Android పరికరంలో స్క్రీన్ లాక్‌ను సెటప్ చేయండి

అనుమతి లేని యాక్సెస్ నుండి మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌ను సురక్షితంగా ఉంచడంలో సహాయపడటానికి మీరు స్క్రీన్ లాక్‌ను సెటప్ చేయవచ్చు. మీ పరికరాన్ని లేదా స్క్రీన్‌ను ఆన్ చేసిన ప్రతిసారీ, సాధారణంగా PIN, ఆకృతి లేదా పాస్‌వర్డ్‌తో మీ పరికరాన్ని అన్‌లాక్ చేయమని మిమ్మల్ని అడుగుతుంది. కొన్ని పరికరాలలో, మీ వేలిముద్రతో మీరు అన్‌లాక్ చేయవచ్చు.

ముఖ్యమైనది: ఈ దశలలో కొన్ని, Android 10లో, అలాగే ఆ తర్వాత వచ్చిన వెర్షన్‌లలో మాత్రమే పని చేస్తాయి. మీ Android వెర్షన్‌ను ఎలా చెక్ చేయాలో తెలుసుకోండి.

స్క్రీన్ లాక్‌ను సెటప్ చేయండి లేదా మార్చండి

ముఖ్యమైనది: మీ ఆటోమేటిక్, మాన్యువల్ బ్యాకప్‌లు మీ స్క్రీన్ లాక్‌తో ఎన్‌క్రిప్ట్ చేయబడ్డాయని నిర్ధారించడానికి, PIN, ఆకృతి, లేదా పాస్‌వర్డ్‌ను ఉపయోగించండి. మీ ఫోన్‌లో డేటాను ఎలా బ్యాకప్ లేదా రీస్టోర్ చేయాలో తెలుసుకోండి.

  1. మీ ఫోన్‌లో Settings యాప్‌ను తెరవండి.
  2. సెక్యూరిటీ ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. స్క్రీన్ లాక్ రకాన్ని ఎంచుకోవడానికి, స్క్రీన్ లాక్‌ను ట్యాప్ చేయండి.
    • మీరు ఇప్పటికే లాక్‌ను సెటప్ చేసి ఉంటే: వేరొక లాక్‌ను ఎంచుకోవడానికి ముందు, మీరు మీ PIN, ఆకృతి, లేదా పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
  4. మీరు ఉపయోగించాలనుకుంటున్న స్క్రీన్ లాక్ ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  5.  స్క్రీన్‌పై సూచనలను ఫాలో అవ్వండి.

స్క్రీన్ లాక్ ఆప్షన్‌లు

లాక్ లేదు
  • ఏదీ వద్దు: మీ ఫోన్ అన్‌లాక్ చేయబడి ఉంటుంది. దీని వలన రక్షణ ఉండదు, కానీ మీరు మీ మొదటి స్క్రీన్‌కు త్వరగా వెళ్లవచ్చు.
  • స్వైప్ చేయడం: మీ స్క్రీన్‌పై మీ చేతి వేళ్లతో స్వైప్ చేయండి. దీని వలన రక్షణ ఉండదు, కానీ మీరు మీ మొదటి స్క్రీన్‌కు త్వరగా వెళ్లవచ్చు.
స్టాండర్డ్ లాక్‌లు
  • PIN: 4 లేదా అంతకంటే ఎక్కువ నంబర్‌లను ఎంటర్ చేయండి, కానీ అదనపు సెక్యూరిటీ కోసం 6 అంకెల PIN సిఫార్సు చేయబడింది. పొడవైన PINలు మరింత సురక్షితంగా ఉంటాయి.
  • ఆకృతి:మీ చేతి వేలితో సాధారణ ఆకృతిని గీయండి.
  • పాస్‌వర్డ్: 4 లేదా అంత కంటే ఎక్కువ అక్షరాలు లేదా నంబర్‌లను ఎంటర్ చేయండి. స్క్రీన్ లాక్ ఆప్షన్ విషయంలో శక్తివంతమైన పాస్‌వర్డ్ అనేది అత్యంత సురక్షితమైనది.

ఆటోమేటిక్-నిర్ధారణ అన్‌లాక్ గురించిన సమాచారం

ఆటోమేటిక్-నిర్ధారణ అన్‌లాక్‌తో మీ ఫోన్‌ను అన్‌లాక్ చేయడానికి మీరు ఎంటర్ కీని ట్యాప్ చేయాల్సిన అవసరం లేదు. దీన్ని ఆన్ చేయడానికి, మీరు కనీసం 6-అంకెల PIN కోడ్ లేదా అంతకంటే ఎక్కువ ఎంచుకోవాలి. మెరుగైన సెక్యూరిటీని కోసం, PIN కోడ్ 6 అంకెల కంటే ఎక్కువ ఉంటే స్క్రీన్‌పై చూపబడదు.

మీ PIN కోడ్ 6 కంటే ఎక్కువ అంకెలను కలిగి ఉన్నంత వరకు మీరు ఆటోమేటిక్-నిర్ధారణను ఆన్ లేదా ఆఫ్ చేయవచ్చు.

ముఖ్య గమనిక: మీరు ఆటోమేటిక్-నిర్ధారణ అన్‌లాక్‌ను సమ్మతిస్తే, అది మీ పరికరం తాలూకు సెక్యూరిటీ తగ్గించవచ్చు.

మీరు సెక్యూరిటీ సెట్టింగ్‌లలో ఆటోమేటిక్-నిర్ధారణ అన్‌లాక్‌ను సెటప్ చేయవచ్చు.

  1. మీ ఫోన్‌లో, సెట్టింగ్‌లు ఆప్షన్‌కు వెళ్లండి.
  2. సెక్యూరిటీ ఆ తర్వాత స్క్రీన్ లాక్ ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. ఆటోమేటిక్-నిర్ధారణను ఆన్ లేదా ఆఫ్ చేయండి.

స్క్రీన్ లాక్‌ను డిజేబుల్ చేయండి

ముఖ్య గమనిక:  స్క్రీన్ లాక్‌ను డిజేబుల్ చేయడం వలన మీ పరికరానికి రక్షణ ఉండదు. 

  1. మీ ఫోన్‌లో ఉన్న Settings యాప్‌ను తెరవండి.
  2. సెక్యూరిటీ అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. మీరు ఇప్పటికే లాక్‌ను సెట్ చేసి ఉంటే, మీరు మీ PIN, ఆకృతి, లేదా పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయాలి.
  4. మీ ప్రస్తుత స్క్రీన్ లాక్ పద్ధతిని తీసివేయడానికి, ఏదీ లేదు ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

సంబంధిత రిసోర్స్‌లు

 

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
16440737450391695082
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
false
false