Chromeలో బుక్‌మార్క్‌లను క్రియేట్ చేయండి, కనుగొనండి, అలాగే ఎడిట్ చేయండి

బుక్‌మార్క్‌లను క్రియేట్ చేయండి, తద్వారా మీకు ఇష్టమైన, మీరు తరచుగా బ్రౌజ్ చేసే వెబ్‌సైట్‌లను Chrome గుర్తుంచుకోగలదు.

మీ Google ఖాతాతో మీరు Chromeకు సైన్ ఇన్ చేసినప్పుడు, మీ పరికరాలన్నింటిలో మీరు బుక్‌మార్క్‌లను, ఇతర సమాచారాన్ని ఉపయోగించవచ్చు.

బుక్‌మార్క్‌ను జోడించండి

  1. మీ iPhone లేదా iPadలో, Chrome Chromeను తెరవండి.
  2. మీరు తరచుగా బ్రౌజ్ చేసే లేదా భవిష్యత్తులో మళ్లీ బ్రౌజ్ చేయాలనుకునే సైట్‌కు వెళ్లండి.
  3. మరిన్ని మరిన్ని ఆ తర్వాత బుక్‌మార్క్‌లకు జోడించండి Bookmark this pageని ట్యాప్ చేయండి.

బుక్‌మార్క్‌ను తెరవండి

  1. మీ iPhone లేదా iPadలో, Chrome Chromeను తెరవండి.
  2. మరిన్ని మరిన్ని ఆ తర్వాత బుక్‌మార్క్‌లు Bookmark this pageను ట్యాప్ చేయండి.
  3. ఫోల్డర్‌లను రివ్యూ చేయండి.
  4. బుక్‌మార్క్‌లను తెరవడానికి, ఫోల్డర్‌ను ట్యాప్ చేయండి.
    • కొత్త ట్యాబ్ లేదా అజ్ఞాత ట్యాబ్‌లో తెరవడానికి, మెనూ నుండి ఎంచుకోవడానికి బుక్‌మార్క్‌ను నొక్కి, పట్టుకోండి.

మీకు కావలసిన బుక్‌మార్క్‌ను మీరు కనుగొనలేకపోతే, అది వేరొక ఫోల్డర్‌లో ఉండవచ్చు. ఫోల్డర్‌లను మార్చడానికి, పైన ఎడమ వైపున ఉన్న, వెనుకకు Backను ట్యాప్ చేయండి. మీకు కావలసిన బుక్‌మార్క్‌తో ఫోల్డర్‌ను ట్యాప్ చేయండి.

బుక్‌మార్క్‌ను ఎడిట్ చేయండి
  1. బుక్‌మార్క్‌ను నొక్కి, పట్టుకోండి.
  2. ఎడిట్ చేయండిని ట్యాప్ చేయండి.
  3. పేరు, ఫోల్డర్, లేదా URLను మార్చండి.
  4. ఎగువున, పూర్తయింది ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

చిట్కా: బుక్‌మార్క్‌ను తొలగించడానికి,దిగువున, తొలగించండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

బుక్‌మార్క్‌ను తొలగించండి

బుక్‌మార్క్‌ను తొలగించిన తర్వాత, మీరు బుక్‌మార్క్‌ను పొరపాటున తొలగించినట్లయితే, చర్యరద్దు చేయమని మీకు ప్రాంప్ట్ వస్తుంది. లేకపోతే, మీరు బుక్‌మార్క్‌ను మళ్లీ జోడించినప్పుడు మాత్రమే మీరు బుక్‌మార్క్‌ను తిరిగి పొందగలరు.

ఒక బుక్‌మార్క్‌ను తొలగించడానికి:

  1. బుక్‌మార్క్‌పై ఎడమ వైపునకు స్వైప్ చేయండి.
  2. తొలగించండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

రెండు లేదా అంతకంటే ఎక్కువ బుక్‌మార్క్‌లను తొలగించడానికి:

  1. దిగువున, ఎంచుకోండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  2. మీరు తొలగించాలనుకుంటున్న బుక్‌మార్క్‌లు ఆ తర్వాతను ట్యాప్ చేసి, తొలగించండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
ఫోల్డర్‌ను క్రియేట్ చేయండి

ముఖ్య గమనిక: కొత్త ఫోల్డర్‌ను క్రియేట్ చేయడానికి, మీ దగ్గర తప్పనిసరిగా బుక్‌మార్క్ చేసిన సైట్ కనీసం ఒకటైనా ఉండాలి.

  1. Chrome Chromeను తెరవండి.
  2. మరిన్ని మరిన్ని ఆ తర్వాత బుక్‌మార్క్‌లు Bookmark this page ఆ తర్వాత ఫోల్డర్‌ను ఎంచుకోండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. దిగువున ఎడమ మూలలో, కొత్త ఫోల్డర్ ఆప్షన్‌ను ఎంచుకోండి.

ఫోల్డర్‌లో బుక్‌మార్క్‌ల క్రమాన్ని మార్చండి

  1. మీ iPhone లేదా iPadలో, Chrome Chromeను తెరవండి.
  2. మరిన్ని మరిన్ని ఆ తర్వాత బుక్‌మార్క్‌లు Bookmark this pageను ట్యాప్ చేయండి.
  3. మీరు ఆర్గనైజ్ చేయాలనుకుంటున్న ఫోల్డర్‌ను తెరవండి.
  4. ఎడిట్ చేయండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  5. బుక్‌మార్క్‌కు కుడి వైపున, లాగి నొక్కి పట్టుకోండి Drag.
  6. మీకు కావలసిన చోటుకు బుక్‌మార్క్‌ను లాగండి.
బుక్‌మార్క్‌ను వేరొక ఫోల్డర్‌కు తరలించండి
  1. మీరు తరలించాలనుకుంటున్న బుక్‌మార్క్‌తో ఫోల్డర్‌ను తెరవండి.
  2. ఎడిట్ చేయండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. మీరు తరలించాలనుకుంటున్న బుక్‌మార్క్‌ను ఎంచుకోండి.
  4. మరిన్ని… ఆ తర్వాత బుక్‌మార్క్‌ను ఎడిట్ చేయండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  5. మీ ఫోల్డర్‌ల లిస్ట్‌ను చెక్ చేయడానికి లేదా కొత్త ఫోల్డర్‌ను క్రియేట్ చేయడానికి, ఫోల్డర్ ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  6. పూర్తయింది ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

సంబంధిత రిసోర్స్‌లు

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
2589610778898664811
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
237
false
false