Find My Device మీ డేటాను ఎలా కాపాడుతుంది

Find My Device సహాయంతో మీ పోగొట్టుకున్న Android పరికరాన్ని లొకేట్ చేయగలుగుతారు, సురక్షితంగా ఉంచగలుగుతారు, ఫ్యాక్టరీ రీసెట్ చేయగలుగుతారు. మీ పరికరం ఆన్‌లైన్‌లోకి వచ్చినప్పుడు కనుగొనడంలో మీకు సహాయపడటంతో పాటు, Find My Device ఆఫ్‌లైన్‌ ఫైండింగ్ ఫీచర్‌లను కూడా కలిగి ఉంది. ఇవి మీ పరికరం, యాక్సెసరీలు ఆఫ్‌లైన్‌లో ఉన్నప్పటికీ వాటిని కనుగొనడంలో మీకు సహాయపడతాయి.

మీ Android పరికరం, Find My Device నెట్‌వర్క్‌లో భాగంగా ఉంటూ, ఎన్‌క్రిప్ట్ చేసిన ఇటీవలి లొకేషన్‌లను ఆటోమేటిక్‌గా Google వద్ద స్టోర్ చేస్తుంది. మీరు, మీతో పాటు ఇతర Android యూజర్లలో ఎవరైనా తమ పరికరాలను పోగొట్టుకుంటే వాటిని కనుగొనడానికి ఈ Find My Device సహాయపడుతుంది. ఇది క్రౌడ్‌సోర్స్‌ మీద ఆధారపడిన Android పరికరాల నెట్‌వర్క్. పూర్తి స్థాయిలో ఎన్‌క్రిప్ట్‌ చేసిన లొకేషన్ సమాచారాన్ని ఉపయోగిస్తుంది.

ఆఫ్‌లైన్‌లో కనుగొనగలిగే ఈ ఫీచర్‌లను మీ పరికరంలో ఎనేబుల్ చేసి ఉంటే, Find My Device అందుబాటులో ఉండే ఉత్తమ సోర్స్‌ను ఉపయోగిస్తుంది – మీ పరికరం ఆన్‌లైన్‌లో ఉంటే దాని ప్రస్తుత లొకేషన్, మీ పరికరం చివరిగా ఆన్‌లైన్‌లో ఉన్నప్పుడు స్టోర్ చేసిన, ఎన్‌క్రిప్ట్ చేసిన ఇటీవలి లొకేషన్ లేదా Find My Device నెట్‌వర్క్‌లోని ఇతర Android పరికరాల నుండి క్రౌడ్‌సోర్స్‌లో ఎన్‌క్రిప్ట్ చేసిన లొకేషన్ – ఇది మీ పరికరాన్ని కనుగొనడంలో మీకు సహాయపడుతుంది.

దిగువ మరింత వివరించినట్లుగా, ఈ సర్వీస్‌లను అందించే, నిర్వహించే, మెరుగుపరిచే సర్వీసుల కోసం Find My Device డేటాను సేకరించి, ప్రాసెస్ చేస్తుంది. Find My Device ద్వారా ప్రాసెస్ చేసే డేటా Google గోప్యతా పాలసీ ప్రకారం హ్యాండిల్ చేయబడుతుంది.

మీ ఆన్‌లైన్ పరికరాలను కనుగొనడం

ఆన్‌లైన్ పరికరాన్ని కనుగొనడంలో సహాయపడటానికి మీరు Find My Deviceని ఉపయోగించినప్పుడు, Find My Device మీ పోగొట్టుకున్న Android పరికరంతో కమ్యూనికేట్ చేస్తుంది, దాని ప్రస్తుత లొకేషన్‌, మీ పరికరం బ్యాటరీ స్థాయి, కనెక్ట్ అయి ఉన్న Wi-Fi నెట్‌వర్క్, అలాగే ఆ Wi-Fi, సెల్యులార్ సిగ్నల్ సామర్థ్యం లాంటి ఇతర సమాచారాన్ని సేకరిస్తుంది. మీ పోగొట్టుకున్న పరికరాన్ని కనుగొనడంలో మీకు సహాయపడటానికి యాప్‌లోని ఈ సమాచారాన్ని Find My Device ప్రదర్శిస్తుంది.

