మీ కంప్యూటర్ & Android పరికరం మధ్య ఫైల్స్‌ని బదిలీ చేయండి

మీరు ఫోటోలను, మ్యూజిక్‌ను, ఇంకా ఇతర ఫైల్స్‌ను మీ కంప్యూటర్‌కు, Android పరికరానికి మధ్య తరలించడానికి మీ Google ఖాతా లేదా USB కేబుల్‌ను ఉపయోగించవచ్చు.

ముఖ్య గమనిక: ఈ దశలలో కొన్ని, Android 9లో, అలాగే ఆ తర్వాత వచ్చిన వెర్షన్‌లలో మాత్రమే పని చేస్తాయి. మీ Android వెర్షన్‌ను ఎలా చెక్ చేయాలో తెలుసుకోండి.

ఆప్షన్ 1: మీ Google ఖాతాతో ఫైల్స్‌ను తరలించండి

ఫైల్స్‌ను మీ కంప్యూటర్‌లో, అలాగే పరికరంలో కూడా ఉపయోగించడానికి, వాటిని మీ Google ఖాతాకు అప్‌లోడ్ చేయండి.

ఆప్షన్ 2: USB కేబుల్‌తో ఫైల్స్‌ను తరలించండి

Windows కంప్యూటర్
  1. మీ పరికరాన్ని అన్‌లాక్ చేయండి.
  2. USB కేబుల్‌తో, మీ పరికరాన్ని మీ కంప్యూటర్‌కు కనెక్ట్ చేయండి.
  3. మీ పరికరంలో, "USB ద్వారా ఈ పరికరాన్ని ఛార్జ్ చేస్తోంది" అనే నోటిఫికేషన్‌ను ట్యాప్ చేయండి.
  4. "దీనికి USBని ఉపయోగించండి" కింద, ఫైల్ బదిలీని ఎంచుకోండి.
  5. మీ కంప్యూటర్‌లో ఒక ఫైల్ బదిలీ విండో తెరుచుకుంటుంది. ఫైల్స్‌ను లాగడానికి దీన్ని ఉపయోగించండి.
  6. మీరు పూర్తి చేసిన తర్వాత, Windows నుండి మీ పరికరాన్ని తొలగించండి.
  7. USB కేబుల్‌ను అన్‌ప్లగ్ చేయండి.
Mac కంప్యూటర్

మీ కంప్యూటర్ తప్పనిసరిగా Mac OS X 10.5ను, లేదా ఆ తర్వాత వచ్చిన వెర్షన్‌లను ఉపయోగిస్తూ ఉండాలి.

  1. మీ కంప్యూటర్‌లో Android ఫైల్ ట్రాన్స్‌ఫర్‌ను డౌన్‌లోడ్ చేసి, ఇన్‌స్టాల్ చేయండి.
  2. Android File Transfer‌ను తెరవండి. తర్వాతిసారి మీ పరికరాన్ని మీరు కనెక్ట్ చేసినప్పుడు, అది ఆటోమేటిక్‌గా తెరుచుకుంటుంది.
  3. మీ పరికరాన్ని అన్‌లాక్ చేయండి.
  4. USB కేబుల్‌తో, మీ పరికరాన్ని మీ కంప్యూటర్‌కు కనెక్ట్ చేయండి.
  5. మీ పరికరంలో, "USB ద్వారా ఈ పరికరాన్ని ఛార్జ్ చేస్తోంది" అనే నోటిఫికేషన్‌ను ట్యాప్ చేయండి.
  6. "దీనికి USBని ఉపయోగించండి" కింద, ఫైల్ బదిలీని ఎంచుకోండి.
  7. మీ కంప్యూటర్‌లో ఒక Android File Transfer విండో తెరుచుకుంటుంది. ఫైల్స్‌ను లాగడానికి దీన్ని ఉపయోగించండి.
  8. మీరు పూర్తి చేసిన తర్వాత, USB కేబుల్‌ను అన్‌ప్లగ్ చేయండి.
Chromebook
  1. USB కేబుల్‌తో, మీ పరికరాన్ని మీ Chromebookకు కనెక్ట్ చేయండి.
  2. మీ పరికరాన్ని అన్‌లాక్ చేయండి.
  3. మీ పరికరంలో, "USB ద్వారా ఈ పరికరాన్ని ఛార్జ్ చేస్తోంది" అనే నోటిఫికేషన్‌ను ట్యాప్ చేయండి.
  4. "దీనికి USBని ఉపయోగించండి" కింద, ఫైల్ బదిలీని ఎంచుకోండి.
  5. మీ Chromebookలో, Files యాప్ తెరుచుకుంటుంది. ఫైల్స్‌ను లాగడానికి దీన్ని ఉపయోగించండి. Chromebookలలో ఎలాంటి ఫైల్ రకాలు పని చేస్తాయో తెలుసుకోండి.
  6. మీరు పూర్తి చేసిన తర్వాత, USB కేబుల్‌ను అన్‌ప్లగ్ చేయండి.

