Chromeలో బుక్‌మార్క్‌లను క్రియేట్ చేయండి, కనుగొనండి, అలాగే ఎడిట్ చేయండి

బుక్‌మార్క్‌లను క్రియేట్ చేయండి, తద్వారా మీకు ఇష్టమైన, మీరు తరచుగా బ్రౌజ్ చేసే వెబ్‌సైట్‌లను Chrome గుర్తుంచుకోగలదు.

మీ Google ఖాతాతో మీరు Chromeకు సైన్ ఇన్ చేసినప్పుడు, మీ పరికరాలన్నింటిలో మీరు బుక్‌మార్క్‌లను, ఇతర సమాచారాన్ని ఉపయోగించవచ్చు.

బుక్‌మార్క్‌ను జోడించండి

  1. మీ కంప్యూటర్‌లో, Chromeను తెరవండి.
  2. మీరు భవిష్యత్తులో మళ్లీ ఏ సైట్‌కు అయితే వెళ్లాలనుకుంటున్నారో, ఆ సైట్‌కు వెళ్లండి.
  3. అడ్రస్ బార్‌కు కుడి వైపున, బుక్‌మార్క్ Bookmark this pageను ఎంచుకోండి.

బుక్‌మార్క్‌ను కనుగొనండి

ముఖ్యగమనిక: బుక్‌మార్క్‌ను సులభమైన మార్గంలో తెరవడానికి, దాన్ని బుక్‌మార్క్‌ బార్‌లో ఎంచుకోండి. బుక్‌మార్క్‌ బార్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయడానికి, మరిన్ని మరిన్ని ఆ తర్వాత బుక్‌మార్క్‌లు, లిస్ట్‌లు ఆ తర్వాత బుక్‌మార్క్ బార్‌ను చూడండి అనే ఆప్షన్‌లను ఎంచుకోండి.

మీ బుక్‌మార్క్‌ల బార్ ఆన్‌లో లేకపోతే లేదా మీ బుక్‌మార్క్ లేకపోతే, మీ బుక్‌మార్క్‌లను కనుగొనడానికి 3 మార్గాలు ఉన్నాయి.

అడ్రస్ బార్ నుండి
  1. మీ కంప్యూటర్‌లో, Chromeను తెరవండి.
  2. అడ్రస్ బార్‌లో, @bookmarks ను ఎంటర్ చేయండి.
  3. Tab లేదా స్పేస్‌ను నొక్కండి.
    • సూచనలలో మీరు బుక్‌మార్క్‌లను సెర్చ్ చేయండి Searchని కూడా ఎంచుకోవచ్చు
  4. మీకు కావలసిన బుక్‌మార్క్ కోసం కీవర్డ్‌లను ఎంటర్ చేయండి.
  5. లిస్ట్‌లో నుండి మీ బుక్‌మార్క్‌ను ఎంచుకోండి.
మెనూ నుండి
  1. మీ కంప్యూటర్‌లో, Chromeను తెరవండి.
  2. ఎగువున కుడి వైపున, మరిన్ని మరిన్ని ఆ తర్వాత బుక్‌మార్క్‌లు, లిస్ట్‌లు ఆ తర్వాత బుక్‌మార్క్ మేనేజర్ ఆప్షన్‌ను ఎంచుకోండి.
  3. బుక్‌మార్క్‌ను ఎంచుకోండి.
నావిగేషన్ ప్యానెల్‌లో
  1. మీ కంప్యూటర్‌లో, Chromeను తెరవండి.
  2. ఎగువున కుడి వైపున ఉన్న, మరిన్ని మరిన్ని ఆ తర్వాత బుక్‌మార్క్‌లు, లిస్ట్‌లు ఆ తర్వాత అన్ని బుక్‌మార్క్‌లను చూపించండి ఆప్షన్‌ను ఎంచుకోండి.
  3. బుక్‌మార్క్‌ను ఎంచుకోండి.
చిట్కా: బుక్‌మార్క్‌లను విజువల్ నుండి కాంపాక్ట్ వీక్షణకు మార్చడానికి, ‌ను ఎంచుకోండి.

