Google Workspace యాడ్-ఆన్‌లు

Docs, Sheets, Slidesలతో మరిన్ని చేయడానికి Google Workspace యాడ్-ఆన్‌లు మిమ్మల్ని అనుమతిస్తాయి. 

యాడ్-ఆన్‌ను ఇన్‌స్టాల్ చేయండి

  1. మీ కంప్యూటర్‌లో, డాక్యుమెంట్, షీట్ లేదా స్లయిడ్‌ను తెరవండి.
  2. కుడి వైపున, యాడ్-ఆన్‌లను పొందండి జోడించుని క్లిక్ చేయండి.
  3. యాడ్-ఆన్‌కు సంబంధించిన వివరణను కనుగొనడానికి, దానిపై క్లిక్ చేయండి.
  4. ఇన్‌స్టాల్ చేయి ఆ తర్వాత కొనసాగించును క్లిక్ చేయండి.
  5. యాడ్-ఆన్‌లను పని చేయడానికి అనుమతించడానికి, “యాక్సెస్‌ను రిక్వెస్ట్ చేయి” మెసేజ్‌ను చదివి, అనుమతించును క్లిక్ చేయండి.
  6. యాడ్-ఆన్ ఇన్‌స్టాల్ అయిన తర్వాత, పూర్తయింది ఆ తర్వాతని క్లిక్ చేయండి. 

ముఖ్యమైనది:

  • కుడి వైపున సైడ్‌బార్‌లో Google Workspace యాడ్-ఆన్‌లను కనుగొని, ఉపయోగించండి.
  • ఇతర యాడ్-ఆన్‌లను కనుగొనడానికి, మెనూలో, ఎక్స్‌టెన్షన్‌లు ఆ తర్వాత యాడ్-ఆన్‌లు అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి. 
  • మీరు యాడ్-ఆన్‌ను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మీ యాడ్-ఆన్ కనిపించకపోతే, దాన్ని మీ సైడ్‌బార్‌కు జోడించడానికి మీ డాక్యుమెంట్, షీట్, లేదా స్లయిడ్‌ను రిఫ్రెష్ చేయండి.
  • యాడ్-ఆన్‌లను ఎలా ఉపయోగించాలి అనే దాని గురించి మరింత తెలుసుకోండి.  

యాడ్-ఆన్‌ను అన్ఇన్‌స్టాల్ చేయండి

  1. మీ కంప్యూటర్‌లో, డాక్యుమెంట్, షీట్ లేదా స్లయిడ్‌ను తెరవండి.
  2. కుడి వైపున, మీరు అన్‌ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్న యాడ్-ఆన్‌ను క్లిక్ చేయండి.
  3. మరిన్ని మరిన్ని ఆ తర్వాత యాడ్-ఆన్‌లను మేనేజ్ చేయండిని క్లిక్ చేయండి.
  4. మీరు అన్‌ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్న యాడ్-ఆన్ పక్కన, ఆప్షన్‌లు మరిన్ని ఆ తర్వాత అన్‌ఇన్‌స్టాల్ చేయిని క్లిక్ చేయండి.

యాడ్-ఆన్‌లను అన్‌ఇన్‌స్టాల్ చేయడానికి మరొక మార్గం ఎక్స్‌టెన్షన్‌లు ఆ తర్వాత యాడ్-ఆన్‌లు ఆ తర్వాత యాడ్-ఆన్‌లను మేనేజ్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయడం. మీరు ఈ విధంగా Google Workspace యాడ్-ఆన్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేస్తే, మీ సైడ్‌బార్ నుండి దాన్ని తీసివేయడానికి, మీ డాక్యుమెంట్, షీట్, లేదా స్లయిడ్‌ను రీలోడ్ చేయండి.

ముఖ్య గమనిక: కొన్ని ఆఫీస్, స్కూల్ ఖాతాలలో వారి సంస్థ ద్వారా ఇన్‌స్టాల్ చేయబడిన యాడ్-ఆన్‌లు ఉంటాయి. ఈ యాడ్-ఆన్‌లను అన్‌ఇన్‌స్టాల్ చేయడానికి, మీ అడ్మినిస్ట్రేటర్‌ను కాంటాక్ట్ చేయండి

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
18101219031276295166
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
35
false
false