3వ ఆప్షన్: Windowsలోని 'సమీప షేరింగ్‌'తో ఫైల్స్‌ను తరలించండి

Windowsకు 'సమీప షేరింగ్‌'ను సెటప్ చేయండి

Windows కంప్యూటర్‌లు, Android పరికరాలలో ఒకేలా ఉండే ఇమేజ్‌లు, వీడియోలు, అలాగే డాక్యుమెంట్‌లను షేర్ చేయడానికి మీరు సమీప షేరింగ్‌ను ఉపయోగించవచ్చు.

మీ సొంత పరికరాలు లేదా సమీప షేరింగ్‌ను ఉపయోగించే మీకు సమీపంలోని వ్యక్తులతో మీరు ఫైల్స్‌ను షేర్ చేయవచ్చు. ఇతర వ్యక్తులు మీకు ఫైల్స్‌ను పంపినప్పుడు, రిక్వెస్ట్‌ను అంగీకరించమని మిమ్మల్ని అడగటం జరుగుతుంది. మీరు ఫైల్స్‌ను షేర్ చేసినప్పుడు అవి ఎన్‌క్రిప్ట్ చేయబడతాయి.

ముఖ్య గమనికలు:

  • మీరు Google ఖాతా లేకుండా Windows కోసం సమీప షేరింగ్‌ను ఉపయోగిస్తే, కొన్ని ఆప్షన్‌లు అందుబాటులో ఉండకపోవచ్చు.
  • అడ్మినిస్ట్రేటర్‌గా యాప్‌ను తెరవవద్దు.
  • డౌన్‌లోడ్ చేస్తున్నప్పుడు, ఇన్‌స్టాలర్ ప్రమాదకరమైనది కావచ్చని మీరు హెచ్చరికను అందుకోవచ్చు. Google నుండి డౌన్‌లోడ్ చేయబడిన ఫైల్స్ సురక్షితమైనవి.
  1. మీ Windows పరికరంలో సమీప షేరింగ్‌ను డౌన్‌లోడ్ చేసి, ఇన్‌స్టాల్ చేయండి.
    • అది ఇన్‌స్టాల్ చేయబడిన తర్వాత, యాప్‌ను తెరిచి సైన్ ఇన్ చేయండి.
  2. "ఇతరులకు ఈ కింది విధంగా కనిపిస్తుంది" కింద, మీ పరికర పేరును ఎంచుకోండి.
  3. "స్వీకరించబడుతోంది" కింద, మీ పరికరంతో ఫైల్స్‌ను ఎవరు షేర్ చేయవచ్చో ఎంచుకోండి.
  4. పూర్తయింది ఆప్షన్‌ను ఎంచుకోండి.
మీ పరికరంతో ఎవరు షేర్ చేయవచ్చో ఎంచుకోండి
  1. మీ కంప్యూటర్‌లో, Windows యాప్ కోసం సమీప షేరింగ్ ను తెరవండి.
  2. ఎగువున కుడి వైపున ఉన్న, సెట్టింగ్‌లు ఆ తర్వాత పరికర విజిబిలిటీ ఆప్షన్‌ను ఎంచుకోండి.
  3. మీ విజిబిలిటీని ఎంచుకోండి:
    • అందరికీ: మీకు దగ్గరలో సమీప షేరింగ్‌ను ఆన్ చేసిన ఎవరికైనా మీ పరికరం కనిపిస్తుంది.
    • కాంటాక్ట్‌లు: మీకు సమీపంలోని కాంటాక్ట్‌లకు మీ పరికరం కనిపిస్తుంది. అన్ని కాంటాక్ట్‌లకు లేదా నిర్దిష్ట కాంటాక్ట్‌లకు మీ పరికరం కనిపించాలని మీరు ఎంచుకోవచ్చు.