బుక్‌మార్క్‌ను ఎడిట్ చేయండి

మెనూ నుండి
  1. మీ కంప్యూటర్‌లో, Chromeను తెరవండి.
  2. ఎగువ కుడి వైపున, మరిన్ని మరిన్ని ఆ తర్వాత బుక్‌మార్క్‌లు, లిస్ట్‌లు ఆ తర్వాత బుక్‌మార్క్ మేనేజర్ అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  3. కుడి వైపున ఉన్న, మరిన్ని మరిన్ని ఆ తర్వాత ఎడిట్ చేయండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
నావిగేషన్ ప్యానెల్‌లో
  1. మీ కంప్యూటర్‌లో, Chromeను తెరవండి.
  2. ఎగువున కుడి వైపున ఉన్న, మరిన్ని మరిన్ని ఆ తర్వాత బుక్‌మార్క్‌లు, లిస్ట్‌లు ఆ తర్వాత అన్ని బుక్‌మార్క్‌లను చూపించండి ఆప్షన్‌ను ఎంచుకోండి.
  3. ఒకే బుక్‌మార్క్‌ను ఎడిట్ చేయడానికి, బుక్‌మార్క్‌పై మౌస్ కర్సర్‌ను ఉంచండి.
  4. మరిన్ని మరిన్ని ఆ తర్వాత ఎడిట్ చేయండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
    • బల్క్‌గా ఎడిట్ చేయడానికి, ఎడిట్ చేయండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.

బుక్‌మార్క్‌ను తొలగించండి

ముఖ్యమైనది:మీరు బుక్‌మార్క్‌ను తొలగించిన తర్వాత, దానిని తిరిగి పొందలేరు. మెనూ నుండి
  1. మీ కంప్యూటర్‌లో, Chromeను తెరవండి.
  2. ఎగువ కుడి వైపున, మరిన్ని మరిన్ని ఆ తర్వాత బుక్‌మార్క్‌లు, లిస్ట్‌లు ఆ తర్వాత బుక్‌మార్క్ మేనేజర్ అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  3. కుడి వైపున ఉన్న, మరిన్ని మరిన్ని ఆ తర్వాత తొలగించండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
నావిగేషన్ ప్యానెల్‌లో
  1. మీ కంప్యూటర్‌లో, Chromeను తెరవండి.
  2. ఎగువున కుడి వైపున ఉన్న, మరిన్ని మరిన్ని ఆ తర్వాత బుక్‌మార్క్‌లు, లిస్ట్‌లు ఆ తర్వాత అన్ని బుక్‌మార్క్‌లను చూపించండి ఆప్షన్‌ను ఎంచుకోండి.
  3. నిర్దిష్ట బుక్‌మార్క్ ఫోల్డర్ లేదా లింక్‌పై మౌస్ కర్సర్‌ను ఉంచండి.
  4. మరిన్నిమరిన్ని ఆ తర్వాత తొలగించండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.

కొత్త బుక్‌మార్క్ ఫోల్డర్‌ను క్రియేట్ చేయండి

  1. మీ కంప్యూటర్‌లో, Chromeను తెరవండి.
  2. ఎగువ కుడి వైపున, మరిన్ని మరిన్ని ఆ తర్వాత బుక్‌మార్క్‌లు, లిస్ట్‌లు ఆ తర్వాత బుక్‌మార్క్ మేనేజర్ అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  3. ఎగువ కుడి వైపున, మరిన్ని మరిన్ని ఆ తర్వాత కొత్త ఫోల్డర్‌ను జోడించండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.

మీరు బుక్‌మార్క్‌ల బార్‌ను ఉపయోగిస్తుంటే, ఫోల్డర్‌ను జోడించడానికి, బుక్‌మార్క్‌ బార్‌ను కుడి క్లిక్ చేసి, ఫోల్డర్‌ను జోడించండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.

చిట్కా: ప్రోడక్ట్ పేజీల కోసం, షాపింగ్ లిస్ట్ ఫోల్డర్ గురించి మరింత తెలుసుకోండి.

