ఫైల్‌ను క్రియేట్ చేస్తే, ఫోల్డర్‌కు ఎలాంటి యాక్సెస్ ఉంటుందో అదే యాక్సెస్ ఆ ఎన్‌క్రిప్ట్ చేసిన ఫైల్‌కు కూడా లభిస్తుంది.
  • ఎన్‌క్రిప్ట్ చేసిన ఖాళీ డాక్యుమెంట్/స్ప్రెడ్‌షీట్/ప్రెజెంటేషన్ లేదా ఎన్‌క్రిప్ట్ చేసిన కొత్త డాక్యుమెంట్/స్ప్రెడ్‌షీట్/ప్రెజెంటేషన్ కోసం ఆప్షన్‌లు అందుబాటులో లేకుంటే:
ఎన్‌క్రిప్ట్ చేసిన కొత్త ఫైల్‌ను అప్‌లోడ్ చేయండి
  1. drive.google.comకు వెళ్లండి.
  2. ఎగువున ఎడమ వైపున, కొత్తది ని క్లిక్ చేయండి.
  3. ఫైల్ అప్‌లోడ్ ఆ తర్వాతకు పక్కన ఉన్న బాణానికి పాయింట్ చేసి, ఎన్‌క్రిప్ట్ చేసి, ఫైల్‌ను అప్‌లోడ్ చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

చిట్కాలు:

  • మీ అడ్మిన్ ఆటోమేటిక్‌గా CSEను ఎనేబుల్ చేస్తే, కొత్త+ మెనూలో "ఎన్‌క్రిప్ట్, ఇంకా అప్‌లోడ్" అనేది సిఫార్సు చేయబడిన ఆప్షన్‌గా కనిపిస్తుంది.
  • మీరు షేర్ చేసిన ఫోల్డర్‌లో ఎన్‌క్రిప్ట్ చేసిన ఫైల్‌ను అప్‌లోడ్ చేస్తే, ఫోల్డర్‌కు ఎలాంటి యాక్సెస్ ఉంటుందో అదే యాక్సెస్ ఆ ఎన్‌క్రిప్ట్ చేసిన ఫైల్‌కు కూడా లభిస్తుంది.
  • ఫైల్‌ను ఎన్‌క్రిప్ట్ చేసి అప్‌లోడ్ చేసే ఆప్షన్ అందుబాటులో లేకపోతే:
ఎన్‌క్రిప్ట్ చేసిన ఫైల్‌ను కాపీ చేయండి

Google Drive నుండి:

  1. ఫైల్‌పై కుడి క్లిక్ చేయండి.
  2. కాపీని రూపొందించు ఆ తర్వాత కాపీని రూపొందించు  క్లిక్ చేయండి (Drive ఫైల్స్‌కి మాత్రమే అందుబాటులో ఉంటుంది, Google Docs, Sheets లేదా Slidesకు కాదు).
  3. ఫైల్ ఒకవేళ:
    • అదనపు ఎన్‌క్రిప్షన్‌ను కలిగి ఉంటే, మీరు డిక్రిప్టెడ్ కాపీని రూపొందించవచ్చు కూడా.
    • అదనపు ఎన్‌క్రిప్షన్‌ను కలిగి లేకపోతే, మీరు ఎన్‌క్రిప్టెడ్ కాపీని తయారు చేయవచ్చు కూడా.

Google Docs, Sheets లేదా Slides నుండి:

  1. ఎన్‌క్రిప్ట్ చేసిన Google Docs, Sheets, లేదా Slides ఫైల్‌ను తెరవండి.
  2. ఎగువన ఎడమ వైపున, ఫైల్ ఆ తర్వాత కాపీని రూపొందించండి ఆ తర్వాత కాపీని రూపొందించండి క్లిక్ చేయండి.
  3. ఫైల్ ఒకవేళ:
    • అదనపు ఎన్‌క్రిప్షన్‌ను కలిగి ఉంటే, మీరు డిక్రిప్టెడ్ కాపీని రూపొందించవచ్చు కూడా.
    • అదనపు ఎన్‌క్రిప్షన్‌ను కలిగి లేకపోతే, మీరు ఎన్‌క్రిప్టెడ్ కాపీని తయారు చేయవచ్చు కూడా.

