Business Profile ఫోటోలు, వీడియోల పాలసీ, పోస్ట్‌ల కంటెంట్ పాలసీ

మీ కస్టమర్‌లకు సందర్భోచిత, సమయానుకూల సమాచారాన్ని నేరుగా తెలియజేయడానికి మీరు మీ Business Profileను ఉపయోగించవచ్చు. మీరు సమర్పించే కంటెంట్ ఏదైనా (టెక్స్ట్, ఫోటోలు లేదా వీడియోలతో సహా) తప్పకుండా కస్టమర్‌లకు సానుకూల అనుభవం అందించేలా చూడటంలో మా నిషేధిత, నియంత్రిత కంటెంట్ పాలసీలు సహాయపడతాయి. 

Business Profile ఫోటోలు మరియు వీడియోల పాలసీ

మీరు సమర్పించే లేదా పబ్లిష్ చేసే ఫోటోలు, వీడియోలకు మా నిషేధిత, నియంత్రిత కంటెంట్ పాలసీలు వర్తిస్తాయి. ఫోటోలు, వీడియోలు తప్పనిసరిగా అదనపు ప్రమాణాలకు కూడా కట్టుబడి ఉండాలి.

మీరు పోస్ట్ చేసిన ఇమేజ్‌లు అన్ని వర్తించే చట్టాలు, నిబంధనలను పాటించేలా చూడటం కూడా మీ బాధ్యత.

Business Profile పోస్ట్‌ల తాలూకు కంటెంట్ పాలసీ

మీరు పోస్ట్ చేసిన కంటెంట్, వర్తించే చట్టాలు, నియంత్రణలన్నింటినీ పాటిస్తోందని నిర్ధారించుకోవడం మీ బాధ్యత.

సందర్భాన్ని బట్టి, మేము ఈ పాలసీల్లో మార్పులు చేర్పులు చేస్తాము. కాబట్టి ఏవైనా అప్‌డేట్‌ల కోసం దయచేసి మళ్లీ ఇక్కడ చెక్ చేయండి. ఒకవేళ వర్తించే చట్టం ప్రకారం అవసరమైతే, మేము అలాంటి మార్పుల గురించి ప్రత్యేకంగా తెలియజేస్తాము.

"ఫోన్ నంబర్‌ను చేర్చడం" నివారించండి

దుర్వినియోగానికి గురి అయ్యే ప్రమాదాన్ని నివారించే దృష్ట్యా, మీరు పోస్ట్ చేసే కంటెంట్‌లో ఫోన్ నంబర్‌ను చేర్చడానికి మేము అనుమతించము. 

బదులుగా, "ఇప్పుడే కాల్ చేయండి" బటన్‌ను మీ పోస్ట్‌కు జోడించవచ్చు. ఈ బటన్, వెరిఫై చేసిన మీ Business Profile ఫోన్ నంబర్‌ను ఉపయోగిస్తుంది.

హోటల్‌కు సంబంధించిన పోస్ట్‌లు

  • కస్టమర్‌లకు సందర్భోచిత, సమయానుకూల సమాచారాన్ని అందించడానికి, లోకల్ పోస్ట్‌లను హోటల్ బిజినెస్‌లు క్రియేట్ చేయవచ్చు. 
  • “ఆఫర్” పోస్ట్‌లను కానీ, లేదా డీల్స్, ప్రమోషన్‌లు, ప్రత్యేక ఆఫర్‌లు లేదా డిస్కౌంట్‌లను పేర్కొనే లేదా కలిగి ఉండే పోస్ట్ దేనినీ హోటల్స్ క్రియేట్ చేయలేవు. ఆర్గానిక్, అలాగే యాడ్ ధరలను చూడటానికి హోటల్ సమాచార ప్యానెల్‌లో ఎక్కడికి నావిగేట్ చేయాలి అనే విషయంలో కస్టమర్‌లకు గందరగోళం ఎదురుకాకుండా ఇది చూసుకుంటుంది.

 

true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
1583139197494598979
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
99729
false
false
false