మీరు Google Assistantను ఏమి అడగవచ్చు

ఫలానా సమాచారం చెప్పు అని, నా రోజువారీ టాస్క్‌ల్లో సహాయం చేయి అని మీరు Google Assistantను అడగవచ్చు.

ముఖ్యమైనది: కొన్ని క్వెరీలు అన్ని పరికరాలలో అలాగే అన్ని భాషల్లో పని చేయవు.

Google Assistant ఎలాంటి సహాయం చేయగలదనే సలహాల కోసం, "నువ్వు ఏమి చేయగలవు?" అని అడగండి

Google Assistant ఏమి చేయగలదు

స్థానిక సమాచారాన్ని పొందండి

  • వాతావరణం: "ఈ రోజు వాతావరణం ఎలా ఉంది?"
  • ఆహారం: "సమీపంలోని పిజ్జా రెస్టారెంట్‌లను చూపించు."
  • బిజినెస్ తెరిచి ఉండే సమయాలు: "బావార్చీ బిర్యానీ సెంటర్ ఇంకా తెరిచే ఉందా?"
  • నావిగేషన్: "హోమ్‌కు నావిగేట్ చేయి."

మీ రోజును ప్లాన్ చేసుకోవడం

  • ట్రాఫిక్: "ఆఫీస్‌కు వెళ్లే దారిలో ట్రాఫిక్ ఎలా ఉంది?"
  • టాస్క్‌లు: ఈ రోజు సాయంత్రం బట్టలు ఉతకాలని గుర్తు చేయి. "ప్రతి ఆదివారం అమ్మకు ఫోన్ చేయమని నాకు గుర్తు చేయి."
  • క్యాలెండర్ ఈవెంట్‌లు: "ఈ రోజు నా మొదటి మీటింగ్ ఎప్పుడు ఉంది?"

Googleను అడగండి

  • గేమ్ అప్‌డేట్‌లు: "నేటి ఐపీఎల్ మ్యాచ్‌లో ఎవరు గెలిచారు?"
  • గణాంకాలు: "80లో 20% ఎంత?"
  • డిక్షనరీ: "'గ్రెగేరియస్' అంటే ఏమిటి?"
  • అనువాదాలు: "మిమ్మల్ని కలుసుకోవడం సంతోషంగా ఉంది అని ఫ్రెంచ్‌లో ఎలా చెప్పాలి?"
  • ఆర్థికం: “S&P 500 ఫలితాలు ఎలా ఉన్నాయి?”
  • యూనిట్ మార్పులు: "ఒక మైలుకు ఎన్ని కిలోమీటర్‌లు ఉంటాయి?"
  • సెర్చ్ చేయడం: "వేసవి సెలవుల్లో విహార యాత్రకు సంబంధించి సలహాల కోసం సెర్చ్ చేయి."
  • ఇమేజ్ సెర్చ్: "పిల్లుల ఫోటోలను చూపించు."
  • వెబ్ సమాధానం: "రగ్గు మీద పడిన వైన్ మరకలను ఎలా తీసివేయాలి?"

మీడియాను ప్లే చేయడం

Important: If media isn't playing, check if Use Restricted Mode is turned on in your device's YouTube settings.
  • మ్యూజిక్: "కర్నాటిక్ మ్యూజిక్ ఏదన్నా ప్లే చేయి."
  • పాడ్‌కాస్ట్‌లు: "అనగనగా పాడ్‌కాస్ట్ తాజా ఎపిసోడ్‌ను ప్లే చేయి."
  • News: "వార్తలు ప్లే చేయి. "డిడి సప్తగిరిలో తాజా వార్తలేమున్నాయి?"

వినోదాన్ని పొందడం

  • మీ Assistant గురించి తెలుసుకోవడం: “నువ్వు కలలు కంటావా?” “నీకు ఇష్టమైన రంగు ఏమిటి?”
  • గేమ్‌లు: “ఒక గేమ్ ఆడదాం.” “నన్ను ఒక సరదా ప్రశ్న అడుగు.”
  • వినోదం: “నాకు ఒక జోక్ చెప్పు.” “ఆసక్తికరమైన విషయం ఏదైనా చెప్పు.”
  • జంతువులకు సంబంధించిన విషయాలు: "నాకు జిరాఫీల గురించి చెప్పు." "సింహం బరువు ఎంత ఉంటుంది?"