    • మీ పరికరాలు: అదే Google ఖాతా ఉన్న మీ పరికరాలకు మీ పరికరం కనిపిస్తుంది.
    • ఎవరికీ వద్దు: మీ పరికరం కనిపించడం లేదు, ఇతరులు మీతో ఫైల్స్‌ను షేర్ చేయలేరు.
చిట్కా: మరింత ప్రైవేట్, సురక్షితమైన షేరింగ్ కోసం, మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేసి, కాంటాక్ట్‌లు లేదా మీ పరికరాలు ఆప్షన్‌ను ఎంచుకోండి.
ఇతర పరికరాలకు కంటెంట్‌ను పంపండి
  1. మీ Windows కంప్యూటర్‌లో, Windowsకు చెందిన 'సమీప షేరింగ్' యాప్ ను తెరవండి.
  2. మీరు షేర్ చేయాలనుకుంటున్న ఫైల్‌ను ఎంచుకోండి.
    • మీరు ఫైల్స్‌ను ఎంచుకోండి లేదా ఫోల్డర్స్‌ను ఎంచుకోండి ఆప్షన్‌ను ఎంచుకుని కూడా మీరు షేర్ చేయాలనుకుంటున్న ఫైల్ లేదా ఫోల్డర్‌ను కనుగొనవచ్చు.
  3. ఫైల్‌ను యాప్ విండోలోకి లాగండి.
  4. మీరు మీ ఫైల్‌ను షేర్ చేయాలనుకుంటున్న పరికరాన్ని ఎంచుకోండి.
    • మీరు PINను పొందినట్లయితే, అది రిసీవర్ పరికరంలోని పిన్‌తో మ్యాచ్ అవుతుందని నిర్ధారించుకోండి.
    • మీకు రిసీవర్ పరికరం కనిపించకపోతే, మీరు ఏ పరికరానికి అయితే కంటెంట్‌ను పంపాలనుకుంటున్నారో, అది మీ పరికరానికి కనిపించేలా చూసుకోండి.
  5. షేర్ చేయండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  6. రిసీవర్ షేరింగ్‌ను నిర్ధారించిన తర్వాత, మీ ఫైల్ పంపబడుతుంది.

చిట్కా: మీరు ఫైల్‌ను లాగి, వదలలేకపోతుంటే:

  • మీరు ఇవి కూడా చేయవచ్చు:
    1. ఫైల్‌ను కనుగొనండి.
    2. ఫైల్‌పై కుడి క్లిక్ చేయండి.
    3. 'సమీప షేరింగ్‌'తో పంపండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  • మీరు అడ్మినిస్ట్రేటర్‌గా యాప్‌ను తెరిచి ఉండవచ్చు. మీరు అడ్మినిస్ట్రేటర్‌గా యాప్‌ను తెరవలేదని నిర్ధారించుకోండి.
ఎవరి నుండి అయినా కంటెంట్ పొందండి

ముఖ్య గమనిక: ఎవరి నుండి అయినా ఫైల్స్‌ను అందుకోవాలంటే, మీ పరికరాన్ని తప్పనిసరిగా వారు గుర్తించగలగాలి. మీరు మీ పరికర విజిబిలిటీని సెట్టింగ్‌లు లో మార్చవచ్చు.

