తెలియని ట్రాకర్‌లను కనుగొనండి

మీకు తెలియకుండా లేదా మీ సమ్మతి లేకుండా మీకు సమీపంలో లేదా మీ వస్తువులలో ఉంచిన ట్రాకర్‌లను తెలియని ట్రాకర్ అలర్ట్‌ల సహాయంతో మీరు గుర్తించవచ్చు, కనుగొనవచ్చు, తీసివేయవచ్చు.

ట్రాకర్‌లు అంటే ఏమిటి?

ట్యాగ్ అని కూడా పిలవబడే ట్రాకర్ అనేది మీరు తాళాలు లేదా బ్యాక్‌ప్యాక్ వంటి ఐటెమ్‌లు పోగొట్టుకున్నప్పుడు వాటిని కనుగొనడంలో మీకు సహాయపడే చిన్న బ్లూటూత్ పరికరం.

కొన్ని సందర్భాల్లో, వ్యక్తుల సమ్మతి లేకుండా ట్రాక్ చేయడానికి ఈ పరికరాలను దుర్వినియోగం చేయవచ్చు.

తెలియని ట్రాకర్ అలర్ట్ అంటే ఏమిటి?

ఒకరి ట్రాకర్ పరికరం సదరు వ్యక్తి నుంచి వేరుపడి, ఓనర్ బ్లూటూత్ రేంజిలో లేనప్పుడు, అదే సమయంలో ఆ ట్రాకర్ మీతో పాటు ప్రయాణిస్తున్నట్లు మీ Android ఫోన్ గుర్తించినప్పుడు, తెలియని (అన్‌నోన్) ట్రాకర్ అలర్ట్‌ వెళుతుంది. ఆ ట్రాకర్‌కు సంబంధించి మిమ్మల్ని నోటిఫికేషన్ అలర్ట్ చేస్తుంది, దాన్ని ఎలా కనుగొనాలి, ఆ తర్వాత ఏం చేయాలి అన్నది తెలియజేస్తుంది.

తెలియని ట్రాకర్ అలర్ట్‌‌కు సంబంధించిన ఉదాహరణ

చిట్కాలు:

  • మీరు ట్రాకర్‌ను కలిగి ఉన్న ఏదైనా వస్తువును అరువుగా తీసుకున్నా లేదా ట్రాకర్ ఉన్న వారితో ప్రయాణిస్తున్నా ఈ నోటిఫికేషన్‌లను పొందవచ్చు.
  • విమానం మోడ్‌ను ఆన్ చేయడం ద్వారా లేదా మీ ఫోన్‌లో బ్లూటూత్‌ను లేదా లొకేషన్ సర్వీస్‌లను ఆఫ్ చేయడం ద్వారా, ట్రాకర్‌ తన లొకేషన్‌ను షేర్ చేయకుండా మీరు ఆపలేరు. ట్రాకర్‌ను ఎలా ఆఫ్ చేయాలో తెలుసుకోండి.
అనుకూల ట్రాకర్‌లు
తెలియని ట్రాకర్‌ల అలర్ట్‌లు ప్రస్తుతం Find My Device నెట్‌వర్క్‌కు అనుకూలంగా ఉన్న ట్యాగ్‌లతో, Apple AirTagsతో పని చేస్తాయి.

మీరు తెలియని ట్రాకర్ అలర్ట్‌ను అందుకుంటే ఏం చేయాలి

ముఖ్య గమనిక: మీరు బ్లూటూత్‌ను లేదా లొకేషన్ సర్వీస్‌లను ఆఫ్ చేసినా, లేదా విమానం మోడ్‌ను ఆన్ చేసినా కూడా ట్రాకర్ లొకేషన్‌ను కనుగొనకుండా ట్రాకర్‌ను లేదా పరికర ఓనర్‌ను మీ ఫోన్ అడ్డుకోలేదు. ట్రాకర్‌ను డిజేబుల్ చేయడానికి, తయారీదారు అందించిన సూచనలను ఫాలో అవ్వండి.