నిర్దిష్ట పరికరాల్లో

మీ Pixel 8 లేదా Pixel 8 Proలో

వెబ్ పేజీల సారాంశాన్ని పొందండి

Chrome లేదా Google యాప్‌లో బిగ్గరగా చదవడం & వెబ్ పేజీలను అనువదించడం

Pixel సహాయాన్ని పొందడం

  • Pixel 8కు లేదా Pixel 8 Proకు సంబంధించి సపోర్ట్ పొందడానికి మీరు Google Assistantను ప్రశ్న అడగవచ్చు.
  • “నా Pixel విషయంలో సాయం చేయి”, లేదా “నేను నోటిఫికేషన్లను ఎలా ఆఫ్ చేయాలి?” లాంటివి అడగవచ్చు
మీ Pixel 6లో, అలాగే ఆ తర్వాత వచ్చిన మోడళ్లలో

Google Assistantతో మీ స్క్రీన్‌పై ఉన్న వాటిని అనువదించడం

  • Google Assistantను యాక్టివేట్ చేసి, “దీన్ని అనువదించు” అని చెప్పండి లేదా అనువదించండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  • ఇది మరొక భాషలో, ఇప్పటికే ఉన్న టెక్స్ట్‌కు పైన కనబడేలా, అనువాదం టెక్స్ట్‌ను జెనరేట్ చేస్తుంది. ఇది మీరు Google Lens అనువాదంలో చూసిన మాదిరిగానే ఉంటుంది.
  • టెక్స్ట్‌తో మీరు పలు రకాలుగా ఇంటరాక్ట్ కావచ్చు. ఉదాహరణకు దాన్ని ఎంపిక చేయవచ్చు. కాపీ చేయవచ్చు. దానిలో సెర్చ్ చేయవచ్చు. లేదా దాన్ని బిగ్గరగా చదివి వినిపించమని చెప్పవచ్చు.
  • ఇమేజ్‌లలో ఉన్న టెక్స్ట్‌తో సహా, మీరు స్క్రీన్‌పై చూసే టెక్స్ట్ విషయంలో ఈ ఫీచర్ పని చేస్తుంది.

మీ వాయిస్‌తో టైప్ చేయడం

  • Assistant వాయిస్ టైపింగ్ ద్వారా మీ వాయిస్‌ను ఉపయోగించి మెసేజ్‌ను టైప్ చేయవచ్చు, ఎమోజీలను జోడించవచ్చు, ఎడిట్లు చేయవచ్చు, పలు భాషల్లో సులభంగా మెసేజ్‌ను పంపవచ్చు. మీరు మాట్లాడే భాషను Google Assistant ఆటోమేటిక్‌గా గుర్తిస్తుంది.
  • మీరు మాట్లాడేటప్పుడు విరామ చిహ్నాలు ఆటోమేటిక్‌గా జోడించబడతాయి. మైక్ ఆన్‌లో ఉన్నా కూడా, మాట్లాడేటప్పుడు టైప్ చేయడానికి మీరు కీబోర్డ్‌ను కూడా ట్యాప్ చేయవచ్చు.
  • మీ వాయిస్‌తో టెక్స్ట్‌ను ఎడిట్ చేయడానికి “తొలగించు”, “క్లియర్ చేయి”, లేదా మెసేజ్‌ను పంపడానికి “పంపించు” వంటి, వాయిస్ కమాండ్‌లను ఉపయోగించండి.
  • మీరు మాట్లాడే టెక్స్ట్ మీ పరికరంలోనే ఉంటుంది, Google సర్వర్‌లకు వెళ్లదు.
  • Assistant వాయిస్ టైపింగ్ ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, జపనీస్, స్పానిష్ భాషల్లో అందుబాటులో ఉంది.
  • మీ వాయిస్ ద్వారా టైప్ చేయడానికి Google Assistantను ఉపయోగించడం ఎలా అనే దాని గురించి మరింత తెలుసుకోండి.
మీ Pixel 4లో, అలాగే ఆ తర్వాత వచ్చిన మోడళ్లలో

ఫోటోలు తీయడం, సెర్చ్ చేయడం & షేర్ చేయడం

  • "హైదరాబాద్‌లో తీసుకున్న నా ఫోటోలను చూపించు"
  • "ఒక సెల్ఫీ తీయి." అని చెప్పి, ఆపై "దీన్ని అశోక్‌తో షేర్ చేయి" అని చెప్పండి.
  • "10 సెకన్లలో ఫోటో తీయి."

మీ ఫోన్‌కు సంబంధించిన సెట్టింగ్‌లను మేనేజ్ చేయండి

  • "ఫ్లాష్‌లైట్‌ను ఆన్ చేయి."
  • "స్క్రీన్‌షాట్ తీయి."
  • "అంతరాయం కలిగించవద్దు మోడ్‌ను ఆన్ చేయి."
  • "బ్లూటూత్‌ను ఆన్ చేయి."