మీ యాక్సెసరీ ప్రస్తుతం కనెక్ట్ అయిన పరికరం లొకేషన్‌ను ప్రదర్శించడం ద్వారా మీ యాక్సెసరీలను కనుగొనడంలో మీకు సహాయపడటానికి కనెక్షన్ ఈవెంట్‌ల (ఉదాహరణకు, మీ ఫోన్‌కి మీ ఇయర్ బడ్స్ చివరిగా ఎప్పుడు కనెక్ట్ అయ్యాయి) లాంటి సమాచారాన్ని కూడా Find My Device సేకరిస్తుంది.

మీ Android పరికరాలు, యాక్సెసరీలను మీ Google ఖాతాతో అనుబంధించే ఐడెంటిఫయర్‌లు, అలాగే Find My Device ద్వారా తీసుకున్న చర్యల గురించిన సమాచారాన్ని, అంటే మీ పరికరాన్ని లాక్ చేయడానికి లేదా ఫ్యాక్టరీ రీసెట్ చేయడానికి మీ Google ఖాతాను ఉపయోగించినది, లేనిదీ, ఆ చర్య విజయవంతంగా పూర్తయిందా, లేదా అనే వివరాలను కూడా Find My Device సేకరిస్తుంది.

మీ ఆఫ్‌లైన్ పరికరాలను కనుగొనడం

పోగొట్టుకున్న మీ పరికరం ఎల్లప్పుడూ ఆన్‌లైన్‌లో ఉండకపోవచ్చు. మీ ఆఫ్‌లైన్ పరికరాలను కనుగొనడంలో మీకు సహాయపడటానికి, మీ Android పరికరం, అలాగే Find My Device నెట్‌వర్క్‌లో భాగమైన ఇతర వాటి నుండి పంపించే ఎన్‌క్రిప్ట్ చేసిన లొకేషన్ సమాచారాన్ని కూడా Find My Device సేకరించవచ్చు, నిల్వ చేయవచ్చు, ఉపయోగించవచ్చు.

Android పరికరాల క్రౌడ్‌సోర్స్‌డ్ నెట్‌వర్క్ పవర్‌ను వినియోగించి, ఆఫ్‌లైన్‌లో ఉన్న Android ఫోన్‌లు, టాబ్లెట్‌లు, అనుకూలమైన ఇయర్‌బడ్స్ అలాగే మీ వాలెట్, కీలు లేదా బైక్ లాంటి భౌతిక వస్తువులకు అటాచ్ చేయగలిగే ట్రాకర్ ట్యాగ్‌లు లాంటి ఫాస్ట్ పెయిర్ యాక్సెసరీలతో సహా వివిధ రకాల ఐటెమ్‌లను కనుగొనడంలో Find My Device నెట్‌వర్క్ మీకు సహాయపడుతుంది.

నెట్‌వర్క్‌లో భాగస్వాములైన ప్రతి ఒక్కరి గోప్యతను కాపాడటంలో సహాయపడటానికి పూర్తి స్థాయి ఎన్‌క్రిప్షన్‌తో సహా అధునాతన రక్షణ ఛత్రాలతో నెట్‌వర్క్‌ను డెవలప్ చేశారు.

క్రౌడ్‌సోర్సింగ్ ఎలా పని చేస్తుంది?

Find My Device నెట్‌వర్క్‌లో భాగం అయిన Android పరికరాలు సమీపంలోని ఐటెమ్‌లను స్కాన్ చేయడానికి బ్లూటూత్‌ను ఉపయోగిస్తాయి. అవి మీ ఐటెమ్‌లను కనుగొంటే, అవి ఐటెమ్‌లను గుర్తించిన లొకేషన్‌ను సురక్షితంగా Find My Deviceకు పంపుతాయి. ఇతరులకు వారి పోగొట్టుకున్న ఐటెమ్‌లను సమీపంలో గుర్తించినప్పుడు తెలియజేయడంలో సహాయపడటానికి మీ Android పరికరం అదే పని చేస్తుంది.