మీ బుక్‌మార్క్‌లను క్రమపద్ధతిలో అమర్చండి

మెనూ నుండి
  1. మీ కంప్యూటర్‌లో, Chromeను తెరవండి.
  2. ఎగువ కుడి వైపున, మరిన్ని మరిన్ని ఆ తర్వాత బుక్‌మార్క్‌లు, లిస్ట్‌లు ఆ తర్వాత బుక్‌మార్క్ మేనేజర్ అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  3. ఎగువున కుడి వైపున, మరిన్ని మరిన్ని ఆ తర్వాత పేరు బట్టి క్రమపద్దతిలో అమర్చండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
నావిగేషన్ ప్యానెల్‌లో
  1. మీ కంప్యూటర్‌లో, Chromeను తెరవండి.
  2. ఎగువున కుడి వైపున ఉన్న, మరిన్ని మరిన్ని ఆ తర్వాత బుక్‌మార్క్‌లు, లిస్ట్‌లు ఆ తర్వాత అన్ని బుక్‌మార్క్‌లను చూపించండి ఆప్షన్‌ను ఎంచుకోండి.
  3. మీ బుక్‌మార్క్‌లను క్రమపద్దతిలో అమర్చడానికి, ఆర్గనైజ్ చేయండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  4. మీకు నచ్చిన క్రమపద్ధతిని ఎంచుకోండి:
    • అత్యంత కొత్తవి ముందు వచ్చే క్రమపద్ధతిలో అమర్చండి
    • అత్యంత పాతవి ముందు వచ్చే క్రమపద్ధతిలో అమర్చండి
    • చివరిగా తెరిచినవి ముందు వచ్చే క్రమపద్ధతిలో అమర్చండి
    • A నుండి Z క్రమపద్ధతిలో అమర్చండి
    • Z నుండి A క్రమపద్ధతిలో అమర్చండి

మీ బుక్‌మార్క్‌లను తరలించండి.

మెనూ నుండి
  1. మీ కంప్యూటర్‌లో, Chromeను తెరవండి.
  2. ఎగువ కుడి వైపున, మరిన్ని మరిన్ని ఆ తర్వాత బుక్‌మార్క్‌లు, లిస్ట్‌లు ఆ తర్వాత బుక్‌మార్క్ మేనేజర్ అనే ఆప్షన్‌లను ఎంచుకోండి.
  3. బుక్‌మార్క్‌ను పైకి లేదా కిందకు లాగండి, లేదా ఎడమ వైపున ఉన్న ఫోల్డర్‌లోకి బుక్‌మార్క్‌ను లాగండి. మీరు మీకు నచ్చిన క్రమంలో బుక్‌మార్క్‌లను కాపీ, పేస్ట్ కూడా చేయవచ్చు.

మీరు బుక్‌మార్క్ బార్‌ను ఉపయోగిస్తే, మీరు మీకు నచ్చిన క్రమంలో బుక్‌మార్క్‌లను లాగవచ్చు.

నావిగేషన్ ప్యానెల్‌లో
  1. మీ కంప్యూటర్‌లో, Chromeను తెరవండి.
  2. ఎగువున కుడి వైపున ఉన్న, మరిన్ని మరిన్ని ఆ తర్వాత బుక్‌మార్క్‌లు, లిస్ట్‌లు ఆ తర్వాత అన్ని బుక్‌మార్క్‌లను చూపించండి ఆప్షన్‌ను ఎంచుకోండి.
  3. మీరు తరలించాలనుకునే బుక్‌మార్క్‌ను ఎంచుకుని ఆ తర్వాత మరిన్ని మరిన్ని ఆ తర్వాత ఎడిట్ చేయండి అనే ఆప్షన్‌లను ఎంచుకోండి.
  4. మీరు బుక్‌మార్క్‌ను ఎక్కడికి తరలించాలనుకుంటున్నారో ఆ ఫోల్డర్‌ను ఎంచుకుని ఆ తర్వాతసేవ్ చేయండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.

సంబంధిత రిసోర్స్‌లు

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
16352476604720923138
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
237
false
false