కాల్స్ చేయడం లేదా మెసేజ్‌లు పంపడం

  • "అమ్మకు కాల్ చేయి."
  • “కాల్‌కు సమాధానం ఇవ్వు” లేదా “కాల్‌ను తిరస్కరించు.”
  • "లక్ష్మికి చెప్పు, నాకు అయిదు నిమిషాలు ఆలస్యమవుతుంది."
  • "నువ్వు వచ్చే దారిలో పాలు తీసుకొని రావడం మర్చిపోవద్దని, శ్రీధర్‌కు టెక్స్ట్ మెసేజ్ పంపు."
  • చాట్ థ్రెడ్‌లో "నేను దారిలో ఉన్నాను, అని రిప్లయి చేయి" అని చెప్పండి.

యాప్‌లను తెరవడం

  • "Translateను తెరువు."
  • "YouTubeలో యోగా తరగతుల కోసం సెర్చ్ చేయి." ఆపై "దీన్ని అమ్మతో షేర్ చేయి" అని చెప్పండి.
  • "Mapsలో గోవాలోని హోటల్స్‌ను చూపించు."
  • "YouTube Musicలో [Artist name]."
  • "నాకు Gmailలో పరమేశ్వర్ నుండి వచ్చిన ఈమెయిల్స్ చూపించు."

Chromeలో వెబ్‌సైట్‌లను తెరవడం

Chrome యాప్‌లోని సైట్‌కు వెళ్లమని Google Assistantను అడగండి.

  • "[site name]కు వెళ్లు."
  • "[site name]ను తెరువు."

మీ యాప్‌లలో లేదా వెబ్‌సైట్‌లలో సెర్చ్ చేయడం

మీరు Chromeలో యాప్‌ను లేదా వెబ్‌సైట్‌ను తెరిచినప్పుడు, ఈ కింద ఇచ్చిన లాంటి టాస్క్‌లను పూర్తి చేయడంలో మీకు సహాయం చేయమని Google Assistantను అడగండి:

  • "చూడటానికి వీడియోను కనుగొనడం"
  • "మెసేజ్ కోసం సెర్చ్ చేయడం."

ఇది అనేక యాప్‌లతో నిరంతరాయంగా పనిచేస్తుంది, అలాగే మేము కాలక్రమేణా యాప్ ఇంటిగ్రేషన్‌లను మెరుగుపరచడాన్ని కొనసాగిస్తాము. ఉదాహరణకు:

  • YouTube యాప్ తెరిచి ఉన్నప్పుడు, "పిల్లి వీడియోలను సెర్చ్ చేయి" అని చెప్పండి.
  • Google Photos యాప్ తెరిచి ఉన్నప్పుడు, "నాకు హైదరాబాద్‌లో తీసుకున్న ఫోటోలను చూపించు" అని చెప్పండి. ఆపై "శిల్పారామం దగ్గర తీసుకున్నవి" అని చెప్పండి.
  • Chromeలో వంటకాల సైట్ తెరిచి ఉన్నప్పుడు, "జీడిపప్పు, గుత్తి వంకాయ కూర కోసం సెర్చ్ చేయి" అని చెప్పండి.
  • ట్రావెల్ యాప్ తెరిచి ఉన్నప్పుడు, [“ఊటీలో హోటళ్లు”] అని చెప్పండి.
మీ ఫోన్‌లో లేదా టాబ్లెట్‌లో

తెలియజేయండి

  • కాల్స్: “అమ్మకు కాల్ చేయి.” “వీడియో కాల్ చేయి.”
  • Duo: "అమ్మకు కాల్ చేయి."
  • ఫోన్స్‌లో మాత్రమే:
    • SMS: శ్రీనివాస్‌కు "సాయంత్రం 5 గంటలకు కలుద్దాం" అని SMS పంపు.
    • WhatsApp: 'కిరణ్‌'కు WhatsApp యాప్‌లో మెసేజ్‌ను పంపు."

Get around your device

  • సెట్టింగ్‌లను మార్చడం: "WiFiని ఆన్ చేయి." "వాల్యూమ్ పెంచు." "ప్రకాశాన్ని తగ్గించు."
  • మీ ఫోన్‌ను కంట్రోల్ చేయడం:"ఫ్లాష్‌లైట్ ఆన్ చేయి." "ఫోటో తీయి."
    • Google Assistant మీ కోసం ఫోటో తీయగలదా లేదా అనేది మీ పరికర తయారీదారుపై ఆధారపడి ఉంటుంది.
    • మీ యాప్‌లలో అంశాలను కనుగొనడం: Amazonలో టాబ్లెట్‌ల కోసం సెర్చ్ చేయి. "Twitterలో పవన్ కళ్యాణ్ కోసం సెర్చ్ చేయి."
    • ఫోటోలను కనుగొనడం: బీచ్‌కు సంబంధించిన నా ఫోటోలను చూపించు.

