Chrome ఉపయోగించి వెబ్‌లో సెర్చ్ చేయండి

మీరు ఇంటర్నెట్‌లోనూ, మీ బుక్‌మార్క్‌లలోనూ, ఇంకా మీ బ్రౌజింగ్ హిస్టరీలోను సెర్చ్ చేస్తున్న వాటిని త్వరగా కనుగొనవచ్చు. మీ ఆటోమేటిక్ సెర్చ్ ఇంజిన్ Chrome ఫీచర్‌కు సపోర్ట్‌ను అందించకపోతే, అది అందుబాటులో ఉండకపోవచ్చు.
  1. మీ కంప్యూటర్‌లో, Chromeను తెరవండి.
  2. పైన ఉన్న అడ్రస్ బార్‌లో, మీరు సెర్చ్ చేయాలనుకున్న దానిని ఎంటర్ చేయండి.
  3. ఫలితాన్ని ఎంచుకోండి లేదా Enterను నొక్కండి.

చిట్కా: మీ సెర్చ్‌ను ఎంటర్ చేశాక, మీ వెబ్, యాప్ యాక్టివిటీ ఆధారంగా మీరు సూచనలను పొందవచ్చు. మీరు మీ సెర్చ్ హిస్టరీ నుండి సూచనలను తొలగించవచ్చు లేదా సూచనలు కనిపించినప్పుడు, మీ యాక్టివిటీ ఆధారంగా వచ్చే సూచనల విభాగాలను దాచవచ్చు. మీ యాక్టివిటీ గురించి మరింత తెలుసుకోండి.

పేజీలోనే సెర్చ్ చేయండి

మీరు మీ కంప్యూటర్‌లోని వెబ్ పేజీలో నిర్దిష్టమైన పదం లేదా పదబంధాన్ని కనుగొనవచ్చు.

  1. మీ కంప్యూటర్‌లో, పేజీని Chromeలో తెరవండి.
  2. ఎగువ కుడి వైపున ఉన్న మరిన్ని నిర్వహించండి ఆ తర్వాత కనుగొని ఎడిట్ చేయండి ఆ తర్వాత కనుగొనండి... ఆప్షన్‌ను ఎంచుకోండి.
  3. సెర్చ్ విండోలో, మీ సెర్చ్ క్వెరీని ఎంటర్ చేయండి.
  4. పేజీని సెర్చ్ చేయడానికి Enterను నొక్కండి.
    • మ్యాచ్‌లు పసుపు రంగులో హైలైట్ చేయబడి ఉంటాయి. కుడివైపున ఉన్న స్క్రోల్‌బార్‌లో, పేజీలో మ్యాచ్‌లు ఎక్కడ ఉన్నాయో పసుపు రంగు గుర్తులు చూపుతాయి.

చిట్కా: పదాన్ని లేదా పదబంధాన్ని త్వరగా కనుగొనడానికి, మీరు Ctrl + f (Windows, Linux, ChromeOS) లేదా  + f (Mac) కీబోర్డ్‌ షార్ట్‌కట్‌లను కూడా ఉపయోగించవచ్చు.
పదాల కోసం సెర్చ్ చేయండి

మీరు పేజీలో నిర్దిష్ట పదం లేదా పదబంధం గురించి మరింత సమాచారాన్ని కనుగొనవచ్చు.

  1. మీ కంప్యూటర్‌లో, పేజీని Chromeలో తెరవండి.
  2. పదం లేదా పదబంధాన్ని హైలైట్ చేయండి.
    • PCలో: హైలైట్ చేసిన కంటెంట్‌పై కుడి క్లిక్ చేయండి.
    • Macలో: Ctrlను నొక్కి పట్టుకుని, హైలైట్ అయిన కంటెంట్‌పై క్లిక్ చేయండి.
  3. మీ ఆటోమేటిక్ సెర్చ్ ఇంజిన్‌తో సెర్చ్ చేయడానికి ఆప్షన్‌ను క్లిక్ చేయండి. ఉదాహరణకు, "ఎంపరర్ పెంగ్విన్ కోసం Googleలో సెర్చ్ చేయండి" వంటి ఆప్షన్ మీకు కనిపించవచ్చు.

చిట్కాలు:

  • మీరు మీ ప్రాధాన్య భాషలోకి అనువదించవచ్చు లేదా మీరు పదాన్ని లేదా పదబంధాన్ని ఎంచుకున్నప్పుడు దాని నిర్వచనాన్ని పొందవచ్చు.
  • మీరు నంబర్‌ను ఎంచుకున్నప్పుడు యూనిట్లను మార్చవచ్చు.
ఇమేజ్‌లతో వెబ్‌లో సెర్చ్ చేయండి

మీరు Google Lensతో ఒక ఇమేజ్ గురించి మరింత తెలుసుకోవచ్చు. ఉదాహరణకు, మీరు ఒక డ్రెస్ ఫోటోను ఎక్కడ కొనుగోలు చేయాలనే దాని కోసం సెర్చ్ చేయవచ్చు, అలాంటి డ్రెస్‌లను కనుగొనవచ్చు లేదా వెబ్‌లో మరెక్కడైనా ఆ ఇమేజ్‌ను కనుగొనవచ్చు.

