గోప్యతా డ్యాష్‌బోర్డ్ నుండి అనుమతులను మేనేజ్ చేయండి

డేటాను ఏ యాప్‌లు యాక్సెస్ చేస్తున్నాయో, అవి ఏ అనుమతులను ఉపయోగిస్తున్నాయో, ఇంకా ఆ యాక్సెస్ ఎప్పుడు జరుగుతోందో మీరు గోప్యతా డ్యాష్‌బోర్డ్‌లో చూడవచ్చు. మీరు కెమెరా, మైక్రోఫోన్, క్యాలెండర్, ఇంకా మరిన్నింటి కోసం కూడా అనుమతులను మేనేజ్ చేయవచ్చు. మీ Android ఫోన్‌లో అనుమతుల గురించి మరింత తెలుసుకోండి.

మీ యాప్ అనుమతులను చెక్ చేయండి:

ముఖ్య గమనిక: ఈ దశలలో కొన్ని, Android 12 లేదా 13లో, అలాగే ఆ తర్వాత వచ్చిన వెర్షన్‌లలో మాత్రమే పని చేస్తాయి. మీ Android వెర్షన్‌ను ఎలా చెక్ చేయాలో తెలుసుకోండి

Android 13లో గత 7 రోజుల లేదా Android 12లో గత 24 గంటల యాప్ యాక్టివిటీని చెక్ చేయడానికి:

  1. మీ Android ఫోన్‌లో, సెట్టింగ్‌ల యాప్‌ను తెరవండి.
  2. సెక్యూరిటీ, గోప్యత లేదా గోప్యత ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
    • గోప్యతా డ్యాష్‌బోర్డ్‌ను కనుగొనడానికి, మీరు గోప్యత ఆప్షన్‌ను మళ్లీ ట్యాప్ చేయాల్సి రావచ్చు. 
  3. గోప్యతా డ్యాష్‌బోర్డ్ ఆప్షన్‌ను ట్యాప్ చేయండి. 
  4. ఏ యాప్‌లు మీ అనుమతులను యాక్సెస్ చేశాయో చూడటానికి, మీరు చూడాలనుకుంటున్న అనుమతిని ఎంచుకోండి. 
  5. అనుమతిని అప్‌డేట్ చేయడానికి, లిస్ట్ చేయబడిన యాప్‌లలో ఒకదానిపై ట్యాప్ చేయండి.  

సంబంధిత రిసోర్స్‌లు

మీ Android ఫోన్‌లో యాప్ అనుమతులను మార్చండి

Android పరికరంలో స్క్రీన్ లాక్‌ను సెటప్ చేయండి

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
4831397023738792735
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
false
false