మీ రోజును ప్లాన్ చేసుకోవడం

  • అలారాలు: "ఉదయం 7 గంటలకు అలారం సెట్ చేయి."

పనులను పూర్తి చేసుకోండి

  • షాపింగ్:"నా షాపింగ్ లిస్ట్‌కు అరటిపళ్లు జోడించు."

చిట్కా: ఒకేసారి 2 పనులను చేయడానికి, 2 రిక్వెస్ట్‌లను "అలాగే"తో కనెక్ట్ చేయండి. ఉదాహరణకు, మీరు "Ok Google, లైట్‌లను ఆఫ్ చేయి అలాగే టీవీని ఆన్ చేయి" అని చెప్పవచ్చు. ప్రస్తుతానికి, మీరు Google Assistantను ఇంగ్లీష్‌లో ఉపయోగిస్తే మాత్రమే, 2 పనులను ఒకేసారి చేయగలరు.

మీ స్పీకర్ లేదా స్మార్ట్ డిస్‌ప్లేలో

మీ స్మార్ట్ హోమ్‌ను కంట్రోల్ చేయడం

  • లైట్‌లు: "లివింగ్ రూమ్ లైట్‌ల వెలుతురును తగ్గించు."
  • థర్మోస్టాట్‌లు: "వెచ్చదనం ఉష్ణోగ్రతను 70కి సెట్ చేయి." "ఉష్ణోగ్రతను 2 డిగ్రీలు తగ్గించు."

మీ రోజును ప్లాన్ చేసుకోవడం

  • అలారాలు: "ఉదయం 7 గంటలకు అలరాన్ని సెట్ చేయి."

తెలియజేయండి

ముఖ్య గమనిక: ఇది స్మార్ట్ డిస్‌ప్లేలలో మాత్రమే పని చేస్తుంది.

  • కాల్స్: “అమ్మకు కాల్ చేయి.” “వీడియో కాల్ చేయి.”
  • Duo: "అమ్మకు కాల్ చేయి." "లివింగ్ రూమ్‌లో స్మార్ట్ డిస్‌ప్లేకు కాల్ చేయి."

చిట్కా: ఒకేసారి 2 పనులను చేయడానికి, 2 రిక్వెస్ట్‌లను "ఇంకా"తో కనెక్ట్ చేయండి. ఉదాహరణకు, మీరు "Ok Google, లైట్‌లను ఆఫ్ చేయి అలాగే టీవీని ఆన్ చేయి" అని చెప్పవచ్చు. ప్రస్తుతానికి, మీరు ఇంగ్లీష్‌లో Google Assistant ఉపయోగిస్తుంటే, మీరు ఒకేసారి 2 పనులను మాత్రమే చేయగలరు.

మీ టీవీలో

టీవీ చూడడం

  • సినిమాలు & టీవీ షోలు: Netflixలో సేక్రెడ్ గేమ్స్ షోను ప్లే చేయి.
  • వీడియో క్లిప్‌లు: ”పిల్లికి సంబంధించిన వీడియోలు ప్లే చేయి.”
  • యాప్‌లు: "YouTubeను తెరువు."
  • సెర్చ్ చేయడం: "కామెడీ షోల కోసం సెర్చ్ చేయి."
  • సమాచారం: "నాకు గృహలక్ష్మి గురించి చెప్పు."

కంట్రోల్

  • ప్లేబ్యాక్: “పాజ్ చేయి.” “స్టాప్ చేయి.” “కొనసాగించు”
  • Volume: “వాల్యూమ్ పెంచు.” “వాల్యూమ్ తగ్గించు.”
  • పవర్: "ఆఫ్ చేయి."
మీ వాచ్‌లో

తెలియజేయడం

మీ వద్ద LTE కనెక్షన్ గల వాచ్ ఉంటే మినహా, దిగువున పేర్కొన్న వాయిస్ చర్యలు మీ ఫోన్‌ను ఉపయోగిస్తాయి.

  • టెక్స్ట్: "మిమ్మల్ని 5 గంటలకు కలుస్తాను అని శ్రీ రామ్‌కు టెక్స్ట్ మెసేజ్ పంపు."

ఫిట్‌నెస్

  • పరుగు: "నా పరుగును ట్రాక్ చేయి."
  • సైక్లింగ్: "సైకిల్ రైడ్‌ను ప్రారంభించు."
  • అడుగుల గణన: "నేను ఎన్ని అడుగులు వేశాను?"
  • గుండె స్పందన రేటు: "నా గుండె స్పందన రేటు ఎంత?"
మీ హెడ్‌ఫోన్స్‌లో

మీరు Android ఫోన్ లేదా టాబ్లెట్‌కు కనెక్ట్ చేసినప్పుడు, కొన్ని హెడ్‌ఫోన్స్ Google Assistantతో హెడ్‌ఫోన్స్ ఫీచర్‌లను కంట్రోల్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి. మీ హెడ్‌ఫోన్స్ Google Assistantకు సపోర్ట్ చేస్తాయో లేదో తెలుసుకోవడానికి, మీ హెడ్‌ఫోన్స్ యూజర్ మాన్యువల్‌ను చెక్ చేయండి.