  1. మీ పరికరంలో, మ్యాప్‌ను తెరవడానికి ట్రాకర్ నోటిఫికేషన్‌ను ట్యాప్ చేయండి.
  2. మీతో పాటు ప్రయాణిస్తున్న ఉన్న ట్రాకర్ ఎక్కడ ఉందో కనుగొనండి.
  3. ట్రాకర్, శబ్దం చేయడానికి సౌండ్‌ను ప్లే చేయండి ఆప్షన్‌పై ట్యాప్ చేయండి.
    • మీరు సౌండ్‌ను ప్లే చేస్తే ఓనర్‌కు తెలియజేయబడదు.
  4. ట్రాకర్‌ను కనుగొనడానికి, సౌండ్‌ను ఫాలో అవ్వండి.
  5. మీరు ట్రాకర్‌ను కనుగొన్నట్లయితే, తర్వాతి దశలు ఆప్షన్‌పై ట్యాప్ చేయండి.
  6. మీరు ట్రాకర్‌ను కనుగొన్న తర్వాత, ఇవి చేయవచ్చు:
    • మీ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని మీరు భావించినప్పుడు సురక్షితమైన పబ్లిక్ లొకేషన్‌కు వెళ్లండి. చట్టాన్ని అమలు చేసే ప్రభుత్వ అధికారులను/పోలీసులను లేదా ఆధారపడదగిన వ్యక్తులను సంప్రదించండి.
    • ట్రాకర్ సమాచారాన్ని పొందండి, సేవ్ చేయండి.
    • ట్రాకర్‌ను డిజేబుల్ చేయండి. ట్రాకర్‌ను ఎలా ఆఫ్ చేయాలో తెలుసుకోండి.
మీరు తెలియని ట్రాకర్ అలర్ట్‌ను అందుకున్నారు

మీ Android ఫోన్‌లో లేదా టాబ్లెట్‌లో నోటిఫికేషన్‌ వచ్చినట్లయితే, మీది కాని ఒక ట్రాకర్ మీతో పాటు ప్రయాణిస్తోందని అర్థం.

మీతో పాటు ఉన్న తాళాలు, బ్యాక్‌ప్యాక్ వంటి వాటికి ట్రాకర్ అటాచ్ చేసి ఉండవచ్చు లేదా అటాచ్ చేసి ఉన్న వాటిని మీరు అరువు తెచ్చుకుని ఉండవచ్చు.

ట్రాకర్‌కు సంబంధించి పరికర రకం, తయారీదారు పేరు వంటి మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి, నోటిఫికేషన్‌ను ట్యాప్ చేయండి.

మీరు నోటిఫికేషన్‌ను ట్యాప్ చేసినప్పుడు, ట్రాకర్ మీతో ప్రయాణిస్తోందని వివరించే ఒక మ్యాప్ మీకు కనిపిస్తుంది.

  • ట్రాకర్ ఓనర్ దాని లొకేషన్‌ను ఎక్కడ చెక్ చేశారో మీరు కనుగొనలేరు.
తెలియని ట్రాకర్‌ను కనుగొనడానికి సౌండ్‌ను ప్లే చేయండి

మీకు అలర్ట్ వస్తే, ట్రాకర్‌ను కనుగొనడంలో మీకు సహాయపడటానికి మీరు సౌండ్‌ను ప్లే చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయడం ద్వారా సౌండ్‌ను ప్లే చేయవచ్చు.

మీరు ఇప్పటికీ పరికరాన్ని కనుగొనలేకపోతే, ట్రాకర్ మళ్లీ సౌండ్ ప్లే చేయడానికి సౌండ్‌ను ప్లే చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

చిట్కా: మీరు సౌండ్‌ను ప్లే చేస్తే, ఓనర్‌కు తెలియజేయబడదు.

