Chrome సురక్షిత బ్రౌజింగ్ మీ బ్రౌజింగ్ డేటాను ఎలా ప్రైవేట్‌గా ఉంచుతుంది

మీ డేటాను ప్రైవేట్‌గా ఉంచడానికి, Google Chrome సురక్షిత బ్రౌజింగ్‌ను ఉపయోగించి కింది వాటి నుండి మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతుంది:

  • దుర్వినియోగపూరిత వెబ్‌సైట్‌లు, ఎక్స్‌టెన్షన్‌లు
  • హానికరమైన, అనుచిత యాడ్‌లు
  • మాల్‌వేర్
  • ఫిషింగ్
  • సోషల్ ఇంజనీరింగ్
సురక్షిత బ్రౌజింగ్ ఏ విధంగా పని చేస్తుంది

స్టాండర్డ్ రక్షణ

'స్టాండర్డ్ రక్షణ'తో, మీరు ఉపయోగించే సైట్‌లను, మీరు ఇన్‌స్టాల్ చేసిన ఎక్స్‌టెన్షన్‌లను, మీరు డౌన్‌లోడ్ చేయడానికి ప్రయత్నించే ఫైల్స్‌ను సురక్షితం కాని Google సైట్‌లు, డౌన్‌లోడ్‌ల లిస్ట్ ఆధారంగా Chrome చెక్ చేస్తుంది. ఈ లిస్ట్‌లోని సైట్‌లు, డౌన్‌లోడ్‌లు- దుర్వినియోగపూరిత వెబ్‌సైట్లు, ఎక్స్‌టెన్షన్‌లతో, హానికరమైన, చిరాకు తెప్పించే యాడ్‌లతో, మాల్‌వేర్, ఫిషింగ్, సోషల్ ఇంజనీరింగ్‌తో లింక్ అయి ఉంటాయి. Chrome ఎప్పటికప్పుడు ఈ లిస్ట్ తాలూకు అత్యంత తాజా కాపీని డౌన్‌లోడ్ చేసి, మీ పరికరంలో స్టోర్ చేస్తుంది. ఇది సురక్షితమైన సైట్‌ల లిస్ట్‌ను కూడా స్టోర్ చేస్తుంది.

మీరు ఏదైనా వెబ్‌సైట్‌కు వెళ్లిన, లేదా డౌన్‌లోడ్ చేయడానికి ట్రై చేసిన ప్రతిసారీ, మీ పరికరంలో స్టోర్ చేసిన సురక్షిత సైట్‌ల లిస్ట్‌లో సదరు URL ఉందో లేదో Chrome ముందుగానే చెక్ చేస్తుంది. అది అందులో లేకపోతే, Chrome మీ IP అడ్రస్‌ను దాచే గోప్యతా సర్వర్ ద్వారా గందరగోళానికి గురి చేసే URL భాగాన్ని Googleకు పంపుతుంది. వెబ్‌సైట్ లేదా డౌన్‌లోడ్ హానికరమైనదని Google నిర్ధారిస్తే, అది ప్రమాదకరమైనదని Chrome మిమ్మల్ని హెచ్చరిస్తుంది. మీరు దుర్వినియోగపూరితమైన లేదా హానికరమైన ఎక్స్‌టెన్షన్‌ను ఇన్‌స్టాల్ చేసి ఉంటే, Chrome దానిని డిజేబుల్ చేస్తుంది. కొన్ని సందర్భాల్లో, గోప్యతా సర్వర్‌కు చేసిన రిక్వెస్ట్ విఫలమైనా లేదా మీరు అజ్ఞాత మోడ్‌లో బ్రౌజ్ చేస్తున్నా, Googleతో స్టోర్ చేసిన లిస్ట్‌కు బదులుగా, మీ పరికరంలో స్టోర్ చేసిన సురక్షితం కాని సైట్‌ల లిస్ట్ ఆధారంగా సైట్‌ను చెక్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భాలలో, అనుమానాస్పద ప్రవర్తనకు ఆధారాలు ఉంటే, గందరగోళానికి గురి చేసే URL భాగాన్ని Chrome, Googleకు పంపుతుంది.

