మీ ఆటోఫిల్, పాస్‌వర్డ్ డేటాను Chrome ఎలా సురక్షితంగా ఉంచుతుంది

ఆన్‌లైన్ ఫారమ్‌లను ఆటోమేటిక్‌గా పూరించడంలో సహాయపడేలా పాస్‌వర్డ్‌లను, అడ్రస్‌లను, పేమెంట్ సమాచారాన్ని సేవ్ చేయడానికి మీరు Chromeను ఉపయోగించవచ్చు. మీరు మీ పరికరాలలోకి సైన్ ఇన్ చేసి ఉంటే, మీ సేవ్ చేసిన డేటాను పరికరాలన్నింటికి Chrome షేర్ కూడా చేయగలదు.

ఆటోఫిల్, పాస్‌వర్డ్ మేనేజ్‌మెంట్ ఎలా పని చేస్తాయి

ఆటోఫిల్

ఆటోఫిల్‌తో వెబ్‌సైట్‌లలో ఫారమ్‌లను మీరు వేగంగా పూరించవచ్చు. చెక్ అవుట్ చేయడం, షిప్పింగ్ వివరాలు, మరిన్నింటిని జోడించడం మరింత సులభం. ఈ విధంగా చేయడానికి, మీరు ఫారమ్‌ను పూరించేటప్పుడు సూచనలు అందించడం కోసం ఫారమ్ ఫీల్డ్‌లకు సంబంధించిన సమాచారాన్ని Chrome Googleకు పంపుతుంది. మీ సమాచారాన్ని ఫారమ్ ఫీల్డ్‌లకు మ్యాచ్ చేయడానికి Chromeను అనుమతించే సూచనలను Google తిరిగి పంపుతుంది. కలెక్ట్ చేసి, Googleకు పంపే డేటాలో ఫారమ్ ప్రాథమిక స్ట్రక్చర్, ఫీల్డ్ పేర్లు, హ్యాష్ చేసిన సైట్ డొమైన్ వెర్షన్ ఉంటాయి.

మీరు ఫారమ్‌ను సబ్మిట్ చేసినప్పుడు, Chrome ఫారమ్ స్ట్రక్చర్ మరియు అట్రిబ్యూట్‌లు, భవిష్యత్తు సూచనలతో సహాయం చేయడానికి మీరు సబ్మిట్ చేసిన డేటా రకాల గురించి సమాచారాన్ని Googleకు పంపుతుంది. ఆటోఫిల్, పాస్‌వర్డ్ మేనేజర్ ఫీచర్‌లను మెరుగుపరచడానికి అలాగే మీరు ఆటోఫిల్‌ను ఉపయోగించినప్పుడు అత్యుత్తమ మ్యాచ్ అయ్యే డేటాను అందించడానికి Google ఆ సమాచారాన్ని ఉపయోగిస్తుంది. ఈ పరిస్థితుల్లో, మీ డేటాను సురక్షితంగా ఉంచడానికి, Chrome ఈ కింది విధంగా చేస్తుంది:

  • "Jessica" టెక్స్ట్‌కు బదులుగా "మొదటి పేరు" లేదా "jessy1980"కి బదులుగా "యూజర్‌నేమ్" వంటి సాధారణ డేటాను పంపండి.
  • Googleకి పంపిన ఫారమ్ లేబుల్‌లు మరియు అట్రిబ్యూట్‌లకు రాండమ్ డేటాను జోడించండి. మేము దీనిని "నాయిస్ జోడించడం" అని పిలుస్తాము, ఇది ప్రైవేట్ డేటా లేని లేబుల్స్, అట్రిబ్యూట్‌లను మాత్రమే Google చెక్ చేస్తుందని నిర్ధారిస్తుంది.

మీరు Google Payని ఉపయోగిస్తే, మీ పేమెంట్ కార్డ్‌ను మోసపూరితంగా ఉపయోగించకుండా నిరోధించడం కోసం Chrome మీ కంప్యూటర్‌కు సంబంధించిన సమాచారాన్ని సేకరించి, Google Payకు పంపుతుంది. మీ డేటాను ప్రైవేట్‌గా ఉంచడంలో Google Pay ఎలా సహాయపడుతుందో తెలుసుకోండి.

Password manager

Google Password Managerలో సేవ్ చేసిన సమాచారంతో సైట్‌లలోకి సైన్ ఇన్ చేయడంలో మీకు Chrome సహాయపడగలదు. సైన్ ఇన్ ఫీల్డ్స్ అందుబాటులో ఉన్నప్పుడు, సైట్‌కు సంబంధించి సేవ్ చేసిన ఉన్న పాస్‌వర్డ్‌లు ఆటోమేటిక్‌గా పూరించబడవచ్చు.

మీ Google ఖాతాతో Chromeకు సైన్ ఇన్ చేసినప్పుడు, మీరు :

  • మీ ఖాతాలో స్టోర్ అయి ఉన్న పాస్‌వర్డ్‌లను ఉపయోగించగలరు
  • సైన్ అప్ సమయంలో కొత్త సైట్‌లకు శక్తివంతమైన పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేయగలరు
  • మీ ఖాతాకు కొత్త పాస్‌వర్డ్‌లను సేవ్ చేయగలరు
మీ డేటాను మేము ఎలా సంరక్షిస్తాము

వెబ్‌సైట్ డెవలపర్‌లు ఎంచుకున్న ఫీల్డ్ లేబుల్స్, పేర్లపై ఆటోఫిల్, Google Password Manager పాక్షికంగా ఆధారపడతాయి. ప్రమాదవశాత్తూ వ్యక్తిగత డేటాను కలెక్ట్ చేయకుండా నిరోధించడానికి, గందరగోళానికి గురి చేసే వీటి వెర్షన్‌లను మాత్రమే Chrome పంపుతుంది.