బ్యాటరీ స్థాయి

మీరు మీ హెడ్‌ఫోన్స్ లేదా ఇయర్‌బడ్‌ల బ్యాటరీ స్థాయిని కనుగొనవచ్చు.

  • "నా హెడ్‌ఫోన్స్‌లో బ్యాటరీ స్థాయి ఎంత ఉంది?"

నాయిస్ క్యాన్సిలేషన్

బయటి నుంచి వచ్చే రణగొణ ధ్వనులను తగ్గించడానికి, మీ హెడ్‌ఫోన్స్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌ను సపోర్ట్ చేస్తున్నట్లయితే, మీరు దాన్ని ఆన్ లేదా ఆఫ్ చేయడానికి లేదా దాని స్థాయిని సర్దుబాటు చేయడానికి Google Assistantను ఉపయోగించవచ్చు.

  • ఆన్ లేదా ఆఫ్ చేయడం: "నాయిస్ క్యాన్సిలేషన్‌ను ఆన్ చేయి"
  • పెంచడం లేదా తగ్గించడం: "నాయిస్ క్యాన్సిలేషన్‌ను పెంచు."
  • సెట్ చేయడం: "నాయిస్ క్యాన్సిలేషన్‌ను గరిష్ఠానికి సెట్ చేయి."
  • క్వెరీ: "నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్‌లో ఉందా?"

యాంబియెంట్ మోడ్

యాంబియెంట్ నాయిస్‌ల సౌండ్‌ను (కొన్నిసార్లు 'టాక్-త్రూ' లేదా 'పాస్-త్రూ' అని పిలుస్తారు) బూస్ట్ చేయడానికి మీ హెడ్‌ఫోన్స్ యాంబియెంట్ మోడ్‌ను సపోర్ట్ చేస్తే, మీరు దాన్ని ఆన్ లేదా ఆఫ్ చేయడానికి లేదా స్థాయిని సర్దుబాటు చేయడానికి Google Assistantను ఉపయోగించవచ్చు.

  • ఆన్ లేదా ఆఫ్ చేయడం: "యాంబియెంట్ మోడ్‌ను ఆన్ చేయి."
  • పెంచడం లేదా తగ్గించడం: "యాంబియెంట్ మోడ్‌ను పెంచు."
  • సెట్ చేయడం: "యాంబియెంట్ మోడ్‌ను గరిష్ఠానికి సెట్ చేయి."
  • క్వెరీ: "యాంబియెంట్ మోడ్ ఆన్‌లో ఉందా?"

టచ్ కంట్రోల్స్

మీ హెడ్‌ఫోన్స్‌కు టచ్ సెన్సిటివ్ కంట్రోల్స్ ఉంటే, వ్యాయామం వంటి సమయంలో అనుకోకుండా జరిగే మాన్యువల్ యాక్టివేషన్‌లను నివారించడానికి మీరు వాటిని ఆఫ్ చేయవచ్చు. మీరు మీ టచ్ కంట్రోల్స్‌ను ఆఫ్ చేస్తే, వాటిని తిరిగి ఆన్ చేయమని Google Assistantను అడగడానికి మీరు వాయిస్ మ్యాచ్‌ను ఉపయోగించాల్సి రావచ్చు, లేదా మీ పరికర తయారీదారు మొబైల్ యాప్ ద్వారా వాటిని తిరిగి ఆన్ చేయాల్సి ఉంటుంది.

  • ఆన్ లేదా ఆఫ్ చేయడం: "టచ్ కంట్రోల్స్‌ను ఆన్ చేయి."
  • క్వెరీ: "టచ్ కంట్రోల్స్ ఆన్‌లో ఉన్నాయా?"
మీ కారులో

నావిగేషన్

  • "[address]కు నావిగేట్ చేయి."
  • "ఆఫీస్‌కు వెళ్లే దారిలో ట్రాఫిక్ ఎలా ఉంది?"
  • "నా తర్వాతి మలుపు ఏమిటి?"

మీడియా

  • "మ్యూజిక్‌ను ప్లే చేయి."
  • "[song name]ను ప్లే చేయి."
  • "[podcast name] తాజా ఎపిసోడ్‌ను ప్లే చేయి."