మీరు సౌండ్ ప్లే చేయలేకపోతే లేదా వినలేకపోతే

మీరు సౌండ్‌ను ప్లే చేయలేకపోతే లేదా సౌండ్‌ను వినలేకపోతే, ప్లేస్‌ మారడానికి ట్రై చేసి, ఆపై సౌండ్‌ను ప్లే చేయండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి. ట్రాకర్ ఇక పరిధిలో ఉండకపోవచ్చు లేదా పరికర ID మారే అవకాశం ఉంది.

మీరు సౌండ్‌ను ప్లే చేయలేకపోతున్నారు, కానీ ట్రాకర్ మీకు సమీపంలో ఉందని భావిస్తే, మీ వస్తువులను చెక్ చేయండి. పరికరం ఎక్కడైనా దాచబడిందా అన్నది తెలుసుకోవడానికి మిమ్మల్ని, మీ పరిసరాలను చెక్ చేయండి. జేబులో, మీ బ్యాగ్‌లో లేదా మీ కారులో మీరు సాధారణంగా చూడని ప్రదేశాలలో ఇది ఉండవచ్చు.

మీరు పరికరాన్ని కనుగొనలేకపోయి, మీ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని భావిస్తే, సురక్షితమైన పబ్లిక్ లొకేషన్‌కు వెళ్లి, చట్టాన్ని అమలు చేసే ప్రభత్వ ఏజెన్సీని లేదా మీరు నమ్మే వ్యక్తులను సంప్రదించండి.

భవిష్యత్తు అవసరాల కోసం తెలియని ట్రాకర్ అలర్ట్, ట్రాకర్ లొకేషన్‌లకు సంబంధించిన మ్యాప్‌ స్క్రీన్‌షాట్‌లను మీరు తీసుకోవచ్చు.

మీరు ట్రాకర్‌ను కనుగొంటే ఏం చేయాలి

మీరు తీసుకోగల చర్యల లిస్ట్‌ను పొందడానికి, తర్వాతి దశలు ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

పరికరాన్ని రిపోర్ట్ చేయడంలో, డిజేబుల్ చేయడంలో సహాయపడటానికి సమాచారాన్ని సేవ్ చేయడంతో సహా వివిధ ట్రాకర్‌లకు వేర్వేరు సూచనలు ఉండవచ్చు.

ట్రాకర్ గురించిన సమాచారాన్ని పొందండి

మీరు ట్రాకర్‌ను కనుగొన్న తర్వాత, దాని సమాచారాన్ని సేవ్ చేయవచ్చు.

  1. తెలియని ట్రాకర్ అలర్ట్, ట్రాకర్ లొకేషన్‌లకు సంబంధించిన మ్యాప్ స్క్రీన్‌షాట్‌ను మీరు తీసుకోవచ్చు.
  2. Airtags విషయంలో, ట్రాకర్ గురించి మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి, ట్రాకర్‌ను మీ ఫోన్ వెనుక వైపునకు తీసుకురండి.
    • మీ స్క్రీన్‌పై ట్రాకర్ సమాచారం రావడానికి కొంత సమయం పట్టవచ్చు.
    • కొన్ని పరికరాలు వాటి సీరియల్ నంబర్‌ను లేదా పరికర ఓనర్ గురించిన అదనపు సమాచారాన్ని షేర్ చేయవచ్చు. ఇతర పరికరాలు బ్లూటూత్ ట్రాకర్‌లో ఫిజికల్‌గా ప్రింట్ చేసిన సీరియల్ నంబర్‌ను కూడా కలిగి ఉంటాయి.
    • సీరియల్ నంబర్‌ను లేదా ఓనర్ సమాచారాన్ని మీరు స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చు
  3. Find My Device నెట్‌వర్క్‌కు అనుకూలమైన ట్యాగ్‌ల విషయంలో, ట్రాకర్ గురించి మరింత తెలుసుకోవడానికి, స్క్రీన్‌పై సూచనలను ఫాలో అవ్వండి.
    • గుర్తింపు సూచనలన్నింటినీ పూర్తి చేసిన తర్వాత, మీరు పరికర ఐడెంటిఫయర్, ఓనర్‌కు సంబంధించి దాచిన ఈమెయిల్ అడ్రస్‌ను చూడగలరు.
    • పరికర ఐడెంటిఫయర్‌ను లేదా ఓనర్ సమాచారాన్ని మీరు స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చు.
    • మీరు ఓనర్ సమాచారాన్ని బహిర్గతం చేయడానికి సూచనలను కనుగొనలేకపోతే, తయారీదారు వెబ్‌సైట్‌లోని గుర్తింపు సూచనలను ఫాలో అవ్వండి.
ట్రాకర్‌ను డిజేబుల్ చేయండి

