మీరు మీటింగ్‌లలో సమయాన్ని ఎలా వెచ్చిస్తున్నారో చూడండి

మీరు ఆఫీస్ లేదా స్కూల్ ఖాతాతో Google Calendarను ఉపయోగిస్తే, మీరు మీటింగ్‌లలో మీ సమయాన్ని ఎలా వెచ్చిస్తున్నారో తెలుసుకోవడానికి "సమయానికి సంబంధించిన గణాంకాలు" అనే ఆప్షన్‌ను ఉపయోగించవచ్చు. మీకు 'సమయానికి సంబంధించిన గణాంకాలు' ఆప్షన్ కనిపించకపోతే, మీ అడ్మిన్ మీ సంస్థ కోసం దాన్ని ఆఫ్ చేసి ఉండవచ్చు. నా అడ్మినిస్ట్రేటర్ ఎవరు?

మీరు సమయానికి సంబంధించిన గణాంకాలను చూడటానికి ఏమి కావాలి

  • మీరు కంప్యూటర్‌లో మాత్రమే సమయానికి సంబంధించిన గణాంకాలను చూడగలరు.
  • మీరు ఇతర వ్యక్తుల క్యాలెండర్‌లను మేనేజ్ చేస్తూ, ఆ క్యాలెండర్‌లకు "షేరింగ్ యాక్సెస్‌ను మేనేజ్ చేయండి" అనుమతిని కలిగి ఉంటే, మీరు వారి సమయానికి సంబంధించిన గణాంకాలను చూడవచ్చు.

సమయానికి సంబంధించిన గణాంకాలను చూడండి

ముఖ్య గమనిక: మీ ప్రధాన క్యాలెండర్‌లో సమయానికి సంబంధించిన గణాంకాల సమాచారం అందుబాటులో ఉంటుంది. సమయ గణాంకాలను కింద పేర్కొన్న వారు యాక్సెస్ చేయవచ్చు:

  1. మీ కంప్యూటర్‌లో, Google Calendarను తెరవండి.
  2. ఎడమ వైపున, మరిన్ని గణాంకాలు ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  • ఆప్షనల్: మీ సమయానికి సంబంధించిన కేటగిరీల గురించి మరింత సమాచారం కోసం, సహాయం ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

చిట్కా: సమయానికి సంబంధించిన గణాంకాలు అనేవి తేదీల పరిధిపై ఆధారపడి ఉంటాయి. వేరొక తేదీల పరిధి కోసం సమయానికి సంబంధించిన గణాంకాలను చూడటానికి, మీ క్యాలెండర్ వీక్షణను మార్చండి.

నిర్దిష్ట వ్యక్తితో వెచ్చించిన సమయాన్ని చెక్ చేయండి

మీరు ఒక వ్యక్తితో మీటింగ్‌లలో ఎంత సమయం వెచ్చిస్తున్నారో చూడటానికి, మీ సమయానికి సంబంధించిన గణాంకాల డ్యాష్‌బోర్డ్‌కు ఆ వ్యక్తికి సంబంధించిన కాంటాక్ట్‌ను పిన్ చేయండి:

  1. మీ కంప్యూటర్‌లో, Google Calendarను తెరవండి.
  2. ఎడమ వైపున, మరిన్ని గణాంకాలు ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. కుడి వైపున, “మీతో మీటింగ్‌లో పాల్గొన్న వ్యక్తులు” ఆప్షన్‌కు స్క్రోల్ చేయండి. పిన్ చేసిన వ్యక్తులను మేనేజ్ చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. పేరును ఎంటర్ చేయండి.
  5. పూర్తయింది ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

చిట్కా: మీరు గరిష్ఠంగా 10 కాంటాక్ట్‌లను పిన్ చేయవచ్చు.

ఏ మీటింగ్‌లు సమయానికి సంబంధించిన గణాంకాలలో భాగంగా లెక్కించబడతాయి

  1. మీ కంప్యూటర్‌లో, Google Calendarను తెరవండి.
  2. ఎడమ వైపున, మరిన్ని గణాంకాలు ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. కుడి వైపున, మీరు రివ్యూ చేయాలనుకుంటున్న గ్రాఫ్‌ను ఎంచుకోండి:
    • సమయానికి సంబంధించిన కేటగిరీలు.
    • మీటింగ్‌లలో వెచ్చించిన సమయం.
    • మీతో మీటింగ్‌లో పాల్గొన్న వ్యక్తులు.
  4. గ్రాఫ్‌లో, హైలైట్ చేయబడిన విభాగాలలో ఒక దానిపై మౌస్ కర్సర్ ఉంచండి.
    • సంబంధిత మీటింగ్ మీ క్యాలెండర్‌లో అదే రంగులో హైలైట్ చేయబడుతుంది, అలాగే మీ సమయానికి సంబంధించిన గణాంకాలలో భాగంగా లెక్కించబడుతుంది.

సమయానికి సంబంధించిన గణాంకాల గురించి సమాచారం

సమయానికి సంబంధించిన గణాంకాలలో భాగంగా లెక్కించబడే ఈవెంట్‌లు

సమయానికి సంబంధించిన గణాంకాలలో భాగంగా లెక్కించడానికి, ఈవెంట్ తప్పనిసరిగా Google Calendar మీటింగ్ అయి ఉండాలి, అలాగే కింది విధంగా ఉండాలి:

  • హాజరు కావడానికి మీరు "అవును" అని ప్రతిస్పందించాలి.
  • ఈవెంట్‌లో కనీసం మరొక గెస్ట్ అయినా ఉండాలి.
  • మీ క్యాలెండర్‌లో "బిజీ" అని మార్క్ చేయబడాలి.
  • ఈవెంట్ వ్యవధి 8 గంటల కన్నా తక్కువ సమయం ఉండాలి.