తెలియజేయడం

  • "అమ్మకు కాల్ చేయి."
  • "నాన్నకు టెక్స్ట్ చేయి."
  • "నా మెసేజ్‌లను చదువు."

రోజువారీ వాతావరణ అప్‌డేట్‌లను, కోట్‌లను & మరిన్నింటిని పొందండి

మీ ఆసక్తుల గురించి రోజువారీ అప్‌డేట్‌లను పంపమని మీరు మీ ఫోన్‌లోని Google Assistantను అడగవచ్చు.

ముఖ్యమైనది: కొన్ని ఫీచర్‌లు అన్ని భాషలు, దేశాలు లేదా ప్రాంతాలలో లేదా అర్హత కలిగిన Android పరికరాలలో అందుబాటులో లేవు.

Subscribe to a daily update

  1. On your Android phone or tablet, touch and hold the Home button or say "Hey Google."
  2. Say or type the update you want, for example:
    • “Send me the weather everyday.”
    • “Send me a poem everyday.”
    • “Send me a quote everyday.”
    • “Send me a funny video everyday.”
    • “Send me a fun fact everyday.”
    • “Send me a mindfulness tip everyday.”
  3. When asked if you want to receive this info everyday, tap Yes.
  4. Choose a time to receive your daily update.

Find your daily updates

  1. On your Android phone or tablet, touch and hold the Home button or say "Hey Google."
  2. Say or type:
    • “Find my daily updates.”
    • “Find my subscriptions.”
    • “What are my subscriptions?”

Change or cancel a daily update

  1. On your Android phone or tablet, touch and hold the Home button, or say "Hey Google."
  2. Say or type:
    • “Find my subscriptions.”
    • “What are my subscriptions?”
  3. Tap a subscription ఆ తర్వాత Change time or Cancel the subscription.

Daily updates don’t work

Google TVలో Google Assistantతో మరిన్ని చేయండి

మీరు Google Assistantతో మీ Google TVలో ప్రశ్నలు అడగవచ్చు, టాస్క్‌లను పూర్తి చేయవచ్చు. Google Assistant మీ Google TV పరికరంలో ఇన్‌స్టాల్ చేయబడింది. మీరు మీ పరికరాన్ని మొదట సెటప్ చేసినప్పుడు దాన్ని ఆన్ చేయవచ్చు లేదా తర్వాత దాన్ని ఆన్ చేయవచ్చు.

Google TV పరికరాలలో, Google Assistant ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్, ఇటాలియన్, జపనీస్, హిందీ, చైనీస్ (సాంప్రదాయ), కొరియన్, పోర్చుగీస్ (బ్రెజిల్), డచ్, నార్వేజియన్, స్వీడిష్, ఇంకా డేనిష్ భాషల్లో అందుబాటులో ఉంది.

Google Assistantతో మాట్లాడండి

  1. మీ Google TV రిమోట్‌లో, Google Assistant బటన్‌ Assistantను నొక్కండి .
  2. ప్రశ్న అడగండి లేదా కమాండ్ చెప్పండి.
  3. మీ రిక్వెస్ట్‌ను అర్థం చేసుకోవడంలో Google Assistantకు సహాయం చేయడానికి, మీ రిమోట్‌లోని మైక్రోఫోన్‌లో మాట్లాడండి.

చిట్కా: మీ Assistantతో మరింత ఎక్కువ ప్రయోజనం పొందడానికి, మీ ఫోన్‌లో, Google Assistant యాప్ Assistantను డౌన్‌లోడ్ చేయండి.

మీరు Google Assistantను ఏమి అడగవచ్చు

వీడియోలను చూడడం

  • సినిమాలు, టీవీ షోలు: "Disney+లో అనుపమను ప్లే చేయండి."
  • వీడియో క్లిప్‌లు: "YouTubeలో పిల్లి వీడియోలను ప్లే చేయండి."
  • యాప్‌లు: "YouTubeను తెరవండి."
  • సెర్చ్ చేయడం: "హాస్య ధారావాహికల కోసం సెర్చ్ చేయి." "సైన్స్ ఫిక్షన్ సినిమాలను కనుగొను."
  • సమాచారం: "గృహలక్ష్మి గురించి చెప్పు."

మీడియాను కంట్రోల్ చేయడం

  • ప్లేబ్యాక్: "పాజ్ చేయి." "స్టాప్ చేయి." "కొనసాగించు."
  • వాల్యూమ్: "వాల్యూమ్ పెంచు." "వాల్యూమ్ తగ్గించు."

మీ స్మార్ట్ హోమ్‌ను కంట్రోల్ చేయడం

  • లైట్స్: "లివింగ్ రూమ్ లైట్‌లను డిమ్ చేయి."
  • థర్మోస్టాట్స్: "వేడిని 70కి సెట్ చేయి." "ఉష్ణోగ్రత 2 డిగ్రీలు తగ్గించు."

