మీ బుక్‌మార్క్‌లు, పాస్‌వర్డ్‌లు, అలాగే మరిన్నింటిని మీ పరికరాలన్నింటిలో పొందండి

మీరు Chromeకు సైన్ ఇన్ చేసినప్పుడు, మీ Google ఖాతాలో మీరు సమాచారాన్ని సేవ్ చేయవచ్చు. మీరు అదే ఖాతాతో సైన్ ఇన్ చేసిన మీ అన్ని పరికరాలలో మీ సమాచారాన్ని ఉపయోగించవచ్చు.

మీరు సింక్‌ను ఆన్ చేసినప్పుడు, మీ పరికరాలన్నింటిలో మీకు ఒకే సమాచారం కనిపిస్తుంది:

  • బుక్‌మార్క్‌లు
  • హిస్టరీ, తెరిచిన ట్యాబ్‌లు
  • పాస్‌వర్డ్‌లు
  • పేమెంట్ సమాచారం
  • అడ్రస్‌లు, ఫోన్ నంబర్‌లు, అలాగే మరిన్ని
  • సెట్టింగ్‌లు, ప్రాధాన్యతలు
మీరు Google ఖాతాతో Chromeకు సైన్ ఇన్ చేశారు కానీ సింక్ ఆన్ చేసి లేనప్పుడు, మీరు Google Payకు సేవ్ చేసిన పేమెంట్ సమాచారాన్ని కూడా యాక్సెస్ చేయవచ్చు.

ఏ సమాచారాన్ని సింక్ చేయాలో ఎంచుకోండి

మీరు సింక్‌ను ఆన్ చేసినప్పుడు, మీ ప్రొఫైల్ సమాచారం మొత్తం మీ Google ఖాతాలో సేవ్ చేయబడుతుంది. మీరు అన్నింటినీ సింక్ చేయకూడదు అనుకున్నట్లయితే, ఏ సమాచారం సేవ్ చేయాలి అన్న దాన్ని మీరు మార్చవచ్చు.

  1. మీ Android పరికరంలో, Chrome Chromeను తెరవండి.
  2. అడ్రస్ బార్‌కు కుడి వైపున ఉన్న, మరిన్ని నిర్వహించండి ఆ తర్వాత సెట్టింగ్‌లు ఆ తర్వాత సింక్ చేయండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. అన్నింటినీ సింక్ చేయండి ఆప్షన్‌ను ఆఫ్ చేయండి.
  4. దేన్ని సింక్ చేయాలో ఎంచుకోండి.
Googleను వ్యక్తిగతీకరించడానికి మీ Chrome హిస్టరీని ఉపయోగించండి

మీ Google ఖాతాలో సేవ్ చేయబడిన Chrome హిస్టరీ, వెబ్ & యాప్ యాక్టివిటీకి కూడా ఆటోమేటిక్‌గా జోడించబడుతుంది. Search లేదా యాడ్‌ల వంటి ఇతర Google ప్రోడక్ట్‌లలో మీ అనుభవాన్ని వ్యక్తిగతీకరించడానికి మీ యాక్టివిటీ ఉపయోగించబడవచ్చు. ఉదాహరణకు, మీ Chrome హిస్టరీ ఆధారంగా మీ ఫీడ్‌లో సిఫార్సు చేసిన వార్తా కథనాన్ని మీరు చూడవచ్చు.

మీ Google ఖాతాలో మీ వెబ్ & యాప్ యాక్టివిటీని మీరు ఎల్లప్పుడూ నియంత్రించవచ్చు. మీ వెబ్ & యాప్ యాక్టివిటీని చూడటం, కంట్రోల్ చేయడం ఎలాగో తెలుసుకోండి.

మీ Google ప్రోడక్ట్‌లను మీరు వ్యక్తిగతీకరించాలని అనుకోకపోతే, మీ Chrome హిస్టరీని Googleను చదవడానికి అనుమతించకుండానే, మీ Chrome డేటాను స్టోర్ చేయడానికి మీరు ఇప్పటికీ Google క్లౌడ్‌ను ఉపయోగించవచ్చు. మీ సమాచారాన్ని ప్రైవేట్‌గా ఉంచడం గురించి మరింత తెలుసుకోండి.

రహస్య పదబంధంతో మీ సమాచారాన్ని ప్రైవేట్‌గా ఉంచండి

రహస్య పదబంధంతో, Googleను మీ Chrome డేటాను చదవడానికి అనుమతించకుండా, దానిని స్టోర్, అలాగే సింక్ చేయడానికి మీరు Google క్లౌడ్‌ను ఉపయోగించవచ్చు. Google Payలోని మీ పేమెంట్ ఆప్షన్‌లు, అలాగే అడ్రస్‌లు రహస్య పదబంధం ద్వారా ఎన్‌క్రిప్ట్ చేయబడి లేవు.