ముఖ్య గమనిక:

  • కొన్ని ట్రాకర్‌లు, డిజేబుల్ చేయబడితే, ఫ్యాక్టరీ రీసెట్ చేయబడవచ్చు, అలాగే వాటి ఒరిజినల్ ఓనర్‌కు ఇకపై లింక్ అవ్వకపోవచ్చు. చట్టాన్ని అమలు చేసే ప్రభుత్వ ఏజెన్సీలు ఈ ట్రాకర్‌ల గురించిన అదనపు సమాచారం అంటే ఈ ట్రాకర్ ఎవరికి చెందినది వంటి విషయాలను పొందలేకపోవచ్చు.
  • పరికరాన్ని ఫిజికల్‌గా డిజేబుల్ చేయడం వలన ఓనర్ ట్రాకర్ నుండి భవిష్యత్తులో లొకేషన్ అప్‌డేట్‌లను అందుకోలేరు, కానీ వారు ఇప్పటికీ ట్రాకర్ ఎనేబుల్ చేసినప్పటి నుండి చివరి లొకేషన్‌ను చెక్ చేయగలరు.
    • మీ పరిస్థితిని బట్టి, ఏదైనా ట్రాకింగ్‌ను ఆపడానికి మీరు ట్రాకర్‌ను డిజేబుల్ చేయవచ్చు లేదా దానిని డిజేబుల్ చేయడం సురక్షితం కాదని మీరు ఆందోళన చెందుతుంటే దాన్ని ఎనేబుల్ చేయవచ్చు.
    • ట్రాకర్‌ను డిజేబుల్ చేయడానికి, దశల వారీ సూచనల కోసం దిగువున ఉన్న ప్రోడక్ట్ తయారీదారును కనుగొనండి:
ప్రోడక్ట్ సహాయం ఎక్కడ పొందాలి
Apple Airtag AirTagను డిజేబుల్ చేయండి
  • మీరు కనుగొన్న ట్రాకర్ గురించి మరింత తెలుసుకోవడానికి మీరు చట్టాన్ని అమలు చేసే స్థానిక ప్రభుత్వ ఏజెన్సీ‌తో కలిసి పని చేయవచ్చు. చట్టాన్ని అమలు చేసే ప్రభుత్వ ఏజెన్సీ విచారణలో భాగంగా, ట్రాకర్ గురించి, పరికర ఐడెంటిఫయర్, లేదా ఇతర సమాచారం కోసం మిమ్మల్ని అడగవచ్చు.
మీరు ట్రాకర్‌ను కనుగొనలేకపోతే

మీరు పరికరాన్ని కనుగొనలేకపోతే, అది ఇప్పటికీ మీకు సమీపంలో లేదా మీ వస్తువులపై ఉండవచ్చు.