మీ రోజును ప్లాన్ చేసుకోవడం

  • అలారాలు: "ఉదయం 7 గంటలకు అలారం సెట్ చేయి."

Googleను అడగండి

  • గేమ్ అప్‌డేట్‌లు: "వారియర్స్ గేమ్‌లో ఎవరు గెలిచారు?"
  • లెక్కలు: "80లో 20% ఎంత?"
  • డిక్షనరీ: "'గ్రెగేరియస్' అంటే ఏమిటి?"
  • అనువాదాలు: "మిమ్మల్ని కలుసుకోవడం సంతోషంగా ఉంది అని ఫ్రెంచ్‌లో ఎలా చెప్పాలి?"
  • ఫైనాన్స్: "S&P 500 ఎలా పని చేస్తోంది?"
  • యూనిట్ మార్పిడులు: "ఒక మైలుకు ఎన్ని కిలోమీటర్‌లు?"
  • సెర్చ్ చేయడం: "వేసవి వెకేషన్ ఐడియాల కోసం సెర్చ్ చేయి."
  • ఇమేజ్ సెర్చ్: "పిల్లుల ఫోటోలను కనుగొను."
  • వెబ్ సమాధానం: "రగ్గు నుండి వైన్ మరకలను ఎలా తీసివేయాలి?"

వినోదాన్ని పొందడం

  • మీ Assistant గురించి తెలుసుకోండి: "మీరు కలలు కంటున్నారా?" "మీకు ఇష్టమైన రంగు ఏమిటి?"
  • గేమ్‌లు: "ఒక గేమ్ ఆడుదాము." "నన్ను ఒక తేలికైన ప్రశ్న అడుగు."
  • వినోదం: "నాకు ఒక జోక్ చెప్పు." "ఆసక్తికరమైన విషయం ఏదైనా చెప్పు."

చిట్కా: మరిన్ని ఐడియాల కోసం, Google Assistantను అడుగు, "మీరు ఏమి చేయగలరు?"

చర్య తీసుకోవడానికి Google Assistantను ఎలా పొందాలి

మీ రిక్వెస్ట్‌లకు సమాధానం ఇవ్వడానికి, Google Assistant అందుబాటులో ఉన్న ఉత్తమ పరికరాన్ని ఉపయోగిస్తుంది. మీరు Google Assistantను "మ్యూజిక్ ప్లే చేయి" అని అడిగితే, మీ ఫోన్‌కు బదులుగా మీ స్పీకర్ మ్యూజిక్‌ను ప్లే చేస్తుంది, ఎందుకంటే ఇది ఉత్తమ ఆడియోను అందిస్తుంది.

మీ రిక్వెస్ట్‌కు ఏ పరికరం ప్రతిస్పందించాలో నిర్ణయించడం Assistant ఎల్లప్పుడూ సులభం కాకపోవచ్చు. మీ ప్రాధాన్య పరికరం సమాధానం ఇస్తుందని నిర్ధారించుకోవడానికి:

  • పరికర ప్లేస్‌మెంట్: మీ పరికరాలు కనీసం 8 అడుగుల దూరంలో ఉన్నాయో లేదో చెక్ చేయండి.
  • పరికరం పేరు చెప్పడం: కొన్ని చర్యల కోసం, మీరు ఉపయోగించాలనుకుంటున్న పరికరాన్ని చెప్పవచ్చు. ఉదాహరణకు, "Ok Google, బెడ్‌రూమ్ స్పీకర్‌లో మ్యూజిక్‌ను ప్లే చేయండి" లేదా "Ok Google, వంటగదిలో లైట్లు ఆన్ చేయండి."
  • నిర్దిష్ట పరికరాలను టార్గెట్‌గా చేసుకోండి: పరికర రకం ఆధారంగా, మీ రిక్వెస్ట్ కోసం మీరు ఏ పరికరాన్ని ఉపయోగించాలనుకుంటున్నారో Google Assistantకు చూపడానికి మార్గాలు ఉన్నాయి. కొన్నిసార్లు, ఇది పరికరానికి దగ్గరగా వెళ్లడానికి సహాయపడుతుంది.
    • Pixel Watch: మీ మణికట్టును ఎత్తండి లేదా కదల్చండి.
    • Nest Hub Max: సరైన అనుమతులు మంజూరు చేయబడితే, మీరు Google Assistantను అడుగుతున్నప్పుడు పరికరాన్ని చూడండి.
    • ఫోన్, టాబ్లెట్: స్క్రీన్ పైకి ఉండేలా చూసుకోండి.
  • టైమర్‌లను, అలారాలను మీడియాను రిమోట్‌గా కంట్రోల్ చేయి: ఉదాహరణకు, మీరు మీ గదిలో నుండి మీ బెడ్‌రూమ్‌లో మోగుతున్న అలారాన్ని ఆపాలనుకుంటే, "Ok Google, అలారం ఆపు" అని చెప్పండి. ఉదాహరణకు, మీరు మీ గదిలో నుండి మీ బెడ్‌రూమ్‌లో మోగుతున్న అలారాన్ని ఆపాలనుకుంటే, "Ok Google, అలారం ఆపు" అని చెప్పండి. మీకు అతి దగ్గరగా ఉన్న పరికరం రింగింగ్ అలారాన్ని ఆపివేస్తుంది.