  1. ఎవరైనా మీకు కంటెంట్‌ను పంపడానికి 'సమీప షేరింగ్‌'ను ఉపయోగించినప్పుడు, మీకు నోటిఫికేషన్ వస్తుంది.
    • మీ Android పరికరం “సమీపంలోని పరికరం షేర్ చేస్తోంది” అని మీకు తెలిపితే: మీ పరికరాన్ని అవతలి వ్యక్తి గుర్తించేలా చేయడానికి ఆన్ చేయండి ఆప్షన్‌ను ఎంచుకొని, 2వ దశకు కొనసాగించండి.
    • ఇది కంటెంట్‌ను పంపే వారి గురించిన వివరాలను చూపిస్తే: అంగీకరించండి లేదా తిరస్కరించండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  2. షేర్ చేయడానికి రిక్వెస్ట్‌ను రివ్యూ చేయండి.
    • మీరు PINను పొందినట్లయితే, అది కంటెంట్‌ను పంపే వారి పరికరంలోని పిన్‌తో మ్యాచ్ అవుతుందని నిర్ధారించుకోండి.
  3. కంటెంట్‌ను పొందడానికి, అంగీకరించండి ఆప్షన్‌ను ఎంచుకోండి.
    • ఫైల్ మీ "డౌన్‌లోడ్‌ల" ఫోల్డర్‌లో సేవ్ అవుతుంది.
చిట్కా: ఒకే Google ఖాతాను ఉపయోగిస్తున్న మీ స్వంత పరికరాల మధ్య మీరు కంటెంట్‌ను షేర్ చేస్తే, రిసీవర్ పరికరం ఆటోమేటిక్‌గా బదిలీ రిక్వెస్ట్‌ను అంగీకరిస్తుంది.

USB ద్వారా ఫైల్స్‌ను తరలించడంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించండి

Windows కంప్యూటర్
  • మీ కంప్యూటర్‌లో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించండి
    • Windows ఆటోమేటిక్‌గా కొత్త హార్డ్‌వేర్‌ను గుర్తిస్తుందని నిర్ధారించుకోవడానికి మీ కంప్యూటర్ సెట్టింగ్‌లను చెక్ చేయండి.
    • మీ కంప్యూటర్‌ను రీస్టార్ట్ చేయండి.
  • మీ పరికర సమస్యను పరిష్కరించండి
  • మీ USB కనెక్షన్‌లలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించండి
    • వేరే USB కేబుల్‌ను ట్రై చేయండి. ఫైల్స్‌ను USB కేబుల్స్ అన్నీ బదిలీ చేయలేకపోవచ్చు.
    • మీ పరికరంలో USB పోర్ట్‌ను టెస్ట్ చేయడానికి, మీ పరికరాన్ని వేరొక కంప్యూటర్‌కు కనెక్ట్ చేయండి.
    • మీ కంప్యూటర్‌లో USB పోర్ట్‌ను టెస్ట్ చేయడానికి, మీ కంప్యూటర్‌కు వేరొక పరికరాన్ని కనెక్ట్ చేయండి.
Mac కంప్యూటర్
  • మీ కంప్యూటర్‌లో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించండి
    • మీ కంప్యూటర్ Mac OS X 10.5ను, లేదా ఆ తర్వాత వచ్చిన వెర్షన్‌లను ఉపయోగిస్తోందని చెక్ చేయండి.
    • మీ కంప్యూటర్‌లో Android File Transfer ఇన్‌స్టాల్ అయ్యుండి, తెరిచి ఉందని చెక్ చేయండి.
    • మీ కంప్యూటర్‌ను రీస్టార్ట్ చేయండి.
  • మీ పరికర సమస్యను పరిష్కరించండి
  • మీ USB కనెక్షన్‌లలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించండి
    • వేరే USB కేబుల్‌ను ట్రై చేయండి. ఫైల్స్‌ను USB కేబుల్స్ అన్నీ బదిలీ చేయలేకపోవచ్చు.
    • మీ పరికరంలో USB పోర్ట్‌ను టెస్ట్ చేయడానికి, మీ పరికరాన్ని వేరొక కంప్యూటర్‌కు కనెక్ట్ చేయండి.
    • మీ కంప్యూటర్‌లో USB పోర్ట్‌ను టెస్ట్ చేయడానికి, మీ కంప్యూటర్‌కు వేరొక పరికరాన్ని కనెక్ట్ చేయండి.

సంబంధిత రిసోర్స్‌లు

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
14744545965237203180
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
false
false