మునుపటి ట్రాకర్ అలర్ట్‌లను కనుగొనండి

మీరు మునుపు అందుకున్న అలర్ట్‌లను చూడాలనుకుంటే:

  1. మీ పరికరంలో, సెట్టింగ్‌లు ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  2. భద్రత & ఎమర్జెన్సీ ఆ తర్వాత తెలియని ట్రాకర్ అలర్ట్‌లు ఆప్షన్‌లను ట్యాప్ చేయండి.
  3. స్క్రీన్ మధ్యలో, ట్రాకర్ అలర్ట్‌ల బాటమ్‌ను ట్యాప్ చేయండి.

మీకు సమీపంలో ఏవైనా ట్రాకర్‌లు ఉన్నాయా అని చెక్ చేయండి

మాన్యువల్ స్కాన్‌ను రన్ చేయండి

ఓనర్‌ల నుండి దూరమై, ప్రస్తుతం మీకు సమీపంలో ఉన్న ట్రాకర్‌లను మీరు ఏ సమయంలోనైనా చెక్ చేయవచ్చు.

  1. మీ పరికరంలో, సెట్టింగ్‌లు ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  2. భద్రత & ఎమర్జెన్సీ ఆ తర్వాత తెలియని ట్రాకర్ అలర్ట్‌లు ఆ తర్వాత ఇప్పుడే స్కాన్ చేయండి ఆప్షన్‌లను ట్యాప్ చేయండి.
    • మాన్యువల్ స్కాన్ పూర్తి చేయడానికి మీ పరికరం దాదాపు 10 సెకన్ల సమయం తీసుకుంటుంది.
మాన్యువల్ స్కాన్‌లో ఏ ట్రాకర్‌లు కనిపిస్తాయి

మీరు మాన్యువల్ స్కాన్‌తో ప్రస్తుతం మీకు సమీపంలో ఉన్న, వాటి ఓనర్ పరికరం నుండి వేరు చేయబడిన ట్రాకర్‌లను గుర్తించవచ్చు. మాన్యువల్ స్కాన్‌లో కనుగొనబడిన ట్రాకర్‌లు పొరపాటున వేరే చోట పెట్టి ఉండవచ్చు లేదా తాత్కాలికంగా వాటి ఓనర్ నుండి వేరు చేయబడి ఉండవచ్చు.

మీరు తెలియని ట్రాకర్ అలర్ట్‌లను ఆన్ చేసినట్లయితే, తెలియని ట్రాకర్ మీతో ప్రయాణిస్తున్నట్లు సిస్టమ్ నిర్ధారిస్తే మీకు ఆటోమెటిక్‌గా నోటిఫికేషన్ వస్తుంది.

మాన్యువల్ స్కాన్‌లో ట్రాకర్‌కు సంబంధించి అలర్ట్ రాలేదు

మాన్యువల్ స్కాన్‌లో కనిపించే ట్రాకర్‌లు ప్రస్తుతం మీకు సమీపంలో ఉండవచ్చు, కానీ మీతో పాటు ప్రయాణిస్తూ ఉండకపోవచ్చు.

మీరు అలర్ట్‌లు ఆన్ చేసి ఉన్నప్పుడు, తెలియని ట్రాకర్ మీతో ప్రయాణిస్తున్నట్లు సిస్టమ్ నిర్ధారిస్తే మీకు ఆటోమేటిక్‌గా నోటిఫికేషన్ వస్తుంది.

మీ ఫోన్‌కు అప్‌డేట్ ఎలా వస్తుంది

మీ Android ఫోన్‌ను సురక్షితంగా ఉంచడానికి, ఇది బ్యాక్‌గ్రౌండ్‌లో ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లను పొందుతుంది. అప్‌డేట్ జరిగే సమయంలో, Play సర్వీస్‌లు తెలియని ట్రాకర్ అలర్ట్ సిస్టమ్‌ను జోడిస్తుంది, తద్వారా మీకు తెలియని ట్రాకర్ గురించి ఆటోమెటిక్‌గా నోటిఫికేషన్‌లు అందుతాయి.

మీరు సమ్మతిని నిలిపివేయాలనుకుంటే, ఎప్పుడైనా నిలిపివేయవచ్చు.