పైన పేర్కొన్న రక్షణ విధానాలతో పాటు, ఏదైనా అనుమానాస్పదమైన పేజీని గమనించినా లేదా అనుమానాస్పదమైన చర్యలలో మీరు పాల్గొనేలా మీ పట్ల ఏదైనా మోసం జరిగినా, Chrome వాటిని Googleకు రిపోర్ట్ చేస్తుంది. ఉదాహరణకు, మీరు కొత్త సైట్‌లో ఇది వరకు సేవ్ చేసిన పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేసినప్పుడు, Chrome, Googleను సంప్రదిస్తుంది. సదరు పేజీ మీ డేటాను దొంగిలించడానికి ఏమైనా ఫిషింగ్ చేస్తోందా? సోషల్ ఇంజనీరింగ్ దాడి లాంటిది ఏమైనా చేస్తోందా? అని చెక్ చేస్తుంది. ఆ పేజీ ఫిషింగ్‌కు సంబంధించినదని నిర్ధారించబడితే, మీ పాస్‌వర్డ్‌ను చెక్ చేయమని లేదా దానిని మార్చమని Chrome మిమ్మల్ని కోరుతుంది.

ఫిషింగ్, సోషల్ ఇంజనీరింగ్ నియమాలకు అనుగుణంగా సైట్‌లను చెక్ చేయడం జరుగుతుంది. విజువల్ ఫీచర్‌లు కలిగిన చిన్న సెట్‌ను Googleకు Chrome పంపి, సైట్ హానికరమైనదా, కాదా అని నిర్ధారించుకోవడానికి దానిని ప్రమాదకరమైన సైట్‌ల లిస్ట్‌తో పోల్చి చూస్తుంది. Googleకు అదనపు డేటాను బహిర్గతం చేయకుండా ఉండటం కోసం అజ్ఞాత మోడ్‌లో కొన్ని సెక్యూరిటీ ఫీచర్‌లు డిజేబుల్ అయి ఉంటాయి.

మీది, Chrome యూజర్‌లందరి సెక్యూరిటీని మెరుగుపరచడంలో సహాయం చేయడానికి, మీ డేటాలోని ఎక్కువ భాగాన్ని Googleకు షేర్ చేసే అదనపు ఫీచర్‌లను మీరు సమ్మతించవచ్చు.

  • వెబ్‌లో అందరి సెక్యూరిటీని మెరుగుపరచడంలో సహాయం చేయండి: "వెబ్‌లో అందరి సెక్యూరిటీని మెరుగుపరచడంలో సహాయం చేయండి" అనే ఫీచర్ ఆన్‌లో ఉన్నప్పుడు, ఇంటర్నెట్‌లో సురక్షిత బ్రౌజింగ్‌ను, సెక్యూరిటీని మెరుగుపరచడంలో సహాయం చేయడానికి పేజీలోని కంటెంట్ హెడర్‌లను, టెక్స్ట్ ప్రివ్యూలను Chrome రిపోర్ట్ చేస్తుంది. మీరు 'మెరుగైన రక్షణ'ను ఎంచుకున్నప్పుడు, ఈ సెట్టింగ్ ఆటోమేటిక్‌గా ఆన్‌లో ఉంటుంది, దీనిని ఆఫ్ చేయడం సాధ్యం కాదు.
  • డేటా ఉల్లంఘనలో పాస్‌వర్డ్‌లు బహిర్గతమైతే మిమ్మల్ని హెచ్చరించడం: "డేటా ఉల్లంఘనలో పాస్‌వర్డ్‌లు బహిర్గతమైతే మిమ్మల్ని హెచ్చరించాలి" అనే ఫీచర్‌ను ఆన్ చేసినప్పుడు, హ్యాష్ చేసిన మీ యూజర్‌నేమ్, పాస్‌వర్డ్ కాపీని Chrome, Googleకు పంపుతుంది. పాస్‌వర్డ్ ఉల్లంఘనలో మీ పాస్‌వర్డ్‌లు బహిర్గతమయ్యాయో, లేదో చెక్ చేయడానికి Chromeకు మాత్రమే తెలిసిన రహస్య కీతో ఈ సమాచారం ఎన్‌క్రిప్ట్ చేయబడుతుంది. మీరు 'మెరుగైన రక్షణ'ను ఎంచుకున్నప్పుడు, ఈ సెట్టింగ్ ఆటోమేటిక్‌గా ఆన్‌లో ఉంటుంది, దీనిని ఆఫ్ చేయడం సాధ్యం కాదు.

మెరుగైన రక్షణ

రియల్ టైంలో బలమైన, మరింత అనుకూలంగా మార్చిన రక్షణను అందించడం కోసం మీ యాక్టివిటీకి సంబంధించిన మరింత సమాచారాన్ని 'మెరుగైన రక్షణ', Googleకు పంపుతుంది. ఈ సమాచారంలో మీరు ఉపయోగించిన URLలు, పేజీ కంటెంట్‌కు సంబంధించిన చిన్న శాంపిల్, డౌన్‌లోడ్‌లు, ఎక్స్‌టెన్షన్ యాక్టివిటీ, సిస్టమ్ సమాచారం ఉంటాయి.

