WhatsApp డేటాను కొత్త Androidకు బదిలీ చేయండి

మీ పాత iPhone లేదా Android నుండి WhatsApp చాట్‌లను, డేటాను మీ కొత్త Android పరికరానికి మీరు బదిలీ చేయవచ్చు.

మీకు అవసరమైనవి

  • మీ పాత ఫోన్ లేదా WhatsApp బ్యాకప్ ఎనేబుల్ చేసి ఉన్న మీ పాత ఫోన్
  • మీ కొత్త Android ఫోన్
  • స్థిరమైన ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం

ముఖ్య గమనిక:

  • ఈ పేజీలో WhatsApp చాట్‌లను, డేటాను కొత్త Android పరికరానికి ఎలా బదిలీ చేయాలో తెలిపే సూచనలు ఉన్నాయి. అవి ఇతర ఆపరేటింగ్ సిస్టమ్‌లు లేదా పరికరాల కోసం పని చేయకపోవచ్చు.
  • మీ చాట్‌లను, డేటాను బదిలీ చేసే ప్రాసెస్ విజయవంతంగా జరుగుతుందని WhatsApp హామీ ఇవ్వదు. మీరు ఏదైనా అడగాలనుకున్నా, ఏదైనా సమస్య ఉన్నా, WhatsApp సపోర్ట్‌ను సంప్రదించండి.

Android పరికరం నుండి WhatsApp డేటాను బదిలీ చేయండి

Android పరికరం నుండి మరో కొత్త Android పరికరానికి డేటాను బదిలీ చేయడానికి:

1వ దశ: మీ Google ఖాతాకు మీ WhatsApp డేటాను బ్యాకప్ చేయండి

  1. మీ పాత Android పరికరంలో, WhatsAppను తెరవండి.
  2. ఎగువ కుడి వైపున, మరిన్ని ని ట్యాప్ చేయండి.
  3. సెట్టింగ్‌లు ఆ తర్వాత చాట్‌లు ఆ తర్వాత చాట్ బ్యాకప్‌లను ట్యాప్ చేయండి.
  4. బ్యాకప్ చేయండిని ట్యాప్ చేయండి.

2వ దశ: మీ కొత్త పరికరంలో WhatsAppను ఇన్‌స్టాల్ చేయండి

ముఖ్య గమనిక: మీ పాత పరికరం నుండి మీ కొత్త Androidకి మీరు యాప్‌లను బదిలీ చేసినట్లయితే, WhatsAppను మీ కొత్త పరికరంలో ఇన్‌స్టాల్ చేయాలి.

మీరు WhatsAppను ఇన్‌స్టాల్ చేయకపోతే:

  1. Play Store యాప్ Google Playకి వెళ్లండి.
  2. WhatsAppను డౌన్‌లోడ్ చేసుకోండి.
  3. ఇంతకు ముందు ఉపయోగించిన పరికరంలో మీరు ఏ ఫోన్ నంబర్‌ను వాడారో, అదే ఫోన్ నంబర్‌తో WhatsAppకు సైన్ ఇన్ చేయండి.

3వ దశ: బ్యాకప్ నుండి మీ WhatsApp డేటాను రీస్టోర్ చేయండి

మీ డేటాను రీస్టోర్ చేయమని ప్రాంప్ట్ వచ్చినప్పుడు, మీకు రెండు ఆప్షన్ లు ఉంటాయి:

  • WiFi ద్వారా రీస్టోర్ చేయడానికి, పాత ఫోన్ నుండి బదిలీ చేయండిని ట్యాప్ చేయండి.
  • క్లౌడ్ ద్వారా రీస్టోర్ చేయడానికి బ్యాకప్ నుండి రీస్టోర్ చేయండిని ట్యాప్ చేయండి.

చిట్కాలు:

  • మీకు ఒకటి కంటే ఎక్కువ Google ఖాతాలుంటే, మీ పరికరాలలో ఒకే ఖాతాతో సైన్ ఇన్ చేసినట్లు నిర్ధారించుకోండి.
  • మీకు అప్‌డేట్ చేసిన క్లౌడ్ బ్యాకప్ ఉంటే, క్లౌడ్ ద్వారా రీస్టోర్ చేయడం ఉత్తమమని మా సిఫార్సు.

