తర్వాత, ఆఫ్‌లైన్‌లో పేజీలను చదవండి

మీరు ఆఫ్‌లైన్‌లో ఉన్నప్పటికీ, తర్వాత చదవడానికి వీలుగా వెబ్‌పేజీలను సేవ్ చేయవచ్చు. వెబ్‌పేజీలను తర్వాత ఆఫ్‌లైన్‌లో చదవడానికి, Chromeలో ముందుగానే వాటిని డౌన్‌లోడ్ చేసుకోండి.

పేజీని తర్వాత చదవండి

పేజీని తర్వాత చదవడానికి, దాన్ని మీ చదవాల్సిన లిస్ట్‌కు జోడించండి.

  1. మీ కంప్యూటర్‌లో, Chromeను తెరవండి.
  2. మీరు తర్వాత చదవాలనుకుంటున్న పేజీకి వెళ్లండి.
  3. ఎగువున కుడి వైపున, మరిన్ని మరిన్ని ఆ తర్వాత బుక్‌మార్క్‌లు, లిస్ట్‌లు ఆ తర్వాత చదవాల్సిన లిస్ట్ ఆప్షన్‌ను ఎంచుకోండి.
  4. చదవాల్సిన లిస్ట్‌కు ట్యాబ్‌ను జోడించండి ఆప్షన్‌ను ఎంచుకోండి.
చిట్కా: మీరు ఆ తర్వాత చదవాల్సిన లిస్ట్‌కు ట్యాబ్‌ను జోడించండి అనే ట్యాబ్‌పై కుడి క్లిక్ చేసి కూడా, మీ చదవాల్సిన లిస్ట్‌కు ట్యాబ్‌ను జోడించవచ్చు.

మీ చదవాల్సిన లిస్ట్‌ను కనుగొనండి

  1. మీ కంప్యూటర్‌లో, Chromeను తెరవండి.
  2. ఎగువున కుడి వైపున, మరిన్ని మరిన్ని ఆ తర్వాత బుక్‌మార్క్‌లు, లిస్ట్‌లు ఆ తర్వాత చదవాల్సిన లిస్ట్ ఆప్షన్‌ను ఎంచుకోండి.
  3. చదవాల్సిన లిస్ట్‌ను చూపండి ఆప్షన్‌ను ఎంచుకోండి.

చిట్కా: సైడ్ ప్యానెల్ నుండి, మీ చదవాల్సిన లిస్ట్‌లోని ఐటెమ్‌ల క్రమాన్ని మార్చవచ్చు, వాటిని ఎడిట్ చేయవచ్చు, తొలగించవచ్చు.

ఆఫ్‌లైన్‌లో చదవడానికి Chrome నుండి ఒక పేజీని డౌన్‌లోడ్ చేయండి

పేజీని సేవ్ చేయడానికి మీరు ఆన్‌లైన్‌లో ఉండాలి.

  1. మీ కంప్యూటర్‌లో, Chromeను తెరవండి.
  2. మీరు సేవ్ చేయాలనుకుంటున్న పేజీకి వెళ్లండి.
  3. ఎగువ కుడి వైపున ఉన్న, మరిన్ని మరిన్ని ఆ తర్వాత సేవ్ చేసి, షేర్ చేయండి ఆ తర్వాత పేజీని ఇలా సేవ్ చేయండి... ఆప్షన్‌ను ఎంచుకోండి.
  4. మీరు పేజీని ఎక్కడ సేవ్ చేయాలనుకుంటున్నారో ఎంచుకోండి.
  5. సేవ్ చేయండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.

సేవ్ చేయబడిన పేజీని చదవడానికి, మీ కంప్యూటర్‌లో ఫైల్‌ను తెరవండి. Chrome లేదా Safari వంటి మీ ఆటోమేటిక్ బ్రౌజర్‌లో అది తెరుచుకుంటుంది.

సేవ్ చేయబడిన పేజీని తొలగించడానికి, మీ కంప్యూటర్ నుండి ఫైల్‌ను తొలగించండి.

సంబంధిత రిసోర్స్‌లు

సంబంధిత రిసోర్స్‌లు

true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
12318330635379338711
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
237
false
false