పూర్తి స్థాయి ఎన్‌క్రిప్షన్

మీ Android పరికరం PIN, ఆకృతి లేదా పాస్‌వర్డ్‌‌ను ఎంటర్ చేయడం ద్వారా మీరు మాత్రమే యాక్సెస్ చేయగలిగే ప్రత్యేక కీని ఉపయోగించి Find My Device నెట్‌వర్క్ మీ ఐటెమ్‌లు ఉన్న లొకేషన్‌లను ఎన్‌క్రిప్ట్ చేస్తుంది.

మీ పాస్‌వర్డ్‌లను సురక్షితం చేయడానికి Google Password Manager ద్వారా ఉపయోగించే అదే సాంకేతిక పరిజ్ఞానం నేపథ్యంగా పని చేసే ఈ పూర్తి స్థాయి ఎన్‌క్రిప్షన్‌తో, మీ ఐటెమ్‌లు ఉన్న లొకేషన్‌లు తప్పకుండా Google నుండి ప్రైవేట్‌గా ఉండేలా చూస్తుంది. అవి కేవలం మీకు, అలాగే Find My Deviceలో మీ ద్వారా మీ ఐటెమ్‌ల షేరింగ్ పొందిన వారికి మాత్రమే కనిపిస్తాయి.

ముఖ్య గమనిక: మీ Android పరికరంలో మీరు PINను, ఆకృతిని లేదా పాస్‌వర్డ్‌ను సెట్ చేయకుండా ఉంటే, Find My Device నెట్‌వర్క్ ప్రయోజనాన్ని పొందడానికి మీరు తప్పనిసరిగా దానిని సెట్ చేయాలి.

నెట్‌వర్క్ ద్వారా ప్రాసెస్ చేసే డేటా

Find My Device నెట్‌వర్క్ అన్నది పూర్తి స్థాయి ఎన్‌క్రిప్షన్ చేసిన లొకేషన్‌లకు అదనంగా, తాత్కాలిక పరికర ఐడెంటిఫయర్‌లు, మీ పరికరం ఎప్పుడు ఐటెమ్‌ను గుర్తించింది, మీ పోగొట్టుకున్న ఐటెమ్‌ల లొకేషన్‌ను మీరు ఎప్పుడు రిక్వెస్ట్ చేసారనే టైమ్ స్టాంప్‌‌లు, అలాగే మీరు మీ పరికరానికి పెయిర్ చేసిన లేదా ఇతరులతో షేర్ చేసిన ఫాస్ట్ పెయిర్ యాక్సెసరీల గురించిన సమాచారం లాంటి డేటాను ప్రాసెస్ చేస్తుంది. ఫీచర్‌లను అమలు చేయడం, ఐటెమ్‌ను పోగొట్టుకున్నప్పుడు సరైన వ్యక్తికి లొకేషన్ సమాచారాన్ని అందించడం, దిగువ వివరించిన అగ్రిగేషన్ ఫీచర్ లాంటి గోప్యత, దుర్వినియోగ నిరోధక రక్షణలను అందించడం లాంటి కారణాల కోసం Find My Device నెట్‌వర్క్ ఈ డేటాను ఉపయోగిస్తుంది. ముఖ్యంగా, ఆచూకీ గుర్తించిన ఐటెమ్ లొకేషన్‌ను మీ Android పరికరం షేర్ చేసినప్పుడు Google మిమ్మల్ని గుర్తించలేదు.

ఎవరైనా తాము పోగొట్టుకున్న వస్తువును వెతకడానికి Find My Device నెట్‌వర్క్‌ను ఉపయోగిస్తే వారికి రెండు విషయాలు మాత్రమే తెలుస్తాయి. ఒకటి వస్తువు ఎక్కడ కనుగొనబడిందో తెలిపే లొకేషన్‌, రెండోది చివరిగా సారిగా సుమారుగా ఏ సమయంలో కనుగొనబడింది అన్నది.