చిట్కాలు:

  • మీ అడ్మిన్ ఆటోమేటిక్‌గా CSEని ప్రారంభిస్తే, ఎన్‌క్రిప్ట్ చేసిన కాపీని రూపొందించండి ఫైల్ ఆ తర్వాత కాపీని రూపొందించండి మెనూ కింద సిఫార్సు చేయబడిన ఆప్షన్‌గా కనిపిస్తుంది.
  • ఎన్‌క్రిప్ట్ చేసిన కాపీని రూపొందించండి లేదా డిక్రిప్ట్ చేసిన కాపీని రూపొందించండి ఆప్షన్‌లు అందుబాటులో లేకపోతే:
    • మీరు మీ ఆఫీస్ లేదా స్కూల్ ఖాతాకు లాగిన్ చేసినట్లు నిర్ధారించండి.
    • మీ అడ్మిన్, క్లయింట్-సైడ్ ఎన్‌క్రిప్షన్‌ను ఎనేబుల్ చేస్తున్నారో లేదో చెక్ చేయండి.
డాక్యుమెంట్‌కు ఎన్‌క్రిప్షన్‌ను జోడించండి
  1. Google Doc, Sheet లేదా Slideను తెరవండి.
  2. ఎగువున, ఫైల్ ఆ తర్వాత కాపీని రూపొందించండి ఆ తర్వాత అదనపు ఎన్‌క్రిప్షన్‌ను జోడించండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

చిట్కాలు:

  • మీ అడ్మిన్ ఆటోమేటిక్‌గా CSEని ఎనేబుల్ చేస్తే, "ఎన్‌క్రిప్ట్ చేసిన కాపీని రూపొందించండి" అనేది ఫైల్ ఆ తర్వాత కాపీని రూపొందించండి మెనూ కింద సిఫార్సు చేయబడిన ఆప్షన్‌గా కనిపిస్తుంది.
  • క్లయింట్-సైడ్ ఎన్‌క్రిప్షన్ ద్వారా సపోర్ట్ చేయని ఫీచర్‌లు స్టాటిక్‌గా ఉంటాయి లేదా తీసివేయడం జరుగుతుంది.
    • స్టాటిక్‌గా చేసిన ఫీచర్‌లు:
      • చెక్‌లిస్ట్‌లు
      • పొందుపరచిన డ్రాయింగ్‌లు, చార్ట్‌లు, టేబుల్స్
      • లింక్ చేసిన ఫారమ్‌లు
      • GOOGLEFINANCE వంటి ఎక్స్‌టర్నల్ డేటా ఫంక్షన్‌లు
      • కనెక్ట్ చేయబడిన షీట్‌లు
      • WordArt
    • డాక్యుమెంట్ నుండి తీసివేసిన ఫీచర్‌లు:
      • ఈ-సిగ్నేచర్ ఫీల్డ్స్
      • కామెంట్‌లు, సూచనలు
      • రక్షిత పరిధులు
      • Apps Script, యాడ్-ఆన్‌లు
  • ఎన్‌క్రిప్షన్‌ను జోడించండి అనే ఆప్షన్ డిస్‌ప్లే కాకపోతే:
    • మీరు మీ ఆఫీస్ లేదా స్కూల్ ఖాతాకు లాగిన్ చేసినట్లు నిర్ధారించుకోండి.
    • మీ అడ్మిన్, క్లయింట్-సైడ్ ఎన్‌క్రిప్షన్‌ను అనుమతిస్తున్నారో లేదో చెక్ చేయండి.
    • మీరు నా డ్రైవ్‌లోని డాక్యుమెంట్‌కు ఓనర్ అని లేదా షేర్ చేసిన డ్రైవ్‌కు మేనేజర్ అని నిర్ధారించండి.
    • మీ గుర్తింపును వెరిఫై చేయండి. మీ ఐడెంటిటీ ప్రొవైడర్‌తో ఎలా కనెక్ట్ చేయాలో తెలుసుకోండి.
డాక్యుమెంట్‌కు ఎన్‌క్రిప్షన్‌ను తీసివేయండి
  1. Google Doc, Sheet లేదా Slideను తెరవండి.
  2. ఎగువున, ఫైల్ ఆ తర్వాత కాపీని రూపొందించండి ఆ తర్వాత అదనపు ఎన్‌క్రిప్షన్‌ను తీసివేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