'స్టాండర్డ్ రక్షణ'లో ఉండే ఆటోమేటిక్, ఆప్షనల్ ఫీచర్‌లు 'మెరుగైన రక్షణ'లో కూడా ఉంటాయి. 'మెరుగైన రక్షణ' అదనపు సమాచారాన్ని ఉపయోగించి కింది వాటి గురించి మిమ్మల్ని హెచ్చరిస్తుంది:

  • రిస్క్ కలిగించే అవకాశమున్న సైట్‌లు: మీరు ఉపయోగించే సైట్‌ల డేటాను Chrome విశ్లేషించి, Googleకు కూడా తెలియని రిస్క్ కలిగించే అవకాశమున్న సైట్‌లు, iframeల గురించి మిమ్మల్ని హెచ్చరిస్తుంది.
  • ప్రమాదకరమైన డౌన్‌లోడ్‌లు: అనుమానాస్పదమైన ఫైల్స్‌లో మాల్‌వేర్ ఉందో, లేదో గుర్తించడానికి అదనపు స్కాన్‌లు చేయడానికి మీరు వాటిని Googleకు పంపడానికి ఎంచుకోవచ్చు. కొత్త సైట్‌లో హోస్ట్ అయి ఉన్న కొత్త మాల్‌వేర్ లేదా ప్రమాదకరమైన ఫైల్స్‌ను కనుగొనడంలో ఈ స్కాన్‌లు సహాయపడగలవు.
  • విశ్వసించలేని ఎక్స్‌టెన్షన్‌లు: Chrome వెబ్ స్టోర్ విశ్వసించలేని ఎక్స్‌టెన్షన్‌ను మీరు ఇన్‌స్టాల్ చేయాలనుకున్నప్పుడు Chrome హెచ్చరిస్తుంది.

మీరు సైన్ ఇన్ అయి ఉంటే, 'మెరుగైన రక్షణ' ఇంకా బాగా పని చేస్తుంది. మీ Google ఖాతా అంతటా డేటాను లింక్ చేయడం ద్వారా మీరు సైన్ ఇన్ చేసిన ఇతర Google యాప్‌లలో ఇది మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతుంది. ఉదాహరణకు, మీ Gmailలో మేము ఫిషింగ్ ప్రయత్నాలను కనుగొంటే, Chromeలో మీరు సైట్‌లను, డౌన్‌లోడ్‌లను తెరిచినప్పుడు మేము మీ రక్షణను పెంచుతాము. 'మెరుగైన రక్షణ' మీ బ్రౌజింగ్ వేగాన్ని తగ్గించదు.

మీ డేటాను మేము ఎలా సంరక్షిస్తాము

స్టాండర్డ్, మెరుగుపరిచిన రక్షణ స్థాయిలతో, మిమ్మల్ని, ఇతర వెబ్ యూజర్‌లను సంరక్షించడానికి, సెక్యూరిటీని మెరుగుపరచడానికి మాత్రమే సురక్షిత బ్రౌజింగ్ డేటా ఉపయోగించబడుతుంది.

'స్టాండర్డ్ రక్షణ'తో:

  • Chrome మీ IP అడ్రస్‌ను Googleకు ఫార్వర్డ్ చేయడానికి ముందు థర్డ్-పార్టీ గోప్యతా సర్వర్ ద్వారా మీరు సందర్శించే URLలలోని గందరగోళానికి గురి చేసే భాగాన్ని పంపడం ద్వారా దాచిపెడుతుంది. ఈ విధంగా, Google, ఇంకా గోప్యతా సర్వర్‌ను ఆపరేట్ చేసే థర్డ్-పార్టీ మీ IP అడ్రస్‌తో నిజమైన URLను అనుబంధించలేవు.
  • సెక్యూరిటీ సంబంధిత సంఘటన జరిగిందనే సాక్ష్యం ఉన్నప్పుడు మాత్రమే Chrome అదనపు డేటాను పంపుతుంది.
    • అనుమానాస్పద ప్రవర్తనను గుర్తిస్తే, Chrome గందరగోళానికి గురి చేసే లేదా పూర్తి URLలు, పేజీ కంటెంట్ బిట్‌లను నేరుగా Google సురక్షిత బ్రౌజింగ్‌కు పంపుతుంది. ఉదాహరణకు, గతంలో సేవ్ చేసిన పాస్‌వర్డ్‌ను మీరు అసాధారణ సైట్‌లో లేదా ఫిషింగ్‌ను గుర్తించే చెక్‌ను పాస్ అవ్వని సైట్‌లో తిరిగి ఉపయోగిస్తే, రిపోర్ట్‌తో పూర్తి URL పంపబడవచ్చు.

