మీ మొదటి స్క్రీన్‌కు Google Calendarను జోడించండి

Google Calendar యాప్‌ను తెరవకుండా, మీ మొదటి స్క్రీన్ నుండి మీ రాబోయే ఈవెంట్‌లు, మీటింగ్‌లను చెక్ చేయడానికి, విడ్జెట్‌ను జోడించండి.

మీ మొదటి స్క్రీన్‌కు Calendar విడ్జెట్‌ను జోడించండి

ముఖ్య గమనిక: మీ Android ఫోన్ లేదా టాబ్లెట్ ఆధారంగా ఈ దశలలో కొన్ని భిన్నంగా ఉండవచ్చు.

  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, మొదటి స్క్రీన్‌ను నొక్కి, పట్టుకోండి.
  2. విడ్జెట్‌లు ఆ తర్వాత Calendar అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. ఈ విడ్జెట్‌లలో ఒక దాన్ని నొక్కి, పట్టుకోండి:
    • Calendar షెడ్యూల్: మీ టాస్క్‌లను, రాబోయే ఈవెంట్‌లను చూడండి.
    • Calendar నెల వీక్షణ: మీ షెడ్యూల్‌లో నెలవారీగా చూపండి.
  4. విడ్జెట్‌ను మొదటి స్క్రీన్‌లో ఖాళీగా ఉన్న చోటుకు లాగి, తర్వాత దాన్ని రిలీజ్ చేయండి.

Calendar విడ్జెట్ సైజ్‌ను మార్చండి

ముఖ్య గమనిక: Android విడ్జెట్‌లో, క్రియేట్ చేయండి జోడించండి బటన్ కోసం మీరు సైజ్‌ను మార్చలేరు.

  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, మీ మొదటి స్క్రీన్‌లోని విడ్జెట్‌ను నొక్కి, పట్టుకోండి, తర్వాత దాన్ని వదిలేయండి.
    • విడ్జెట్ చుట్టూ చుక్కలతో కూడిన అవుట్‌లైన్ కనిపిస్తుంది.
  2. విడ్జెట్ సైజ్‌ను మార్చడానికి, ఆ చుక్కలను లాగండి.
  3. మీరు సైజ్ మార్చడం పూర్తయిన తర్వాత, విడ్జెట్ బయట ట్యాప్ చేయండి.

Calendar విడ్జెట్‌ను తరలించండి

  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, విడ్జెట్‌ను నొక్కి, పట్టుకోండి.
  2. విడ్జెట్‌ను మొదటి స్క్రీన్‌లో ఖాళీగా ఉన్న చోటుకు లాగి, తర్వాత దాన్ని రిలీజ్ చేయండి.

Calendar విడ్జెట్‌ను తీసివేయండి

  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, విడ్జెట్‌ను నొక్కి, పట్టుకోండి.
  2. తీసివేయండి వరకు విడ్జెట్‌ను లాగండి, తర్వాత దాన్ని వదిలేయండి.

సంబంధిత రిసోర్స్‌లు

Android iPhone & iPad
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
3977687326065257504
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
88
false
false