చిట్కాలు:

  • ఎన్‌క్రిప్షన్‌ను తీసివేయండి అనే ఆప్షన్ డిస్‌ప్లే కాకపోతే:
    • మీరు మీ ఆఫీస్ లేదా స్కూల్ ఖాతాకు లాగిన్ చేసినట్లు నిర్ధారించుకోండి.
    • మీ అడ్మిన్, క్లయింట్-సైడ్ ఎన్‌క్రిప్షన్‌ను అనుమతిస్తున్నారో లేదో చెక్ చేయండి.
    • మీరు నా డ్రైవ్‌లోని డాక్యుమెంట్‌కు ఓనర్ అని లేదా షేర్ చేసిన డ్రైవ్‌కు మేనేజర్ అని నిర్ధారించండి.
    • మీ గుర్తింపును వెరిఫై చేయండి. మీ ఐడెంటిటీ ప్రొవైడర్‌తో ఎలా కనెక్ట్ చేయాలో తెలుసుకోండి.

Driveలో ఎన్‌క్రిప్ట్ చేసిన Excel ఫైల్స్‌తో ఎలా పని చేయాలో తెలుసుకోండి

ఎన్‌క్రిప్ట్ చేసిన Excel ఫైల్స్‌తో పని చేయడానికి వేర్వేరు మార్గాలు ఉన్నాయి. మీరు వీటిని చేయవచ్చు:

  • Excel డేటాను Sheetsలోకి దిగుమతి చేయడం.
  • Sheets ఫైల్ తాలూకు కాపీని Excel ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ చేయడం.
Excel డేటాను Sheetsలోకి దిగుమతి చేయడం

మీరు Excel ఫైల్ నుండి డేటాను కొత్త ఎన్‌క్రిప్ట్ చేసిన Sheets ఫైల్‌కు దిగుమతి చేయవచ్చు. మీరు ఎన్‌క్రిప్ట్ చేసిన Sheets ఫైల్‌ను మార్చినప్పటికీ, మీ Excel ఫైల్ మార్చబడదు.

  1. Sheetsలో, కొత్తదాన్ని క్రియేట్ చేయండి లేదా అందుబాటులో ఉన్న ఎన్‌క్రిప్ట్ చేసిన Excel ఫైల్‌ను తెరవండి.
  2. ఎగువన ఎడమ వైపున, ఫైల్ ఆ తర్వాత దిగుమతి క్లిక్ చేయండి.
  3. Excel ఫైల్‌ను ఎంచుకోండి.
  4. ఎంచుకోండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  5. దిగుమతి చేయండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి:
    • కొత్త స్ప్రెడ్‌షీట్‌ను క్రియేట్ చేయండి
    • కొత్త షీట్(ల)ను ఇన్‌సర్ట్ చేయండి
  6. డేటాను దిగుమతి చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

చిట్కాలు:

  • మీరు .xlsx ఎక్స్‌టెన్షన్‌తో మాత్రమే Excel ఫైల్స్‌ని దిగుమతి చేసుకోవచ్చు.
  • మీరు దిగుమతి చేస్తున్నప్పుడు, Sheetsలో సపోర్ట్ లేని Excel ఫీచర్‌లు విస్మరించబడతాయి.
  • గరిష్ఠ ఫైల్ సైజ్‌: 100MB
  • గరిష్ఠ సెల్స్ సంఖ్య: 10M
  • గరిష్ఠ ఇమేజ్‌ల సంఖ్య: 3000
Sheets ఫైల్‌ని Excel ఫైల్‌లోకి ఎలా డౌన్‌లోడ్ చేయాలో తెలుసుకోండి

మీరు Excel ఫార్మాట్‌లో ఎన్‌క్రిప్ట్ చేసిన Sheets ఫైల్ కాపీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

  1. Sheetsలో, ఎగువన ఎడమ వైపున, ఫైల్ ఆ తర్వాత డౌన్‌లోడ్, డిక్రిప్ట్ క్లిక్ చేయండి.
  2. Microsoft Excel (.xlsx)ను క్లిక్ చేయండి.

సంబంధిత ఆర్టికల్స్

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
953059895172188894
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
35
false
false