'మెరుగైన రక్షణ'తో:

  • మీరు ఉపయోగించబోయే సైట్ గురించి Chrome వద్ద సమాచారం లేకపోతే, అది అదనపు డేటాను పంపుతుంది.
    • URLలను, పేజీ కంటెంట్‌లోని కొన్ని భాగాలను Chrome, Google సురక్షిత బ్రౌజింగ్‌కు పంపుతుంది.
    • హానికరమైన సాఫ్ట్‌వేర్ అటాక్‌లు, మాల్‌వేర్, ఫిషింగ్ అటాక్‌ల వంటి వాటి నుండి మిమ్మల్ని సురక్షితంగా ఉంచడానికి Chromeలో అత్యధిక భద్రత అందుబాటులో ఉంది.
కంట్రోల్ మీ చేతిలో ఉంది

సురక్షిత బ్రౌజింగ్ స్థాయిని ఎంచుకునే అవకాశం మీకు ఉంది. మీకు, ఇతర వెబ్ యూజర్‌లకు సెక్యూరిటీని మెరుగుపరచడం కోసం, మీ గురించిన ఏ డేటాను Googleకు పంపాలో కూడా మీరు ఎంచుకోవచ్చు. Chrome నుండి మీకు హెచ్చరిక వచ్చిన తర్వాత కూడా మీరు ఎప్పుడైనా సరే సురక్షితం కాని సైట్‌కు వెళ్లడాన్ని, లేదా ప్రమాదకరమైన ఫైల్‌ను డౌన్‌లోడ్ చేయడాన్ని ఎంచుకోవచ్చు.

మీ సురక్షిత బ్రౌజింగ్ సెట్టింగ్‌లను మార్చండి

ముఖ్య గమనిక: మీరు సురక్షిత బ్రౌజింగ్‌ను ఆఫ్ చేస్తే, మీ సమాచారాన్ని దొంగిలించడానికి లేదా హానికరమైన సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి ట్రై చేసే వెబ్‌సైట్‌ల నుండి Chrome మిమ్మల్ని రక్షించలేదు. మేము కొంత రక్షణను సిఫార్సు చేస్తాము.

కంప్యూటర్

  1. మీ కంప్యూటర్‌లో, Chromeను తెరవండి.
  2. ఎగువ కుడి వైపున ఉన్న, మరిన్ని మరిన్ని ఆ తర్వాత సెట్టింగ్‌లు ఆ తర్వాత గోప్యతా, సెక్యూరిటీ ఆ తర్వాత సెక్యూరిటీ అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  3. మీరు ఉపయోగించాలనుకుంటున్న రక్షణ స్థాయిని ఎంచుకోండి.

Android

  1. మీ Android పరికరంలో, Chrome Chromeను తెరవండి.
  2. ఎగువ కుడి వైపున ఉన్న మరిన్ని మరిన్ని ఆ తర్వాత సెట్టింగ్‌లు Settings ఆ తర్వాత గోప్యతా, సెక్యూరిటీ ఆ తర్వాత సురక్షిత బ్రౌజింగ్ అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. మీరు ఉపయోగించాలనుకుంటున్న రక్షణ స్థాయిని ఎంచుకోండి.

iOS

  1. మీ iPhoneలో లేదా iPadలో, Chrome Chromeను తెరవండి.
  2. దిగువ కుడి వైపున ఉన్న మరిన్ని మరిన్ని ఆ తర్వాత సెట్టింగ్‌లు Settings ఆ తర్వాత గోప్యతా, సెక్యూరిటీ ఆ తర్వాత సురక్షిత బ్రౌజింగ్ అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. మీరు ఉపయోగించాలనుకుంటున్న రక్షణ స్థాయిని ఎంచుకోండి.

సెక్యూరిటీ సెట్టింగ్‌లను మెరుగుపరిచే విధంగా సహాయపడండి

మీరు 'స్టాండర్డ్ రక్షణ'ను ఎంచుకుంటే, "వెబ్‌లో అందరి సెక్యూరిటీని మెరుగుపరచడంలో సహాయం చేయండి" అనే ఆప్షన్‌ను ఆన్ చేయాలో, ఆఫ్ చేయాలో మీరు ఎంచుకోవచ్చు. 'మెరుగైన రక్షణ'తో, ఈ ఫీచర్ ఆటోమేటిక్‌గా ఆన్‌లో ఉంటుంది, దీనిని ఆఫ్ చేయడం సాధ్యం కాదు.