ముఖ్య గమనిక: Googleను మీ ఆటోమేటిక్ సెర్చ్ ఇంజిన్‌గా సెట్ చేయండి.

ఇమేజ్ గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి:

  1. మీ కంప్యూటర్‌లో, Chromeను తెరవండి.
  2. ఏదైనా ఒక వెబ్‌సైట్‌కు వెళ్లండి.
  3. ఇమేజ్‌పై కుడి క్లిక్ చేయండి.
  4. మెనూలో, Googleతో ఇమేజ్‌ను సెర్చ్ చేయండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
    • మీరు ఇమేజ్ వెలుపల ఎక్కడైనా కుడి క్లిక్ చేస్తే, మెనూలో, Googleతో ఇమేజ్‌లను సెర్చ్ చేయండి అనే ఆప్షన్‌ను ఎంచుకొని, లాగి ఇమేజ్‌ను ఎంచుకోవచ్చు.

చిట్కాలు:

  • సైడ్ ప్యానెల్‌లో సెర్చ్ ఫలితాలు డిస్‌ప్లే అవుతాయి. వాటిని కొత్త ట్యాబ్‌లో డిస్‌ప్లే చేయడానికి, తెరవండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  • సైడ్ ప్యానెల్‌లో ఇమేజ్‌ను సెర్చ్ చేయడానికి, ఇమేజ్ ఆధారంగా సెర్చ్ చేయండి అనే ఆప్షన్‌ను లేదా ఈ పేజీలో ఇమేజ్‌ను సెర్చ్ చేయండి అనే ఆప్షన్ దిగువున ఉన్న సూచించిన ఇమేజ్‌ను క్లిక్ చేయండి. సూచించిన ఇమేజ్‌లు మీ పరికరంలోనే ఉంటాయి, Googleతో షేర్ చేయబడవు. సూచించిన ఇమేజ్‌పై మీరు క్లిక్ చేసినప్పుడు, ఆ ఇమేజ్‌కు సంబంధించిన సమాచారాన్ని Google కలెక్ట్ చేయవచ్చు.
Google Search సైడ్ ప్యానెల్‌తో వెబ్ పేజీలను సెర్చ్ చేయడం

Google Search సైడ్ ప్యానెల్‌తో, మీరు బ్రౌజ్ చేసే సైట్‌లు, మీరు ఉపయోగించే సెర్చ్ టూల్స్‌కు సంబంధించిన మరింత సమాచారాన్ని యాక్సెస్ చేయవచ్చు.

ఏదైనా సైట్ తెరిచి ఉన్నప్పుడు, Google Search సైడ్ ప్యానెల్‌ను తెరిచి ఆర్టికల్స్, ఇతర వెబ్ పేజీలలోని ముఖ్యమైన పాయింట్‌లను తెలుసుకోండి.

Google Search సైడ్ ప్యానెల్‌తో వెబ్ పేజీని సెర్చ్ చేయడానికి దిగువ దశలను ఫాలో అవ్వండి:

  1. మీ కంప్యూటర్‌లో, Chromeను తెరవండి.
  2. వెబ్‌సైట్‌కు వెళ్లండి.
  3. ఎగువ కుడి వైపున, మరిన్ని మరిన్ని ఆ తర్వాత Googleతో ఈ పేజీని సెర్చ్ చేయండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
    • మీరు కనుగొన్న టెక్స్ట్, ఇమేజ్‌ల గురించి మరింత తెలుసుకోవడానికి, వెబ్ పేజీలోని కీవర్డ్‌లను ఎంటర్ చేయండి.

చిట్కాలు:

Chromeలో జెనరేటివ్ AI గురించి మరింత తెలుసుకోండి

Chrome నుండి అత్యధిక ప్రయోజనాలను పొందడంలో మీకు సహాయపడటానికి, మరింత సమర్థవంతమైన, ఎంగేజ్ చేసే AI-అందించిన ఎక్స్‌పీరియన్స్‌లను ఇప్పుడు Google Search సైడ్ ప్యానెల్ అందిస్తోంది. మీరు సులభంగా దిగువున ఉన్న వాటిని చేయవచ్చు:

  • ఆర్టికల్స్‌ నుండి, ఇతర వెబ్ పేజీల నుండి కీ పాయింట్‌లను జెనరేట్ చేయడం.

సైడ్ ప్యానెల్‌లో AI-అందించే ఎక్స్‌పీరియన్స్‌లతో సహా Chromeలోని Searchలో ప్రయోగాలను ట్రై చేయడానికి, Search Labs కోసం సైన్ అప్ చేయడం ఎలాగో తెలుసుకోండి.

చిట్కా: కావలసిన అర్హతలు వర్తించవచ్చు. Search జెనరేటివ్ ఎక్స్‌పీరియన్స్ గురించి మరింత తెలుసుకోండి.

 

true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
7384561871276089105
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
237
false
false