తెలియని ట్రాకర్ అలర్ట్‌లను ఆఫ్ చేయండి

ముఖ్య గమనిక: మీరు తెలియని ట్రాకర్ అలర్ట్‌లను ఆఫ్ చేస్తే, మునుపటి అలర్ట్‌లు క్లియర్ చేయబడుతుంది, తెలియని ఇతర ట్రాకర్‌ల గురించి సమాచారం ఏదైనా తొలగించడం జరుగుతుంది. ఈ డేటాను రికవర్ చేయడం సాధ్యం కాదు.

మీ Android పరికరం Android 12 (S), ఆ తర్వాతి వెర్షన్ అయితే:

  1. మీ పరికరంలో, సెట్టింగ్‌లు ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  2. భద్రత & ఎమర్జెన్సీ ఆ తర్వాత తెలియని ట్రాకర్ అలర్ట్‌లు ఆప్షన్‌లను ట్యాప్ చేయండి.
  3. అలర్ట్‌లను అనుమతించండి సెట్టింగ్‌ను ఆఫ్ చేయండి.

మీ Android పరికరం Android 11 (R), ఆ తర్వాతి వెర్షన్ అయితే:

  1. మీ పరికరంలో, సెట్టింగ్‌లు ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  2. Google ఆ తర్వాత Personal Safety ఆ తర్వాత తెలియని ట్రాకర్ అలర్ట్‌లు ఆప్షన్‌లను ట్యాప్ చేయండి.
  3. అలర్ట్‌లను ఆఫ్ చేయండి.

మీ డేటా & గోప్యత

మేము ఏ డేటాను ఉపయోగిస్తాము

తెలియని ట్రాకర్ మీతో ఎలా ప్రయాణించిందో తెలుసుకోవడానికి, తెలియని ట్రాకర్ అలర్ట్‌లు మీ లొకేషన్ సమాచారాన్ని, మీ పరికరం ట్రాకర్‌ను గుర్తించిన టైమ్ స్టాంప్‌లను, ట్రాకర్ పరికర IDని ఉపయోగిస్తాయి. మీరు తెలియని ట్రాకర్ అలర్ట్‌ను అందుకున్నప్పుడు, మ్యాప్‌లో మీతో ట్రాకర్ గుర్తించబడిన స్థలాలను కూడా చూడగలరు.

ఈ సమాచారాన్ని ప్రాసెస్ చేయబడుతుంది, ఎన్‌క్రిప్ట్ చేసిన ఫార్మాట్‌లో తాత్కాలికంగా స్టోర్ అవుతుంది. ఇది మీ పరికరంలో మాత్రమే సేవ్ అయ్యి ఉంటుంది. మిమ్మల్ని ఏదైనా ట్రాకర్ ఫాలో అవుతుంటే, మ్యాప్‌లో దానిని మీకు ప్రదర్శిస్తుందో లేదో తెలుసుకోవడానికి ఈ సమాచారాన్ని ఉపయోగించడం జరుగుతుంది. దీన్ని Googleతో లేదా ఇతర యూజర్‌లతో షేర్ చేయడం జరగదు.

Android లొకేషన్ సెట్టింగ్‌ల గోప్యత

మీతో పాటు ప్రయాణించే తెలియని ట్రాకర్‌ల కోసం ఆటోమేటిక్ అలర్ట్‌లను పొందడానికి, మీరు తప్పనిసరిగా మీ లొకేషన్‌ను ఆన్ చేసి ఉండాలి.

మీరు మీ లొకేషన్‌ను ఆఫ్ చేస్తే, ఆ సమయంలో మీకు సమీపంలో ఉన్న ట్రాకర్‌లను కనుగొనడానికి, ఇప్పటికీ మాన్యువల్ స్కానింగ్ ఫీచర్‌ను ఉపయోగించవచ్చు.