కంప్యూటర్

  1. మీ కంప్యూటర్‌లో, Chromeను తెరవండి.
  2. ఎగువ కుడి వైపున ఉన్న, మరిన్ని మరిన్ని ఆ తర్వాత సెట్టింగ్‌లు ఆ తర్వాత గోప్యతా, సెక్యూరిటీ ఆ తర్వాత సెక్యూరిటీ అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  3. "స్టాండర్డ్ రక్షణ"కు దిగువున, వెబ్‌లో అందరికీ సెక్యూరిటీని మెరుగుపరచడంలో సహాయపడండి అనే ఆప్షన్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయండి.

Android

  1. మీ Android పరికరంలో, Chrome Chromeను తెరవండి.
  2. ఎగువ కుడి వైపున ఉన్న మరిన్ని మరిన్ని ఆ తర్వాత సెట్టింగ్‌లు Settings ఆ తర్వాత గోప్యతా, సెక్యూరిటీ ఆ తర్వాత సురక్షిత బ్రౌజింగ్ అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. "స్టాండర్డ్ రక్షణ"కు దిగువున, వెబ్‌లో అందరికీ సెక్యూరిటీని మెరుగుపరచడంలో సహాయపడండి అనే ఆప్షన్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయండి.

iOS

  1. మీ iPhoneలో లేదా iPadలో, Chrome Chromeను తెరవండి.
  2. ఎగువ కుడి వైపున ఉన్న మరిన్ని మరిన్ని ఆ తర్వాత సెట్టింగ్‌లు Settings ఆ తర్వాత గోప్యతా, సెక్యూరిటీ ఆ తర్వాత సురక్షిత బ్రౌజింగ్ అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. స్టాండర్డ్ రక్షణ సైట్ సమాచారాన్ని వీక్షించండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. వెబ్‌లో అందరికీ సెక్యూరిటీని మెరుగుపరచడంలో సహాయపడండి అనే ఆప్షన్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయండి.

"సెర్చ్‌లను & బ్రౌజింగ్‌ను మెరుగుపరచండి" అనే ఆప్షన్‌కు సంబంధించిన మీ సెట్టింగ్‌లను మార్చండి

"సెర్చ్‌లను, బ్రౌజింగ్‌ను మెరుగుపరచండి" అనే ఆప్షన్ ఆన్‌లో ఉన్నప్పుడు, మీ బ్రౌజింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను, సెక్యూరిటీని మెరుగుపరచడానికి మీరు ఉపయోగించే పేజీల URLలను Chrome పంపుతుంది. ప్రైవేట్ బ్రౌజింగ్ యాక్టివిటీ, అజ్ఞాత మోడ్‌లోని URLల గురించి మరింత తెలుసుకోండి.

కంప్యూటర్

  1. మీ కంప్యూటర్‌లో, Chromeను తెరవండి.
  2. ఎగువ కుడి వైపున ఉన్న మరిన్ని మరిన్ని ఆ తర్వాత సెట్టింగ్‌లు ఆ తర్వాత మీరు, Google ఆ తర్వాత సింక్, Google సర్వీస్‌లు అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  3. సెర్చ్‌లను, బ్రౌజింగ్‌ను మెరుగుపరచండి అనే ఆప్షన్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయండి.

Android

  1. మీ Android పరికరంలో, Chrome Chromeను తెరవండి.
  2. ఎగువ కుడి వైపున ఉన్న మరిన్ని మరిన్ని ఆ తర్వాత సెట్టింగ్‌లు Settings ఆ తర్వాత Google సర్వీస్‌లు అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. సెర్చ్‌లను, బ్రౌజింగ్‌ను మెరుగుపరచండి అనే ఆప్షన్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయండి.

iOS

  1. మీ iPhoneలో లేదా iPadలో, Chrome Chromeను తెరవండి.
  2. దిగువ కుడి వైపున ఉన్న మరిన్ని మరిన్ని ఆ తర్వాత సెట్టింగ్‌లు Settings ఆ తర్వాత Google సర్వీస్‌లు అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. సెర్చ్‌లను, బ్రౌజింగ్‌ను మెరుగుపరచండి అనే ఆప్షన్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయండి.

సంబంధిత రిసోర్స్‌లు

true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
1464091177997243593
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
237
false
false