సమయానికి సంబంధించిన గణాంకాలలో భాగంగా లెక్కించబడని ఈవెంట్‌లు

కింద పేర్కొన్న సందర్భాలలో ఈవెంట్‌లు సమయానికి సంబంధించిన గణాంకాలలో భాగంగా లెక్కించబడవు:

  • ఈవెంట్‌కు మీరు మాత్రమే ఆహ్వానించబడితే.
  • మీరు ఈవెంట్‌కు "అవును" అని ప్రతిస్పందించకపోతే.

సమయానికి సంబంధించిన గణాంకాలు ఎలా లెక్కించబడతాయి

సమయానికి సంబంధించిన కేటగిరీల గురించి సమాచారం

మీ సమయానికి సంబంధించిన కేటగిరీలలో కనిపించే సమయ రకాలు కింద పేర్కొనబడ్డాయి.

  • ఫోకస్ టైమ్: వైరుధ్య మీటింగ్‌లు లేకుండా ప్లాన్ చేసిన ఫోకస్ టైమ్.
    • ఫోకస్ టైమ్‌ను సెట్ చేయడానికి, ఫోకస్ టైమ్‌ను షెడ్యూల్ చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  • 1:1: మరొక గెస్ట్‌ను కలిగి ఉన్న మీటింగ్‌లు.
  • 3+ గెస్ట్‌లు: కనీసం 2 ఇతర గెస్ట్‌లను కలిగి ఉన్న మీటింగ్‌లు.
  • ప్రతిస్పందించాల్సిన అవసరం ఉన్నవి: మీరు ఇంకా ఆమోదించని లేదా తిరస్కరించని మీటింగ్‌లు. "బహుశా హాజరు కావచ్చు" అని ప్రతిస్పందించిన మీటింగ్‌లు చేర్చబడలేదు.
  • మిగతా సమయం: మీటింగ్‌లు ఏవీ లేకుండా పని వేళలకు సంబంధించిన సమయం లేదా ’ఆఫీస్‌లో లేరు’ సమయం. మీరు మీ పని వేళలను సెట్ చేస్తే మాత్రమే ఇది కనిపిస్తుంది. మీ సంస్థ కోసం పని వేళలు అందుబాటులో ఉండకపోవచ్చు.

మీటింగ్‌లలో వెచ్చించిన సమయం

  • మీటింగ్‌లలో సమయం అనేది సగటున లెక్కించబడుతుంది. 
    • మీ క్యాలెండర్ రోజు, వారం, షెడ్యూల్ లేదా 5 రోజుల వీక్షణలో ఉన్నప్పుడు: గత 3 వారాలకు సంబంధించిన మీటింగ్‌లలో మీరు వెచ్చించిన సమయం నుండి సగటు లెక్కించబడుతుంది.
    • మీ క్యాలెండర్ నెల వీక్షణలో ఉన్నప్పుడు: గత 3 నెలలకు సంబంధించిన మీటింగ్‌లలో మీరు వెచ్చించిన సమయం నుండి సగటు లెక్కించబడుతుంది.
    • మీరు ఆఫీసులో లేకుంటే, మీటింగ్‌లలో వెచ్చించే మీ సగటు సమయం తగ్గుతుంది.
  • మీరు ఒకే సమయంలో షెడ్యూల్ చేయబడిన 2 మీటింగ్‌లను కలిగి ఉంటే, గ్రూప్ మీటింగ్‌కు సంబంధించిన సమయానికి బదులుగా 1:1 మీటింగ్‌కు సంబంధించిన సమయం లెక్కించబడుతుంది. పలు, ఒకే సమయంలో ఉన్న 1:1 మీటింగ్‌ల కోసం, మొత్తం సమయం లెక్కించబడుతుంది.
  • మీటింగ్‌లలో మీ సమయం ఏ కాల వ్యవధికైనా ఒకసారి మాత్రమే లెక్కించబడుతుంది. 
    • ఉదాహరణకు, ఒకే సమయంలో షెడ్యూల్ చేయబడిన 2 ఒక గంట వ్యవధి గల మీటింగ్‌లకు మీరు "అవును" అని ప్రతిస్పందిస్తే, మీటింగ్‌లలో వెచ్చించిన మీ సమయాన్ని ఒక గంటగా మాత్రమే లెక్కించడం జరుగుతుంది.

మీతో మీటింగ్‌లో పాల్గొన్న వ్యక్తులు

  • ఒక సమయ పరిధిలో మీరు కలిసి ఎక్కువ సమయం వెచ్చించిన 5 మంది వ్యక్తులు చూపబడతారు. 
  • మీరు ప్రధాన కాంటాక్ట్‌లను పిన్ చేయవచ్చు, అలాగే మీరు కలిసి మీటింగ్‌లలో ఎంత సమయాన్ని వెచ్చించారో చెక్ చేయవచ్చు. మీరు గరిష్ఠంగా 10 కాంటాక్ట్‌లను పిన్ చేయవచ్చు.
  • మీరు 15 లేదా అంతకంటే తక్కువ మంది ఇతర వ్యక్తులతో కలిసి మీటింగ్‌లో పాల్గొన్నప్పుడు మాత్రమే మరొక వ్యక్తితో వెచ్చించిన సమయం లెక్కించబడుతుంది.
  • ఇతర వ్యక్తి మీటింగ్‌ను తిరస్కరించినట్లయితే మీటింగ్ సమయం లెక్కించబడదు.
  • మీరు మీటింగ్‌కు "అవును" అని ప్రతిస్పందించకపోతే మీటింగ్ సమయం లెక్కించబడదు.
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
15687284789560361694
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
88
false
false