నిర్దిష్ట రకాల డేటాకు అదనపు రక్షణలు అందించబడతాయి:

  • పాస్‌వర్డ్‌లు:
    • మీరు సైట్‌కు సైన్ ఇన్ చేసినప్పుడు, మీ పాస్‌వర్డ్ చోరీకి గురయ్యిందా, లేదా అని తెలుసుకోవడానికి గోప్యతను కాపాడే విధంగా Chrome మీ పాస్‌వర్డ్‌ను చెక్ చేయవచ్చు. ఇది బ్రౌజర్ మోడ్, మీరు ఆన్ చేసిన సెట్టింగ్‌లపై ఆధారపడుతుంది. Chromeలో పాస్‌వర్డ్ రక్షణల గురించి మరింత తెలుసుకోండి.
    • ఫిషింగ్ అటాక్‌ల నుండి మిమ్మల్ని రక్షించేందుకు, ఏ వెబ్‌సైట్‌లలో అయితే పాస్‌వర్డ్‌లను ఉపయోగించాలో వాటికి మాత్రమే Password Manager పాస్‌వర్డ్‌లను మ్యాచ్ చేస్తుంది, వాటి లాగా కనిపించే ఇతర సైట్‌లకు కాదు.
    • మీ పాస్‌వర్డ్‌లకు సంబంధించిన స్క్రాంబుల్డ్ స్ట్రెంత్ గణాంకాలు Googleతో షేర్ చేయబడతాయి. వెబ్‌సైట్‌ల ఆవశ్యకతలకు అనుగుణంగా ఉండే శక్తివంతమైన పాస్‌వర్డ్‌లను సూచించేలా ఇవి Chromeను అనుమతిస్తాయి. ఈ డేటా మీ ఖాతాకు అనుబంధించబడి ఉండదు, మీ పాస్‌వర్డ్‌ను సులభంగా ఊహించగలిగేలా చేసే సమచారాన్ని బహిర్గతం చేయడాన్ని నిరోధించడం కోసం ఇది స్క్రాంబుల్ చేయబడుతుంది.
    • మీ పాస్‌వర్డ్‌లను అనధికారంగా యాక్సెస్ చేయకుండా రక్షించడానికి, సేవ్ చేసిన పాస్‌వర్డ్‌లను మీరు ఉపయోగించడానికి ట్రై చేసినప్పుడు లేదా మేనేజ్ చేయడానికి ట్రై చేసినప్పుడు, మీ Google ఖాతా యూజర్‌నేమ్, పాస్‌వర్డ్ లేదా ముఖం లేదా వేలిముద్ర గుర్తింపుతో మీ గుర్తింపును నిర్ధారించమని Chrome మిమ్మల్ని అడగవచ్చు.
    • మీ సేవ్ చేసిన పాస్‌వర్డ్‌లను సురక్షితంగా ఉంచడానికి, Chrome పరికరంలో ఎన్‌క్రిప్షన్ వంటి పద్ధతులను ఉపయోగిస్తుంది. ఈ పద్ధతులు మీ ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఆధారపడి ఉంటాయి. నిర్దిష్ట ప్లాట్‌ఫారమ్‌ల గురించిన వివరాలను Chrome సెక్యూరిటీ FAQలో చూడవచ్చు.
  • పేమెంట్ సమాచారం: మీ అనుమతి లేకుండా Chrome పూర్తి పేమెంట్ సమాచారాన్ని స్టోర్ చేయదు. ఉదాహరణకు, క్రెడిట్ కార్డ్‌ను స్టోర్ చేసే ఆప్షన్‌ను మీరు ఎంచుకోకపోతే, మీ కార్డ్ చివరి 4 అంకెలను Chrome స్టోర్ చేస్తుంది, తద్వారా అదే కార్డ్ గురించి Chrome మిమ్మల్ని మళ్లీ అడగకుండా ఉంటుంది. మీరు ఫోన్ కెమెరాతో మీ క్రెడిట్ కార్డ్‌ను స్కాన్ చేసినప్పుడు, సమాచారం మీ ఫోన్‌లో మాత్రమే స్టోర్ అవుతుంది. Google Payకు పేమెంట్ సమాచారాన్ని జోడించే ఆప్షన్‌ను కూడా మీరు ఎంచుకోవచ్చు.
కంట్రోల్ మీ చేతిలో ఉంది

ఆటోఫిల్, Password Manager ఆటోమేటిక్‌గా ఆన్‌లో ఉంటాయి. మీ Chrome సెట్టింగ్‌ల ద్వారా మీరు ఆటోఫిల్, సేవ్ చేసిన మీ డేటాను మేనేజ్ చేయవచ్చు.

Chromeలో మీరు ఉపయోగించే పాస్‌వర్డ్‌లు, అడ్రస్, పేమెంట్ సమాచారం వంటి డేటాను కూడా మీరు తొలగించవచ్చు.

ముఖ్య గమనిక:

  • మీ Google ఖాతాలో సైన్ ఇన్ చేసి ఉండగా Chromeలో మీరు సమాచారాన్ని తొలగించినప్పుడు, మీ Google ఖాతాలో, మీరు సైన్ ఇన్ చేసిన పరికరాలన్నింటిలో అది తొలగించబడుతుంది.
  • Chromeలో మీరు పేమెంట్ సమాచారాన్ని తొలగించినప్పుడు, అది Google Payలో తొలగించబడదు. Google Payలో పేమెంట్ సమాచారాన్ని తొలగించడానికి, Google Payకి వెళ్లండి.

చిట్కాలు:

సంబంధిత రిసోర్స్‌లు

true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
3022093372696639037
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
237
false
false