Chromeలో బ్రౌజింగ్ డేటాను క్లియర్ చేయండి

మీ బ్రౌజింగ్ హిస్టరీని, సేవ్ చేసిన ఫారమ్ ఎంట్రీల వంటి ఇతర బ్రౌజింగ్ డేటాను మీరు తొలగించవచ్చు లేదా నిర్దిష్ట తేదీ నుండి డేటాను తొలగించవచ్చు.

మీ సమాచారానికి ఏమైంది

తొలగించగలిగే డేటా
  • బ్రౌజింగ్ హిస్టరీ: మీ బ్రౌజింగ్ హిస్టరీని క్లియర్ చేయడం వలన ఈ కిందివి తొలగించబడతాయి:
    • హిస్టరీ పేజీ నుండి మీరు సందర్శించిన వెబ్ అడ్రస్‌లు తీసివేయబడతాయి.
    • కొత్త ట్యాబ్ పేజీ నుండి ఆ పేజీలకు షార్ట్‌కట్‌లు తీసివేయబడతాయి.
    • ఆ వెబ్‌సైట్‌లకు అడ్రస్ బార్ సూచనలు ఇకపై చూపబడవు.
  • ట్యాబ్‌లు: మీ పరికరంలో తెరవబడిన ట్యాబ్‌లు మూసివేయబడతాయి.
  • కుక్కీలు, సైట్ డేటా
    • కుక్కీలు: బ్రౌజింగ్ సమాచారాన్ని సేవ్ చేయడం ద్వారా మీ ఆన్‌లైన్ ఎక్స్‌పీరియన్స్‌ను సులభతరం చేయడానికి మీరు బ్రౌజ్ చేసే వెబ్‌సైట్‌ల ద్వారా క్రియేట్ చేయబడిన ఫైల్స్ ఇవి. కుక్కీలను తొలగించవచ్చు.
    • సైట్ డేటా: అప్లికేషన్ కాష్‌లు, వెబ్ స్టోరేజ్ డేటా, వెబ్ SQL డేటాబేస్ డేటా, ఇండెక్స్ చేయబడిన డేటాబేస్ డేటాతో సహా HTML5 ఎనేబుల్ చేయబడిన స్టోరేజ్ రకాలు తొలగించబడతాయి.
    • మీడియా లైసెన్స్‌లు: మీరు ప్లే చేసిన లేదా డౌన్‌లోడ్ చేసిన సినిమాలు లేదా మ్యూజిక్, వంటి HTML5 సురక్షిత కంటెంట్‌కు లైసెన్స్‌లు తొలగించబడతాయి.
  • కాష్ చేయబడిన ఇమేజ్‌లు, ఫైల్‌లు: మీ తర్వాతి సందర్శన సమయంలో పేజీలను వేగంగా తెరవడానికి సహాయపడేందుకు Chrome పేజీల భాగాలను గుర్తుంచుకుంటుంది. Chromeలో మీరు బ్రౌజ్ చేసిన పేజీల నుండి టెక్స్ట్, ఇమేజ్‌లు తీసివేయబడతాయి.
  • సేవ్ చేయబడిన పాస్‌వర్డ్‌లు: మీరు సేవ్ చేసిన పాస్‌వర్డ్‌లు తొలగించబడతాయి.
  • ఆటోఫిల్ ఫారమ్ డేటా: మీ అడ్రస్ర్‌లు, క్రెడిట్ కార్డ్‌లతో సహా మీ ఆటోఫిల్ ఎంట్రీలు తొలగించబడతాయి. Google Pay ఖాతా నుండి కార్డ్‌లు తొలగించబడలేదు.
  • సైట్ సెట్టింగ్‌లు: మీరు సైట్‌లకు ఇచ్చిన సెట్టింగ్‌లు, అనుమతులు తొలగించబడతాయి. ఉదాహరణకు, సైట్ JavaScriptను రన్ చేయగలగడం మీ కెమెరాను ఉపయోగించడం, లేదా మీ లొకేషన్‌ను తెలుసుకోవడం.
తొలగించబడని డేటా

ఆన్‌లైన్‌లో మీ ప్రవర్తనకు సంబంధించి ఇతర రకాల డేటా ఉంది. ఈ ఇతర రకాల డేటా విడిగా తొలగించబడుతుంది:

మీ పరికరాన్ని ఇచ్చేస్తుంటే, మీ బ్రౌజింగ్ డేటాను తొలగించాలని గుర్తుంచుకోండి, ఆపై Chrome నుండి సైన్ అవుట్ చేయండి.

మీ బ్రౌజింగ్ డేటాను తొలగించండి

మీరు ఒక రకమైన డేటాను సింక్ చేస్తే, మీ Android పరికరంలో దానిని తొలగించడం అది సింక్ అయిన ప్రతి చోటా దానిని తొలగిస్తుంది. ఇది మీ ఇతర పరికరాలు, Google ఖాతా నుండి తీసివేయబడుతుంది.

  1. మీ Android పరికరంలో, Chrome Chromeను తెరవండి.
  2. మరిన్ని మరిన్ని ఆ తర్వాత బ్రౌజింగ్ డేటాను క్లియర్ చేయండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
    • బ్రౌజింగ్ హిస్టరీని (తెరిచి ఉన్న ట్యాబ్‌లతో సహా) తొలగించడానికి, వ్యవధిని ఎంచుకుని, డేటాను క్లియర్ చేయండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి. ఆటోమేటిక్ వ్యవధి 15 నిమిషాలు.
    • మీరు తొలగించాలనుకుంటున్న మరింత నిర్దిష్ట రకాల డేటాను ఎంచుకోవడానికి, మరిన్ని ఆప్షన్‌లు ఆప్షన్‌ను ట్యాప్ చేయండి. మీరు తొలగించాలనుకుంటున్న బ్రౌజింగ్ డేటా రకాలను ఎంచుకుని, డేటాను క్లియర్ చేయండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

చిట్కాలు:

  • మీరు కుక్కీలను తొలగించి, సింక్‌ను ఆన్ చేసి ఉన్నట్లయితే, మీ Google ఖాతాలోకి Chrome మిమ్మల్ని సైన్ ఇన్ చేసి ఉంచుతుంది. ఇతర పరికరాలు, Google ఖాతా నుండి మీ కుక్కీలు తీసివేయబడతాయి.
  • అన్ని వెబ్‌సైట్‌లలో మీ Google ఖాతా నుండి సైన్ అవుట్ చేయడానికి, Chrome నుండి సైన్ అవుట్ చేయండి.
  • అడ్రస్ బార్‌లో బ్రౌజింగ్ డేటాను క్లియర్ చేయండి డైలాగ్‌ను త్వరగా యాక్సెస్ చేయడానికి, “బ్రౌజింగ్ డేటాను క్లియర్ చేయండి” అని టైప్ చేసి, ఆపై యాక్షన్ చిప్ ఆప్షన్‌ను ట్యాప్ చేయండి. టాస్క్‌లను త్వరగా పూర్తి చేయడానికి Chrome చర్యలను గురించి తెలుసుకోండి.
విడిగా ఉన్న ఐటెమ్‌లను తొలగించండి

మీ బ్రౌజింగ్ డేటా మొత్తం కేటగిరీలను తొలగించడానికి బదులుగా, మీరు తొలగించే ఐటెమ్‌లను ఎంచుకోవచ్చు:

సంబంధిత రిసోర్స్‌లు

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
10590462166260889959
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
237
false
false