తెలియని ట్రాకర్‌లకు సంబంధించిన సమస్యలను పరిష్కరించండి

నాకు అలర్ట్ వచ్చిన తర్వాత నేను ట్రాకర్‌ను ఎందుకు రింగ్ చేయడం సాధ్యం కాదు?

మీరు ట్రాకర్‌ను ఈ కింది కారణాల వల్ల రింగ్ చేయలేకపోవచ్చు:

  • ట్రాకర్ ఓనర్ సమీపంలో ఉండవచ్చు
  • ట్రాకర్ ఇటీవలే దాని ఓనర్ నుండి వేరు చేయబడి ఉండవచ్చు
  • ట్రాకర్ మీ Android ఫోన్ బ్లూటూత్ పరిధిలో లేదు లేదా మీ వద్ద ఇక లేదు
  • ట్రాకర్ పరికర ID మార్చబడింది
ట్రాకర్ పరికర ID మారినట్లయితే దాని అర్థం ఏమిటి?

ప్రతి బ్లూటూత్ ట్రాకర్ దానితో అనుబంధించబడిన ర్యాండమ్ IDని కలిగి ఉంటుంది, అది కాలానుగతంగా మారుతుంది. ట్రాకర్ దాని ఓనర్‌కు సమీపంలో లేకుంటే, అది రోజుకు ఒకసారి లాగా తక్కువ తరచుగా మారవచ్చు.

ట్రాకర్ దాని ర్యాండమ్ IDని మార్చినప్పుడు, అది ఇకపై అదే ట్రాకర్‌గా గుర్తించబడదు, మీ Android పరికరం భవిష్యత్తు స్కాన్‌లు లేదా హెచ్చరికలకు కొత్త ట్రాకర్‌గా డిస్‌ప్లే చేయబడుతుంది.

నేను ఎందుకు అలర్ట్ త్వరగా పొందలేదు?

అలర్ట్‌ను పంపేటప్పుడు తెలియని ట్రాకర్ అలర్ట్‌లు పలు అంశాలను పరిగణనలోకి తీసుకుంటాయి. అలర్ట్ ఖచ్చితత్వాన్ని మెరుగుపరచడానికి, మీరు అలర్ట్‌ను స్వీకరించడానికి ముందు కాలక్రమేణా ట్రాకర్‌తో భౌతికంగా కదలాలి.

నేను ఒకటి కంటే ఎక్కువ అలర్ట్‌లను ఎందుకు స్వీకరించలేదు?
సిస్టమ్ ప్రస్తుతం బిల్డ్ చేయబడుతుంది కాబట్టి మీరు ప్రతిరోజూ ఒక ట్రాకర్‌కు ఒక అలర్ట్‌ను మాత్రమే అందుకుంటారు. ట్రాకర్ మీ వద్ద ఉందని మీరు ఇప్పటికీ ఆందోళన చెందుతుంటే, సమీప ట్రాకర్‌లను కనుగొనడానికి మాన్యువల్ స్కాన్‌ను రన్ చేయండి.
నా మాన్యువల్ స్కాన్ సమీపంలోని ట్రాకర్‌లను ఎందుకు గుర్తించలేదు?
మాన్యువల్ స్కాన్ ఫీచర్‌లో ట్రాకర్‌లను చూపించడానికి, వారు తప్పనిసరిగా వాటి ఓనర్‌ల నుండి భౌతికంగా వేరు చేయబడాలి. పలు మాన్యువల్ స్కాన్‌లను రన్ చేయడం వలన సమీపంలోని గుర్తించబడిన ట్రాకర్‌ల ఖచ్చితత్వాన్ని మెరుగుపరచవచ్చు.

అదనపు సపోర్ట్ రిసోర్స్‌లు

మీ భద్రత గురించి మీరు ఆందోళన చెందుతుంటే, ఈ రిసోర్స్‌లు సహాయపడవచ్చు:

సంబంధిత రిసోర్స్‌లు

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
16617239308973672681
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
false
false