Chromeలో సైన్ ఇన్ చేయడం, సింక్ చేయడం

మీరు మీ Google ఖాతాతో Chromeకు సైన్ ఇన్ చేసినప్పుడు, మీ పరికరాలన్నిటిలో మీ సమాచారాన్ని పొందవచ్చు, అదనపు Chrome ఫీచర్‌లను ఉపయోగించవచ్చు.

మీరు సైన్ ఇన్ చేసినప్పుడు

సైన్ ఇన్ చేసి, సింక్‌ను ఆన్ చేయండి

Chromeకు సైన్ ఇన్ చేయడానికి, సింక్‌ను ఆన్ చేయడానికి, మీకు తప్పనిసరిగా Google ఖాతా ఉండాలి.

ముఖ్య గమనిక: మీ స్వంత పరికరాలతో మాత్రమే Chrome సింక్‌ను ఆన్ చేయండి. మీరు పబ్లిక్ కంప్యూటర్‌ను ఉపయోగిస్తే, బదులుగా గెస్ట్ మోడ్‌ను ఉపయోగించండి.

  1. మీ కంప్యూటర్‌లో, Chromeను తెరవండి.
  2. ఎగువ కుడి వైపున ఉన్న ప్రొఫైల్ Profile ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. సింక్‌ను ఆన్ చేయండి... ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

    • మీరు మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేయకుంటే, మీరు సైన్ ఇన్ చేయమని ప్రాంప్ట్ చేయబడతారు.

  4. అవును, సైన్ ఇన్ చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

చిట్కా: మీరు ఒకటి కంటే ఎక్కువ ఖాతాలను సింక్ చేయాలనుకుంటే లేదా మీ కంప్యూటర్‌ను మీరు ఇతరులతో షేర్ చేస్తుంటే, Chromeలో ప్రొఫైల్‌ను ఎలా జోడించాలో తెలుసుకోండి.

సైన్ అవుట్ చేసి, సింక్‌ను ఆఫ్ చేయండి

మీరు సింక్‌ను ఆఫ్ చేసినా, మీరు ఇప్పటికీ మీ కంప్యూటర్‌లో బుక్‌మార్క్‌లు, హిస్టరీ, పాస్‌వర్డ్‌లు, ఇతర సెట్టింగ్‌లను కనుగొనవచ్చు. మీరు ఏవైనా మార్పులు చేస్తే, అవి మీ Google ఖాతాకు సేవ్ చేయబడవు, అలాగే అవి మీ ఇతర పరికరాలకు సింక్ చేయబడవు.

మీరు సింక్‌ను ఆఫ్ చేసినప్పుడు, Gmail వంటి ఇతర Google సర్వీస్‌ల నుండి కూడా మీరు సైన్ అవుట్ చేయబడతారు.

  1. మీ కంప్యూటర్‌లో, Chromeను తెరవండి.
  2. ఎగువ కుడి వైపున ఉన్న, ప్రొఫైల్ Profile ఆ తర్వాత సింక్ ఆన్ చేయబడిందిఅనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. ఆఫ్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

మీ Google ఖాతా నుండి సింక్ చేసిన సమాచారాన్ని తొలగించడానికి:

  1. మీ కంప్యూటర్‌లో, Chromeను తెరవండి.
  2. chrome.google.com/sync లింక్‌కు వెళ్లండి.
  3. డేటాను క్లియర్ చేయడానికి స్క్రోల్ చేసి, దానిని క్లిక్ చేయండి.

మీ Chromebook నుండి సైన్ అవుట్ చేసి, దానిని ఆఫ్ చేయడానికి,సైన్ అవుట్ చేసి, ఆఫ్ చేయడం ఎలాగో తెలుసుకోండి.

మీరు Gmail వంటి Google సర్వీస్ ద్వారా మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేసినప్పుడు, Chromeకు మీరు ఆటోమేటిక్‌గా సైన్ ఇన్ అవుతారు. మీరు Chromeకు సైన్ ఇన్ చేయకూడదు అనుకుంటే, మీరు Chrome సైన్ ఇన్‌ను ఆఫ్ చేయవచ్చు.

సంబంధిత రిసోర్స్‌లు

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
16599525995965620986
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
237
false
false