రహస్య పదబంధాలు అనేవి ఆప్షనల్. డేటా ఉల్లంఘన ప్రమాదాన్ని తగ్గించడానికి, మీరు సింక్ చేసిన డేటా ఎల్లప్పుడూ అత్యంత అధునాతనమైన ఎన్‌క్రిప్షన్ ద్వారా రక్షించబడుతుంది.

మీ స్వంత రహస్య పదబంధాన్ని క్రియేట్ చేయండి

మీకు రహస్య పదబంధం ఉన్నప్పుడు:

  • ఎక్కడైనా కొత్తగా మీరు సింక్‌ను ఆన్ చేసినప్పుడు, మీకు మీ రహస్య పదబంధం అవసరం.
  • మీరు ఇప్పటికే సింక్‌ను ఆన్ చేసిన మీ పరికరాలలో కొత్త రహస్య పదబంధాన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
  • మీరు Chromeలో బ్రౌజ్ చేసిన సైట్‌ల ఆధారంగా మీ ఫీడ్, సూచనలను చూపించదు.
  • మీరు సేవ్ చేసిన పాస్‌వర్డ్‌లను passwords.google.com సైట్‌లో చెక్ చేయలేరు లేదా పాస్‌వర్డ్‌ల కోసం Smart Lockను ఉపయోగించండి.
  • మీ హిస్టరీ మొత్తం అన్ని పరికరాలలో సింక్ చేయబడదు. కేవలం Chrome అడ్రస్ బార్‌లో మీరు టైప్ చేసిన వెబ్ అడ్రస్‌లు మాత్రమే సింక్ అవుతాయి.

రహస్య పదబంధాన్ని క్రియేట్ చేయండి

  1. మీ Android పరికరంలో, Chrome Chromeను తెరవండి.
  2. అడ్రస్ బార్‌కు కుడి వైపున ఉన్న, మరిన్ని నిర్వహించండి ఆ తర్వాత సెట్టింగ్‌లు ఆ తర్వాత సింక్ చేయండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. మీ Google ఖాతాతో సింక్‌ను ఆన్ చేయండి.
  4. దిగువున, ఎన్‌క్రిప్షన్ ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  5. మీ Google ఖాతాలో Chrome డేటా మొత్తాన్ని ఎన్‌క్రిప్ట్ చేయడానికి మీ స్వంత రహస్య పదబంధాన్ని ఉపయోగించండి ఆప్షన్‌ను ఎంచుకోండి.
  6. రహస్య పదబంధాన్ని ఎంటర్ చేసి, నిర్ధారించండి.
  7. సేవ్ చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
మీ రహస్య పదబంధాన్ని మార్చండి లేదా తీసివేయండి

ముఖ్య గమనిక: మీ రహస్య పదబంధాన్ని రీసెట్ చేసిన తర్వాత Chromeలో మీ పాస్‌వర్డ్‌లను ఉపయోగించడం కొనసాగించడానికి, మీరు పాస్‌వర్డ్‌లను రీసెట్ చేయడానికి ముందు వాటిని ఎగుమతి చేసి, మళ్లీ దిగుమతి చేసుకోవచ్చు.

మీ రహస్య పదబంధాన్ని మీరు మార్చినప్పుడు, మీ రహస్య పదబంధం ద్వారా ఎన్‌క్రిప్ట్ చేయబడిన డేటా Google సర్వర్‌ల నుండి తొలగించబడుతుంది, మీరు సైన్ ఇన్ చేసిన మీ పరికరాలన్నింటి నుండి సైన్ అవుట్ చేయబడతారు. Google Payలో మీ పేమెంట్ ఆప్షన్‌లు, మీ అడ్రస్‌లు రహస్య పదబంధంతో ఎన్‌క్రిప్ట్ చేయబడలేదు, అందువల్ల, వాటిని తొలగించడం సాధ్యం కాదు.

మీ Google ఖాతా, మీ పరికరం నుండి మీ పాస్‌వర్డ్‌లు, ఇతర సమాచారం తొలగించబడతాయి.

దశ 1: రహస్య పదబంధాన్ని తీసివేయండి

  1. మీ Android పరికరంలో, Chrome Chromeను తెరవండి.
  2. Google Dashboard లింక్‌కు వెళ్లండి.
  3. దిగువున, డేటాను క్లియర్ చేయండి ఆ తర్వాత క్లియర్ ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

చిట్కాలు:

  • మీ Google ఖాతాలో మీరు డేటాను సేవ్ చేయడం కొనసాగించవచ్చు, కానీ మీకు రహస్య పదబంధం ఉండదు.
  • మీరు సింక్‌ను ఆన్ చేయవచ్చు. అడ్రస్ బార్‌కు కుడి వైపున ఉన్న, మరిన్ని నిర్వహించండి ఆ తర్వాత సెట్టింగ్‌లు ఆ తర్వాత సింక్‌ను ఆన్ చేయండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

2వ దశ: కొత్త రహస్య పదబంధాన్ని రూపొందించండి (ఆప్షనల్)

