వేరొకరి Google Calendarకు సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

ఎవరైనా తమ క్యాలెండర్‌ను మీకు షేర్ చేస్తే మీరు దాన్ని కనుగొనవచ్చు. వారు ఇప్పటికీ తమ క్యాలెండర్‌ను మీతో షేర్ చేయకపోతే, మీరు యాక్సెస్ కోసం రిక్వెస్ట్ కూడా చేయవచ్చు.

ముఖ్య గమనికలు:

  • మీరు 400 కంటే ఎక్కువ క్యాలెండర్‌లకు సబ్‌స్క్రయిబ్ చేస్తే క్యాలెండర్ పనితీరు ప్రభావితం కావచ్చు.
  • మీరు Google Calendarను కంప్యూటర్ లేదా మొబైల్ బ్రౌజర్‌లో ఉపయోగించినప్పుడు, మీరు సబ్‌స్క్రయిబ్ చేసుకోవాలనుకుంటున్న క్యాలెండర్‌ను కేవలం సెర్చ్ మాత్రమే చేయగలరు.

క్యాలెండర్‌కు సబ్‌స్క్రయిబ్ చేసుకోవడానికి ఈమెయిల్ అడ్రస్‌ను ఉపయోగించండి

1వ దశ: క్యాలెండర్‌కు సబ్‌స్క్రయిబ్ చేసుకోమని అడగండి

  1. మీ కంప్యూటర్‌లో, Google Calendarను తెరవండి.
  2. ఎడమ వైపున, "ఇతర క్యాలెండర్‌లు" పక్కన, జోడించండి Add other calendars ఆ తర్వాత క్యాలెండర్‌కు సబ్‌స్క్రయిబ్ చేయండిని క్లిక్ చేయండి. మీతో క్యాలెండర్ షేర్ చేసి ఉంటే, మీకు ఇమెయిల్ అందుతుంది.
  3. “క్యాలెండర్‌ను జోడించండి” బాక్స్‌లో, వ్యక్తి ఇమెయిల్ అడ్రస్‌ను ఎంటర్ చేయండి లేదా లిస్ట్ నుండి ఒక ఇమెయిల్ అడ్రస్‌ను ఎంచుకోండి.
  4. Enterను నొక్కండి.
  5. వారి క్యాలెండర్ షేర్ చేయబడి ఉందా లేదా అనే దాని బట్టి, కింది వాటిలో ఒకటి జరుగుతుంది:
    • ఒకవేళ క్యాలెండర్ మీతో షేర్ చేసి లేకపోతే, యాక్సెస్‌ను రిక్వెస్ట్ చేయమని మేము మీకు ప్రాంప్ట్ చేస్తాము.
    • ఒకవేళ క్యాలెండర్ ఇప్పటికే మీతో షేర్ చేసి ఉంటే, వారి క్యాలెండర్ "ఇతర క్యాలెండర్‌లు" కింద, ఎడమ వైపున జోడించబడుతుంది.
    • ఒకవేళ ఆ వ్యక్తి వద్ద Google Calendar లేకపోతే, Google Calendarను ఉపయోగించేందుకు వారిని ఆహ్వానించమని మేము మీకు ప్రాంప్ట్ చేస్తాము.
మీ సొంతం కాని క్యాలెండర్‌కు ఎలా సబ్‌స్క్రయిబ్ చేయాలో కనుగొనండి

2వ దశ: (ఆప్షనల్) ఇతర వ్యక్తి నుండి ఆమోదం పొందండి

మీరు రిక్వెస్ట్ చేసిన క్యాలెండర్, మీతో షేర్ చేసి లేకపోతే, ఆ క్యాలెండర్ ఓనర్‌కు యాక్సెస్ కోసం రిక్వెస్ట్ చేస్తూ ఒక ఈమెయిల్ అందుతుంది.

మీ రిక్వెస్ట్‌ను ఆమోదించడానికి, ఆ వ్యక్తి ఇలా చేయాలి:

  1. ఒక కంప్యూటర్‌లో, మీరు యాక్సెస్‌ను రిక్వెస్ట్ చేస్తూ పంపిన ఇమెయిల్‌ను తెరవాలి.
  2. ఇమెయిల్‌లోని లింక్‌ను క్లిక్ చేయాలి.
  3. తెరుచుకొనే సెట్టింగ్‌ల పేజీలో, రిక్వెస్ట్ పంపిన వ్యక్తిని ఎంచుకున్నారని నిర్ధారించుకొని, ఒక అనుమతి సెట్టింగ్‌ను ఎంచుకోవాలి.
  4. పంపండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

చిట్కా: ఇతర వ్యక్తి మీ రిక్వెస్ట్‌ను ఆమోదించాక, "ఈ క్యాలెండర్‌ను జోడించండి"కి లింక్‌తో ఒక ఇమెయిల్ మీకు అందుతుంది. మీరు క్యాలెండర్‌ను జోడించిన తర్వాత, అది "ఇతర క్యాలెండర్‌లు" కింద, ఎడమ వైపున కనిపిస్తుంది. ఒకవేళ అక్కడ క్యాలెండర్ కనిపించకపోతే, పేజీని రిఫ్రెష్ చేయండి.

పబ్లిక్ క్యాలెండర్‌ను జోడించడానికి లింక్‌ను ఉపయోగించండి

ముఖ్య గమనిక: ఇతర వ్యక్తి క్యాలెండర్ పబ్లిక్‌గా ఉంటే, మీరు లింక్‌ను ఉపయోగించి మాత్రమే క్యాలెండర్‌ను జోడించగలరు. పబ్లిక్ క్యాలెండర్‌ల గురించి మరింత తెలుసుకోండి.

  1. మీ కంప్యూటర్‌లో, Google Calendarను తెరవండి.
  2. ఎడమ వైపున, "ఇతర క్యాలెండర్‌లు" పక్కన, జోడించండి Add other calendars ఆ తర్వాత URL నుండిని క్లిక్ చేయండి.
  3. క్యాలెండర్ అడ్రస్‌ను ఎంటర్ చేయండి.
  4. క్యాలెండర్‌ను జోడించండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి. ఆ క్యాలెండర్ "ఇతర క్యాలెండర్‌లు" కింద, ఎడమ వైపున కనిపిస్తుంది.

చిట్కా: మార్పులు మీ Google Calendarలో కనిపించడానికి 24 గంటల దాకా సమయం పట్టవచ్చు.

వేరొకరి క్యాలెండర్‌ను దాచండి

  1. మీ కంప్యూటర్‌లో, Google Calendarను తెరవండి.
  2. ఎడమ వైపున, "ఇతర క్యాలెండర్‌లు" కింద, మీరు దాచాలనుకుంటున్న క్యాలెండర్ ఎంపికను తీసివేయండి.

చిట్కా: మీ లిస్ట్ నుండి ఒక క్యాలెండర్‌ను శాశ్వతంగా తొలగించాలని మీకు లేకపోతే, మీరు దాని సబ్‌స్క్రిప్షన్‌ను తీసివేయవచ్చు. క్యాలెండర్‌కు యాక్సెస్‌ను రీస్టోర్ చేయడానికి, ఆ క్యాలెండర్‌కు మళ్లీ సబ్‌స్క్రయిబ్ చేసుకోండి.

సంబంధిత రిసోర్స్‌లు

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
7238720192741706723
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
88
false
false