పరిష్కార ప్రక్రియ

WhatsAppను రీస్టోర్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు బ్యాకప్ దొరకలేదు
  1. మీ పాత, కొత్త పరికరాలలో మీరు ఒకే Google ఖాతాకు సైన్ ఇన్ చేసినట్లు నిర్ధారించుకోండి.
  2. మీ పాత పరికరంలో, WhatsAppలో బ్యాకప్ మొదలై, రన్ అవుతున్నట్లుగా నిర్ధారించుకోండి. మీ పరికరంలో డేటాను ఎలా బ్యాకప్ చేయాలో తెలుసుకోండి.
  3. మీ కొత్త పరికరంలో, WhatsAppను మూసివేసి, మళ్లీ సెటప్ చేయండి.
రీస్టోర్ చేసిన తర్వాత నా WhatsApp మెసేజ్‌లు కొన్ని మిస్ అయ్యాయి
  1. మీ పాత పరికరంలో, WhatsAppను చివరి సారి ఎప్పుడు బ్యాకప్ చేశారో చెక్ చేయండి.
  2. బ్యాకప్‌ను 'వద్దు'కు సెట్ చేయండి.
  3. మీరు మళ్లీ రీస్టోర్ చేయాలనుకుంటే, మీ కొత్త పరికరంలో, WhatsApp యాప్ డేటాను పూర్తిగా తొలగించండి.
  4. WhatsAppను తెరవండి.
  5. స్క్రీన్‌పై సూచనలను ఫాలో అవ్వండి.

ముఖ్య గమనిక: మీ కొత్త పరికరానికి అందిన కొత్త మెసేజ్‌లను కోల్పోతారు.

రీస్టోర్ చేసిన తర్వాత నా ఇమేజ్‌లలో కొన్ని మిస్ అయ్యాయి
  1. మీ పాత పరికరంలో, WhatsAppను చివరి సారి ఎప్పుడు బ్యాకప్ చేశారో చెక్ చేయండి.
    • పాత ఇమేజ్‌లను రీస్టోర్ చేయడానికి WhatsAppకు కొంత టైమ్ పట్టవచ్చు.
  2. అవి 24 గంటల తర్వాత కూడా కనపడకపోతే WhatsApp సపోర్ట్‌ను సంప్రదించండి.
నా కొత్త పరికరంలో నాకు WhatsApp కనిపించలేదు
  1. మీ కొత్త పరికరంలో, WhatsApp ఇన్‌స్టాల్ చేసి ఉందో లేదో చెక్ చేయండి.
    • మీ పరికరంలో WhatsApp ఇన్‌స్టలేషన్ ఆటోమేటిక్ సెట్టింగ్‌గా లేకపోవచ్చు.
  2. WhatsApp ఇన్‌స్టాల్ చేసి లేకపోతే, Play Storeకు వెళ్లండి.
  3. WhatsAppను ఇన్‌స్టాల్ చేయండి.
నా కొత్త పరికరంలో WhatsApp ఇప్పటికే యాక్టివ్‌గా ఉంది

ముఖ్య గమనిక: మీరు కొత్త ఫోన్‌లో క్రియేట్ చేసిన చాట్ హిస్టరీని మీ పాత ఫోన్‌లో గతంలో క్రియేట్ చేసిన చాట్ హిస్టరీతో విలీనం చేయలేరు. మీ పాత చాట్ హిస్టరీని మీరు రీస్టోర్ చేస్తే, అది మీ కొత్త ఫోన్‌లో క్రియేట్ చేసిన కొత్త చాట్ హిస్టరీని రీప్లేస్ చేస్తుంది.

మీ పాత మెసేజ్ హిస్టరీని తిరిగి పొందడానికి:

  1. మీ కొత్త పరికరంలో WhatsAppను అన్‌ఇన్‌స్టాల్ చేయండి.
  2. మీ కొత్త పరికరంలో WhatsAppను రీ-ఇన్‌స్టాల్ చేయండి.
నా కొత్త పరికరంలో ఫోన్ నంబర్ వేరేది ఉంది

మీ WhatsApp డేటాను మీరు కొత్త ఫోన్ నంబర్‌కు బదిలీ చేయలేరు. అయితే, కొత్త ఫోన్‌లోకి డేటాను బదిలీ చేయడానికి ముందు, మీ పాత పరికరంలో ఉన్న మీ ఫోన్ నంబర్‌ను, మీ కొత్త ఫోన్ నంబర్‌కు మార్చవచ్చు.

ముఖ్య గమనిక: ఇతర డేటా మైగ్రేషన్ యాప్‌లకు సపోర్ట్ ఉండదు, వీటి వల్ల తరలింపులో సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. బదిలీ సమయంలో WhatsApp మీ డేటాను తొలగించదు, ఎర్రర్ ఏర్పడినా సరే మీ డేటాను కోల్పోవడం జరగదు.

సంబంధిత రిసోర్స్‌లు

Android iPhone & iPad
true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
15501771662927575349
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
false
false