నెట్‌వర్క్‌లో మీ పరికరం ఎలా భాగం కావాలనేది కంట్రోల్ చేయడం

మీరు ఎప్పుడైనా Find My Device సెట్టింగ్‌లలో “మీ ఆఫ్‌లైన్ పరికరాలను కనుగొనండి” విభాగాన్ని సందర్శించి, కింది ఎంపికల నుండి ఎంచుకోవడం ద్వారా నెట్‌వర్క్‌లో మీ Android పరికరం ఎలా భాగం కావాలనేది కంట్రోల్ చేయవచ్చు:

This image shows Find my device screen on your deviceThis images shows the options when you tap the find your offline devices page on your device

“ఆఫ్”

మీరు Find My Device నెట్‌వర్క్‌లో భాగం కాకూడదని లేదా Googleతో ఎన్‌క్రిప్ట్ చేసిన ఇటీవలి లొకేషన్‌లను స్టోర్ చేయడం ద్వారా మీ స్వంత ఐటమ్‌లు ఆఫ్‌లైన్‌లో ఉన్నప్పుడు వాటిని గుర్తించే సామర్థ్యం వద్దని ఎంచుకుంటే, మీరు ఈ ఆఫ్‌లైన్‌లో కనుగొనే ఫీచర్‌లను పూర్తిగా ఆఫ్ చేసేలా ఎంచుకోవచ్చు.

మీరు ఆఫ్‌లైన్‌లో కనుగొనడాన్ని ఆఫ్ చేసినా కూడా, మీరు ఆన్‌లైన్‌లో ఉన్నప్పుడు మీ పరికరం లేదా కనెక్ట్ చేసిన ఏవైనా FastPair ఉపకరణాలను లొకేట్ చేయడం, భద్రపరచడం, వాటిని ఫ్యాక్టరీ రీసెట్ చేయడం కోసం Find My Deviceను ఉపయోగించవచ్చు. మీరు Find My Deviceను ఉపయోగించకూడదనుకుంటే, సెట్టింగ్‌లు ఆ తర్వాత Google ఆ తర్వాత అన్ని సర్వీస్‌లు, (ట్యాబ్‌లు ఉన్నట్లయితే) ఆ తర్వాత Find My Device ఆ తర్వాతకు వెళ్లి, Find My Device ఆఫ్‌కి సెట్ చేసి ఉందో లేదో చెక్ చేయండి.

“నెట్‌వర్క్ లేకుండా”

మీరు Find My Device నెట్‌వర్క్‌లో భాగం కాకూడదని ఎంచున్నప్పటికీ, మీ Android పరికరం, అలాగే దానికి కనెక్ట్ చేసిన ఇయర్‌బడ్స్ లాంటి ఫాస్ట్ పెయిర్ యాక్సెసరీలతో సహా మీ ఐటెమ్‌లలో కొన్ని ఆఫ్‌లైన్‌లో ఉన్నా కూడా వాటి ఎన్‌క్రిప్ట్ చేసిన ఇటీవలి లొకేషన్‌లను Google వద్ద స్టోర్ చేయడం ద్వారా మీరు వాటిని కనుగొనవచ్చు.

ఈ ఆప్షన్‌తో, మీ వాలెట్, కీలు లేదా బైక్ లాంటి ఐటెమ్‌లను కనుగొనడానికి ట్రాకర్ ట్యాగ్‌లను ఉపయోగించలేరు, మీ ఐటెమ్‌లను కనుగొనడంలో మీకు సహాయపడటానికి Android పరికరాల విస్తృత నెట్‌వర్క్‌పై ఆధారపడలేరు. అయితే, మీ Android పరికరం కాలానుగతంగా దాని కోసం, అలాగే దాని కనెక్ట్ చేసిన యాక్సెసరీల కోసం ఎన్‌క్రిప్ట్ చేసిన లొకేషన్‌ను Find My Deviceకి పంపిస్తుంది. కేవలం మీ పరికరం లేదా యాక్సెసరీకి సంబంధించిన అత్యంత ఇటీవల ఎన్‌క్రిప్ట్ చేసిన లొకేషన్ మాత్రమే స్టోర్ చేయబడుతుంది.

