Docs, Sheets, Slidesలతో మరిన్ని చేయడానికి Google Workspace యాడ్-ఆన్లు మిమ్మల్ని అనుమతిస్తాయి.
యాడ్-ఆన్‌ను ఇన్స్టాల్ చేయండి
- మీ కంప్యూటర్లో, డాక్యుమెంట్, షీట్ లేదా స్లయిడ్‌ను తెరవండి.
- కుడి వైపున, యాడ్-ఆన్‌లను పొందండి ని క్లిక్ చేయండి.
- యాడ్-ఆన్‌కు సంబంధించిన వివరణను కనుగొనడానికి, దానిపై క్లిక్ చేయండి.
- ఇన్స్టాల్ చేయి కొనసాగించును క్లిక్ చేయండి.
- యాడ్-ఆన్‌లను పని చేయడానికి అనుమతించడానికి, “యాక్సెస్‌ను రిక్వెస్ట్ చేయి” మెసేజ్‌ను చదివి, అనుమతించును క్లిక్ చేయండి.
- యాడ్-ఆన్ ఇన్స్టాల్ అయిన తర్వాత, పూర్తయింది ని క్లిక్ చేయండి.
ముఖ్యమైనది:
- కుడి వైపున సైడ్‌బార్‌లో Google Workspace యాడ్-ఆన్‌లను కనుగొని, ఉపయోగించండి.
- ఇతర యాడ్-ఆన్‌లను కనుగొనడానికి, మెనూలో, ఎక్స్టెన్షన్లు యాడ్-ఆన్లు అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
- మీరు యాడ్-ఆన్‌ను ఇన్స్టాల్ చేసిన తర్వాత మీ యాడ్-ఆన్ కనిపించకపోతే, దాన్ని మీ సైడ్బార్కు జోడించడానికి మీ డాక్యుమెంట్, షీట్, లేదా స్లయిడ్‌ను రిఫ్రెష్ చేయండి.
- యాడ్-ఆన్‌లను ఎలా ఉపయోగించాలి అనే దాని గురించి మరింత తెలుసుకోండి.
యాడ్-ఆన్‌ను అన్ఇన్స్టాల్ చేయండి
- మీ కంప్యూటర్లో, డాక్యుమెంట్, షీట్ లేదా స్లయిడ్‌ను తెరవండి.
- కుడి వైపున, మీరు అన్ఇన్స్టాల్ చేయాలనుకుంటున్న యాడ్-ఆన్‌ను క్లిక్ చేయండి.
- మరిన్ని యాడ్-ఆన్‌లను మేనేజ్ చేయండిని క్లిక్ చేయండి.
- మీరు అన్ఇన్స్టాల్ చేయాలనుకుంటున్న యాడ్-ఆన్ పక్కన, ఆప్షన్లు అన్ఇన్స్టాల్ చేయిని క్లిక్ చేయండి.
యాడ్-ఆన్‌లను అన్ఇన్స్టాల్ చేయడానికి మరొక మార్గం ఎక్స్టెన్షన్లు యాడ్-ఆన్లు యాడ్-ఆన్‌లను మేనేజ్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయడం. మీరు ఈ విధంగా Google Workspace యాడ్-ఆన్‌ను అన్ఇన్స్టాల్ చేస్తే, మీ సైడ్బార్ నుండి దాన్ని తీసివేయడానికి, మీ డాక్యుమెంట్, షీట్, లేదా స్లయిడ్‌ను రీలోడ్ చేయండి.
ముఖ్య గమనిక: కొన్ని ఆఫీస్, స్కూల్ ఖాతాలలో వారి సంస్థ ద్వారా ఇన్స్టాల్ చేయబడిన యాడ్-ఆన్లు ఉంటాయి. ఈ యాడ్-ఆన్‌లను అన్ఇన్స్టాల్ చేయడానికి, మీ అడ్మినిస్ట్రేటర్‌ను కాంటాక్ట్ చేయండి.