  1. సింక్ చేయండిని ట్యాప్ చేయండి.
  2. దిగువున, ఎన్‌క్రిప్షన్ ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. మీ Google ఖాతాలో Chrome డేటా మొత్తాన్ని ఎన్‌క్రిప్ట్ చేయడానికి మీ స్వంత రహస్య పదబంధాన్ని ఉపయోగించండి ఆప్షన్‌ను ఎంచుకోండి.
  4. రహస్య పదబంధాన్ని ఎంటర్ చేసి, నిర్ధారించండి.
  5. సేవ్ చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

మీ పరికరాలన్నింటిలో మీ Chrome సమాచారాన్ని చూడండి

మీరు సింక్‌ను ఆన్ చేసిన తర్వాత, ఇతర పరికరాలలో మీరు సేవ్ చేసిన సమాచారాన్ని చూడవచ్చు. మీరు Chromeకు సైన్ ఇన్ చేసినప్పుడు, మీరు Google Pay నుండి మీ పేమెంట్ సమాచారాన్ని యాక్సెస్ చేయవచ్చు.

మీ బుక్‌మార్క్‌లను కనుగొని, మేనేజ్ చేయడం
  1. మీ Android పరికరంలో, Chrome Chromeను తెరవండి.
  2. ఎగువున కుడి వైపు, మరిన్ని నిర్వహించండి ఆ తర్వాత బుక్‌మార్క్‌లను ట్యాప్ చేయండి.
  3. ఫోల్డర్‌లను మార్చడానికి, వెనుకకు Backను ట్యాప్ చేయండి.
  4. మీకు కావలసిన బుక్‌మార్క్‌తో ఫోల్డర్‌ను ఎంచుకోండి.
మీరు గతంలో వినియోగించిన సైట్‌లను చూడండి
  1. మీ Android పరికరంలో, Chrome Chromeను తెరవండి.
  2. ఎగువున కుడి వైపున, మరిన్ని నిర్వహించండి ఆ తర్వాత హిస్టరీ ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

మీరు రహస్య పదబంధాన్ని ఉపయోగిస్తుంటే, ఇతర పరికరాలలో మీరు సందర్శించిన సైట్‌లను కనుగొనాలంటే, ఆ సైట్‌ల వెబ్ అడ్రస్‌లను అడ్రస్ బార్‌లో టైప్ చేయాల్సి ఉంటుంది. రహస్య పదబంధాల గురించి మరింత తెలుసుకోండి.

ఇతర పరికరాలలో తెరిచి ఉన్న ట్యాబ్‌లను చూడటం
  1. మీ Android పరికరంలో, Chrome Chromeను తెరవండి.
  2. అడ్రస్ బార్‌కు కుడి వైపున ఉన్న, మరిన్ని నిర్వహించండి ఆ తర్వాత ఇటీవలి ట్యాబ్‌లు అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
మీరు సేవ్ చేసిన పాస్‌వర్డ్‌లను కనుగొనండి
  1. మీ Android పరికరంలో, Chrome Chromeను తెరవండి.
  2. అడ్రస్ బార్‌కు కుడి వైపున, మరిన్ని నిర్వహించండి ఆ తర్వాత సెట్టింగ్‌లు ఆ తర్వాత Password Manager ఆప్షన్‌లను ట్యాప్ చేయండి.
  3. "Password Manager" కింద, మీకు పాస్‌వర్డ్‌లన్నీ కనిపిస్తాయి.

మీరు సేవ్ చేసిన పాస్‌వర్డ్‌లను Chromeలో సింక్ చేసినప్పుడు, మీ Android పరికరంలో మీ Google ఖాతాతో మీరు సైన్ ఇన్ చేసిన సైట్‌లకు, యాప్‌లకు సైన్ ఇన్ చేయడానికి వాటిని ఉపయోగించవచ్చు. మీ పరికరాలలో పాస్‌వర్డ్‌లను ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి.

సేవ్ చేసిన మీ అడ్రస్‌లు & క్రెడిట్ కార్డ్‌లను చూడండి
  1. మీ Android పరికరంలో, Chrome Chromeను తెరవండి.
  2. అడ్రస్ బార్‌కు కుడి వైపున, మరిన్ని నిర్వహించండి ఆ తర్వాత సెట్టింగ్‌లు ఆ తర్వాత ఆటోఫిల్, పేమెంట్‌లు ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

ఆటోమేటిక్‌గా ఫారమ్‌లను పూరించడం గురించి మరింత తెలుసుకోండి.

మీ సెట్టింగ్‌లకు చేసిన మార్పులు, మీ అన్ని పరికరాలలో అప్‌డేట్ చేయబడతాయి.

సింక్‌తో ఉన్న సమస్యలను పరిష్కరించండి

మీరు Chrome పాత వెర్షన్‌ను ఉపయోగిస్తున్నట్లయితే, దానికి సింక్ చేయడం అప్పుడప్పుడు కష్టంగా ఉంటుంది. Chrome అత్యంత తాజా వెర్షన్‌కు అప్‌డేట్ అవ్వండి.

సంబంధిత రిసోర్స్‌లు

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
8574730073672622558
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
237
false
false