ముఖ్య గమనిక:

  • మీ Android పరికరంలో మీరు PINను, ఆకృతిని లేదా పాస్‌వర్డ్‌ను సెట్ చేసి ఉంటే, మీ Android పరికరం తాలూకు PINను, ఆకృతిని లేదా పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయడం ద్వారా మీరు మాత్రమే యాక్సెస్ చేయగల ప్రత్యేక కీని ఉపయోగించడం ద్వారా, ఇటీవలి లొకేషన్ సమాచారం ఎన్‌క్రిప్ట్ చేయబడుతుంది.
  • మీ Android పరికరంలో మీరు PINను, ఆకృతిని లేదా పాస్‌వర్డ్‌ను సెట్ చేసి ఉండకపోయినా కూడా, మీరు ఈ ఫీచర్‌ను ఉపయోగించవచ్చు. మీ Google ఖాతా పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయడం ద్వారా మీరు మాత్రమే యాక్సెస్ చేయగల ప్రత్యేక కీతో ఇటీవలి లొకేషన్ సమాచారాన్ని ఎన్‌క్రిప్ట్ చేయడం జరుగుతుంది.
  • మీ పరికరం Android 8.0 లేదా అంతకంటే తక్కువ వెర్షన్‌ను రన్ చేస్తున్నట్లయితే, అది విస్తృతమైన క్రౌడ్‌సోర్స్‌తో కూడిన Find My Device నెట్‌వర్క్‌లో పాల్గొనదు. కానీ మీ పరికరం ఇప్పటికీ దాని కోసం ఎన్‌క్రిప్ట్ చేసిన ఇటీవలి లొకేషన్‌లను, Googleతో కనెక్ట్ చేసిన ఏవైనా ఉపకరణాలను స్టోర్ చేస్తుంది. ఎన్‌క్రిప్ట్ చేసిన ఇటీవలి లొకేషన్‌ను స్టోర్ చేయడం వలన, మీరు పోగొట్టుకున్న ఐటెమ్‌లను సెర్చ్ చేస్తున్నప్పుడు అవి ఆఫ్‌లైన్‌లో ఉన్నా కూడా వాటిని కనుగొనడంలో Find My Device మీకు సహాయపడుతుంది. Android 8.0, అంతకంటే తక్కువ వెర్షన్‌లో, మీరు ఈ సెట్టింగ్‌ని, సెట్టింగ్‌లు ఆ తర్వాత Google ఆ తర్వాత అన్ని సర్వీస్‌లు, (ట్యాబ్‌లు ఉంటే) ఆ తర్వాత Find My Device ఆ తర్వాతకు వెళ్లి సర్దుబాటు చేయవచ్చు.

“అధిక ట్రాఫిక్ గల ప్రాంతాలలోని నెట్‌వర్క్‌తో మాత్రమే”

ఆటోమేటిక్‌గా, ఇతరులు అధిక ట్రాఫిక్ గల ప్రాంతాలలో వారి ఐటెమ్‌లను కనుగొనే సమయంలో మీ Android పరికరం సహాయం చేస్తుంది. అధిక ట్రాఫిక్ గల ప్రాంతాలలో మీ ఐటెమ్‌లను కనుగొనడానికి మీకు కూడా సహాయం లభిస్తుంది.

పోగొట్టుకున్న ఐటెమ్ యజమాని దాని లొకేషన్‌ను రిక్వెస్ట్ చేసినప్పుడు, Find My Device నెట్‌వర్క్—ఆటోమేటిక్‌గా—మీ పరికరం ద్వారా పంపిన లొకేషన్‌ను, ఆ పోగొట్టుకున్న ఐటమ్ ఆచూకీని గుర్తించిన అనేక ఇతర Android పరికరాల నుండి పంపిన లొకేషన్‌లతో కూడా అగ్రిగేట్ చేస్తుంది.

అగ్రిగేషన్ అంటే ఏమిటి?

అగ్రిగేషన్ వలన, పోగొట్టుకున్న ఐటెమ్‌ను అనేక Android పరికరాలు గుర్తించే వరకు Find My Device నెట్‌వర్క్ వేచి ఉంటుంది. ఆ తర్వాత Find My Device ఆ పోగొట్టుకున్న ఐటెమ్ ఓనర్‌కి అనేక లొకేషన్ రిపోర్ట్‌ల ఆధారంగా కాలిక్యులేట్ చేసిన సెంటర్ పాయింట్‌ను చూపిస్తుంది.