భవిష్యత్తులో ప్రవర్తనను మెరుగుపరచడంలో Googleకు సహాయపడండి

మెరుగైన అనుభవాన్ని అందించడానికి, Google Assistant మీ ఉపయోగిస్తుంది.

Assistant నోటిఫికేషన్‌లు

మేము మీ ఫీడ్‌బ్యాక్‌ను అడగడం కోసం పుష్ నోటిఫికేషన్‌లను క్రమం తప్పకుండా పంపుతాము. మీరు నోటిఫికేషన్‌ను అందుకున్నట్లయితే, Google Assistantను మెరుగుపరచడంలో సహాయపడటానికి మీ ఫీడ్‌బ్యాక్‌ను షేర్ చేసుకోండి.

Google Home యాప్‌లోని ఫీడ్‌బ్యాక్‌ను పంపడం

  1. Google Home యాప్ Google Homeను తెరవండి.
  2. పైన కుడి వైపున, మీ ప్రొఫైల్ చిహ్నం మీద ట్యాప్ చేయండి.
  3. మీరు ఫీడ్‌బ్యాక్‌ను సబ్మిట్ చేయాలనుకుంటున్న పరికరం రకాన్ని సహాయం & ఫీడ్‌బ్యాక్ ఆ తర్వాతను ఎంచుకోండి.
  4. మీరు ఫీడ్‌బ్యాక్‌ను సబ్మిట్ చేయాలనుకునే పరికరానికి ఫీడ్‌బ్యాక్ పంపండి ఆ తర్వాతను ట్యాప్ చేయండి.
  5. మీ సమస్య తాలూకు క్లుప్త వివరణను ఎంటర్ చేయండి.
  6. స్క్రీన్‌షాట్, సిస్టమ్ లాగ్‌ల: కోసం బాక్స్‌ను ఎంచుకోండి.
  7. ఎగువ కుడి వైపున ఉన్న, పంపు Sendను ట్యాప్ చేయండి.

వాల్యూమ్‌ను మార్చండి

మీడియాను ప్లే చేయమని మీరు మీ Google Assistantను అడిగిన తర్వాత, మీరు కమాండ్‌లతో వాల్యూమ్‌ను కంట్రోల్ చేయవచ్చు. మీరు వాల్యూమ్‌ను నిర్దిష్ట స్థాయికి (1–10) లేదా శాతానికి (1–100%) సెట్ చేయవచ్చు.

ముఖ్య గమనిక: మీరు ఉపయోగించగల భాషలు పరికరంపై ఆధారపడి ఉంటాయి. మీ పరికరంలో ఏ భాషలు పని చేస్తాయో తెలుసుకోండి.

వాల్యూమ్‌ను మార్చడం ఎలా

మీ Google Assistantతో మాట్లాడటానికి "Ok Google" అని చెప్పండి లేదా బటన్‌ను నొక్కండి. అప్పుడు కమాండ్‌ను చెప్పండి.

  • పెంచడం: “దానిని పెంచు.” వాల్యూమ్ (10% పెరుగుతుంది).
  • తగ్గించడం: “దానిని తగ్గించు.” (వాల్యూమ్ 10% తగ్గుతుంది).
  • నిర్దిష్ట స్థాయి లేదా శాతాన్ని సెట్ చేయండి: "వాల్యూమ్ 5." "వాల్యూమ్‌ను 65%."
  • వాల్యూమ్‌ను [X] మార్చండి: "వాల్యూమ్‌ను 10% పెంచు." "వాల్యూమ్‌ను 10% తగ్గించు."
  • పూర్తిగా పెంచడం: “వాల్యూమ్‌ను పూర్తిగా పెంచు.”
  • పూర్తిగా తగ్గించడం: “వాల్యూమ్‌ను పూర్తిగా తగ్గించు.”

సంబంధిత రిసోర్స్‌లు

Android iPhone & iPad
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
16368142918386996098
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
1633398
false
false