ఐటెమ్‌లను ఎక్కువగా పోగొట్టుకునే ఎయిర్‌పోర్ట్‌లు లేదా బిజీ ఫుట్‌పాత్‌లు లాంటి అధిక ట్రాఫిక్ ఉన్న ప్రాంతాలలో ఐటెమ్‌లను కనుగొనడానికి ఇది మీతో సహా, అందరు వ్యక్తులకు సహాయపడుతుంది, అదే విధంగా నెట్‌వర్క్‌కు లొకేషన్ సమాచారాన్ని షేర్ చేసే Android పరికరాలు చెందిన ప్రతి ఒక్కరి గోప్యతను కాపాడటంలోనూ సహాయపడుతుంది.

ముఖ్య గమనిక: మీరు నెట్‌వర్క్‌లో భాగం అయినప్పుడు, మీ Android పరికరం దాని కోసం, అలాగే కనెక్ట్ చేసిన యక్సెసరీల కోసం ఎన్‌క్రిప్ట్ చేసిన ఇటీవలి లొకేషన్‌లను Google వద్ద కూడా స్టోర్ చేస్తుంది. మీరు ఈ ఫంక్షన్ గురించి, నెట్‌వర్క్ లేకుండా అనే విభాగం కింద మరింత చదవవచ్చు. Find My Device మీ స్వంత పరికరం నుండైనా లేదా విస్తృత నెట్‌వర్క్‌లోని క్రౌడ్‌సోర్స్ నుండైనా అందుబాటులో ఉన్న ఉత్తమ లొకేషన్‌ను ఉపయోగించి మీ ఐటెమ్‌ను కనుగొనడంలో మీకు సహాయపడుతుంది.

“అన్ని ప్రాంతాలలోని నెట్‌వర్క్‌తో”

తక్కువ ట్రాఫిక్ ఉన్న ప్రాంతాలలో మీ పోగొట్టుకున్న ఐటెమ్‌లను కనుగొనడంలో మీకు Find My Device నెట్‌వర్క్ సహాయం కావాలనుకుంటే, ఐటెమ్ ఉన్న లొకేషన్‌ను కేవలం మీ పరికరం మాత్రమే గుర్తించి, షేర్ చేసినప్పుడు కూడా పోగొట్టుకున్న ఐటెమ్‌లను కనుగొనడంలో ఇతరులకు సహాయపడేందుకు మీరు లొకేషన్ సమాచారాన్ని నెట్‌వర్క్‌లో షేర్ చేసేందుకు సమ్మతించవచ్చు. ఈ ఆప్షన్‌ను ఆన్ చేసిన యూజర్‌లు అధిక ట్రాఫిక్ ఉన్న, తక్కువ ట్రాఫిక్ ఉన్న ప్రాంతాలు రెండింటిలోనూ ఐటెమ్‌లను కనుగొనడానికి పరస్పరం సహాయం చేసుకుంటారు. పోగొట్టుకున్న మీ ఐటెమ్‌లను మరింత త్వరగా కనుగొనడంలో ఈ ఆప్షన్ మీకు సహాయపడవచ్చు.

ముఖ్య గమనిక: మీరు నెట్‌వర్క్‌లో భాగం అయినప్పుడు, మీ Android పరికరం దాని కోసం, అలాగే కనెక్ట్ చేసిన యక్సెసరీల కోసం ఎన్‌క్రిప్ట్ చేసిన ఇటీవలి లొకేషన్‌లను Google వద్ద కూడా స్టోర్ చేస్తుంది. మీరు ఈ ఫంక్షన్ గురించి, నెట్‌వర్క్ లేకుండా అనే విభాగం కింద మరింత చదవవచ్చు. Find My Device మీ స్వంత పరికరం నుండైనా లేదా విస్తృత నెట్‌వర్క్‌లోని క్రౌడ్‌సోర్స్ నుండైనా అందుబాటులో ఉన్న ఉత్తమ లొకేషన్‌ను ఉపయోగించి మీ ఐటెమ్‌ను కనుగొనడంలో మీకు సహాయపడుతుంది.

గమనిక: Find My Device యాప్ ద్వారా అన్ని పరికరాలను, వాటి లొకేషన్‌లను మీరు ఎప్పుడైనా తొలగించవచ్చు.

సంబంధిత రిసోర్స్‌లు

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
6395755211821232705
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
false
false